breaking news
Andhra Pradesh High Court
-
హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు రానీయండి
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు వెలువడిన అనంతరం, అవసరమైతే ఈ అంశంపై జోక్యం చేసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు దోషులు, ఉన్నతాధికారుల పాత్రను తేల్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీ హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ ముగింపు దశలో ఉంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడడం సబబు’ అని వ్యాఖ్యానించింది. అంతక్రితం విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్, న్యాయవాదులు అల్లంకి రమేష్, రాళ్ల మమత వాదనలు వినిపిస్తూ, ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సాయికృష్ణ కనిపించకపోవడంపై తల్లి దాఖలుచేసిన హెబియస్ కార్పస్, అలాగే కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
తుది ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు జరపాలి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ హైకోర్టును అభ్యర్థించింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం తుది వాదనలు వినిపిస్తూ.. ‘మేం ఎన్నికలను వాయిదా వేయాలని కోరడంలేదు. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. 2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ చర్యలు చేపట్టడం సరికాదు. దీనివల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. నామినేషన్ల ముగింపు తేదీ నాటికి జరిగే అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితా విడుదలచేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సర్‌లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. సర్ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది. మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రోటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు స్థానం లేకుండా పోతుంది’ అని వివరించారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది నర్సీపట్నం అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ, సవరించిన తుది జాబితా కోసం వేచిచూస్తే ఎన్నికల సన్నాహకాలన్నీ వృధా అవుతాయన్నారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.తీర్పు రిజర్వ్» సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. » బీసీ జనగణన చేపట్టి, అందుకు అనుగుణంగా రిజర్వేషన్ ఖరారు చేసి, ఆ తరువాతే స్థానిక సంస్థలు, గ్రామపంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన పిల్లో కూడా గురువారం వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యంలో కూడా సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, బీసీ జన గణన చేసిన తరువాతే స్థానిక ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో ఇదే హైకోర్టు ఆదేశించిందన్నారు. » గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను ఏబీసీడీఈలుగా ఉపవర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కూడా వాదనలు ముగిశాయి. ఇందులో కూడా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. -
కేవలం ఇలాంటి మాటలతో విడాకులు మంజూరు చేయలేం: హైకోర్టు
రాయ్‌పుర్: భార్య తన భర్తను “నల్లగా ఉన్నావు”, “లావుగా ఉన్నావు” అని పిలిచిందనే ఒకే ఒక్క ఆరోపణ ఆధారంగా భర్తకు ఆమె నుంచి విడాకులు ఇవ్వలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చెప్పింది. భార్య తనపై క్రూరత్వానికి పాల్పడిందని, తనను విడిచిపెట్టిందని భర్త తగిన ఆధారాలతో నిరూపించలేకపోయారని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది.జాంజ్గీర్-చాంపా జిల్లాకు చెందిన 28 ఏళ్ల అక్ష్ ఘోష్.. రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల పూజా సీత్ను 2019 మార్చి 7న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సుమారు 2-3 నెలలు భర్త, ఆయన కుటుంబంతో కలిసి నివసించారు. ఆ సమయంలో భార్య తన పట్ల శత్రుత్వ ధోరణితో వ్యవహరించిందని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించిందని, తరచూ పుట్టింటికి వెళ్లేదని భర్త ఆరోపించారు. రాజస్థాన్‌లో బంధువు వివాహానికి తన అనుమతి లేకుండా వెళ్లి, సుమారు 25 రోజుల తర్వాత తిరిగి వచ్చిందని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెకు కవలల గర్భస్రావం జరిగిందని తెలిపారు.అయితే భార్య ఈ ఆరోపణలను ఖండించారు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆయన మద్యం తాగడం కూడా ప్రారంభించారని ఆరోపించారు. తనను దుర్భాషలాడేవారని, అనారోగ్య సమయంలో సరైన వైద్యం కూడా అందించలేదని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తన తల్లి రాయ్‌గఢ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లిందని చెప్పారు. కోలుకున్న తర్వాత భర్త, ఆయన కుటుంబాన్ని తిరిగి తనను తీసుకెళ్లాలని కోరినా వారు స్పందించలేదని పేర్కొన్నారు.గతంలోనూ విడాకుల పిటిషన్ తిరస్కరణఈ వివాదంపై కుటుంబ న్యాయస్థానం 2024 ఆగస్టు 28న భర్త విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. భార్య పుట్టింటి వారు ఇచ్చిన బహుమతులు, ఇతర వస్తువులను తిరిగి ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ అక్ష్ ఘోష్ హైకోర్టును ఆశ్రయించారు.న్యాయమూర్తులు పార్థ్ ప్రతీమ్ సాహు, సచిన్ సింగ్ రాజ్‌పుత్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 18న తీర్పు వెలువరించింది. భార్యపై చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. భర్తను నల్లని చర్మం కలిగిన వ్యక్తిగా, లావుగా ఉన్నవాడిగా భార్య పేర్కొన్నప్పటికీ, అవి విడాకులు మంజూరు చేయడానికి సరిపడే కారణాలు కావని స్పష్టం చేసింది. భార్య ఎటువంటి సమంజసమైన కారణం లేకుండా పుట్టింట్లోనే ఉండిపోయిందన్న విషయాన్ని కూడా భర్త నిరూపించలేకపోయారని తెలిపింది. దీంతో కుటుంబ న్యాయస్థానం తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని హైకోర్టు పేర్కొంటూ, భర్త అప్పీల్‌ను ఎలాంటి ఖర్చులు విధించకుండా కొట్టివేసింది. -
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై కక్ష సాధింపు
సాక్షి,విజయవాడ:కోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారలేదు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించి నోటీసులు ఇచ్చే పేరుతో పోలీసులు రాత్రి సమయంలో ఆమె నివాసానికి వెళ్లారు.అర్ధరాత్రి వేళ ఇళ్లకు వచ్చి తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురిచేయడంపై మాజీ మేయర్ భాగ్యలక్ష్మి దంపతులు పోలీసులను తీవ్రంగా నిలదీశారు. కోర్టు చివాట్లు పెట్టినా పోలీసుల తీరులో మార్పు రాలేదని మండిపడ్డారు. -
క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణం ఏమిటి?
సాక్షి, అమరావతి: దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనపై హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది. విజయవాడ, కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజు వేధింపుల వల్ల క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ కమిషనర్, నార్త్ జోన్ ఏసీపీ, కృష్ణలంక ఇన్స్పెక్టర్లతో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ నాగరాజుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ కుటుంబ సభ్యులను ఏ రకంగానూ బెదిరించరాదని కూడా స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కూడా అప్పటి సీఐ నాగరాజు ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు ఉపసంహరణకు బెదిరింపులు తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణమంటూ ఈ ఏడాది మే 21న క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ‘దర్యాప్తు విషయంలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుకు ఇస్తున్న ప్రాధాన్యతను దళిత యువకుడైన క్రాంతికుమార్ కేసుకు ఇవ్వడంలేదు. పైగా కుమారుడి మృతిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు రోజూ పిటిషనర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీని వెనుక విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ ఉన్నారు. ప్రైవేటు గూండాలు కూడా ఇంటికి వస్తూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి’ అని విన్నవించారు. -
శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. బుధవారం సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో న్యాయమూర్తులు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత వీరు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఐదుగురిలో జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్ 2024 అక్టోబర్ 28న.. జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఇప్పుడు వీరిని అదనపు న్యాయమూర్తుల నుంచి శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: తన కుమారుడు గాదె సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని.. అలాగే అతడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తల్లి గాదె విజయలక్ష్మి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంపై కింది కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి తన కుమారుడు సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారని, తరువాత అతడి ఆచూకీ తెలియడం లేదని, ఈ నేపథ్యంలో అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ విజయలక్ష్మి ఈ ఏడాది జూన్‌లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే సాయికృష్ణను పోలీసులే కొట్టి చంపి, మృతదేహాన్ని దహనం చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అసాధారణ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఇవ్వొచ్చు ఈ వ్యాజ్యాలపై మంగళవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. విజయలక్ష్మి న్యాయవాది నర్సీపట్నం అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని దారుణంగా హింసించి, చంపేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. అనంతరం ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించిందని తెలిపారు. సిట్‌లో కూడా రాష్ట్ర పోలీసులే ఉండటంతో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అసాధారణ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానాలు ఆదేశించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని వివరించారు. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చన్నారు. ఇది అంత అరుదైన కేసు కాదు పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామన్నారు. నిందితులందరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. కస్టోడియల్ హింస వల్లే సాయికృష్ణ మృతిచెందినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు స్నేహితుడు, ఈ కేసులో నిందితుడు అయిన సురేష్ వాంగ్మూలం ఇచ్చారని చెప్పారు. సాయికృష్ణ మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేసినట్లు కూడా చెప్పారన్నారు. ఈ వాంగ్మూలంపై నిజానిజాలను నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంటుందన్నారు. ఇది అలాంటి అత్యంత అరుదైన కేసు కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
సివిల్ గొడవల్లో మీ జోక్యమేంటి? AP పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్..
-
పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం
పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు నిలదీసింది. పోలీస్ యూనిఫాం వేసుకుని కౌన్సిలింగ్ చేయటమంటే, అది ప్రజలను బెదిరించడం, భయభ్రాంతులను గురి చేయడమేనని స్పష్టం చేసింది. సివిల్ వివాదాలతో అసలు పోలీసులకు సంబంధం ఏంటని నిలదీసింది. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే పోలీసులు రేపు సమాంతర కోర్టులు నిర్వహించేందుకు కూడా వెనకాడరని పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు ఏ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి స్టేషన్లకు పిలిపిస్తున్నారంటూ విశాఖ పోలీసులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదికను ముందు ఉంచాలని విశాఖ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
‘సిట్‌తో లాభంలేదు.. సీబీఐ దర్యాప్తునకే ఆదేశించండి’
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందేనని అతడి తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు నివేదించారు. సాయికృష్ణ విషయంలో న్యాయం జరగాలంటే, సీబీఐ దర్యాప్తే శరణ్యమని ఆమె చెప్పారు. దీంతో, పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని వివరాలు తమ ముందు ఉంచాలని.. ఇక ఎవరికీ ఎలాంటి గడువునిచ్చే ప్రసక్తేలేదని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.కాగా, గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు.. ‘సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ తెలియకుండా పోయింది. అతని ఆచూకీ కనుగొనడంలో, నిష్పక్షపాతంగా విచారణ జరపడంలో పోలీసులు విఫలమయ్యారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. నా కుమారుడిని 2026 మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకుని, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత ఇన్స్పెక్టర్కు అప్పగించినట్లు ప్రతివాదులైన పోలీసులు తమ కౌంటర్ అఫిడవిట్లో అంగీకరించారు.అయితే, ఆ తర్వాత సాయికృష్ణ ఆచూకీ ఏమైంది అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే సముచితం. నా కుమారుడి లాకప్‌డెత్ కేసుకు సంబంధించి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసినప్పటికీ, అందులో ఉన్నది కూడా పోలీసులే. విచారణ ఎదుర్కొంటున్న పోలీసు శాఖకు చెందిన వారే దర్యాప్తు చేస్తే న్యాయం జరిగే అవకాశమేలేదు. అందువల్ల సంస్థాగత స్వతంత్రత కోసం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుత కేసు కేవలం అనుమానాలు, నిరాధారమైన ఆరోపణలపై మాత్రమే ఆధారపడలేదు. రికార్డులో ఉన్న నిర్దిష్ట వాస్తవాలపై ఆధారపడింది’.. అని విజయలక్ష్మి పేర్కొన్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌కు విజయలక్ష్మి ఈ మేరకు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేశారు. ఇదీ చదవండి: సంతకాలు దాచిపెట్టి కూన కట్టుకథలు -
గోశాల స్థలంలో జోక్యం చేసుకోవద్దు
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా, తిరుచానూరులోని శ్రీరాధాగోవింద గోరక్ష సమితి 3 ఎకరాల స్థలంలోని నిర్మాణాలను రహదారి విస్తరణ పేరుతో కూల్చేందుకు అధికారులు ప్రయత్నింస్తుండటంపై హైకోర్టు స్పందించింది. తిరుచానూరు సర్వేనంబరు 575/1లోని గోరక్ష సమితికి చెందిన భూమిలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా), ఆర్డీవో తదితరులను హైకోర్టు ఆదేశించింది. అక్కడ నిర్మాణాల జోలికి కూడా వెళ్లొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తుడా అధికారుల తీరుపై అత్యవసర పిటిషన్... తిరుచానూరు గోరక్ష సమితి స్థలంలో తుడా అధికారులు జోక్యం చేసుకుంటూ, అక్కడి నిర్మాణాలను కూల్చేసేందుకు యత్నిస్తున్నారంటూ శ్రీరాధాగోవింద గోరక్ష సమితికి చెందిన ఎ.గాయత్రి హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. తిరుచానూరు సర్వే నంబరు 575/1లో గోశాల నిర్మాణం కోసం మూడు ఎకరాలను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ 2001లో ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.అప్పటి నుంచి ఆ స్థలం గోశాల స్వాదీనంలో ఉందన్నారు. రహదారి విస్తరణ పేరుతో తుడాకు చెందిన అధికారులు, స్థానిక అధికారులతో కలిసి అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు యత్నిస్తున్నారని ఉమేష్ చంద్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక కూల్చివేతలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. వాదనలు విన్న గోశాలకు చెందిన స్థలంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరారు. తుడా తరపు న్యాయవాది కేకే దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అభ్యంతరాలు కోరుతూ తుడా ప్రకటించిన రహదారి అభివృద్ధి ప్రణాళికలో సర్వే నంబరు 575/1 లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి, సర్వే నంబరు 575/1లోని గోశాలకు సంబంధించిన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
50% పైన రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారు?
సాక్షి, అమరావతి: బీసీ తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు ఆ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్ నివేదికను పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉందని చెబుతూనే, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజమని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అందులో అంత రహస్యం ఏముందని ప్రశ్నించింది. కమిషన్ నివేదికలోని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి గణాంకాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని స్పష్టంచేసింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై బుధవారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, అసలు రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని ఎలా సమర్థించుకుంటారో కూడా చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుది ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రాతిపదిక కావాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం వాదనలు వినిపిస్తూ, తాము స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదన్నారు. ‘ప్రస్తుతం జరుగుతున్న సర్ పూర్తయి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. తద్వారా సర్‌లో ప్రాథమికంగా ఓటు కోల్పోయిన వారు, అప్పీల్ చేసుకుని తుది ఓటర్ల జాబితాలో స్థానం పొందే అవకాశం ఉంటుంది. తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే, ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మా వ్యాజ్యం నిరర్థకం అవుతుంది. గతంలో ఇలాగే పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది’ అని శ్రీరాం విన్నవించారు. ఆయన వాదనలను ఏకీభవించిన ధర్మాసనం, ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పిటిషన్ నిరర్థకం అవుతుందని, అందులో సందేహం లేదంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కాదనే భావిస్తున్నామని తెలిపింది. మిషన్ నివేదిక అందకుండా వాదనలు ఎలా చేయగలం శాస్త్రీయంగా బీసీ జనగణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించరాదని, ఆ దిశగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. శంకరరావు తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని, ఈ నివేదికను పరిశీలించకుండా వాదనలు వినిపించడం సాధ్యం కాదని విన్నవించారు. ప్రభుత్వ జీవోలు సరికాదు స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ వేశారు. ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ కూడా యోగేష్ మరో పిల్ వేశారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. నెపాన్ని కోర్టుపై నెట్టేయాలనే దురాలోచన కృష్ణా జిల్లాకు చెందిన వెంకట నరసింహ శర్మ పిల్ దాఖలు చేసిన పిటిషన్లో ఆయన తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికను తొక్కిపెడుతోందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లు 50 శాతం దాటేలా ఉత్తర్వులిచ్చిందన్నారు. రేపు కోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేస్తే, ‘మేం రిజర్వేషన్లు ఇచ్చాం.. కోర్టు కొట్టేసింది.. మమ్మల్ని ఏం చేయమంటారు’ అంటూ నెపాన్ని కోర్టుపై నెట్టేయాలన్నదే ప్రభుత్వ దురాలోచన అన్నారు. -
ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి?
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగ అవకాశాలలో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాల అమలు విషయంలో వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాపులకు సంబంధిత 5 శాతం రిజర్వేషన్ చట్టాలను అమలు చేస్తారా? లేక వాటిని పునః సమీక్షిస్తారా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలుపై ఏం నిర్ణయం తీసుకుంటారు? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల అమలుపై వ్యాజ్యాలు » కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. » విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ రాజమండ్రికి చెందిన అడ్డేపల్లి శ్రీధర్ లక్ష్మణ్, విజయవాడకు చెందిన కమ్మిలి కృష్ణ, ఉత్కర్ష్ పిటిషన్లు దాఖలు చేశారు. » కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 14, 15 చట్టాలను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెంకు చెందిన పెద్ది రామకృష్ణ, కర్నూలుకు చెందిన కె.చంద్రశేఖర శర్మ, మిత్రవింద తదితరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. అనుకూల వాదనలు పిటిషనర్లు శ్రీధర్ లక్ష్మణ్, కృష్ణ తదితరుల తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు, జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, ‘ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలు తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలను మాత్రం అమలు చేయడం లేదు. ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇస్తూ చేసిన చట్టాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో కాపులకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. ప్రతికూల వాదనలు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేసిన పెద్ది రామకృష్ణ తదితరుల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ... ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థించిందన్నారు. దీనిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసిందని తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సంబంధించిన వ్యాజ్యాల గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పులో ప్రస్తావించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే అక్కడే రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పులకు తాము భాష్యాలు చెప్పలేమంది. అలా అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి తగిన వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని ఇంద్రనీల్ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
‘కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా?
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలా రిజర్వేషన్లు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వైపు కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారు. నివేదిక పరిశీలనలో ఉందని ఎంతకాలం చెబుతారు.? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందికమిషన్ నివేదిక ఎందుకు బహిర్గతం చేయటం లేదు. కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా? అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. బీసీ రిజర్వేషన్ల పూర్తి గణాంకాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలన్న కోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
బాలిక ఆచూకీకి మూడునెలలు ఎందుకు పట్టింది?
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన పదవ తరగతి బాలికను షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి జూన్‌లో అపహరించి తీసుకెళితే, ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులకు మూడు నెలల సమయం ఎందుకు పట్టిందని హైకోర్టు సోమవారం రాష్ట్ర డీజీపీని ప్రశ్నించింది. ‘మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం చాలా తీవ్రమైన విషయం. బాలిక కిడ్నాప్ వెనుక షేక్ జాన్ సైదా ఒక్కరే ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ సమర్పించండి’ అని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బాలిక కోరిక ప్రకారం తండ్రికి అప్పగించాలని ఆదేశాలు..అంతక్రితం జాన్ సైదా తీసుకెళ్లిన బాలికను గుంటూరు, పట్టాభిపురం పోలీసులు ధర్మాసనం ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆ బాలిక తన తండ్రితో పాటు ఇంటికెళతానని ధర్మాసనానికి తెలిపింది. దీంతో ధర్మాసనం ఆ బాలికను తండ్రికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక.. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో సహకరించాలని తండ్రికి ధర్మాసనం నిర్దేశించింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ ధర్మాసనం ముందు తొలుత వాదనలు వినిపిస్తూ బాలికను జాన్ సైదా అనే వ్యక్తి తీసుకెళ్లారని తెలిపారు. వారు హరియాణాలో ఉండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. జాన్‌సైదాకు సహకరించిన అతని తల్లి, సోదరిని ఈ కేసులో నిందితులుగా చేర్చామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.పోలీసుల నిర్లక్ష్యంపై తండ్రి న్యాయ పోరాటం..గుంటూరులో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, పోలీసులపై ముఖ్యంగా డీజీపీపై నిప్పులు చెరిగింది. అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరుపరిచేలా చూడాలని డీజీపీని ఆదేశించింది. దీంతో డీజీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.డీజీపీకి ధర్మాసనం ప్రశ్నలు..⇒ బాలికను తీసుకెళ్లే వ్యవహారంలో జాన్ సైదాకు ఎవరు సహకరించారు?⇒ గుంటూరు నుంచి వెళ్లిన తరువాత వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ⇒ బంధువులు, స్నేహితుల పాత్ర ఏమిటి?⇒ నిందితుడు సైదాకు సహకరించిన వారిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? ⇒ ఆ బాలిక మైనర్ అని తెలిసి హోటల్ యజమానులు ఎలాంటి ధ్రువపత్రాలు పరిశీలించకుండా గదులు ఎలా వారికి అద్దెకిచ్చారు? ⇒ వారిపై ఏమి చర్యలు తీసుకున్నారు? ⇒ అదృశ్యమైన రోజు నుంచి ఈరోజు వరకు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? -
ఈ–స్టాంప్ కేసు దర్యాప్తు త్వరగా ముగించాలి
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కనుసన్నల్లో సాగిన వేల కోట్ల రూపాయల ‘ఈ–స్టాంప్’ కుంభకోణంపై నమోదైన కేసులో వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు సోమవారం సీఐడీని ఆదేశించింది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషిట్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను స్టేటస్ రిపోర్ట్ రూపంలో తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది కీలక పాత్ర’ అని కోర్టుకు విన్నవించారు. ఈ–స్టాంపుల కుంభకోణంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
గుంటూరు బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దాదాపు మూడు నెలల కిందట మాయమైన బాలిక ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదని చెబుతున్న పోలీసులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హెచ్చరికల నేపథ్యంలో బాలికను, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హరియాణా రాష్ట్రం కర్నాల్ నగరంలోని ఓ లాడ్జిలో ఉండగా సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వారిద్దరినీ గుంటూరు తీసుకువస్తున్నారు. మూడు నెలలుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు.. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించిన 24 గంటల్లోనే అంత దూరంలో ఉన్న వారిని ఎలా పట్టుకోగలిగారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వదిలేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బాని అలియాస్ పండు ఆమెను జూన్ 9న తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో బాలిక ఇంటి నుంచి 200 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. ఆ బంగారంలో సగం వరకు అమ్మేసిన కిడ్నాపర్ సైదా మూడు నెలలపాటు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక అశ్లీల వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, తన వెంట రాకపోతే గ్రూపుల్లో షేర్ చేస్తానంటూ బెదిరించి బాలికను తీసుకెళ్లినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. షేక్ జాన్ సైదా సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకుని, అందులో బాలిక వీడియోలు, ఫొటోలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాపర్‌కు ఎవరెవరు సహకరించారనేది విచారణలో తేలుతుందని, దాన్ని బట్టి వారిపైనా కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదు? బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి జూన్ 10న ఫిర్యాదు చేసినా గుంటూరు పట్టాభిపురం పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అన్ని ఆధారాలు ఇచ్చినా, వారి ఖర్చులు భరించినా కాలం వెళ్లదీశారు. పైగా షేక్ సైదా చేతనైతే పట్టుకోవాలని పోలీసులకు సవాలు కూడా విసిరాడు. అతడి గురించి సమాచారం ఉన్నా పట్టుకొని తీసుకురావడంలో పోలీసులు ఘోరంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గురువారం పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి, హాజరుపరచాలని గట్టిగా హెచ్చరించడంతో దిగివచ్చిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులకు అధికారపార్టీ నేతలు, ఉన్నతాధికారుల అండ? బాలిక కిడ్నాప్ కేసును ఛేదించడంలో మూడు నెలలుగా నిర్లక్ష్యం వహించిన పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలిక కిడ్నాప్‌పై స్పందించకపోవడం వెనుక పెద్ద తలకాయలే ఉంటాయన్న అనుమానాలున్నాయి. బాలిక తండ్రి పోలీసుల చుట్టూ తిరుగుతూ.. వారికి స్వయంగా కార్లు, ఫ్లైట్ టికెట్లు పెట్టి సహకరిస్తున్నా నిందితుడిని పట్టుకోకపోవడం వెనుక పెద్ద వ్యక్తులు ఉంటారని తేటతెల్లమవుతోంది. పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
-
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
డీజీపీ బుర్ర ఉపయోగించరా?
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన పదిహేనేళ్ల బాలిక అదృశ్యం కేసులో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యవహారశైలిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అంటూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుపట్టింది. సిట్ ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనంది. రాష్ట్రంలో ఏదైనా కేసులో సిట్ ఏర్పాటు చేశారంటే, దాని అర్థం ఆ కేసు ‘కోల్డ్ స్టోరేజ్’లోకి వెళ్లినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని, తమ ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని తాము ఆదేశిస్తే, ఆ పని చేయకుండా సిట్‌ను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనిని బట్టి డీజీపీ బుర్ర ఉపయోగించడం లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఈ సిట్‌లో గుంటూరు, పట్టాభిపురం పోలీసులకు స్థానం కల్పించడాన్ని తప్పుపట్టింది. ‘బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టాభిపురం పోలీసులు ఏమీ చేయలేకపోయారు. మూడు నెలల క్రితం బాలిక తండ్రి ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఓ బాలిక ఆచూకీ తెలుసుకోవడంలో దారుణంగా విఫలమైన వారికి సిట్‌లో స్థానం కల్పిస్తారా? సిట్‌ను ఏర్పాటు చేశారంటేనే ఈ కేసు దర్యాప్తులో గుంటూరు పోలీసులు విఫలమైనట్లు డీజీపీ ఒప్పుకున్నట్లే. గుంటూరు పోలీసుల వల్ల ఏమీ కాదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే డీజీపీ సిట్‌ను ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు గుంటూరు పోలీసులకు సిట్‌లో స్థానం కల్పించడంలో అర్థమేముంది?’ అని డీజీపీని నిలదీసింది. ఈ కేసులో దర్యాప్తు ఎలా చేయాలో మేం చెప్పే పరిస్థితిని తెచ్చుకోవద్దని డీజీపీకి తేల్చి చెప్పింది. పోలీసులు ఉన్నది ప్రజల ప్రాణాలను రక్షించడానికేనని స్పష్టం చేసింది. మాకు కథలు చెబుతున్నారు‘బాలికను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించిన తరువాత తీసుకున్న చర్యలు, సీఐడీ అదనపు డీజీ సమీక్ష, సిట్ ఏర్పాటు, సిట్ చేయాల్సిన పనులు వంటి వాటిపై దాఖలు చేసిన మెమో విషయంలోనూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మెమోలో వ్యాసం రాశారు. సీరియల్ కథలు రాశారు. వాటి ఆధారంగా మాకు కథలు చెబుతున్నారు. ఓ బాలిక అదృశ్యం కేసును రొటీన్ వ్యవహారంలా చూస్తున్నారు. మీరు ఆ మెమోలో రాసిన రాతల తీరు చూస్తుంటే, కోర్టుకే మీరు సూచనలు చేస్తున్నట్లుంది. కోర్టు ఎలా వ్యవహరించాలో మార్గదర్శకత్వం చేస్తున్నట్లు ఉంది. పోలీసులు రాసిచ్చింది మాకు ఇవ్వడం కాదు. ప్రభుత్వ న్యాయవాదులూ వాటిని చదివి రావాలి. హెబియస్ కార్పస్ పిటిషన్లో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మాకు కావాల్సింది బాలిక ఆచూకీ.. ఇలాంటి స్పందనను మేం డీజీపీ నుంచి ఏ మాత్రం ఆశించలేదు. ఈ కేసు దర్యాప్తులో పట్టాభిపురం పోలీసుల నుంచి సహకారం తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లకు సిట్‌లో స్థానం కల్పించడం ఏంటి? డీజీపీ ఈ కేసును చాలా కాజువల్‌గా తీసుకుంటున్నారు. డీజీపీ తీరుపై మేం బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లిన వ్యక్తి ఎక్కడున్నారో పోలీసులకు బాగా తెలుసు. డీజీపీ ఆ పోలీసులను ఓ గదిలో కూర్చోబెట్టి అడిగితే ఉదయం కల్లా వారిని రప్పించొచ్చు. బాలికను కోర్టు ముందు హాజరుపరచమంటే, కాలానుగుణ నివేదికలు ఇస్తామంటారా? నివేదికలు ఇస్తే ఏమవుతుంది? మాకు కావాల్సింది బాలిక ఆచూకీ. అది తప్ప మీరు అన్నీ చేస్తామంటున్నారు. డీజీపీతో పాటు సంబంధిత పోలీసు అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తాం. అప్పుడు గాని పరిస్థితుల్లో మార్పు రాదు.’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. కోర్టు ప్రొసీడింగ్స్‌ను డీజీపీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు... ‘డీజీపీ కోర్టు ప్రొసీడింగ్స్‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. సిట్ ఏర్పాటు చేయడానికి ముందు గుంటూరు జిల్లా ఎస్పీ నుంచి డీజీపీ నివేదిక తెప్పించుకున్నారా? ఎస్పీ నుంచి కాకుండా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకోవడం ఏంటి? అసలు ఈ కేసుతో సీఐడీకి ఏం సంబంధం? ఎస్పీ నుంచి కాకుండా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకున్నారంటేనే, డీజీపీ బుర్ర ఉపయోగించలేదని అర్థమవుతోంది. అసలు సిట్ ఏంటి? డీజీపీనే రంగంలోకి దిగి పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తే, ఆ బాలిక ఆచూకీ ఇట్టే తెలుస్తుంది. అయితే గుంటూరు పోలీసులను డీజీపీ అసమర్థులుగా భావించారు కాబట్టే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఓ బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోయినందుకు గుంటూరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి సిట్‌లో స్థానం కల్పిస్తారా? డీజీపీ ఇలాగేనా పని చేసేది? సిట్ ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. డీజీపీనే కోర్టుకు పిలిపించి వివరణ అడుగుతాం.’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారం వరకు గడువునివ్వండి... ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణు తేజ వాదనలు వినిపిస్తూ, సోమవారం వరకు గడువునివ్వాలని అభ్యర్థించారు. ఆ లోపు బాలిక ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. సోమవారం లోపు బాలిక ఆచూకీ తెలిసినా వెంటనే హాజరుపరుస్తామని తెలిపారు. బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్ కేసుగా మార్చామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. దళిత మహిళ గంగమ్మ లాకప్‌డెత్ బాధ్యురాలికే సిట్ బాధ్యతలు... బాలిక అదృశ్యం వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటు చేసిన డీజీపీ, దాని బాధ్యతలను గుంటూరు ఎస్పీ (క్రైమ్స్) కె.సుప్రజకు అప్పగించారు. సుప్రజతో పాటు గుంటూరు వెస్ట్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం ఇన్స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నిసార్ బాషా, మహిళా ఎస్ఐ తరంగిణి, ఎస్ఐ రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, కానిస్టేబుళ్లు తనీష్ కుమార్, మాణిక్యరావు సిట్‌లో ఉన్నారు. వాస్తవానికి సుప్రజ లాకప్‌డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ కేసులో సుప్రజ నేతృత్వంలోని సిట్ చేతిలో కర్నూలుకు చెందిన మాల గంగమ్మ అనే దళిత మహిళ లాకప్‌డెత్‌కు గురయ్యారన్న ఆరోపణలున్నాయి. గంగమ్మ మృతిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. ఇలాంటి సుప్రజకు మళ్లీ సిట్ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కుమార్తె ఆచూకీ కోసం తండ్రి న్యాయ పోరాటం... గుంటూరులో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కి వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వాసు ఒత్తిడితో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ సంపాదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోలేకపోయారు.పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరుపరిచేలా చూడాలని డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. -
లోకాయుక్త చట్ట సవరణ సంగతి ఏమిటి?
సాక్షి, అమరావతి: లోకాయుక్త నియామకానికి సంబంధించిన దాఖలైన రెండు వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు స్పందించింది. వేర్వేరుగా దాఖలైన ఈ రెండు వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే, చట్ట సవరణను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన అనంతరం లోకాయుక్త నియామకానికి సంబంధించి దాఖలైన మరో పిల్లో జస్టిస్ మల్లికార్జునరావుకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వ్యాజ్యాలు ఇవీ.. » లోకాయుక్త నియామక ప్రక్రియ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో చేసిన చట్ట సవరణ చేసింది. దీనిని సవాలు చేస్తూ గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. » రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుకి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో తాజాగా మరో పిల్ దాఖలైంది. లోకాయుక్తగా ఆయన నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ రైల్వేశాఖ విశ్రాంత ఉద్యోగి ఏము కొండలరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. » పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ‘లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, లోకాయుక్త మల్లికార్జునరావుకు నోటీసులు జారీ చేయాలి’ అని కోరారు. అయితే ఈ దశలో నోటీసులు ఇవ్వలేమని, చట్ట సవరణపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత నోటీసుల అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టంచేసిన ధర్మాసనం, రెండు వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ అతడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తు విషయంలో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్‌కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత సాయికృష్ణ పోలీసుల లాకప్‌డెత్‌లో మృతిచెందినట్లు రూఢీ అయింది. దీంతో విజయలక్ష్మి తన కుమారుడి లాకప్‌డెత్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తరువాత ఈ వ్యాజ్యంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఓసారి, ఉపసంహరించుకోవడంలేదని మరోసారి విజయలక్ష్మి చెబుతూ వచ్చారు. ఆమె తరఫున హాజరవుతున్న న్యాయవాదుల విషయంలో కూడా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి న్యాయవాది కోగంటి రిత్విక స్పందిస్తూ.. తమ పిటిషన్‌పై ప్రభుత్వ కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అలాగే సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు విషయంలో కౌంటర్ దాఖలు చేశారా? అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిని ప్రశ్నించింది. దాఖలు చేయలేదని ఆమె చెప్పడంతో.. సీబీఐ దర్యాప్తు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
వీళ్లేం పోలీసులు?
సాక్షి, అమరావతి: పదవ తరగతి చదివే తన కుమార్తె కనిపించడం లేదంటూ దాదాపు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని పోలీసులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పోలీసులు ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలంది. ఆ బాలికను కిడ్నాప్ చేశారా? ఆ బాలికను ఎవరికైనా అమ్మేశారా? అసలు ఏం జరిగిందో తేల్చారా.. అని ప్రశ్నించింది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఓ పదవ తరగతి అమ్మాయి ఆచూకీ తెలుసుకోలేకపోయారంటే అంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏమీ ఉండదంది. ఇన్ని రోజులైనా ఆ బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని తేల్చి చెప్పింది. ‘కుమార్తె కనిపించడం లేదంటూ తండ్రి ఫిర్యాదు ఇచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఏం చేశారు? మీరు దర్యాప్తు చేస్తున్నారంటే మేం నమ్మాలా? ఓ బాలిక మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకుంటారా? రాష్ట్ర పోలీసులందరిలో కల్లా గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ (వ్యంగ్యంగా). పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా సమాచార ప్రధాన కమిషనర్‌నే అడ్డుకున్న ఘనత వీరిది. ప్రధాన కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉంటుంది. చట్ట ప్రకారం ప్రధాన కమిషనర్‌కు తగిన ప్రోటోకాల్ ఉంది. ఆయన్నే అడ్డుకున్నారంటే, గుంటూరు పోలీసులు ఎంత గొప్పోళ్లో అర్థమవుతోంది. ఇలాంటి పోలీసులు ఉండటం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు.’ అని హైకోర్టు నిప్పులు చెరిగింది. సదరు బాలికను షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి తీసుకెళ్లారని తెలిసినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఆ బాలికను గురువారం తమ ముందు హాజరుపరిచి తీరాలని ఏకంగా డీజీపీనే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టు తలుపుతట్టిన తండ్రి... గుంటూరు భాష్యం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కి వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వాసు ఒత్తిడితో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ సంపాదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోలేకపోయారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చేతనైతే పట్టుకోవాలని సవాలు విసిరినా పోలీసులు స్పందించడం లేదు... ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపించారు. ట్యూషన్‌కు వెళ్లిన పిటిషనర్ కుమార్తె గత 80 రోజులుగా కనిపించడం లేదన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి ఆ బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లారన్న విషయం దర్యాప్తులో రూఢీ అయినట్లు పోలీసులు చెబుతున్నారని, అయితే తదుపరి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రబ్బానీ ఉపయోగించిన బైక్ మొదలు, సదరు బాలికను తీసుకెళ్లడం, నెల్లూరులో ఫోన్ కొనడం, కోయంబత్తూర్‌లో లాడ్జీల్లో దిగడం, అక్కడి నుంచి కేరళ వెళ్లడం, మళ్లీ అక్కడి నుంచి హైదరబాద్ రావడం వంటి వాటికి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. చేతనైతే తనను పట్టుకోవాలని సైదా ఇన్‌స్టాలో సవాలు విసిరాడని, అయినప్పటికీ పోలీసులు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోవడం లేదన్నారు. సైదా మొబైల్ నెంబర్, ఇన్స్ట్రా ఐడీ, చిరునామా కూడా పోలీసులు తెలుసుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, గుంటూరు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్హెచ్ఓ.. ఎస్పీలతో ప్రయోజనం లేదు.. డీజీపీనే కరెక్ట్... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) కృష్ణ ప్రణీత్ స్పందిస్తూ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి మూడు రాష్ట్రాలకు వెళ్లారన్నారు. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి, ఆ బాలిక, రబ్బాని ఎక్కడున్నారో తెలుసుకున్నామని, తీరా అక్కడి వెళ్లాక వారు అక్కడ లేరని తెలిపారు. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారంటే తామెలా నమ్మగలమంటూ వ్యాఖ్యానించింది. ఆ బాలికను గురువారం తమ ముందు హాజరుపరిచి తీరాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. డీజీపీకి కాకుండా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ, ఎస్హెచ్ఓ, ఎస్పీలకు ఆదేశాలిస్తే ప్రయోజనం ఉండదని, డీజీపీకే ఆదేశాలు ఇవ్వడం సబబని తేల్చి చెప్పింది. -
‘సర్’ కొనసాగుతుండగా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ప్రశ్నించింది. సర్‌లో గల్లంతైన ఓటర్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని, వారు తిరిగి ఓటుహక్కు పొందే ఆస్కారం ఉందని గుర్తు చేసింది. దీంతో తుది ఓటర్ల జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపింది. సర్ ప్రక్రియ ముగిసేవరకు వేచిచూడకుండా.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే చాలామంది ఓటుహక్కు కోల్పోతారని పేర్కొంది. ఈ విషయంలో వైఎస్సార్సీపీ వ్యక్తం చేస్తున్న ఆందోళన సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ ధర్మాసనం ముందుంచడం సముచితమని న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. సర్ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సుజాత మంగళవారం విచారణ జరిపారు.నోటిఫికేషన్ విడుదలైతే మా వ్యాజ్యం నిరర్థకం అవుతుంది వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలకు తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి సంబంధమే లేదని తెలిపారు. ఆ వ్యాజ్యాల్లో పిటిషనర్లు ఏం కోరారు.. తాము ఈ వ్యాజ్యంలో ఏం కోరుతున్నాం అన్న వివరాలను ఆయన న్యాయమూర్తి ముందుంచారు. ఈ నెల 9న సీజే ధర్మాసనం ముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రానున్నాయని, ఆలోపు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే, తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత అందులో న్యాయస్థానాల జోక్యంపై నిషేధం ఉందని తెలిపారు. ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల రికార్టులన్నీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సీజే ధర్మాసనానికి నివేదించిందని శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యాలతో జత చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సర్ ప్రక్రియ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి కాదన్నారు. పంచాయతీలకు సంబంధించి వార్డుల ఓటర్ల జాబితా ప్రచురణ ఈ ఏడాది ఏప్రిల్ 15న పూర్తయిందని, పట్టణ స్థానిక సంస్థల ఓటర్ల జాబితాను సెపె్టంబర్ 3న ప్రచురిస్తారని చెప్పారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలపై సీజే ధర్మాసనం విచారణ జరుపుతోందని, ఈ వ్యాజ్యాన్ని కూడా సీజే ధర్మాసనానికే పంపాలని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ’సర్’ ప్రక్రియ ముగియకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కనపర్తి అజయ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అభ్యర్థనను అనుమతిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయన్నారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలను ఆపాలంటే మొత్తం ప్రక్రియను మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుందని, ఇందుకు ఐదారు నెలల సమయం పడుతుందని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత వైఎస్సార్సీపీ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ముందున్న స్థానిక ఎన్నికల వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించమని చెప్పండి ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో ఓటు కోల్పోయిన వారున్నారని శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. వీరిలో నిజంగా ఓటు కోల్పోయిన వారు సంబంధిత అధికారుల వద్ద అప్పీల్ దాఖలు చేసుకుని, తిరిగి ఓటు పొందే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నాటికి సర్ ప్రక్రియ ముగియనుందని, ఆ తరువాత తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1ని అర్హత తేదీగా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా సెప్టెంబర్ 3లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని వివరించారు. సర్ ప్రక్రియను ముగించి అక్టోబర్ 3న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా ప్రచురించనుందని తెలిపారు. ఆ ఓటర్ల జాబితా ఆధారంగా మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, నామినేషన్ల ముగింపు తేదీ నాటికి సర్ ప్రక్రియ వల్ల ఓటర్ల జాబితాలో జరిగే మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితాను విడుదల చేసేలా కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. -
పిల్లలకు మద్యం, పొగాకు అమ్మకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: మద్యం, పొగాకు ఉత్పత్తులను చిన్నారులకు విక్రయించకుండా తీసుకొచ్చిన చట్టాన్ని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఘాటుగా స్పందించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న హైకోర్టు, జువెనైల్ చట్టం ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నేరమని గుర్తు చేసింది. ‘హెల్ప్ ది పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్’ చైర్మన్ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం.. మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపుల వద్ద హెచ్చరికల బోర్డును ప్రదర్శించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం, హెచ్చరికల బోర్డుల ప్రదర్శనకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఆహార భద్రత మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, వైద్యఆరోగ్య శాఖ, హోం శాఖ, రెవెన్యూ (ఎక్సైజ్), పంచాయతీరాజ్, పురపాలక శాఖ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర డీజీపీ, జువెనైల్ సంక్షేమ డైరెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
పంచదార్లకొండ మైనింగ్ లీజుల వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, పంచదార్లకొండను గుల్ల చేస్తూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సోమవారం స్పందించింది. పంచదార్లకొండ వద్ద మైనింగ్‌కు సంబంధించిన జారీ చేసిన లీజుల వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లకొండ వద్ద కూటమి ప్రభుత్వ పెద్దలకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ అక్రమ మైనింగ్ చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించడంతో పాటు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారంటూ శ్రీపంచదార్ల ధర్మలింగేశ్వరస్వామి దేవస్థానం పూర్వ చైర్మన్ ఉప్పులూరి నాయుడు పిల్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పంచదార్లకొండ రక్షిత జోన్లో ఉంది. ఇక్కడ ఎలాంటి మైనింగ్ చేయడానికి వీల్లేదు. యమధర్మరాజు ప్రతిష్టించిన శివలింగానికి అక్రమ మైనింగ్ వల్ల ప్రమాదం ఏర్పడింది. అధికార పార్టీలకు చెందిన నేతలు కొందరు పంచదార్లకొండను అక్రమ మైనింగ్ ద్వారా గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎగవేసిన పన్నులు, రాయల్టీ, సీనరేజీ, డెడ్‌రెంట్ వంటి వాటిని అక్రమ మైనింగ్‌దారుల నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న విజయ్ కుమార్ నాయుడు, రితి్వక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ లైసెన్సులను రద్దు చేయాలి’ అని విన్నవించారు. పంచదార్లకొండపై 2.13 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించామని, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించామని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలుపుతుండగా, పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ‘మొత్తం మూడు మైనింగ్ లీజులున్నాయి. ఒకటి కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీ పేరు మీద, మరొకటి ఆయన డ్రైవర్ పేరు మీద, మరొకటి ఇతర పేరు మీద ఉంది. ఈ మూడింటిలో ఒక లైసెన్సును మాత్రమే రద్దు చేశారు. మిగిలిన వాటి గురించి ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు’ అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
పదవీ విరమణ ఫలాలు ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హౌసింగ్ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదాన్ని కారణంగా చూపి ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను తెలంగాణ హౌసింగ్ బోర్డు నిలిపేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఉద్యోగులకు అందించే పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ దాతృత్వం, ఉదారత, దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండవని తేల్చి చెప్పింది. పదవీ విరమణ ప్రయోజనాలన్నవి సుదీర్ఘ సేవలకు ఉద్యోగులు సంపాదించుకున్న అత్యంత విలువైన హక్కు అని తేల్చి చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ బకాయిల విషయంలో ఇది మరింత బలంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన జాప్యాలకు, సంస్థాగత వివాదాలకు ఉద్యోగులు బాధితులుగా మారడానికి వీల్లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. 8 వారాల్లో చెల్లింపులు జరపాలి: తెలంగాణ హౌసింగ్ బోర్డుకు ఆదేశాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ బోర్డులో పనిచేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ.8.77కోట్ల జీపీఎఫ్ నిధులు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో ఉన్నాయన్న హైకోర్టు, రాష్ట్ర విభజన ముందు నాటి పిటిషనర్ల జీపీఎఫ్ బకాయిలను వడ్డీతో సహా ఎనిమిది వారాల్లో చెల్లించాలని ఆ రాష్ట్ర బోర్డును ఆదేశించింది. నిర్ణీత గడువులోగా జీపీఎఫ్ బకాయిలను విడుదల చేయకుంటే ఉద్యోగులు పదవీ విరమణ చేసిన నాటి నుండి సొమ్ము చెల్లించే వరకు 12శాతం వార్షిక వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ హౌసింగ్ బోర్డుకు తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు చేసే ఈ చెల్లింపులను ఇరు రాష్ట్రాల హౌసింగ్ బోర్డుల మధ్య జరిగే ఆస్తులు, అప్పులు పంపిణీ సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. వ్యాజ్యం వివరాలు ఇవీ.. 2014 ఏపీ పునర్వీభజన చట్టం ప్రకారం ఉమ్మడి హౌసింగ్ బోర్డు.. ఏపీ హౌసింగ్ బోర్డు–తెలంగాణ హౌసింగ్ బోర్డుగా విడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డులో 40 ఏళ్ల పాటు సేవలు అందించిన పలువురు ఉద్యోగులు రాష్ట్ర విభజన అనంతరం ఏపీ హౌసింగ్ బోర్డులో తమ సేవలను కొనసాగించారు. ఈ ఉద్యోగుల్లో కొందరు 2018–21 మధ్య కాలంలో పదవీ విరమణ చేశారు. వీరు ఏపీ హౌసింగ్ బోర్డు నుంచి తాము పనిచేసిన కాలానికి జీపీఎఫ్ బకాయిలను పూర్తిగా పొందారు. అయితే పునర్వీభజనకు ముందు ఉమ్మడి హౌసింగ్ బోర్డులో పనిచేసిన కాలానికి వారి నుంచి సేకరించిన జీపీఎఫ్ నిధులన్నీ కూడా తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయాయి. ఈ జీపీఎఫ్ బకాయిలను, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించకపోవడంతో పలువురు విశ్రాంత ఉద్యోగులు 2021– 2022 మధ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున తేలప్రోలు శ్రీచరణ్ చేసిన వాదనలతో హైకోర్టు పూర్తిగా ఏకీభవించింది. -
అక్రమ మైనింగ్ సామాజిక రుగ్మత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ అండదండలతో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కొండలను గుల్ల చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అక్రమ మైనింగ్ అనేది సమాజాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సామాజిక రుగ్మత. దీన్ని మనం అందరం తప్పనిసరిగా గుర్తించుకుని తీరాల్సిందే. ఎటువంటి భయం, సిగ్గు లేకుండా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. ఇందుకు మనిషి అత్యాశే ప్రధాన కారణం. ఆ విధ్వంస పర్యవసానమే ఇప్పుడు మనకు మన కళ్ల ముందు కనిపిస్తున్న వినాశకరమైన ఫలితాలు.’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు 2020లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనల సవరణలను హైకోర్టు సమర్థించింది. ఆ సవరణలు చట్టబద్ధమైనవేనని తేల్చి చెప్పింది. ఎంఎంఆర్డీ చట్టంలోని సెక్షన్ 15, 23సీ ప్రకారం మైనర్ మినరల్స్ అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు నిబంధనలు తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్దీకరణ చట్టం (ఎంఎండీఆర్), ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ (ఎంఎంసీ) రూల్స్‌ను ఉల్లంఘిస్తూ అక్రమ తవ్వకాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకు జరిమానా విధించే అధికారం గనుల శాఖ అధికారులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే శిక్ష విధించే అధికారం మాత్రం సంబంధిత న్యాయస్థానానికే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ఎంఎంసీ రూల్స్‌కు ప్రభుత్వం చేసిన సవరణలు కేంద్ర చట్టమైన ఎంఎంఆర్డీకి విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటు కావంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పట్లో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది. గనుల శాఖ అధికారుల నుండి డిమాండ్ నోటీసు అందుకున్న మైనింగ్ కంపెనీలు ఈ తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చిన 15 రోజుల్లో చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అప్పిలేట్ అథారిటీ వద్ద అప్పీల్ వేసుకోవచ్చని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ కఠిన చర్యలు రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌కు సంబంధించి చట్ట నిబంధనల సవరణలు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం 2020 జూలై 1న జీవో 35 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అక్రమ మైనింగ్‌కు పాల్పడినా, పర్మిట్ లేకుండా రవాణా చేసినా, భారీ జరిమానా, సీనరేజ్ ఫీజు విధించవచ్చు. అంతేకాక డిమాండ్ నోటీసు జారీ, మెరిట్ వసూలు, వాహనాలు, యంత్రాలు సీజ్ చేసే అధికారం గనుల శాఖ అధికారులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణాలకు అవసరమైన రాళ్లు, రహదారి మెటల్ కోసం అనుమతులకు మించి తవ్వకాలు చేసిన మైనింగ్ కంపెనీలకు జరిమానా నిమిత్తం అధికారులు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను సవాలు చేస్తూ శ్రీదుర్గా భవానీ గ్రానైట్స్, సల్సార్ గ్రానైట్స్, జీఎంబీ రాక్స్, జీఎస్ఆర్ స్టోన్ క్రషర్స్ తదితర కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర చట్టమైన మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్ధీకరణ చట్టం (ఎంఎండీఆర్) 1957కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఏపీ ఎంఎంసీ నిబంధనలు చెల్లవని పేర్కొన్నాయి. ఎంఎంఆర్డీ చట్టం కింద జరిమానాలు, శిక్షలు విధించే అధికారం కేవలం సంబంధిత క్రిమినల్ కోర్టులకు మాత్రమే ఉంటుంది తప్ప అధికారులకు లేదని ఆ కంపెనీలు వాదించాయి. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్‌రావు, డిమాండ్ నోటీసులు జారీ చేసే పరిధి మాత్రమే అధికారులకు ఉందని జరిమానాలు, శిక్షలు విధించే అధికారం సంబంధిత కోర్టులకు మాత్రమే ఉంటుందంటూ 2020లో తీర్పునిచ్చారు. చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పలు కంపెనీలకు జరిమానా నిమిత్తం గనుల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు. దీంతో తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఎంఎంసీ నిబంధనల్లోని రూల్ 26(3)(2), 34(1) చట్టబద్ధతను సవాలు చేస్తూ అంజనీ స్టోన్ క్రషర్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. -
స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పూర్తి కాక ముందే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత మాత్రమే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు భిన్నంగా... ‘దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌సహా 19 రాష్ట్రాల్లో 01.07.2026ను అర్హత తేదీగా తీసుకుని సర్‌ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుంటూ పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి మేం వినతి పత్రం ఇచ్చాం. 31.07.2026న ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. తుది జాబితా 03.10.2026న వెలువడాల్సి ఉంది’ అని అప్పిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానిది ఏకపక్ష నిర్ణయం ‘సర్ ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది. మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రోటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం. ఈ విషయంలో మా ఆందోళనను సంఘం పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుత, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు ఏ మాత్రం స్థానం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు.హైకోర్టుకు అభ్యర్థనలు..» 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుని వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. » ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ వార్డు ఓటర్ల జాబితానైనా ప్రచురిస్తే దానిని తాత్కాలికమైనదిగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. » ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ వరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగే అన్ని రకాల చేర్పులు, తొలగింపులు అన్నీ కూడా స్థానిక వార్డు ఓటర్ల జాబితాలో కూడా ప్రతిబింబించేలా ఆదేశించాలి. » నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ నాటికి ఈ సవరణలన్నింటినీ చేరుస్తూ ఒక అనుబంధ (సప్లిమెంటరీ) ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. -
రెండు వారాల్లోగా జూడాల డిమాండ్లు పరిష్కరించండి
సాక్షి, అమరావతి: జూనియర్ డాక్టర్ల(జూడాల) న్యాయమైన డిమాండ్లను రెండువారాల్లో పరిష్కరించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో నాన్చవద్దని, తక్షణం చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో సామాజిక కార్యకర్త, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన గూడూరి వెంకట రత్న కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్, జూనియర్ డాక్టర్ల తరఫున న్యాయవాది భూమా మహర్షిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మీ బాధను అర్థం చేసుకోగలం.. వైద్య వృత్తి పవిత్రమైనది వాదనలు విన్న ధర్మాసనం.. జూనియర్ డాక్టర్లనుద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ‘మీ బాధను మేం అర్థం చేసుకోగలం. మీ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న కారణంతో మీరు సమ్మెకు దిగి ఉండొచ్చు. కానీ వైద్యులు సమ్మె పేరుతో విధులకు దూరంగా ఉండటం సరికాదు. మీరు చేస్తున్న సమ్మె వల్ల వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసన తెలిపేందుకు ఇతర మార్గాలను, పద్ధతులను చూడండి.’ అని వ్యాఖ్యానించింది. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని హితవు పలికింది. ఈ వ్యాజ్యంపై భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ చేపడుతామని, అప్పుడు సమ్మె విరమణపై జూనియర్ డాక్టర్లు తమ నిర్ణయం చెప్పాలని సూచించింది. జూడాల సమ్మె తాత్కాలిక విరమణ భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమైన వెంటనే గౌరవ న్యాయస్థానం సూచన మేరకు సమ్మె విరమించాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయం తీసుకున్నట్టు జూనియర్ డాక్టర్ల తరఫున న్యాయవాది భూమా మహర్షి రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే జూడాల డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రెండువారాల్లోగా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, దీనికోసం తక్షణం చర్యలు చేపట్టాలని, నాన్చడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూడాల సమ్మె విరమణ నిర్ణయంపైనా హైకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ‘యువ వైద్యులారా మీరు కనిపిస్తే రోగి సగం జబ్బు నయమవుతుంది. మీ నిర్ణయంతో మేం సంతోషంగా ఉన్నాం.. పవిత్రమైన వైద్య వృత్తి గౌరవాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.’ అని ఉన్నత న్యాయస్థానం అభినందించింది. కాగా, తాము సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నామని డిమాండ్ల సాధనకోసం ప్రత్యామ్నాయ మార్గాల్లో నిరసన కొనసాగిస్తామని జూడాలు ప్రకటించారు. -
జస్టిస్ గోపాలకృష్ణారావుకు హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావుకు హైకోర్టు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న జస్టిస్ గోపాలకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. బుధవారం నుంచి హైకోర్టుకు వరుస సెలవులు రావడంతో మంగళవారమే ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ గోపాలకృష్ణారావుకు వీడ్కోలు పలికేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు జస్టిస్ గోపాలకృష్ణారావు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను చూపేవారని, అదే రీతిలో కేసులను పరిష్కరించారని తెలిపారు. హైకోర్టు కమిటీలో సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయన విశ్రాంత జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆమె ఆకాక్షించారు. మంచి తీర్పులిచ్చారు..అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడారు. జస్టిస్ గోపాలకృష్ణారావు ఎంతో ఓపికతో కేసులను విచారించి మంచి తీర్పులు ఇచ్చారని చెప్పారు.ప్రమాణానికి కట్టుబడే విధులు..జస్టిస్ గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. న్యాయవాదిగా, న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా తన వృత్తి జీవితం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. తన జీవితం అంతా న్యాయస్థానాల్లోనే గడిచిందని, ఇందుకు తాను ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి కట్టుబడే విధులు నిర్వర్తించానన్నారు. తన న్యాయ ప్రస్థానంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) తేనేపల్లి నిరంజన్, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.జస్టిస్ గోపాలకృష్ణారావు దంపతులకు ఘన సన్మానంఅనంతరం జస్టిస్ గోపాలకృష్ణారావు, ఆయన సతీమణి సౌజన్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సీజే జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తులు, సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
రఘురామకృష్ణరాజుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ, ఎస్ఎఫ్ఐఓకి ఇవ్వొద్దంటూ బెదిరిస్తున్నారని, ఈ నేపథ్యంలో తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాసు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలకు సంబంధించిన ఆధారాలను తమకిచ్చేయాలంటూ దాదాపు 30 మంది తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ శ్రీనివాసు ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు శ్రీనివాసు తరఫున మద్రాసు హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది మణిశంకర్ వాదనలు వినిపిస్తూ, ‘ఎన్సీఎల్ఏటీలో ఉన్న రూ. 267.88 కోట్ల రికవరీ వ్యాజ్యాలు, సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే క్రిమినల్ విచారణ భయంతో రఘురామకృష్ణరాజు భౌతిక దాడులకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణరాజుపై పట్టాభిపురం పోలీసులకు అన్ని ఆధారాలతో పిటిషనర్ ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారు నిర్వర్తించాల్సిన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రాన ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏదీ లేదు. పిటిషనర్‌కు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని విన్నవించారు. -
పర్యావరణ బాధ్యత మీదే
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం, అడవివరం గ్రామంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్న వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించి తీరాల్సిందేనని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేసింది. పర్యావరణ అనుమతులు తీసుకుని చట్ట నిబంధనల మేరకే డేటా సెంటర్ నిర్మాణ పనులు కొనసాగించాలని తేల్చి చెప్పింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానానికి చెందిన భూమిని డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ స్పందిస్తూ, డేటా సెంటర్ కోసం భూమిని కేవలం 11 ఏళ్ల లీజు ప్రాతిపదికన మాత్రమే కేటాయించామన్నారు. దీనివల్ల దేవస్థానానికి ఏటా రూ.26 కోట్ల మేర ఆదాయం వస్తుందన్నారు. -
సివిల్ సర్వీసుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పాటు
సబ్బవరం: ‘యూపీఎస్సీ, సివిల్ సర్వీసు పరీక్షల్లో న్యాయ విద్యార్థులు రాణించగలరు. ఇందుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పడుతుంది. అదేవిధంగా చట్టాలను సమర్థంగా అమలు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు సైతం న్యాయ పరిజ్ఞానం దోహదపడుతుంది.’ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ లీసా గిల్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని శనివారం సీజే జస్టిస్ లీసా గిల్ సందర్శించారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన విద్యార్థినుల వసతి గృహం, రెండు సమావేశ మందిరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ లీసా గిల్ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి రంగంలో మహిళలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, అవి వారి ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను పరిమితం చేయకూడదని చెప్పారు. మహిళలు భవిష్యత్‌లో మార్గదర్శకులుగా నిలిచేలా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరుగుతోందిన్యాయవాద వృత్తిలో మహిళల పాత్రపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీజే జస్టిస్ లీసా గిల్ సమాధానమిస్తూ... న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. పంజాబ్–హరియాణ హైకోర్టులో ప్రస్తుతం సుమారు 70 శాతం మంది, పలు రాష్ట్రాల హైకోర్టుల్లో దాదాపు 65 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయరంగంలో పరిస్థితులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. మొదటి తరం మహిళా న్యాయవాదులు వృత్తిలోకి ప్రవేశించినప్పుడు అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. అంకితభావం, పట్టుదలతో వాటిని అధిగమించారని చెప్పారు. న్యాయ విద్యార్థులు అత్యుత్తమ సివిల్ సర్వెంట్లుగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విశ్వవిద్యాలయ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సీజే జస్టిస్ లీసా గిల్‌ను యూనివర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాశరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, భోపాల్ నేషనల్ అకాడమీ మాజీ డైరెక్టర్ మోహన్ గోపాల్, యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ విశ్వచంద్రనాథ్ మదాసు, అకడమిక్ డైరెక్టర్ సోమా భట్టాచార్య, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రఘురామకృష్ణరాజు బారినుంచి కాపాడండి
సాక్షి, అమరావతి: పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ చెప్పుకునే తండ్రీ, కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లకు తమ పార్టీ నేత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అరాచకాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఓ వ్యాపారవేత్త చేసేదేమీ లేక భద్రత కోసం హైకోర్టు తలుపుతట్టారు. రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ, ఎస్ఎఫ్ఐఓకి ఇవ్వొద్దంటూ బెదిరిస్తున్నారని, తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాసు హైకోర్టులో గురువారం అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 2+2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని, అందుకయ్యే ఖర్చును తానే భరిస్తానని శ్రీనివాసు తన పిటిషన్లో పేర్కొన్నారు. కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ జెన్కాం కంపెనీని వేలం పాటలో కొనుగోలు చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరించారని, ఈ ఘటనకు సంబంధించి తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నమోదుచేయలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా గుంటూరు, పట్టాభిపురం పోలీసులను ఆదేశించాలని కూడా ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రాన ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏదీ లేదన్నారు. కాగా, కోర్టు సమయం అయిపోవడంతో ఆయన పిటిషన్ విచారణకు రాలేదు. క్రిమినల్ కేసులు వెంటాడతాయన్న భయంతోనే..‘తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న 189 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ కంపెనీ ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ గతంలో రఘురామకృష్ణరాజు, ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉండేది. భారీ ఆరి్థక బకాయిల వల్ల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ సదరు కంపెనీ లిక్విడేషన్‌కు ఆదేశించింది. 2022 మే 13న జరిగిన బహిరంగ ఈ–వేలంలో నేను, నా సతీమణి అనిత కన్సారి్టయం రూ.101.42 కోట్లకు (వడ్డీతో కలిపి) కంపెనీని కొనుగోలు చేశాం. రఘురామకృష్ణరాజు చెల్లించాల్సిన రూ.267.88 కోట్లను వసూలు చేసుకోవడానికి, న్యాయస్థానాల్లో కేసులను కొనసాగించడానికి చట్టబద్ధమైన బాధ్యత, హక్కులను ఈ ఎన్సీఎల్టీ మాకు ఈ సందర్భంగా ఇచ్చింది. రూ.1,185 కోట్ల బ్యాంకు రుణాన్ని రఘురామకృష్ణరాజు దారి మళ్లించిన వ్యవహారంపై సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కంపెనీ ప్రస్తుత యజమానిగా, అధికారిక రికార్డుల కస్టోడియన్‌గా ఎస్ఎఫ్ఐఓ జారీ చేసిన సమన్ల ప్రకారం, పాత రికార్డులు, లావాదేవీల చిట్టాలు, ఇతర కీలక ఆర్థిక పత్రాలను దర్యాప్తు సంస్థల ముందు ప్రవేశపెట్టాల్సిన చట్టబద్ధమైన బాధ్యత నాపై ఉంది. ఈ కీలకమైన రికార్డులు గనుక సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ చేతికి చిక్కితే తనపై క్రిమినల్ కేసుల విచారణ వేగవంతమై శిక్ష పడుతుందనే భయంతో రఘురామకృష్ణరాజు మా ఇంటిపై దాడి చేయించి ఆ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు’ అని పిటిషనర్ పేర్కొన్నారు. -
జస్టిస్ హరినాథ్‌పై ఆరోపణలు చేయలేదంటారా..?
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణంపై ఏసీబీ విచారణకు ఆదేశించి, ఆ వ్యవహారంపై విచారణ జరుపుతున్న హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌పై విశ్వాసం లేదంటూ న్యాయవాది రాహుల్ చౌదరి ఆరోపణలు చేయడాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో జస్టిస్ హరినాథ్‌పై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని, ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని విన్నపాలు, అభ్యర్థనలతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి అలాగే కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన భూములను తమ భూములుగా చెప్పుకుంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ప్రైవేటు వ్యక్తులు.. గుబ్బల సత్యనారాయణమూర్తి, ముమ్మన సూర్యారావు, వాసంశెట్టి అప్పారావు మరికొందరు సీజే ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రైవేటు వ్యక్తులు (అప్పీలెంట్లు) దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చిన సందర్భంగా వారి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జిపై న్యాయవాది రాహుల్ చౌదరి ఆరోపణలు చేయలేదన్న విల్సన్ వాదనలను ధర్మాసనం ఈ సందర్భంగా తప్పుపట్టింది. అన్నీ తెలుసుకొని వాదించాలని సూచించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు తక్షణ నిలుపుదలకు విల్సన్ చేసిన అభ్యర్థనను నిరాకరించిన ధర్మాసనం, ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌తో కలిపి ఈ రెండు అప్పీళ్లను విచారిస్తామంటూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. భూముల విషయంలో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలో దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలకు, ఇటీవల దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై తాము దృష్టి సారించామని కూడా స్పష్టం చేసింది. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా వాదనలు వినిపించడం సరికాదు‘సింగిల్ జడ్జిపై మేము ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కావాలంటే మేము దాఖలు చేసిన లిఖితపూర్వక మెమోను పరిశీలించాలి’అని విల్సన్ అంతక్రితం ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘మెమోలో ఏమీ ఉండకపోవచ్చు.. కాని మౌఖికంగా చేసిన ఆరోపణల సంగతి ఏమిటి? ఆరోపణలు చేయలేదని చెబితే సరిపోదు. ఆరోపణలకు మా వద్ద వీడియో రికార్డింగ్ ఆధారాలున్నాయి. కావాలంటే ఆ వీడియోను ప్లే చేసి చూపుతాము. మీ క్లయింట్ల తరఫు న్యాయవాది రాహుల్ చౌదరి (ఎస్‌జీపీ ప్రణతి భర్త) సింగిల్ జడ్జి ముందు మాట్లాడిన మాటలు మాత్రం రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ ఉన్న నేపథ్యంలో సింగిల్ జడ్జిపై రాహుల్ చౌదరి ఎలాంటి ఆరోపణలు చేయలేదని చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కోర్టుల్లో వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉండటం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. సింగిల్ జడ్జిపై ఆరోపణలు ఏమీ చేయలేదని చెబుతున్నారంటే మీకు మీ ఆన్ రికార్డ్ న్యాయవాదులు గానీ, పిటిషనర్లు గానీ సరైన బ్రీఫింగ్ చేసినట్లు కనిపించడం లేదు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా మీరు వాదనలు వినిపించడం ఎంత మాత్రం సరికాదు.’ అని ధర్మాసనం విల్సన్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. -
బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడీ
సాక్షి, అమరావతి: బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టిన చంద్రబాబు సర్కారు ఒక్కపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై బీసీలను మ«భ్యపెడుతూ మరోపక్క న్యాయస్థానాలు తప్పుబట్టే నిర్ణయాలతో ఆటలాడుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నివేదిక అందజేసిన సందర్భంగా ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ హైకోర్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు సూచించటాన్ని బట్టి చంద్రబాబు బురిడీ రాజకీయాలు స్పష్టమవుతున్నాయి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులు కొనసాగుతుంటాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూడాలంటే బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ రిజర్వేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందువల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే పరిస్థితి ఉంటే హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లే తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత కావాలని బీసీ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు దీన్ని విస్మరించి న్యాయస్థానాలు తప్పుబట్టేలా వ్యవహరించటాన్ని బట్టి బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందనే చర్చ జరుగుతోంది. రెండేళ్లుగా చిన్న ప్రయత్నమైనా చేయకుండా డ్రామాలు.. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పరమైన రక్షణ లేకపోవడం, జనాభా లెక్కలు లేకపోవడంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛకు వదిలిపెట్టారు. చట్టబద్ధమైన బీసీ జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీపై ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై రెండేళ్లుగా సీఎం చంద్రబాబు చిన్న ప్రయత్నం కూడా చేయకుండా డ్రామాలాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తాజాగా శాసనసభలో చర్చ సందర్భంలో సైతం దీనికి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కనీసం తీర్మానం చేయకపోవటాన్ని బట్టి చంద్రబాబు అసలు నైజం తెలుస్తోందనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేవలం మంత్రివర్గం నిర్ణయంతో సరిపెట్టడం బట్టి రిజర్వేషన్ల చెల్లుబాటుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత ప్రభుత్వం అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి కేంద్రానికి పంపి చిత్తశుద్ధి చాటుకుంది. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నాడు వైఎస్ జగన్ కోరడం గమనార్హం. బీసీ రిజర్వేషన్లపై మరో కుట్ర» 34 శాతం రిజర్వేషన్లపై రేపు కోర్టుకు వెళ్లేది చంద్రబాబే » వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సాక్షి, అమరావతి: స్థానికసంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతున్నట్లు వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు డప్పు కొట్టుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచితే, తన మనుషులతో కోర్టులో పిటిషన్లు వేయించి అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. అనిల్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని, ఈసారి కూడా తన మనుషులతో వీటిపై పిటిషన్లు వేయించి వైఎస్సార్సీపీ మీదకు నెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పారు. అందుకే ముందస్తుగా లీకులిస్తున్నారన్నారు. ‘బీసీలకు 50 శాతం పదవులిచ్చింది వైఎస్ జగన్. కోర్టు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయంగా పదవులిచ్చారు. బీసీలను నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది. స్థానికసంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు. జగన్ ఇచ్చిన రిజర్వేషన్లను అడ్డుకుంది మీరేగా గతంలో జగన్ రాజకీయ పదవుల్లో 50 శాతాన్ని బీసీలకు ఇచ్చారు. 25 మంది ఎంపీలుంటే అందులో 11 ఎంపీ సీట్లు ఇచ్చారు, రాజ్యసభలో సైతం మొదటిసారి నాలుగు ఎంపీ పదవులు ఇచ్చారు. 58 ఎమ్మెల్సీ పదవుల్లో 28 మంది బీసీలకు అవకాశం కల్పించారు. 13 మేయర్ పోస్టుల్లో తొమ్మిది బీసీలకు ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ పదవులు 13లో ఆరు బీసీలకు ఇచ్చారు. 84 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చారు. ఇలా చూసుకుంటే 40 నుంచి 60 శాతం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవుల్ని జగన్ బీసీలకు ఇచ్చారు. పార్లమెంట్లో 50 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రైవేటు బిల్లు పెట్టించిన ఘనత జగన్‌దే. మీరు ఒక్కసారి అయినా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు మొదట వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొంటున్నారు. అసలు బీసీలకు ఈ విధంగా పదవులు ఇవ్వాలని జగన్ అంకురార్పణ చేస్తే, దాన్ని అమలుచేయక తప్పని పరిస్ధితి మీది. 2019కి ముందు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో ఎంత మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో చూడాలి. జగన్ హయాంలో 196 మార్కెట్ యార్డుల్లో 76 చోట్ల బీసీలు చైర్మన్లు అయ్యారు. వడ్డెర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఓడిపోయినా ఏసురత్నం రూపంలో మండలిలో స్థానం కల్పించారు’ అని అనిల్‌కుమార్ పేర్కొన్నారు. చాలా చిన్నస్థాయిలో ఉన్నవారికి కూడా జగన్ ఊహించని పదవులు ఇచ్చారన్నారు. -
ఏమీ తెలియదా.. గుడ్.. వెరీగుడ్!
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహా రంలో సోమవారం హైకోర్టులో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. తనతో పాటు తన భర్త, ఇతరులపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌పై సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.ఈ సందర్భంగా సింగిల్ జడ్జి హరినాథ్ వద్ద ఉన్న వ్యాజ్యం గురించి ప్రశ్నించింది. ప్రణతి తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు తెలియదని, అందులో తాము పార్టీ కాదని చెప్పారు. ‘తెలియదు అని చెప్పేస్తే సరిపోదు. తమ ముందున్న ప్రణతి అప్పీల్‌తో ముడిపడి ఉన్న వ్యాజ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని ధర్మాసనం ఈ సందర్భంగా గట్టిగా చెప్పింది. దీంతో ఆ వ్యాజ్యం విచారణ గురించి తెలుసుకుంటామని ఆదినారాయణరావు చెప్పారు.అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ఆగస్టు 3న సింగిల్ జడ్జి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులు (మీపై నమ్మకంలేదంటూ ప్రణతి భర్త రాహుల్ చౌదరి దాఖలు చేసిన మెమోపై ఇచ్చిన ఉత్తర్వులు) గురించి తెలుసా? అని ప్రణతి తరఫు ఆన్ రికార్డ్ న్యాయవాది నిరంజన్బాబును ప్రశ్నించింది. తమకు తెలీదని చెప్పగానే, ధర్మాసనం ‘గుడ్.. వెరీ గుడ్’ అంటూ అసహనం వ్యక్తం చేసి విచారణను వాయిదా వేసింది.ప్రణతి అఫిడవిట్‌ను ఆమోదించొద్దుఅంతక్రితం ప్రణతి తరఫున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు సింగిల్ జడ్జిపై తాము చేసిన ఆరోపణలను తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ సమయంలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ఈ అఫిడవిట్‌ను ఆమోదించకూడదన్నారు. ఇదే రీతిలో తెలంగాణ హైకోర్టు జడ్జిపై పెద్దిరాజు అనే వ్యక్తి పలు ఆరోపణలు చేశారని, తరువాత ఆ ఆరోపణలను ఉపసంహరించుకుంటూ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రణతి దాఖలు చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరం ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేస్తానని వెంకట్ చెప్పారు.జస్టిస్ హరినాథ్‌పై ప్రణతి భర్త ఆరోపణలుఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి పలు ఆరోపణలు చేయగా, ఆమె భర్త, న్యాయవాది రాహుల్ చౌదరి సైతం పిటిషనర్ల తరఫున ఆరోపణలు చేశారు. కాకినాడ భూ వివాదంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మీపై మాకు నమ్మకం లేదని జస్టిస్ హరినాథ్‌పై రాహుల్ చౌదరి ఆరోపణ చేశారు. సీజే ధర్మాసనం ముందు అప్పీల్ (ఎస్‌జీపీ ప్రణతి దాఖలు చేసింది) తేలేంత వరకు తమ వ్యాజ్యంపై విచారణ జరపవద్దని కూడా ఆయన కోరారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని రాహుల్ చౌదరిని ఆదేశించారు.దీంతో రాహుల్ ఇటీవల ఓ మెమో దాఖలు చేశారు. దానిని పరిశీలించిన జస్టిస్ హరినాథ్ విచారణ నుంచి తప్పుకోవడానికి, విచారణను వాయిదా వేయడానికి నిరాకరించారు. విచారణను వాయిదా వేయడానికి గానీ, కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి పిటిషనర్లు చేసిన అభ్యర్థనలు ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోదగ్గవి కావన్నారు. మీపై నమ్మకం లేదంటూ రాహుల్ బహిరంగంగా ఆరోపణ చేసిన నేపథ్యంలో, ఆ రోజున జరిగిన విచారణ తాలుకు రికార్డింగ్‌లను డౌన్లోడ్ చేసి జాగ్రత్త చేయాలని రిజిస్ట్రార్ (ఐటీ)ని న్యాయమూర్తి ఆదేశించారు. తనపై నమ్మకం లేదని రాహుల్ చౌదరి మెమో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తగిన సూచనల నిమిత్తం ఈ కేసును ప్రధానన్యాయమూర్తి ముందు ఉంచాలని ఆదేశించారు. -
విద్యుత్ సదుపాయం జీవించే హక్కులో భాగం
సాక్షి, అమరావతి: విద్యుత్ సరఫరా కనెక్షన్ల విషయంలో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న విద్యుత్ అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. విద్యుత్ సదుపాయం రాజ్యాంగంలో అధికరణæ 21 ప్రకారం జీవించే హక్కులో ఒక అవిభాజ్య అంతర్భాగమని స్పష్టం చేసింది. ఒకవేళ దీనికి భంగం వాటిల్లితే, అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని పేర్కొంది. విద్యుత్ సరఫరా కనెక్షన్ల వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల దైనందిన జీవితంలో విద్యుత్‌కు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, చట్టబద్ధమైన నిబంధనలను ఎటువంటి మినహాయింపు లేకుండా అమలు చేయడానికి తగిన సమగ్రమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ విద్యుత్ కనెక్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరిస్తూ ఈపీడీసీఎల్ చైర్మన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. అలాగే పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తును తిరిగి పరిగణనలోకి తీసుకుని రెండు వారాల్లో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. విసిగి వేసారి హైకోర్టులో పిటిషన్శ్రీకాకుళం జిల్లా, పరంపేటకు చెందిన కడగల శ్రీనివాసరావు తన ఇంట్లో జీవనోపాధి కోసం చిన్న పిండి మిల్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కూడా పొందారు. ఫీజు చెల్లించి, కేటగిరి 2 కింద కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం 2025 సెప్టెంబర్ 20న దరఖాస్తు చేసుకున్నారు. లైన్మెన్ విద్యుత్ సిబ్బంది కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించగా, స్థానికుల జోక్యం కారణంగా మీటర్ బిగించకుండానే వెళ్లిపోయారు. ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదో కూడా శ్రీనివాసరావుకు చెప్పలేదు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆన్లైన్ పోర్టల్‌లో చూడగా, దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరించినట్లు అని చూపించారు. దీంతో శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. -
సీనియర్ సిటిజన్లు, బలహీనవర్గాల కేసులకు అధిక ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: అత్యవసర కేసులతో పాటు పాత కేసులు, సీనియర్ సిటిజన్లు, బలహీన వర్గాల కేసుల విచారణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. మహిళా న్యాయవాదులు, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక మౌలిక వసతులు కలి్పస్తున్నట్లు చెప్పారు. 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం హైకోర్టులో ఘనంగా జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో న్యాయ వ్యవస్థది కీలక పాత్ర అని చెప్పారు.సత్వర న్యాయం కోసం సాంకేతికను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఇప్పటికే హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో డిజిటల్ విప్లవం తీసుకొచ్చామని తెలిపారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. కోర్టులు కేవలం రాళ్లు, ఇటుకలతో కూడిన నిర్మాణాలుగా మిగిలిపోకూడదని, సత్వర న్యాయాన్ని అందించే ఆలయాలుగా ఉండాలని అన్నారు. రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అంకితభావంతో, పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను 2,50,363 నుంచి 2,45,438కి తగ్గించగలిగామని తెలిపారు. గత ఏడాది కాలంలో నిర్వహించిన 4 లోక్ అదాలత్‌లలో 13.95 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందించేందుకు 14 సంచార వాహనాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. ద్వారకానాథ్ రెడ్డి, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తేనెపల్లి నిరంజన్, న్యాయవాదులు, రిజి్రస్టార్లు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అదనపు భవనం ప్రాంగణంలో న్యాయమూర్తులందరూ మొక్కలు నాటారు. విజయవాడలోని విజయమేరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి అలరించారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం చట్టవిరుద్ధమే
సాక్షి, అమరావతి: మద్యం రవాణా కేసులో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అరెస్ట్ విషయంలో సీఐడీ సిట్ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమేనని తేల్చిచెప్పిన హైకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం చట్టవిరుద్ధమే అని స్పష్టం చేసింది. మద్యం రవాణా కేసులో తమ అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్ట్‌ను అక్రమమని ప్రకటించారు. వారి తక్షణ విడుదలకు ఆదేశాలిచ్చారు. ఇందుకు సంబంధించి 121 పేజీల కామన్ ఆర్డర్ ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. అరెస్ట్‌కు ముందే వైద్య పరీక్షలా? ‘మద్యం రవాణా కేసులో చాలాకాలం అరెస్ట్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, 2026 ఏప్రిల్ 7వ తేదీన మద్యం అక్రమ కేసులో బెయిల్ లభించిన తరువాత నిందితులను అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీ కోసం అత్యవసరంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిని ముందుగా కస్టడీలోకి తీసుకుని, తరువాత కోర్టులో అరెస్ట్ చూపారు. అరెస్ట్‌కు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 53కి విరుద్ధం. నిందితులు విచారణలో పాల్గొనడానికి ఎలాంటి ఆసక్తి చూపడంలేదనిగానీ లేదా వారు పరారీలో ఉన్నారనిగానీ సిట్ కౌంటర్ అఫిడవిట్ పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేనప్పుడు సీఆర్పీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిందితులను అరెస్టు చేసి, ఆ తర్వాత హడావుడిగా జుడీషియల్ కస్టడీకి కోరాల్సిన అత్యవసర అవసరం ఎంత మాత్రం లేదు. చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ పాటించాల్సి తీరాల్సిందే. ప్రస్తుత కేసులో నిందితుల అరెస్ట్ అవసరం తప్పనిసరిగా ఉందని సిట్ నిరూపించలేకపోయింది’అని హైకోర్టు స్పష్టం చేసింది.వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు⇒ వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించి తీరాల్సిందే. అధికరణ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు. ⇒ దర్యాప్తు అవసరాలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సమతుల్యత ఉండాలి. ⇒ దర్యాప్తు అధికారాలను ఉపయోగించి వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించరాదు. ⇒ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాలలో చట్ట విధి విధానాలను అనుసరించకపోవడం తీవ్రమైన అక్రమ చర్యే అవుతుంది. ⇒ అధికరణ 22(1) ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తికి అరెస్ట్‌కు సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ (అరెస్ట్‌కు దారి తీసిన వాస్తవ పరిస్థితులు)లను తెలియజేయడం రాజ్యాంగపరమైన తప్పనిసరి హక్కు. ⇒ కేవలం నామమాత్రంగా రీజన్స్ ఆఫ్ అరెస్ట్ (అరెస్ట్‌కు చూపే కారణాలు) చూపించడం సరిపోదు. ⇒ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్.. రీజన్స్ ఆఫ్ అరెస్ట్ రెండూ ఒకటి కాదు. ⇒ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్‌లో ఆ వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలియచేసే వ్యక్తిగత, ప్రాథమిక వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి అవసరమైతే తన రిమాండ్‌ను వ్యతిరేకించడానికి, బెయిల్ కోరడానికి ఇది దోహదపడుతుంది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లిఖితపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో స్పష్టంచేసింది. ⇒ రిమాండ్‌కు కనీసం రెండు గంటల ముందు ఈ కారణాలను తెలియజేయాలి. లేదంటే దాని ఆధారంగా జరిగిన రిమాండ్ కూడా చట్టవిరుద్ధం అవుతుంది. ⇒ రిమాండ్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వడం గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇచ్చినట్లు పరిగణించలేము. ⇒ రిమాండ్ రిపోర్ట్‌లో తగిన కారణాలున్నాయని చెబితే సరిపోదు. ఆ కారణాలను అరెస్ట్ చేసిన వ్యక్తికి ప్రత్యేకంగా అందించాల్సిందే. ⇒ న్యాయ వ్యవస్థ ఒకవైపు సక్రమమైన, సమర్థవంతమైన దర్యాప్తు ప్రయోజనాలను కాపాడుతూనే, మరోవైపు నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ⇒ దర్యాప్తు అధికారాలు న్యాయాన్ని అందించడానికి మాత్రమే ఉపయోగపడాలి. అనవసరంగా లేదా పరిమితికి మించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉండకుండా చూడటం న్యాయస్థానాల బాధ్యత. -
న్యాయవ్యవస్థకు జస్టిస్ చక్రవర్తి ఎనలేని సేవలు
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, ‘గత 32 సంవత్సరాలుగా జస్టిస్ చక్రవర్తి వివిధ హోదాల్లో న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కించడంలో కీలక పాత్ర పోషించారు’ అని పేర్కొన్నారు.అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడుతూ సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా జస్టిస్ చక్రవర్తి చూసేవారన్నారు. చివరిగా జస్టిస్ చక్రవర్తి మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా కంప్యూటర్ కమిటీ సభ్యునిగా, మాస్టర్ ట్రైనీగా తనకు మరిచిపోలేని అనుభవాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జస్టిస్ చక్రవర్తి కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జస్టిస్ చక్రవర్తి దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాగా, పదవీ విరమణ అనంతరం జస్టిస్ చక్రవర్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.న్యాయవాదుల కోసం ‘అడ్వొకేట్ సర్వీసెస్ పోర్టల్’న్యాయవ్యవస్థలో సాంకేతికతను అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర హైకోర్టు తాజాగా న్యాయవాదుల కోసం కొత్తగా ‘అడ్వకేట్ సర్వీసెస్ పోర్టల్’ను తీసుకొచ్చింది. ఇంతకుముందు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో లేని పలు సేవలను ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. జస్టిస్ చక్రవర్తి చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమైంది.ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, న్యాయ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందన్నారు. న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ న్యాపతి విజయ్, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ టి.సి.డి. శేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన హైకోర్టు ఐటీ కమిటీ మార్గదర్శకత్వంలో ఈ పోర్టల్ రూపొందింది.జస్టిస్ చక్రవర్తి దంపతులను సత్కరించి జ్ఞాపిక ఇస్తున్న వాసిరెడ్డి ప్రభునాథ్, తిరుమలశెట్టి కిరణ్ తదితరులు -
రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్ అక్రమం
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణా కేసులో చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు అరెస్టులే లక్ష్యంగా దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వారి అరెస్ట్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. వీరి అరెస్ట్ విషయంలో చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ అధికారులు తుంగలో తొక్కారని ఆక్షేపించింది. సిట్ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం లేదంది. సిట్ దర్యాప్తునకు సహకరించాలని రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిలను ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు వారి ముందు హాజరు కావాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో తమకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమ అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ తుహిన్‌కుమార్ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పూర్తి పాఠం తెలియరాలేదు. -
ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్‌కు ఏం పని..?
సాక్షి, అమరావతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను హైకోర్టు గురువారం తీవ్రంగా ఆక్షేపించింది. తిరుపతి రూరల్ మండలం, తణపల్లి పరిధిలోని సర్వే నంబర్ 478లోని అప్రూవ్డ్ ప్రైవేట్ లేఔట్లోకి భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ కలెక్టర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ప్రైవేట్ లేఔట్లోకి అక్రమంగా చొరబడి ఉంటే, దాని యజమాని కింది కోర్టులో సూట్ దాఖలు చేసుకునే వారని పేర్కొంటూ, దీంట్లో కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశి్నంచింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించిన హైకోర్టు, దర్యాప్తునకు సహకరించాలని భూమన, ఆయన కుటుంబ సభ్యులను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్‌పై హైకోర్టును ఆశ్రయించిన భూమన భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అప్రూవ్డ్ లేఔట్లోకి అక్రమంగా ప్రవేశించి యంత్రాల సహాయంతో మామిడి తోటల మొక్కలను ధ్వంసం చేశారని, అలాగే తన సొంత పొలానికి రోడ్డు వేసుకుని అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని, దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ గత నెల 22న జిల్లా ఎస్పీని లిఖితపూర్వకంగా ఆదేశించారు. ఈ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన సతీమణి రేవతి, కుమారుడు అభినయ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. భూమన తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు నాగేశ్వరరావు, న్యాయవాది యుగంధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వం విషం చిమ్ముతోందన్నారు. లేఔట్ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు కలెక్టర్ ఎలా జోక్యం చేసుకుంటారు? ‘‘ఓ ప్రైవేట్ అప్రూవ్డ్ లేఔట్ వివాదంలో కలెక్టర్‌కు ఏ సంబంధం ఉంది? ప్రైవేటు భూ వివాదంలో జోక్యం చేసుకునే అధికార పరిధి కలెక్టర్‌కు ఎక్కడ ఉంది? భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులను గూండాలని కలెక్టర్ తన ప్రొసీడింగ్స్‌లో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరం. ఏ ఆధారంతో కలెక్టర్ వారిని గూండాలని సంబోధిస్తారు? కలెక్టర్ చాలా దారుణమైన భాష ఉపయోగించారు. ప్రైవేటు అప్రూవ్డ్ లేఔట్ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు ఆ వ్యవహారంలో కలెక్టర్ ఎలా జోక్యం చేసుకుంటారు?’’ అని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.ఫిర్యాదుదారుగా కలెక్టర్‌ని పేర్కొనడంపై కూడా విస్మయం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ కోరితే, ఫిర్యాదుదారుగా కలెక్టర్‌ను ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. బహుశా కలెక్టర్ మన శాఖకు చెందిన వారు కాదు కదా అన్న ఉద్దేశంతో, ఎస్పీని కాకుండా కలెక్టర్‌ను ఫిర్యాదుదారుగా పోలీసులు పేర్కొని ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఎస్పీని ఫిర్యాదుదారుగా చేర్చేంత ధైర్యం కింది స్థాయి పోలీసులకు ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించింది. -
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
నోరు తెరిస్తే అబద్దాలు!
సాక్షి, అమరావతి: తప్పు అంటూ సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా మందలించింది.. మంచి పద్ధతి కాదంటూ మొట్టికాయలేసింది. కరువు సీమలో ఉపాధి కల్పిస్తూ..చట్టబద్ధంగా అన్ని అనుమతులతో కార్యకలాపాలు నడుపుతూ ప్రభుత్వానికి వేల కోట్ల పన్నులు చెల్లిస్తున్న ప్రతిష్టాత్మక సిమెంట్ కంపెనీ భారతి సిమెంట్స్‌ను అడ్డుకోవడం తగదని హైకోర్టు హితవు పలికింది. అయినా చంద్రబాబు అండ్ కో తీరు మారలేదు. కోర్టు తీర్పుతో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ తప్పు సరిదిద్దుకోవాలన్న తలంపు లేదు. కళ్లార్పకుండా కమిట్మెంట్తో తాను అబద్దాలు ఆడినట్లే తమ పార్టీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డితో కూడా చంద్రబాబు అబద్ధా్దలు చెప్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కేసుపై రాద్ధాంతం చేయిస్తున్నారు.. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి లేబర్ కోర్టులో ఓడిపోయిన ఆ కేసుపై ఇప్పుడు నాటకాలేమిటని కార్మికులే ఆశ్చర్యపోతున్నారు.. మైనింగ్ ఇబ్బందికరంగా మారిందని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టీడీపీ నేతలు కట్టుకథలు అల్లుతున్నారు. ఇవన్నీ డ్రామాలేనని ప్రజలకు అర్థమవుతూనే ఉంది...ప్రజలు గుండెల్లో పెట్టుకున్న కంపెనీ..భారతి సిమెంట్స్ సంస్థ 18 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. అక్కడి ప్రజల సహకారం, అభిమానం లేకపోతే ఒక కంపెనీ ఇంతకాలం ఇంత విజయవంతంగా నడవడం సాధ్యమయ్యే పనేనా? హైకోర్టు చెప్పినట్లు.. కరువు ప్రాంతంలో వచ్చిన ఈ కంపెనీ అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 15 వేల కుటుంబాలలో వెలుగులు నింపింది. అందుకే ప్రజలు ఈ కంపెనీని గుండెల్లో పెట్టుకున్నారు. భారతి సిమెంట్స్ కంపెనీ పట్ల ప్రజల అవ్యాజమైన అభిమానానికి మరో కారణం కూడా ఉంది.సాధారణంగా పరిశ్రమల కోసం భూమి సేకరిస్తే పరిహారం ఇవ్వడంతోనే.. రైతులకు, పారిశ్రామికవేత్తలకు అక్కడితో సంబంధం ముగిసిపోతుంది. కానీ పేదల కష్టాల గురించి తెలిసిన.. అందరికీ చేతనైనంత సాయం చేయాలని అహరహం తపించే వైఎస్ జగన్మోహన్రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. భారతి సిమెంట్స్ కోసం భూములిచ్చిన రైతులందరికీ మరలా ఎకరానికింత అని లెక్కగట్టి అదనంగా డబ్బులిచ్చారు. ఒక రేటు కట్టి భూమికి డబ్బు ఇచ్చేసిన తర్వాత మరలా డబ్బు ఇచ్చిన పారిశ్రామికవేత్త బహుశా ఎవరూ ఉండరేమో.. ప్రజలంటే జగన్‌కు ఎంత అభిమానమో..జగన్ పట్ల ఆ ప్రాంత ప్రజల్లో కూడా అంత గుడ్‌విల్ ఉంది. అందుకే జగన్‌ను, భారతి సిమెంట్స్ సంస్థను అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి సంస్థపై అభాండాలు వేస్తే ఎవరైనా నమ్ముతారా....వీగిపోయిన అబద్ధపు కేసుతో ఏం సాధిస్తారు? ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పచ్చ ముఠాల ప్రోద్బలంతో 10మంది వర్కర్లు అప్పటి సీఈవోపై దాడి చేశారు. ఆ కేసులో సీసీటీవీ ఫుటేజి సహా అన్ని సాక్ష్యాధారాలూ స్పష్టంగా ఉన్నాయి. దానిపైన లేబర్ కోర్టులో వేసిన కేసులో ఓడిపోయారు కూడా.. కొందరు కార్మికులను ఉసిగొల్పి దాడిచేయించి ఆ తర్వాత కేసుపెట్టి ఏదో సాధించాలనుకున్న వారు అలా దెబ్బతిన్నారు.. మరలా ఇప్పుడు ఆ కేసునే పట్టుకుని అదే కార్మికులను ముందుపెట్టి వాళ్లను రెచ్చగొడుతూ గొడవ నడిపిస్తున్నారు. ఇది చాలదన్నట్లు మైనింగ్ చేస్తుంటే శబ్దాలు వస్తున్నాయంటూ కొత్త కట్టుకథలు మొదలుపెట్టారు. 18 ఏళ్లుగా లేని సమస్యలు ఇపుడు కొత్తగా వచ్చాయా? మీరెన్ని అబద్ధాలు ప్రచారం చేయాలనుకున్నా స్థానికులకు వాస్తవాలు తెలియవా..? ఇవన్నీ డ్రామాలేనని అర్ధం కావడం లేదూ..?పెట్టుబడిదారులకు స్వర్గధామమా..?భారతి సిమెంట్స్, భారత్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ సంస్థ వికాట్ గ్రూప్‌పై చంద్రబాబు సర్కార్ పగబట్టినట్లు వ్యవహరిస్తుండడంపై పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలోని బెస్ట్ సిమెంట్ కంపెనీలలో ఒకటైన వికాట్ గ్రూప్‌తో అనుబంధమున్న భారతి సిమెంట్స్ వంటి సంస్థ కార్యకలాపాలనే ఇలా కక్షసాధింపుతో అడ్డుకుంటుంటే... రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. చట్టబద్దమైన వ్యాపార సంస్థలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇలా కక్షసాధించడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాక్స్ రూపంలో రూ.7,300 కోట్లు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్, వికాట్ వంటి సంస్థలను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేమిటి అని పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైజాగ్‌లో గ్రైండింగ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించుకున్నా వికాట్ సంస్థ ఇదే కారణంతో ఆ ఆలోచనను ఉపసంహరించుకుందని వారు గుర్తుచేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత ప్రభుత్వ హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెబుతున్న చంద్రబాబు చేస్తున్నదేమిటి? ఎమ్మెల్యేలను ముందుపెట్టి వారిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు అండ్ కో తీరు వల్లే రాష్ట్రం నుంచి పలు కంపెనీలు పలాయనం చిత్తగిస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ కంపెనీ బైబై చెప్పేసింది.. హిందుస్థాన్ కోకోకోలా, ఆజాద్ మొబిలిటీ, జూపిటర్, జిన్ఫ్రా, ఐస్పేస్ లాంటి సంస్థలు కూడా వెళ్లిపోయాయి. -
ఈ–చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారు?
సాక్షి, అమరావతి: రేజర్ పే క్లోనింగ్ యాప్ సాయంతో రూ.36.53 కోట్ల ట్రాఫిక్ ఈ–చలాన్ల సొమ్మును దారి మళ్లించిన వ్యవహారంపై గతంలో నమోదు చేసిన కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పడంపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు పురోగతి, జాప్యానికి కారణాల వంటి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న ఈ వ్యవహారంపై తాడేపల్లి పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తును పక్కనపడేశారు. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన క్రికెటర్ శిబి చక్రవర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జిల్లా జడ్జిలు బదిలీహైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా గుత్తాల గోపి సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో హైకోర్టులో పలు కీలక నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా ఉన్న వైవీఎస్‌బీజీ పార్థసారథిని రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమించింది. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న గుత్తాల గోపీని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించింది. విశాఖపట్నం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న చిన్నంశెట్టి రాజును హైకోర్టు రిజిస్ట్రార్(అడ్మిన్)గా నియమించింది. అంతేకాక ఆయనకు కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రార్ (ఇన్ఫ్రా) బాధ్యతలను అదనంగా అప్పగించింది. నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి గోకవరపు శ్రీనివాస్‌ను విశాఖపట్నం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ చేసింది. కడప ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి డాక్టర్ చదలవాడ యామినీని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ చేసింది. తిరుపతి ఫ్యామిలీ కోర్టు కం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గుడుగుంట రామగోపాల్‌ను కడప ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జిగా నియమించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి అక్కిరెడ్డి నరసింహమూర్తి, నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మిన్)గా ఉన్న వీఎస్ఎస్ శ్రీనివాస శర్మను కృష్ణా జిల్లా మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ చేసింది. బదిలీ అయిన న్యాయాధికారులందరూ ఈ నెల 19వ తేదీలోపు కొత్త విధుల్లో చేరాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ (విజిలెన్స్) వి.శ్రీనివాస శివరాం బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. -
సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ అయిఉంటే అది చాలా తీవ్రమైన వ్యవహారమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మే నుంచీ హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదంటూ పోలీసులను ధర్మాసనం నిలదీసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.రెండు వారాలు గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరగా.. హైకోర్టు నిరాకరించింది. వారం రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకు కోర్టు వాయిదా వేసింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. -
భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు
-
‘ప్రత్యామ్నాయం’ ఉంటే.. మరణశిక్ష విధించకూడదు
సాక్షి, అమరావతి: మరణ శిక్ష విధించే ముందు న్యాయస్థానాలు నేర తీవ్రతను మాత్రమేగాక, నిందితుని స్థితిగతులను సైతం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన తీరు, క్రూరత్వం, బాధితుల పరిస్థితి, అలాగే నిందితుడి వయసు, సామాజిక–ఆర్థిక నేపథ్యం, నేర చరిత్ర లేకపోవడం, మానసిక స్థితి మధ్య న్యాయస్థానాలు సమతుల్యతను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాక నిందితుడు మారడానికి, జనజీవన స్రవంతిలో కలిసి పునరావాసం పొందడానికి ఉన్న అవకాశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంది.‘క్రిమినల్ జస్టిస్ సిస్టం (నేర న్యాయ వ్యవస్థ) అనుకున్న దానికంటే ఎక్కువ శిక్షాత్మకంగా మారింది. ఇదే సమయంలో ఈ వ్యవస్థ మార్పు, పునరావాసానికి కూడా అవకాశం కల్పిస్తోంది. నేరస్థుడిని శిక్షించడం, సంస్కరించడం, జనజీవనస్రవంతిలో కలిసేలా చేయడం అనేవి భారతీయ క్రిమినల్ జస్టిస్ సిస్టం ముఖ్య లక్ష్యాలు. శిక్షించడం కంటే పునరావాసం కల్పించడానికే క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రాధాన్యతనిస్తుంది. ఈ నేపథ్యంలో నేరస్థుడిని సంస్కరించడమే దీని అంతిమ లక్ష్యం’ అని హైకోర్టు పేర్కొంది. జీవితఖైదు విధించే ప్రత్యామ్నాయం ఉన్న కేసులను సైతం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసులుగా పరిగణించి ఉరిశిక్ష విధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత భార్య, అత్తమామలను చంపినందుకు నారాపురం శ్రవణ్‌కుమార్, తండ్రి వరప్రసాద్‌లకు ఉరిశిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు 2024లో ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. ఉరిశిక్షను రద్దుచేసిన హైకోర్టు తండ్రి, కొడుకులకు జీవితఖైదు విధించింది. వీరికి ఎలాంటి క్షమాభిక్షకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. తండ్రీకొడుకులకు నేరచరిత్ర లేదని, పరివర్తన చెందేందుకు ఆస్కారం ఉందని, అంతేగాక వీరు సమాజానికి ముప్పుగా పరిణవిుస్తారనేందుకు ఆధారాలు లేనందున వారికి విధించిన మరణశిక్షణు జీవితఖైదుగా మారుస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. శ్రవణ్‌కుమార్ తల్లి కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమెకు కింది కోర్టు విధించిన జీవితఖైదును రద్దుచేసింది. ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.ఇద్దరిని చంపిన తండ్రీకొడుకులు కర్నూలులోని చింతలముని నగర్‌కు చెందిన నారాపురం శ్రవణ్‌కుమార్ (26), రుక్మిణి (18)లకు 2023 మార్చి 1న పెళ్లైంది. అనంతరం శ్రవణ్‌కుమార్ నపుంసకుడంటూ రుక్మిణి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2023 మార్చి 14న శ్రవణ్‌కుమార్ వనపర్తి వెళ్లి తన భార్య రుక్మిణి, అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కర్నూలులోని తన ఇంటికి రాత్రి 11.30 గంటల సమయంలో తీసుకొచ్చాడు. తరువాత కొద్దిసేపటికే శ్రవణ్‌కుమార్, అతడి తండ్రి వరప్రసాద్ (62).. కత్తులతో రుక్మిణి మీద, ఆమె తల్లిదండ్రులు రమాదేవి, వెంకటేశ్వర్లుపై దాడిచేశారు. తీవ్ర గాయాలతో రుక్మిణి, రమాదేవి మృతి చెందగా.. వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 302, 307తో పాటు 34 కింద కేసు నమోదు చేసిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు 2023 మార్చి 15న నిందితులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి 2024లో తీర్పు వెలువరించింది. దీన్ని అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ.. నిందితులు శ్రవణ్‌కుమార్, వరప్రసాద్‌లకు మరణశిక్ష, శ్రవణ్‌కుమార్ తల్లి కృష్ణవేణికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ మరణశిక్ష ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెషన్స్ కోర్టు 2024లో హైకోర్టుకు లేఖ రాసింది. కేసు రికార్డులను హైకోర్టుకు పంపింది. దీంతో హైకోర్టు ఆ లేఖను రెఫర్డ్ ట్రయల్ (ఆర్టీ)గా పరిగణించి విచారణ చేపట్టింది. ఇదే సమయంలో శ్రవణ్‌కుమార్, వరప్రసాద్ తమకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. కృష్ణవేణి కూడా అప్పీల్ వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. వరప్రసాద్, శ్రవణ్‌కుమార్‌లకు కింది కోర్టు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది. -
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకులా?
‘భారతి సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారు రూ. 7,300 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడం, రాకపోకలను నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాలి. భారతి సిమెంట్స్ ప్రాంగణం సమీపంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు చూడాలి’.– హైకోర్టుసాక్షి,అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక, విచ్ఛిన్నకర శక్తులను అడ్డంపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతి సిమెంట్స్‌ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి భారతి సిమెంట్స్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసేందుకు అడుగడుగునా సహకరించిన పోలీసులకు సైతం హైకోర్టు తలంటింది. వైఎస్సార్ కడప జిల్లా, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలోని నల్లలింగాయపల్లె గ్రామంలో ఉన్న ‘భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్’కు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ఉద్యోగులు, ముడిసరుకుతో పాటు ఇతర సరుకులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసులకు తేల్చి చెప్పింది. అంతేకాక కంపెనీ చట్టబద్ధమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగేలా చూడాలని కూడా స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ పరిశ్రమ ఆవరణ సమీపంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, తమ చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని భారతి సిమెంట్స్‌ను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి పిటిషనర్ కంపెనీ సాధ్యమైనంత వరకు తన విచక్షణను ఉపయోగించవచ్చునని తెలిపారు.పోలీసుల ఉదాసీనతపై హైకోర్టులో భారతి సిమెంట్స్ పిటిషన్...వైఎస్సార్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాŠంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.భారతి సిమెంట్స్ కరువు పీడిత ప్రాంతంలో ఉపాధి కల్పిస్తోంది...‘భారతి సిమెంట్స్ ప్రాథమికంగా 2007 నుండి చట్టబద్ధ, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని ముందస్తు అనుమతులను పొంది తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా, ఇది కరువు పీడిత ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో దాదాపు రూ. 7,300,00,00,000 చెల్లిస్తూ రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు తోడ్పడుతోంది.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.దేశ సమగ్ర అభివృద్ధికి పారిశ్రామిక శాంతి చాలా అవసరం...‘పారిశ్రామిక శాంతి అనేది దేశ సమగ్ర అభివృద్ధికి, భారతి సిమెంట్స్‌కి, అలాగే దాని వాటాదారులు (శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు) అందరికీ చాలా అవసరం. ఎటువంటి చట్టపరమైన కారణం లేకుండా భారతి సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అకస్మాత్తుగా, బలవంతంగా అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం సరికాదు. ఇలాంటి చర్యలను ఆదిలోనే అరికట్టాలి. ఎందుకంటే ఇది యజమాని, ఉద్యోగులు, వారి కుటుంబాలు, రాష్ట్ర ఖజానాపై వినాశకరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చట్ట ప్రకారం తమ అధికార పరిధిలో శాంతి భద్రతలను కాపాడవలసిన చట్టబద్ధమైన బాధ్యత పోలీసులపై ఉంది. ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు.’ అని జస్టిస్ మహేశ్వరరావు తెలిపారు.అన్ని అనుమతులతో భారతి సిమెంట్స్ నడుస్తోంది...‘భారతి సిమెంట్స్ మైనింగ్ శాఖతో సహా అన్ని శాఖల ముందస్తు అనుమతులతో నడుస్తున్న కంపెనీ. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదు. కంపెనీ రాకపోకలకు, ఉత్పత్తికి, ఇతర చట్టబద్ధమైన కార్యకలాపాలకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు లేవనేది కూడా స్పష్టం. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి అనుచరులు కంపెనీ కార్యకలాపాలను, వాహనాలు, ఉద్యోగులు, అధికారులు, మెటీరియల్స్ రాకపోకలను అడ్డుకోకుండా భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.’ అని ఆయన తెలిపారు.చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత...‘నేరాలను అరికట్టడం, శాంతిభద్రతల విఘాతానికి దారితీసే పరిస్థితులను అదుపు చేయడం, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, హింస, బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. ప్రజా శాంతికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి చట్టవిరుద్ధమైన పనులను నిరోధించడం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ప్రజలు తమ చట్టబద్ధమైన కార్యకలాపాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకునేలా చూడడమే పోలీసుల ప్రధాన విధి.’ అని తేల్చి చెప్పారు.ప్రజా సంక్షేమమే సర్వోత్కృష్ట చట్టం..‘ప్రజా సంక్షేమమే అన్నింటి కన్నా గొప్ప చట్టం. న్యాయస్థానాలు తమ న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు సమాజ విస్తృత ప్రజా ప్రయోజనాలను, సంక్షేమాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత హక్కులు, సమాజ చట్టబద్ధ ప్రయోజనాలు రెండింటినీ కూడా కోర్టు విస్మరించరాదు. వాటి మధ్య తగిన సమతుల్యతను పాటించాలి. భారతి సిమెంట్స్ కంపెనీ స్పష్టమైన ఫిర్యాదులు చేసినప్పటికీ, శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి సంబంధిత పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనేది ఈ కేసులోని కీలక అంశం. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా వేగంగా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.కంపెనీకి రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నష్టం....సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనను క్లుప్తంగా చెప్పాలంటే, పోలీసులు, కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నివసిస్తున్న శాశ్వత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీ రోజుకు రూ. 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు నష్టపోతోందని, ఇది రాష్ట్ర ఖజానాకు, శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు.యజమానులు పోలీసు రక్షణ కోరవచ్చు.. కేరళ హైకోర్టు తీర్పు‘పారిశ్రామిక శాంతిని కాపాడేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు తన అధికారాన్ని ఉపయోగించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వవచ్చా లేదా అనే కోణంలో కోర్టులు వెల్లడించిన చట్టపరమైన తీర్పులను పరిశీలించడం ఎంతైనా అవసరం. రాఘవన్ వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసులో కేరళ హైకోర్టు విస్తృత తీర్పునిస్తూ... యజమానులకు, కార్మికులకు నడుమ వివాదాల పరిష్కారానికి లేబర్ చట్టాలు ఉన్నప్పటికీ, శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు యజమానులు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించి పోలీసు రక్షణ కోరవచ్చునని తెలిపింది. సమ్మె చేస్తున్న కార్మికులు యజమానిని లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులను అడ్డుకున్నప్పుడు, పూడ్చుకోలేని నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు కూడా యజమానులు హైకోర్టుకు రావొచ్చునని కేరళ హైకోర్టు చెప్పింది.’ అని జస్టిస్ మహేశ్వరరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పోలీసు రక్షణకు ఆదేశాలివ్వవచ్చు.. మద్రాసు హైకోర్టు‘అదే విధంగా, తమిళనాడు హైకోర్టు కూడా ఎస్ఎన్వై ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసులో ఫ్యాక్టరీ నిర్వహణపై శాంతిభద్రతల ప్రభావం పడినప్పుడు ఆర్టికల్ 226 కింద హైకోర్టు పోలీసు రక్షణకు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేయవచ్చని, అయితే ఫ్యాక్టరీపై, తోటి కార్మికులపై లేదా మెటీరియల్ తరలింపు విషయంలో హింసకు, బెదిరింపులకు పాల్పడటం, రాకపోకలకు ఆటంకాలు సృష్టించడం వంటివి చేయరాదని ఆ హైకోర్టు స్పష్టం చెప్పింది. పోలీసు రక్షణ అనేది కేవలం శాంతిని కాపాడటానికి, చట్టబద్ధమైన రాకపోకలకు మాత్రమేనని, వారి మధ్య ఉన్న పారిశ్రామిక వివాదాన్ని హైకోర్టు పరిష్కరించదని స్పష్టం చేసింది.’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు.రాష్ట్రానికి లబ్ది చేకూర్చే పరిశ్రమను మూసివేసేలా చేయకూడదు‘ఇండియన్ సిమెంట్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రాథమిక విధి ఇదే హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, పన్నుల రూపంలో రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్న పరిశ్రమను, కార్మికుల నిరసనల కారణంగా మూసివేసేలా చేయకూడదు. కాంట్రాక్ట్ కార్మికులకు తమ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు లేదా డిమాండ్లు ఉంటే, వారు లేబర్ కోర్టు లేదా సంబంధిత లేబర్ అథారిటీ వద్ద తగిన పరిష్కారం కోరాలి. హింస, ఆటంకాలు, అలజడులను నిరోధించి, పరిశ్రమ తన చట్టబద్ధమైన కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా చూసేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వును ఇదే హైకోర్టుకు చెందిన మరొక సింగిల్ జడ్జి కూడా అనుసరించారు. అందువల్ల, పారిశ్రామిక శాంతికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద ఈ కోర్టుకు విస్తృత అధికారాలున్నాయి.’ అని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తేల్చి చెప్పారు. -
న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలా..?
సాక్షి, అమరావతి: న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ఉపయోగించిన అభ్యంతరకర పదజాలంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు చేయడం మాత్రమే కాదని.. వాటిని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందని తేల్చి చెప్పింది. దీంతో ప్రణతి తరఫు న్యాయవాది క్షమాపణ చెప్పడంతో పాటు, ఆ వ్యాఖ్యలను అప్పీల్ నుంచి తొలగిస్తామని కోర్టుకు విన్నవించారు.కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్లో సింగిల్ జడ్జిపై అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు. ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన... ‘అక్రమం, బుర్ర ఉపయోగించకపోవడం, పక్షపాతం, అసందర్భం, అనుచితం, మందబుద్ది, దురుద్దేశాలు’ వంటి పదాలను ధర్మాసనం చదివి వినిపించింది.పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణ రావు కోర్టును క్షమాపణ కోరారు. అప్పీల్ నుంచి వాటిని తొలగిస్తామని చెప్పారు. అలా అయితే సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన అభ్యంతకర పదజాలాన్ని తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రణతిని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.అటు భార్య.. భర్త.. ఇటు ఏసీబీ విచారణ...కాకినాడలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రజా ప్రయోజనాల నిమిత్తం కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు కొంత భూమిని బహుమానంగా ఇచ్చింది. ఈ భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతూ హైకోర్టుకొచ్చారు. దీనిపై స్పందించిన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్, ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతున్న భూమి తమదేనని, దానిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మాట మార్చింది. ఆ భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది కూడా ఆశ్చర్యకరంగా ఆ భూమిపై తాము జోక్యం చేసుకోమని కోర్టుకు వివరించారు. అయితే దీనిని జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తోసిపుచ్చింది. ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కోర్టుకు చెప్పాలని తాము ఎన్నడూ తమ న్యాయవాదికి చెప్పలేదని తెలిపింది. వీటన్నింటితో పాటు ఈ కేసులో గతంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున హాజరైన ప్రణతి ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున హాజరు కావడం, అలాగే ఆ ప్రైవేటు వ్యక్తుల తరఫున ప్రస్తుతం ప్రణతి భర్త రాహుల్ చౌదరి హాజరుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్, పలు అను మానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు.ఏసీబీ విచారణపై ధర్మాసనం ముందు ప్రణతి అప్పీల్...ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి గురువారం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల తన కెరీర్ తీవ్ర ప్రభావితమవుతుందని, అందువల్ల వాటిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ప్రణతి తన అప్పీల్లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై గత నెల 31న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రణతిపై సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రా యాలను, అలాగే ఆమెపై ఏసీబీ విచారణను తదుపరి విచారణ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ప్రణతి సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు...తాజాగా సోమవారం ప్రణతి దాఖలు చేసిన అప్పీల్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ ఏ పేరాల్లో వ్యక్తిగత ఆరోపణలున్నాయో చెప్పారు. దీంతో ధర్మాసనం ఆ పేరాలను పరిశీలించింది. అనంతరం వాటిని చదివి వినిపించింది. సింగిల్ జడ్జిను ఉద్దేశించి అప్పీల్లో ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వాటిని అప్పీల్ నుంచి తొలగిస్తామని ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పడంతో, ఆ మేర అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఇది రాజకీయశక్తుల కుట్ర!
సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్‌స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్‌లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్‌స్టోన్ లోపలికి వెళితే, సిమెంట్ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. 10మంది ఆందోళన చేస్తున్నారు... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? ఇందుకు సీవీ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్‌తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్‌లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్‌రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్‌కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్‌లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
బాబు సర్కార్ కుట్రలు.. పోలీసుల నిర్లక్ష్యం.. హైకోర్టుకు భారతి సిమెంట్స్
-
చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపుపై భారతి సిమెంట్స్ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) న్యాయ పోరాటానికి దిగింది. అధికార పార్టీకి చెందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తన అనుచరుల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకుంటున్నా కనీస స్థాయిలో కూడా స్పందించకుండా చోద్యం చూస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీసుల ఉదాసీనతపై హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ గుండాలు గత మూడు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి సున్నపురాయి తవ్వకాలను అడ్డుకుంటూ, తద్వారా ఉత్పత్తిని ఆపి కంపెనీని దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలను మొత్తం అడ్డుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్స్ అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు ‘భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద సిమెంట్ తయారీ ఫ్యాక్టరీ, సున్నపురాయి గనిని నిర్వహిస్తోంది. కంపెనీ మ్యాన్‌పవర్ కాంట్రాక్టర్ అయిన ‘మెసర్స్ వైష్ణవి అసోసియేట్స్’ ద్వారా పనుల్లోకి వచ్చిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ నిర్వహించిన క్రీడా పోటీలలో తీవ్ర గొడవలు సృష్టించారు. దీనిని తీవ్ర క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన కాంట్రాక్టర్ వారిని పని నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన కార్మికులు ఫ్యాక్టరీ వద్ద గొడవలు చేస్తామని బెదిరించడంతో, కంపెనీ యాజమాన్యం పోలీసుల రక్షణ కోరింది.అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 28న భారతి సిమెంట్స్ కమలాపురం జూనియర్ సివిల్ కోర్టులో సస్పెండ్ అయిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా దావా వేసింది. విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెండ్ అయిన కార్మికులు లేదా వారి అనుచరులు ఫ్యాక్టరీ కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రతిరోజూ 25–30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి సిమెంట్ ప్లాంట్‌కు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లు, వాహనాలు అడ్డంగా పెట్టి దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుండి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది.రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. భారతి సిమెంట్ తయారీ కేంద్రంలో ఉన్న ప్రస్తుత సున్నపురాయి నిల్వలు ఇకపై ఫ్యాక్టరీ కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోవు. పోలీసుల ఉదాసీతన కారణంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇది కంపెనీకి మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుండటమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది’ అని పిటిషనర్ పేర్కొన్నారు.అధికారం ఉన్నా.. కలెక్టర్ స్పందించడం లేదు‘జిల్లాపై పూర్తి అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ’భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చట్టబద్ధంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా నిరోధించడానికి, ప్రాణాలకు, భద్రతకు ప్రమాదం కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా, తిరుగుబాటు, గొడవలు జరగకుండా నిరోధించేందుకు నిర్దిష్ట చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించే అధికారం కూడా కలెక్టర్‌కు ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా కలెక్టర్ ఏ మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.’ అని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు.ఎస్పీ ఫిర్యాదును తీసుకోవడానికే నిరాకరించారు‘సస్పెండ్ అయిన కార్మికులు, ఇతరులు కలిసి కంపెనీ జీఎం (మైన్స్) కె.సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ జి. వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అటు తరువాత కూడా భారీ మూక ప్లాంట్ వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కమలాపురం సీఐ, కడప డీఎస్పీ, లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఎస్పీ ఫిర్యాదును స్వీకరించడానికే నిరాకరించారు. దీంతో ఆయనకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపాం. ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు సదరు మూకను చెదరగొట్టడం గానీ, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గానీ చేయలేదు. ఈ నేపథ్యంలో విధి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వండి.’ అని బాలాజీ తన పిటిషన్లో అభ్యర్థించారు. హైకోర్టుకు అభ్యర్థనలు ⇒ కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ⇒ ముందస్తు భద్రతను ఏర్పాటు చేసేలా కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి. ⇒ మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ⇒ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కలిగిస్తున్న ఆటంకాలను తొలగించి, వారిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయించేలా ఆదేశాలివ్వాలి. ⇒ తద్వారా సిమెంట్ ప్లాంట్‌లో చట్టబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగించేలా, ప్లాంట్ ప్రాంగణంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేలా ఆదేశించాలి. ⇒ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. -
అభ్యర్థులకు ప్రభుత్వం చేసిన హెచ్చరికలను మా ముందుంచండి
సాక్షి, అమరావతి: డీఎస్సీ 2025లో చోటు చేసుకున్న భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను అదనపు ఆధారాలుగా తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల బాధితులుగా మారిన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చే విషయంలోనూ స్పష్టతనివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం వాదనలు వినిపించారు. మెగా డీఎస్సీ2025 నియామక ప్రక్రియ మొత్తం భారీ స్థాయి వ్యవస్థాగత కుంభకోణమని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని, పిటిషనర్‌కు ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కూడా తాము ఎక్కడా దాచిపెట్టలేదని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బాధిత అభ్యర్థులు ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. డీఎస్సీ అక్రమాలపై ఎవరైనా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరించిందని, ఈ నేపథ్యంలో కోర్టుకొచ్చేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని శ్రీరాం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ ప్రచురించలేదని, దీంతో పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టుకొచ్చారు... ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, డీఎస్సీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్లు పడ్డాయని, ఇందులో 69 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నారు. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఎవరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానిస్తూనే డీఎస్సీ అక్రమాలపై మాట్లాడితే సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతామన్న ప్రభుత్వ హెచ్చరికలను తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అదే రీతిలో బాధిత అభ్యర్థులను ఈ పిల్లో ప్రతివాదులుగా చేర్చే అంశంపైనా స్పష్టతనివ్వాలని పేర్కొంది. -
మహిళా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా
సాక్షి, అమరావతి: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్)కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కింది కోర్టుల్లో న్యాయవాదులు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను సీజే దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టుల్లో మరుగుదొడ్లు, వెయిటింగ్ రూమ్‌లు లేక మహిళా న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సీజే.. ఈ విషయంలో ఇప్పటికే తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ మరుగుదొడ్లు, వెయిటింగ్ రూంల అవసరం ఉందో వివరాలు తెప్పించుకునే పనిలో ఉన్నానన్నారు. న్యాయవాదులు మరణించినప్పుడు ఏర్పాటు చేసే సంస్మరణ సభలను సాయంత్రం 4.15 గంటలకు మార్చడంపై కింది కోర్టుల న్యాయవాదుల అభ్యంతరాలను బార్ కౌన్సిల్ నూతన సభ్యులు సీజే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న విధంగా ఉదయమే సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీనిపై కూడా సీజే సానుకూలంగా స్పందించారు. కోర్టు పని మొదలు కావడానికి ముందే సంస్మరణ సభ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని బార్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు. సీజేను కలిసిన వారిలో అజయ్ కుమార్ చలసాని, కలిగినీడి చిదంబరం, ఆలూరు రామిరెడ్డి, గొర్రెముచ్చు శాంత కుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, యలమంజుల బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాస రాజు, ఎస్.రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి, ఎన్వీ సుమంత్, రవి బెల్లన, బండారు వెంకట రమణ మూర్తి, గంటా రామారావు, కీర్తి రామ జోగేశ్వరరావు, కె. వెంకట్రామిరెడ్డి, మాధవి,కృష్ణమోషన్,అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గా నాగశ్రీ, రాగి గంగా భవాని ఉన్నారు. -
తీర్పు అభిప్రాయాల వినియోగంపై ఆంక్షలు విధించలేం
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ తీర్పునిచ్చిన సింగిల్ జడ్జి, ఆ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రజా బాహుళ్యంలో ఎవరూ, ఏ రకంగా వాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పులోని అభిప్రాయాలను పలువురు పలు రకాలుగా వ్యాప్తి చేస్తున్నారని, ఇది ప్రణతి ప్రతిష్టకు విఘాతం కలిగిస్తోందన్న ఆమె తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఆ తీర్పు కాపీ పబ్లిక్ డాక్యుమెంట్ అని, అది ఇప్పటికే ప్రజా బాహుళ్యం (పబ్లిక్ డొమైన్)లో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అందువల్ల ఆ తీర్పును ఏ రకంగా ఉపయోగించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రణతి విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల అమలును తదుపరి విచారణ వరకు మాత్రమే ధర్మాసనం నిలుపుదల చేసింది. అలాగే ప్రణతిపై ఏసీబీ విచారణను సైతం తదుపరి విచారణ వరకు నిలిపేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ప్రతివాదులుగా ఉన్న జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘానికి, పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
డబ్బు కోసం పామర్రు పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: హత్య కేసులో సాక్షినైన తనను డబ్బు కోసం పోలీసులు వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేయడం పోలీసు శాఖలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు సీఐ, ఎస్సై తనను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని, లేదంటే ఒక హత్య కేసులో ఇరికిస్తామంటూ వేధిస్తున్నారని కొలుసు అయ్యప్ప శుక్రవారం మీడియా ఎదుట వాపోయాడు. కొలుసు అయ్యప్ప తన అత్తను మామ కొట్టి చంపిన కేసులో సాక్షిగా ఉన్నాడు. డబ్బు కోసం తనను సీఐ కొట్టాడని, కానిస్టేబుల్‌ను పలుమార్లు ఇంటికి, పనిచేసే చోటకి పంపించి వేధిస్తున్నారని తెలిపాడు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని, లేదంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ సీఐ, ఎస్ఐ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై తాను సీఐ, ఎస్ఐతో మాట్లాడిన ఆడియో రికార్డులను కృష్ణా జిల్లా ఎస్పీకి అందచేసి ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. పోలీసులు లంచం డిమాండ్ చేసిన ఆడియో రికార్డులను అయ్యప్ప తరపు న్యాయవాది కోర్డుకు సమర్పించాడు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో అయ్యప్ప దొంగతనం చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే మూడు నెలలు అయినా ఇప్పటివరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను న్యాయమూర్తి నిలదీసినట్లు సమాచారం. -
ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా, బలవంతంగా, చట్టవిరుద్ధంగా లాక్కుంటున్న నేపథ్యంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తన భూమిని సేకరించే విషయంలో ముందుకెళ్లకుండా అధికారులను నిరోధించాలంటూ చోడిశెట్టి నిర్మలత అనే రైతు దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇందుకు సంబంధించి పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన వారంలోపు తగిన నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. అప్పటి వరకూ ఈ భూమి విషయంలో గతంలో ఇచ్చిన ‘యథాతథస్థితి’ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, న్యాయమూర్తి జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ దౌర్జన్యంపై హైకోర్టులో పిటిషన్...అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం పెనుమాక రైతుల భూములను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా దౌర్జన్యపూరితంగా, బలవంతంగా లాక్కుంటున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో తన భూమిని సైతం ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటుండటంతో ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన చోడిశెట్టి నిర్మలత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలోని సర్వే నెంబర్ 39–2లో ఉన్న 65 సెంట్ల భూమికి సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్‌తో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూ సేకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మలత ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ «నేతృత్వంలోని ధర్మాసనం, నిర్మలత భూమి స్వాధీనం విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఈ అప్పీల్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి కీలక నిర్దేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికి ధర్మాసనం సూచనలు» ఆస్తిలో అతి చిన్న భాగాన్ని సేకరించాలన్నా కూడా, అది చట్టానికి లోబడి జరగాల్సిందే. » 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ సేకరణ చట్ట నిబంధనల ప్రకారమే జరిగి తీరాలి. » భూ సేకరణలో తీసుకుంటున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువే అయినప్పటికీ, ఆస్తి హక్కు అనేది ఆ భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉండదు. » విస్తృత ప్రజాప్రయోజనానికి, ఒక వ్యక్తి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనమే నిలబడుతుంది. » ఇతరుల దృష్టిలో ఆ ఆస్తి నష్టం ఎంత చిన్నదైనప్పటికీ, చట్ట నిబంధనల ప్రకారం ఆ ఆస్తిని మినహాయించడానికి వీల్లేదు. » ’చట్ట ప్రకారం’ అంటే కేవలం చట్టపరమైన అధికారం ఉండటం మాత్రమే కాదు. చట్టం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించడం కూడా. » ప్రస్తుత కేసులో చట్ట నిబంధనలు, నిర్దేశిత విధి విధానాలను పాటించలేదని బాధిత వ్యక్తుల తరఫు న్యాయవాది చేసిన వాదనను ఎలాంటి ప్రాధాన్యత, విలువ లేనిదిగా ఈ దశలో చూడలేము. » చట్ట విధి విధానాలను పాటించారా లేదా దాని ప్రభావం ఏంటన్నది బాధితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తేల్చాల్సిన అంశం. » ఈ నేపథ్యంలో అప్పీలుదారు ప్రయోజనాలను కాపాడటం సమంజమైన చర్య. -
సాయికృష్ణ కేసులో సంచలనం
సాక్షి, అమరావతి: ఆది నుంచీ మలుపులపై మలుపులు తిరుగుతున్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా, ఎలాంటి సూచనలు తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని, ఆ మేరకు వకాలత్ ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోరినప్పటికీ, ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. ఎన్వోసీతో పాటు కేసు రికార్డులను కూడా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్వోసీ లేకుండానే వకాలత్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేర తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు, విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు, వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.నాకు తెలియకుండానే రిత్విక ఆ పిటిషన్ వేశారు..తన కుమారుడిని కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ లాకప్‌డెత్ జరిగిందన్న విషయం రూఢీ అయింది. దీంతో ఆమె తన కుమారుడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 14న విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐ దర్యాప్తు కోసం వేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్‌నూ ఉపసంహరించుంటామని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం, ప్రధాన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఓ చోట, అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని మరో చోట రాశారని గుర్తు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరిస్తూ తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని విజయలక్ష్మిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఐదుగుర్ని అరెస్ట్ చేశాం.. ఒకరు పరారీలో ఉన్నారు..తాజాగా ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాసుదేవుడు స్పందిస్తూ జరిగిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిను ప్రశ్నించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విజయలక్ష్మి అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుడిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.దర్యాప్తు పురోగతిని మా ముందుంచండిసాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
రూ.కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు
సాక్షి, అమరావతి: రూ.కోట్లు విలువచేసే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ భూమిని కొట్టేసేందుకు కుట్ర జరిగిందన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి, ఆమె భర్త, న్యాయవాది మేకా రాహుల్ చౌదరి, అలాగే కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించి రూ. 15 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్ప గించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని ఇందుకు సంబంధించిన ఒక రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది. ‘మోసం, కుమ్మక్కు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) వంటి అంశాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి’అని ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ జరపాలని ఆదేశించారు. ఐజీ స్థాయికంటే తక్కువకాని అధికారి విచారణ చేపట్టాలని నిర్దేశించారు. 12 వారాల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించారు. కోర్టును తప్పుదారి పట్టించిన తీరిది » తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, రమణయ్యపేట సర్వే నెంబర్ 127/4లో తమకు చెందిన స్థలాల్లో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రహరీ నిర్మిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గోదావరిగుంటకు చెందిన గుబ్బల సత్యనారాయణమూర్తి, మరొకరు 2013లో, ఇదే అభ్యర్థనతో వాసంశెట్టి అప్పారావు మరో ముగ్గురు 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు 2015లో కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషనర్లు ఏ స్థలాలనైతే తమ స్థలాలుగా చెబుతున్నారో వాస్తవానికి అవి ప్రజా ప్రయోజనాల నిమిత్తం విడిచిపెట్టిన స్థలాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కార్పొరేషన్ అధికారులు కౌంటర్లలో పేర్కొన్నారు. » ఇదిలా ఉండగా, కాకినాడ, జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేరింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాలు వారివి కావని, అవి ప్రజా ప్రయోజనార్థం మునిసిపల్ కార్పొరేషన్‌కు తమ సంఘం బహుమతిగా ఇవ్వడం జరిగిందని హైకోర్టుకు నివేదించింది. » ఈ ఏడాది జనవరిలో ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్లు చెబుతున్న స్థలాలు తమవేనంటూ 2015లో దాఖలు చేసిన కౌంటర్‌కు భిన్నంగా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ జనవరి 6న మరో కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టుకు చెప్పింది. అదే రీతిలో ఆ స్థలాలపై తాము ఎలాంటి హక్కు కోరడం లేదంటూ జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది సైతం హైకోర్టుకు నివేదించారు. మునిసిపల్ కార్పొరేషన్ తాజా కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సంఘం న్యాయవాది కోరారు. దీంతో ఇరుపక్షాల అంగీకారంతో హైకోర్టు సింగిల్ జడ్జి ఈ రెండు వ్యాజ్యాలను పరిష్కరించారు. పిటిషనర్ల స్థలాల విషయంలో జోక్యం చేసుకోవద్దని కార్పొరేషన్ అధికారులను ఆదేశిస్తూ 2026 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. » ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందు పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ దాఖలు చేసుకోవాలని సంఘానికి సూచించింది. దీంతో జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను రివ్యూ చేయాలంటూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం పిటిషన్ దాఖలు చేసింది. » జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు, ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, తమ న్యాయవాది కుమ్మక్కై, ఆస్తిని కాజేయడానికి ప్లాన్ వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారని విన్నవించారు. హైకోర్టు గమనించిన ముఖ్యాంశాలు..» ప్రణతి గతంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదిగా వ్యవహరించి, ఆ తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. » ఆమె స్థానంలో ఆమె భర్త రాహుల్ చౌదరి అదే పిటిషనర్ల తరఫున వకాలత్ దాఖలు చేశారు. » 2015లో భూమి తమదేనని చెప్పిన మునిసిపల్ కార్పొరేషన్, 2026లో ఆ భూమిపై హక్కు కోరబోమని విరుద్ధ అఫిడవిట్ దాఖలు చేసింది. » హైకోర్టులో ప్రభుత్వం తరఫున మళ్లీ ప్రణతి హాజరు కావడం, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ గతంలో దాఖలు చేసిన కౌంటర్‌కు భిన్నంగా.. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కౌంటర్ దాఖలు చేయడం వంటి వరుస పరిణామాలపై న్యాయమూర్తి అనుమానాలు వ్యక్తం చేశారు. » ఈ పరిణామాలు కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ ఆస్తిని కాజేయాలనే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. » ఈ కేసుల్లో ఆయా పార్టీల తరఫున హాజరైన న్యాయవాదులు వ్యవహరించిన తీరు వృత్తిపరమైన తీవ్ర దుష్ప్రవర్తన, కోర్టును మోసం చేయడానికి చేసిన ప్రయత్నమన్నారు. » ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల తరఫున హాజరైన న్యాయవాదులు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలమయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు. » రిట్ పిటిషనర్లు, ప్రతివాదులు (ప్రభుత్వం) తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టును మోసం చేయడం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
వైద్య విద్యార్థినికి హైకోర్టు అండ
సాక్షి, అమరావతి: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్ కోర్సు నుంచి రెండేళ్లు విరామం తీసుకుని, తిరిగి కోర్సులో మంచి మార్కులతో మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించినా.. రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థిని వినీతకు హైకోర్టు అండగా నిలిచింది. ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ‘తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వంటి అనివార్య కారణాల వల్ల విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో తాత్కాలిక విరామం తీసుకుంటే, ఆ విరామకాలాన్ని మొదటి సంవత్సరం పూర్తి చేయడానికి ఉద్దేశించిన నాలుగేళ్ల గరిష్ట కాలపరివిుతిలో లెక్కించకూడదు. కోర్సులో తీసుకునే తాత్కాలిక విరామం విద్యార్థి ప్రతిభకు ప్రాతిపదిక కాదు. ప్రస్తుత కేసులో ఆ విద్యార్థిని రూ.62 లక్షల ఫీజు చెల్లించి తిరిగి కోర్సులో చేరినట్లు తెలిపారు. సెప్టెంబర్ 2025లో జరిగిన పరీక్షకు హాజరై మొదటి సంవత్సరాన్ని మంచి మార్కులతో పూర్తిచేశారు. రెండో ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం రెండో సంవత్సరం కోర్సు పూర్తిచేసే దశలో ఉన్నారు. నిబంధనల పేరుతో ఈ దశలో ఆమెను చదువుకు దూరం చేయడమంటే, సమాజానికి ఒక వైద్యురాలిని దూరం చేయడమే. నీట్ ప్రవేశపరీక్ష కోసం ఎంతో కఠినమైన ప్రిపరేషన్‌ను దాటుకుని అడ్మిషన్ సాధించిన తర్వాత, సాధారణ పరిస్థితుల్లో ఏ విద్యార్థి కూడా ఎంబీబీఎస్ కోర్సు నుంచి స్వచ్ఛందంగా విరామం తీసుకోరు’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు చెప్పారు.ఆర్థిక కారణాలతో రెండేళ్ల విరామం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జోసెఫ్ పాల్ కుమార్తె వినీత 2020–21 విద్యాసంవత్సరానికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో బీ కేటగిరి కింద ఎంబీబీఎస్ ప్రవేశం పొందారు. తీవ్రమైన ఆర్థిక కారణాలతో ఆమె రెండేళ్లు విరామం తీసుకున్నారు. 2024లో రూ.62 లక్షల ఫీజు చెల్లించి తిరిగి కోర్సులో చేరారు. నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరాన్ని గరిష్టంగా నాలుగేళ్లు లేదా నాలుగు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి. ఈ నాలుగేళ్ల కాల పరిమితి 2024 డిసెంబర్‌తో ముగిసిందంటూ ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు వినీతను పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వినీత తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. -
డీఎస్సీ అక్రమాలపై విచారణ
సాక్షి, అమరావతి: లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టిన మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్ కోటా ముఖ్యంగా జూడో క్రీడా విభాగంలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్య ప్రవేశాలు పొందుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 2025 మెగా డీఎస్సీలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులు, రిట్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై నాలుగు నెలల్లోతగిన నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఫిర్యాదులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు...అంతకు ముందు పురుషోత్తం తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది పలువురు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, అలాగే 2025 డీఎస్సీలో కూడా ఉద్యోగాలు సంపాదించారన్నారు. అంతేకాక వైద్య విద్యలో కూడా ప్రవేశాలు పొందారని తెలిపారు. వీటన్నింటిపై పిటిషనర్ ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఆరోపణలకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను కోరినా స్పందించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యల నిమిత్తం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీలు జరగకపోయినా సర్టిఫికెట్లు..ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందినవారు.. వారు సంపాదించిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పిటిషనర్ పిటిషన్లో వివరించారు. పోటీలు జరగకపోయినా జూడోలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్లు ఇచ్చారు. అసలైన జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లతో సంబంధం లేని తేదీలు, వేదికల పేరుతో నకిలీ ఫారమ్–2, ఫారమ్–4 సర్టిఫికేట్లను సృష్టించారు. టోర్నమెంట్లలో పాల్గొనని, మొదటి రౌండ్లలోనే నిష్క్రమించిన అభ్యర్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు నకిలీ రికార్డులను తయారు చేశారు. ఈ నకిలీ పత్రాల ద్వారా స్పోర్ట్స్ ప్రాధాన్యత జాబితాలో మొదటి స్థానాలు పొంది, నిజమైన క్రీడాకారుల హక్కులను కాలరాశారు.నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. మెడికల్ సీట్లు..విశాఖపట్నం జిల్లాలో సుమారు 20 మంది నకిలీ జూడో సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు. కె.చందన అనే అభ్యర్థి ఇంటర్–డిస్ట్రిక్ట్ జూడో టోర్నమెంట్ నకిలీ సర్టిఫికేట్‌తో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఎంపికైంది. ⇒ పల్లిపాటి రిత్విక్‌ను 2017 డిసెంబర్ లో చెన్నైలో జరిగిన సీనియర్ నేషనల్ జూడో ఛాంపియన్‌షిప్‌లో 66 కేజీల కేటగిరీలో అనర్హుడిగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ పోటీ ఆధారంగా పొందిన నకిలీ సర్టిఫికేట్‌తో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్పోర్ట్స్ కోటా సీటు సాధించాడు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. టోర్నమెంట్లలో అనర్హత పొందిన వారికి, కేవలం పాల్గొన్న వారికి ఎటువంటి మెరిట్ సర్టిఫికెట్లు జారీ చేయమని స్పష్టంగా చెప్పింది. ⇒ ఇదే రీతిలో పశుసంవర్థక శాఖలో కూడా పలువురు ఉద్యోగాలు పొందారు. టోర్నమెంట్ రికార్డులు, పతకాల ప్రదానోత్సవ వివరాలను పరిశీలించగా, పలువురు అభ్యర్థులు చూపిన సర్టిఫికేట్లు నకిలీవని రూఢీ అయింది. ఆకుమల్ల హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీలలో ఎటువంటి స్థానమూ సాధించకపోయినా, మెరిట్ సర్టిఫికేట్‌తో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పి. ఇస్మాయిల్ బాషా, పల్లపు అభినయ్, అయితు అప్పలస్వామి, పి. అశ్విని తదితరులు పోటీ రికార్డుల్లో పేర్లు లేకున్నా నకిలీ స్పోర్ట్స్ ఫారమ్‌ల ఆధారంగా ఉద్యోగాలు సాధించారు. ఏ టోర్నమెంట్ అధికారిక రికార్డులలో లేదా ఎంట్రీ ఫారమ్‌లలో లేదు. అయినా సరే నకిలీ సర్టిఫికేట్ల ద్వారా జాబితాలో చేరి ఉద్యోగం సాధించారు. ఇదో పెద్ద కుంభకోణం.. దీని వెనుక కుట్రకోణం..పోటీలు జరగని తేదీలతో, ఇతర విజేతల స్థానాలను తమ స్థానాలుగా చెప్పుకుంటూ, జూనియర్ టోర్నమెంట్లను సీనియర్ టోర్నమెంట్లుగా చిత్రీకరిస్తూ సమర్పించిన దరఖాస్తులను జూడో సంఘం కార్యదర్శి పవన్ ఎలాంటి పరిశీలన చేయకుండా ఫారమ్ 2 సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణంలో భాగం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) లోని అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది ఈ నకిలీ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా ధృవీకరించారు. సమాచార హక్కు చట్టం కింద పాత సమాచారాన్ని కోరినప్పుడు, ఈమెయిల్‌లు, ఇతర ఆధారాలు డిలీట్ అయ్యాయని అధికారులు చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. ఏపీ జూడో అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్ నమిశెట్టి, పవన్ సందీప్ నమిశెట్టి తదితరులు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఫారమ్–2, ఫారమ్–4 లను జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలి.’ అని పురుషోత్తం తన పిటిషన్లో పేర్కొన్నారు.డీఎస్సీలోనూ అవే నకిలీ సర్టిఫికెట్లు..మెగా డీఎస్సీ నోటిఫికేషన్ –2025 కింద దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు జూడో అసోసియేషన్ నుంచి సంపాదించిన నకిలీ సర్టిఫికేట్లను జతపరిచారు. ఖమ్మం, విజయవాడ, గుంటూరులలో జరిగిన టోర్నమెంట్ల పేరుతో సమర్పించిన ధృవీకరణ పత్రాలు అసలు ఫలితాల జాబితాతో సరిపోలడం లేదు. జరగని పోటీలను జరిగినట్లు చూపడంతో పాటు, పోటీల్లో తాము ఫలానా స్థానం సాధించామని తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందారు. ⇒ డాకోజి పాండు ఖమ్మంలో జరిగిన సీనియర్ జూడో ఛాంపియన్‌షిప్‌లో 2వ స్థానం సాధించినట్లు నకిలీ సర్టిఫికేట్, హామీ పత్రం సమర్పించగా, జూడో అసోసియేషన్ కార్యదర్శి పవన్ సందీప్ దీనికి ఫారమ్–2 మంజూరు చేశారు. ⇒ మిట్నసాల సుధారాణి 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వగా, 23.05.2025న పవన్ సందీప్ ఫారమ్–2 జారీ చేశారు. ⇒ దేసావత్ చంద్ర నాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు హామీ పత్రం ఇవ్వగా, 20.05.2025న పవన్ ఫారమ్–2 సర్టిఫికేట్ ఇచ్చారు. ⇒ రియాజుల్లా నల్బంది 73 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం పొందినట్లు తప్పుడు రికార్డు చూపగా, పవన్ 20.05.2025న ఫారమ్–2 జారీ చేశారు.⇒ షేక్ ఇనామ్ హుస్సేన్ 73 కేజీల సీనియర్ విభాగంలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ చూపారు. ఏ స్థానంలో అయితే తాను విజయం సాధించానని హుస్సేన్ చెప్పారో, అధికారిక రికార్డుల ప్రకారం కె.హరికృష్ణ ఆ స్థానాన్ని సాధించినట్లు తేలింది. అయినా సరే హుస్సేన్‌కు పవన్ ఫారమ్–2 ఇచ్చారు.⇒ అక్కల సురేఖ 63 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు తేదీలతో ఉన్న పత్రాలు ఇవ్వగా, పవన్ ఫారమ్–2 జారీ చేశారు.⇒ నొస్సం కరిష్మా 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం పొందినట్లు నకిలీ తేదీల సర్టిఫికేట్ సమర్పించగా, జూడో సంఘం కార్యదర్శి నుంచి ఫారమ్ 2 సంపాదించారు. ⇒ హస్వంత్ సూర్య నాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు రికార్డులతో ఫారమ్–2 సర్టిఫికేట్ పొందారు. ఇలా పలువురు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటి ద్వారా ఉద్యోగాలు పొందారు. -
సివిల్ వివాదాలలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మండిపడింది. అసలు మీరెందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని నిలదీసింది. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా తక్షణమే నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖపట్నంలో ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం(పీఎల్‌సీఎఫ్) పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్న వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు వేధిస్తున్నారంటూ పిటిషన్లు ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో విశాఖపోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంతోపాటు నిత్యం తమను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని సినీ నిర్మాత నట్టికుమార్ గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వ్యాపారి మంచుకొండ రామకృష్ణ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ విచారణ జరిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వివాదాలను ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం ద్వారా పరిష్కరించుకోవాలంటూ విశాఖ పోలీసులు తమను నిత్యం వేధిస్తున్నారని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో విశాఖ పోలీసులు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఫోరం పరిధి, దాని చట్టబద్ధత, అధికారాలు, పరిమితులపై సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫోరం సంగతి ఏంటో తేల్చేందుకు కేసు రికార్డులు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ కేసు రికార్డులను సీజే ముందుంచారు. వాటిని పరిశీలించిన సీజే, దీనిని రిట్ పిటిషన్‌గా మలచాలని ఆదేశించి గురువారం విచారణ జరిపారు. అసలు పోలీసులు ఎందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని గట్టిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం గురించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, ఇందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్
-
లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా.. ఎన్ని కేసుల్లో తలంటినా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరు మారడం లేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు షరామామూలుగా మారిపోయింది. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. లా అండ్ ఆర్డర్ అన్నది చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి తప్ప, పోలీసులకు నచ్చినట్లు కాదని తేల్చి చెప్పింది. పోలీసులు కవులుగా మారిపోయారని, వారు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరంది. ప్రభుత్వం మారిన తరువాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులకు క్లీన్చిట్లు ఇస్తేస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగులపై నమోదు చేసిన ఫోర్జరీ కేసులో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వివాదానికి కారణమైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెంకట శ్రీరాం చిరంజీవి నాగు పేరు మీద ఉంటే, అతని తండ్రి తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణిని ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను నిలదీసింది. నాగు తమ్ముళ్లు, బావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చి ఉండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమారని తెలిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు పోలీసులను, ఇటు ఫిర్యాదుదారుడిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరెస్ట్ నుంచి సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు నిరాకరించారు. క్వాష్ పిటిషన్లో ఎలాంటి రక్షణ కల్పించలేమని, అరెస్ట్ భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేశారు. మాపై కేసు కొట్టేయండి.. అప్పటి వరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయండి ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాలతో ఆస్తి రిజిష్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. తమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదనలు వినిపించారు. రజనీ అనే మహిళ నుంచి చట్టబద్ధంగా వెంకట శ్రీరాం చిరంజీవి నాగు భూమిని కొనుగోలు చేశారన్నారు. ఒక్క సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. క్రిమినల్ కేసును సివిల్ కేసుగా చూపుతున్నారుపోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విలువైన ఆస్తిని కాజేయాలని పిటిషనర్లు కుట్ర పన్నారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, డాక్యుమెంట్ వెంకట శ్రీరాం చిరంజీవి నాగు పేరు మీద ఉంటే, సీతారాం, ఆయన భార్యను ఎందుకు నిందితులుగా చేర్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థలం ఆక్రమణకు గురైందని తెలుసుకున్న వెంటనే పోలీసు కేసు పెట్టకుండా సివిల్ సూట్ ఎందుకు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దావా దాఖలు చేసిన రెండేళ్ల తరువాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నించారు. ఆధారాలు చూపండిఫిర్యాదుదారు తరఫున సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వెనుక పిటిషనర్లు ఉన్నట్లు వారి ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఏమైనా సృష్టించగలరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆస్తి కొనుగోలుకు సంబంధించి యజమాని రజనీకి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు చూపాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. చెక్కు ఇచ్చారా? డబ్బు ఇచ్చారా? ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ ముందుంచి, సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారుడిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. -
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
-
ప్రకృతిని చెరబట్టొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వనరుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ వాటిని తరలిస్తుండటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ‘గాలి, నీరు, అడవులు వంటివి ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి ఏ ఒక్క వ్యక్తికో, ప్రైవేట్ సంస్థకో సొంతం కాదు. సమాజంలోని ప్రజలందరికీ వీటిని సమానంగా పొందే హక్కు ఉంది. ఈ వనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వం కేవలం ప్రజల తరఫున ఒక సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరించాలి. ప్రజల శ్రేయస్సు కోసం ఈ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇదే పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం. సహజ వనరులు జాతీయ ఆస్తులు. ప్రకృతి ప్రసాదించిన వనరులు ఏ ఒక్క తరం వాడి పారేసే వస్తువులు కావు. ఈ వనరులను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎకనావిుక్ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్న కన్నంనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతినిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. సహజ వనరుల పరిరక్షణ నిమిత్తం ఈ ఏడాది మే 8న జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్ఓపీ) కచ్చితంగా అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహజ వనరుల దోపిడీని అడ్డుకునేందుకు వీలుగా ప్రతి ఏడాది సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు రెండు రోజుల క్రితం తీర్పునిచ్చారు.చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతిపై పిటిషన్ కన్నంనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతినిస్తూ కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ స్థానికులు బొడ్డు సత్యవతి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు సాగు, తాగు నీటికి కన్నంనాయుడు చెరువే ఆధారమన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపారు. ‘పర్యావరణ పరిరక్షణ ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన ఆలోచనేమీ కాదు. ముఖ్యంగా భారత్‌లో ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించడం అన్నది మన సంస్కృతి, జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వస్తోంది.మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన నీరు, ఇతర సహజ వనరులను ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు పవిత్రమైనవిగా భావిస్తాయి. నేడు మనం మాట్లాడుకుంటున్న ‘పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం’ మూలాలు ఈ ఆధ్యాత్మిక బోధనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ‘జీవించే హక్కు’ అంటే కేవలం మనుషులు శ్వాస తీసుకుంటూ, భౌతికంగా బతికి ఉండటం మాత్రమే కాదు. ప్రతి మనిషీ స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా జీవించడం.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.కాంట్రాక్టర్లేమీ సేవ చేయడం లేదు ‘జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి కావాలనే లక్ష్యం దేశ ప్రగతికి ఎంత అవసరమో.. ఆ ప్రక్రియలో చట్టపరమైన పరిధులను, క్షేత్ర స్థాయి వాస్తవాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జాతీయ రహదారుల అథారిటీ నుండి పనులు పొందిన కాంట్రాక్టర్లు ఈ నిర్మాణాలను ఉచితంగా, స్వచ్ఛంద సేవగా చేయడం లేదు. వారు ఈ కమర్షియల్ కాంట్రాక్ట్ ద్వారా భారీ మొత్తంలో డబ్బును, లాభాలను ఆర్జిస్తున్నారు. కాబట్టి, సాధారణ వ్యాపార నిబంధనలు, పౌర చట్టాలు వారికి కూడా పూర్తిగా వర్తిస్తాయి. రహదారుల నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక వంటి సహజ వనరులను సేకరించడం పూర్తిగా ఆయా కాంట్రాక్టర్ల బాధ్యత. చట్టం విధించిన కఠిన నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం నేరం’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.ముందు తరాలు కాపాడినందునే మనం జీవిస్తున్నాం ‘పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు లేదా విధించే చట్టపరమైన ఆంక్షలు తక్షణమే కంటికి కనిపించే ఆర్థిక లాభాలను ఇవ్వకపోవచ్చు. కానీ, ఆ నిర్ణయాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తే, అది మన తర్వాత రాబోయే బిడ్డలకు మనం ఇచ్చే అత్యంత విలువైన కానుక. మన ముందు తరాలు ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేయకుండా, కొంత వరకు కాపాడగలిగారు కాబట్టే.. ఈ రోజు మనం ఈ భూమిపై శ్వాస తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ వారు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రకృతిని పూర్తిగా దోచేసి ఉంటే, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న జీవించే హక్కు, దాని విస్తృత పరిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యేవి. దీంతో మన మనుగడే ప్రశ్నార్థకమయ్యేది’ అని తెలిపారు.ఆ జలాశయాలు కీర్తి కోసం కట్టినవి కావు ‘ప్రజల కోసం శతాబ్దాల క్రితం నిర్మించిన జలాశయాలు కేవలం రాజుల కీర్తి కోసం కట్టినవి కావు. రాబోయే తరాల సంక్షేమం కోసం వారు తలపెట్టిన పవిత్ర యజ్ఞాలు. ప్రకాశం జిల్లాలో కంభం చెరువు, వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్లలో అనంతరాజ సాగర్, అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం చెరువులు ఇలా నిర్మితమైనవే.పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం లేదా ఉదాసీనత వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు తమకు లభించిన అంతర్గత అధికారాలను ఉపయోగిస్తాయి. సంపూర్ణ న్యాయం చేయడం కోసం, ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ కోర్టు కూడా తన అంతర్గత అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు ఇస్తోంది’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో తేల్చి చెప్పారు. -
నాటకీయ పరిణామాల మధ్య పటాస్ శ్రీకాంత్ అరెస్ట్
రాప్తాడు రూరల్: అనంతపురం జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కురుబ చిట్రా శ్రీకాంత్ అలియాస్ పటాస్ శ్రీకాంత్‌ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. అతడి ఆచూకీపై కుటుంబసభ్యుల ఆందోళన, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో అరెస్టు చూపించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంత్‌ను మూడురోజులుగా ప్రత్యేక పోలీసులు అదుపులో ఉంచుకుని తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.కూటమి ప్రభుత్వాన్ని, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ప్రశ్నించిన కారణంగానే తన కుమారుడిని వేధిస్తున్నారని అంతకుముందు శ్రీకాంత్ తల్లి చిట్రా రాజేశ్వరి మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు పదిరోజులుగా ఇంటికి రాలేదని, మూడురోజులుగా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసిందని పేర్కొన్నారు. తన కుమారుడిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, లేదంటే పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అదే సమయంలో శ్రీకాంత్ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు గురువారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి రాజేశ్వరితో సంతకాలు తీసుకున్న అనంతరం పోలీసులు శ్రీకాంత్ శింగనమల పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. తరువాత శ్రీకాంత్‌ను ఆస్పత్రి నుంచి అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. శ్రీకాంత్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వండి విచారణ సందర్భంగా పోలీసులు తనను కొట్టి హింసించారని శ్రీకాంత్ న్యాయాధికారికి చెప్పారు. దీంతో శ్రీకాంత్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయాధికారి ఆదేశించారు. తర్వాత సొంత పూచీకత్తుపై శ్రీకాంత్‌ను విడుదల చేయాలని చెప్పారు. మరోవైపు.. శ్రీకాంత్‌పై అనంతపురం వన్‌టౌన్, ఇటుకలపల్లి, శింగనమల, శ్రీసత్యసాయి జిల్లా అగళి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేయడంతోపాటు కౌన్సెలింగ్ పేరుతో తీవ్రస్థాయిలో వేధించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా ప్రసన్న నియామకం చెల్లదు
సాక్షి, అమరావతి: చట్టం నిర్దేశించిన అర్హతలు లేనప్పటికీ శాసన సభ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను నియమించారని, ఏ అధికారంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన కో వారెంటో పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ గవర్నర్ కార్యదర్శికి, ప్రసన్న కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హతలు లేని వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం అందలం ఎక్కించింది న్యాయవాది వై. కనక లింగేశ్వరరావు దాఖలు చేసిన ఈ కో వారెంటో పిటిషన్‌పై జస్టిస్ విజయ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు. ‘నిబంధనల ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పదవిని లోక్‌సభ, రాజ్యసభ లేదా రాష్ట్రాల శాసన సభ సెక్రటేరియట్లలో పని చేస్తున్న లేదా రిటైర్ అయిన సెక్రటరీ జనరల్‌లతో భర్తీ చేయాలి. అందుకు విరుద్ధంగా ప్రసన్నకుమార్‌ను ఆంధ్రప్రదేశ్ శాసన సభకు సెక్రటరీ జనరల్‌గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో నోటిఫికేషన్ జారీ చేసింది. తగిన అర్హతలు లేకపోయినా ప్రసన్నకుమార్‌ను సెక్రటరీ జనరల్‌గా నియమించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టి, నెలవారీ పారితోషికం రూ.3.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్లో ప్రసన్నకుమార్ పూర్వ అర్హతను సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ గా పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇ చ్చిన సమాచారం ప్రకారం.. ప్రసన్న కుమార్ సుప్రీంకోర్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గానే పని చేశారు. వాస్తవానికి ఆయన 1993లో న్యూఢిల్లీలోని న్యూస్ సర్వీసెస్ డివిజన్లో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్‌గా చేరి 2022న స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.అయినప్పటికీ, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించడం కోసం సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్‌గా పేర్కొన్నారు. అర్హతలు లేని వ్యక్తిని సెక్రటరీ జనరల్‌గా నియమించడం చట్టాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎటువంటి పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించకుండా, పారదర్శక ఎంపిక విధానం లేకుండా ప్రసన్న కుమార్ నియామకం జరిగింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి.’ అని శశిభూషణ్ హైకోర్టును అభ్యర్థించారు. -
పార్టీషన్ డీడ్‌ను ట్రిబ్యునళ్లు రద్దు చేయలేవు
సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం ఆస్తి పార్టీషన్ డీడ్ (విభజన పత్రం)ను రద్దు చేసే అధికారం ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్‌కు గానీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్‌కు గానీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఒక తీర్పును రద్దు చేసింది. కాగా ఈ చట్టం ప్రకారం ఆస్తి బదిలీ (ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపర్టీ) విషయంలో మాత్రం ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది. చట్టం ప్రకారం ట్రిబ్యునళ్లు ఆస్తి బదిలీని రద్దు చేయాలంటే తప్పనిసరిగా వర్తించాల్సిన అంశాలను కూడా హైకోర్టు వివరించింది. ‘చట్టం అమల్లోకి వచ్చిన తరువాత వృద్ధులు తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేసి ఉండాలి. అలాగే ఆస్తి తీసుకునే వ్యక్తి ఆస్తి బదిలీ పత్రంలో ఆ వృద్ధుల అవసరాలు తీరుస్తాననే నిబంధనను తప్పనిసరిగా పొందుపరిచి ఉండాలి. సదరు వృద్ధుల పట్ల తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆస్తిని తీసుకున్న వ్యక్తి విఫలమవ్వాలి’’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.కుమారుడిపై తల్లి ఫిర్యాదుపశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన రామలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీరామమూర్తి 2018లో ఉమ్మడి ఆస్తులను విభజించుకుని ఎవరికి రావాల్సిన ఆస్తులను వారు తీసుకున్నారు. కొద్ది కాలం తరువాత తన కుమారుడు తనను సక్రమంగా చూడటం లేదని, అందువల్ల ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం రామలక్ష్మి ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేసేందుకు నిరాకరించారు. దీంతో కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్‌కు రామలక్ష్మి వెళ్లారు. కలెక్టర్ విచారణ జరిపి రామలక్ష్మి కోరిన విధంగా ఆస్తి పార్టీషన్ డీడ్‌ను రద్దు చేస్తూ 2023లో తీర్పునిచ్చారు. దీనిని సవాలు చేస్తూ రామలక్ష్మి కుమారుడు శ్రీరామమూర్తి, ఆయన భార్య, కుమారుడు, కోడలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేశారు. -
సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ఆదేశంపై అభ్యంతరం తెలిపిన సిట్.. దర్యాప్తు ప్రక్రియకు ఇది ఆటంకంగా మారుతుందని పేర్కొన్నట్లు సమాచారం.హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలేంటంటే..గాదె సాయికృష్ణ మృతి కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి సీఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. అయితే కస్టడీ విచారణ విషయంలో ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీఐ నాగరాజును ఒక రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులోనే విచారించాలని సూచించింది.సుప్రీంకు వెళ్లిన సిట్హైకోర్టు ఆదేశాలపై సిట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కస్టడీ విచారణ సమయంలో ఇలాంటి పరిమితులు ఉంటే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని సిట్ తన అభ్యర్థనలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.లాకప్‌డెత్ కేసులో కీలక విచారణగాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కస్టడీ.. అనంతరం కనిపించకుండా పోవడం.. చివరకు లాకప్‌లో హింసించడం కారణంగానే మృతి చెందాడని.. ఆనవాలు కూడా దొరక్కుండా శవం మాయం చేశారని తేలింది. ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు సిట్ దర్యాప్తు చేపట్టింది. సీఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ విచారణ కీలకంగా మారింది. అయితే.. సిట్ తనను ఇరికించేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే కస్టడీకి కోరిందని.. విచారణ పేరిట తనను టార్చర్ చేయకుండా రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయస్థానాన్ని లేఖ రాయడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. -
సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సీజే ధర్మాసనం ముందు తాజాగా విచారణకు వచ్చిన ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు. ‘సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు వరకే పరిమితం చేస్తోంది. లాకప్‌డెత్ వెనుక డీజీపీ, విజయవాడ కమిషనర్, డీసీపీ, ఏసీపీ తదితరుల పాత్ర ఉంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా డీజీపీ, విజయవాడ కమిషనర్లు హైకోర్టును తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నారో తమకు తెలియనే తెలియదని చెప్పారు. అయితే నాగరాజును అరెస్ట్ చేసిన తరువాత దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 6నే అదుపులోకి తీసుకున్నారు. తద్వారా సాయికృష్ణ గురించి పూర్తి వివరాలు డీజీపీ, కమిషనర్లకు స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది. దీనిపై పారదర్శక, నిష్పాక్షిక దర్యాప్తు కోరుతున్నాం. సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదు. స్వతంత్ర సంస్థ దర్యాప్తుతోనే నిజాలు నిగ్గుతేలుతాయి. ఈ దారుణంలో డీజీపీతో సహా ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని పొన్నవోలు ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు, ఆరుగురిని నిందితులుగా చేర్చినట్లు సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు. -
SITకు హైకోర్టు చిన్న అవకాశం సీల్డ్ కవర్ లో ఆధారాలు
-
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు, ఈ పిల్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. లాకప్‌డెత్ కేసులో సీపీతో పాటు డీజీపీ పాత్ర ఉందని, డీజీపీ కింద స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని తన వాదనల్లో వినిపించారు పొన్నవోలు. గత నెల 15వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు సాయి కృష్ణ మా దగ్గర లేడు ఆయన కోసం ప్రత్యేక టీములు పెట్టి వెతుకుతున్నామని చెప్పారని, సిట్ వేసిన రిమాండ్ రిపోర్టులు మాత్రం గత నెల ఆరో తేదీన సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నట్లు చూపించారన్నారు. పోలీసులు అబద్ధాలు చెప్పి కోర్టునే తప్పుదోవ పట్టించారని విచారణ సందర్భంగా పొన్నవోలు స్సష్టం చేశారు. అయితే సిట్‌కు చిన్న అవకాశం ఇద్దామన్న హైకోర్టు.. సీల్డ్ కవర్లో విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. -
సత్యమేవ జయతే నినాదాన్ని కాపాడండి
సాక్షి, అమరావతి : దేశ జాతీయ నినాదమైన ‘సత్యమేవ జయతే’ సమగ్రతను కాపాడుతూ నిజాన్ని వెలికి తీసేందుకు కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును నిష్పక్షపాతంగా, శాస్త్రీయ పద్ధతిలో విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలంటూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది.సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నాగరాజును రాజమహేంద్రవరం జైలు నుంచి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌తో సహా నేర ఘటనలు జరిగిన చోట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి నాగరాజును కస్టడీలోకి తీసుకుని ఈ నెల 16 వరకు విచారించాలని సిట్‌ను ఆదేశించింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి రాజమహేంద్రవరం జైలుకు నాగరాజును తరలించే సమయంలో అతని ప్రతి కదలికను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఆ ఒరిజినల్ వీడియో రికార్డింగ్‌లను ఈ నెల 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీని ఒరిజినల్ రూపంలో 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు తేల్చి చెప్పింది. కస్టడీ కాలంలో నాగరాజు ప్రాణానికి, శారీరక భద్రతకు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు స్పష్టం చేసింది. సీఐ కస్టడీ విషయంలో విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన మిగతా అన్ని షరతులు యథాతథంగా కొనసాగుతాయని న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం తీర్పుచెప్పారు.జైలులోనే విచారించాలన్న విజయవాడ కోర్టుసాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో నిందితుడు నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల అనుమతించింది. ఈ నెల 10 వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని, విచారణకు న్యాయవాదిని అనుమతించాలని సిట్ అధికారులను ఆదేశించింది. వీటితో పాటు పలు షరతులు విధించింది. పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం నిమిత్తం మొత్తం విచారణ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర వీడియో రికార్డింగ్ సిస్టం ఉన్న ప్రాంతంలోనే నాగరాజును విచారించాలని సిట్‌కు స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజీని కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భద్రపరచాలని, దానిని తొలగించడానికి, ఓవర్ రైట్ చేయడానికి లేదా ట్యాంపరింగ్ చేయడానికి ఎవరినీ అనుమతించకూడదని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నాగరాజు భద్రతకు దర్యాప్తు ఆఫీసర్, అదనపు ఎస్పీ, సిట్ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ సంయుక్తంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ కస్టడీని 10వ తేదీ తర్వాత పొడిగించబోమని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు విధించిన ఈ షరతులను, ఆదేశాలను సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. నాగరాజును కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో విచారించేందుకు అనుమతించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై సోమవారం సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, నాగరాజు తరఫున చల్లా అజయ్ కుమార్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేసి మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మంగళవారం తన తీర్పును వెలువరించారు.అప్పుడు ధ్వంసం చేసి.. ఇప్పుడు సీసీటీవీ కెమెరాల రక్షణ కోరతారా?‘నిందితుడు నాగరాజు విజయవాడ కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్. అతనిపై హత్య, సాక్ష్యాల నాశనం కింద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అక్రమ కస్టడీలో హత్య జరిగినట్లు భావిస్తున్న కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, హార్డ్ డిస్క్‌ను ఉద్దేశ పూర్వకంగా మాయం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు నాగరాజుపై ఉన్నాయి. ఇటువంటి తరుణంలో, కేవలం రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలనడం దర్యాప్తు సంస్థల చట్టబద్ధమైన అధికారాలకు అడ్డుకట్ట వేయడమే అవుతుంది.నిందితుడు ఒకప్పుడు తానే సీసీటీవీ కెమెరాలను మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పుడు తన విచారణకు అవే సీసీటీవీ కెమెరాల రక్షణ కావాలని కోరడం పరస్పర విరుద్ధంగా ఉంది. రాజ్యాంగ బద్ధమైన ఈ కోర్టు, నిందితుడి హక్కులను కాపాడటంతో పాటు దర్యాప్తు సంస్థల అధికారాలను కూడా సమతుల్యం చేయాల్సి ఉంది. అందువల్ల విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరిస్తున్నాం’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు. -
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించారు. మొదట హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం వారి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తరువాత జస్టిస్ రవినాథ్ తిల్హరీతో కలిసి పురుషోత్తం కుమార్, జస్టిస్ బట్టు దేవానంద్‌తో కలిసి గంధం సునీత, జస్టిస్ దొనడి రమేష్‌తో కలిసి ఆలపాటి గిరిధర్ కేసులను విచారించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను.. ప్రస్తుతం 29 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు రిజిస్ట్రార్లు, అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారి కుటుంబ సభ్యులతోపాటు అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు. అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ముగ్గురిని పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ హైకోర్టుకు ప్రశ్న రావణ్.!
-
ఏపీ హైకోర్టులో రావణ్ పిటిషన్
సాక్షి,విజయవాడ: యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి, ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఒకే అంశాన్ని లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా వరుస కంప్లైంట్లు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.ఒక కేసులో కోర్టు నుండి బెయిల్ లభించగానే, వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.రావణ్‌పై ఏపీలో ఇప్పటివరకు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, మరియు గన్నవరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేశారు. -
జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి 'మాకు అన్యాయం చేస్తున్నారు'..
సాక్షి, అమరావతి: తన పోషణ, చదువు తదితరాల నిమిత్తం జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన తండ్రి నుంచి తన తల్లికి భరణం ఇప్పించాలని కోరుతూ 4వ తరగతి చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి న్యాయ పోరాటానికి దిగింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా జగిత్యాలలో పని చేస్తున్న తన తండ్రి వినీల్ కుమార్ తమకు కనీసం తాత్కాలిక భరణం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతూ హైకోర్టును ఆశ్రయించింది. భరణం విషయంలో తన తల్లి నాగలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడంలో ఒంగోలు కోర్టు తీవ్ర జాప్యం చేస్తోందని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘తన అధికారిక సామర్థ్యంలోనే కాక, తన వ్యక్తిగత ప్రవర్తనలో కూడా రోల్ మోడల్‌గా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తన పెంపకం భారాన్ని నా తల్లే మోస్తోందని పేర్కొంటూ తన బాగోగుల నిమిత్తం కనీసం రూ.40 వేల తాత్కాలిక భరణం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ చిన్నారి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది. లేదా నిర్దిష్ట మొత్తాన్ని కోర్టులో జమ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. భరణం కోసం ఏడాదిన్నరగా పెండింగులో ఉన్న పిటిషన్‌ను రోజూ వారీ పద్దతిలో విచారణ జరిపి వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఒంగోలు కోర్టును ఆదేశించాలని కోరింది. ‘‘వేగవంతమైన పరిష్కారం అనేది కేవలం న్యాయపరమైన విచక్షణ మాత్రమే కాదు. అది ఒక రాజ్యాంగపరమైన బాధ్యత. మరీ ముఖ్యంగా చిన్న వయసున్న నాలాంటి మైనర్ బాలిక సంక్షేమం ప్రమాదంలో ఉన్నప్పుడు వేగవంతమైన పరిష్కారం చాలా అవసరం.’ అని చిన్నారి తన పిటిషన్లో పేర్కొంది. ‘‘నా తల్లి తాత్కాలిక భరణం కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు రూ. 50 వేల మెయింటినెన్స్‌కు ప్రధాన పిటిషన్లో విచారణను ఆలస్యం చేయడానికి నా తండ్రి వరుస దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. తద్వారా ఆయన కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని కూడా చిన్నారి పేర్కొంది. -
2 నెలల తర్వాత ఎముకలు, బూడిద ఎలా వచ్చాయి?
సాక్షి, అమరావతి: అబ్రకదబ్ర అంటూ గాల్లో వస్తువులు సృష్టించడం ఇంద్రజాల విద్య. కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. అబ్రకదబ్ర అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద సృష్టించింది. సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌లో అంతమైన కేసును నీరుగార్చేందుకు సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ కేసు నుంచి పోలీసు, ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు ఏకంగా న్యాయస్థానం కళ్లుగప్పేందుకు బరితెగించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయంలో పక్కా స్కెచ్ సిద్ధమైపోయిందని హైకోర్టులో పోలీసులు సమర్పించిన లంచ్ మోషన్ పిటిషన్ బట్టబయలు చేస్తోంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్‌పై తమకు కొన్ని ఎముకలు, కొంత బూడిద దొరికినట్లు హఠాత్తుగా ఓ కట్టుకథను వినిపించడం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టును బురిడీ కొట్టించడం.. ఈ కేసు నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు, విజయవాడ పోలీస్ కమిషనర్‌తోపాటు తెరవెనుక పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రను తప్పించడం.. కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు పన్నిన కుతంత్రం విస్తుగొలుపుతోంది. రెండు నెలల తర్వాత పోలీస్ స్టేషన్‌పై ఎముకలు, బూడిద! సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యమైన దారుణాన్ని దారి మళ్లించేందుకు పోలీసులు పన్నిన సరికొత్త పన్నాగం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని నెల క్రితమే ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు నియమించిన సిట్ అధికారిక సమాచారం ప్రకారం సాయికృష్ణను మే 6న కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. అంటే ఇప్పటికి దాదాపు రెండు నెలలు అవుతోంది. రెండు నెలల తర్వాత సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్ డాబా మీద హఠాత్తుగా కొన్ని ఎముకలు, కొంత బూడిదను గుర్తించారట. అంతే కాకుండా అనుమానాస్పద మరకలతోపాటు ఓ లాఠీని కూడా గుర్తించారని సిట్ హైకోర్టుకు సమరి్పంచిన నివేదికలో పేర్కొంది. సాయికృష్ణను ఎక్కడికో తరలించి మరీ దహనం చేయడం ద్వారానో మరో విధంగానో లేకుండా చేశారని ఇదే సిట్ మొదట పేర్కొంది. విద్యుత్ దహన వాటికలో అనాథ మృతదేహంగా బూడిద చేశారనే బలమైన వాదనా ఉంది. సిట్ అధికారులు విద్యుత్ దహన వాటికకు వెళ్లి దర్యాప్తు చేశారు కూడా. కాగా అందుకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికాయని సిట్ చెప్పడం విడ్డూరం. హెబియస్ కార్పస్ పిటిషన్ నుంచి తప్పించుకునేందుకే.. సాయికృష్ణ ఆచూకీ కోసం ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై పోలీసు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాయికృష్ణను గానీ, ఆయన మృతదేహాన్ని గానీ, ఆయనకు సంబంధించిన డీఎన్ఏ అవశేషాలనుగానీ గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకే తాము ఏదో ఎముకలు, బూడిద కనుగొన్నాం.. దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టును తప్పుదారి పట్టించాలన్నది పోలీసుల ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్ఏ నమూనాలతో కనీసం పరీక్ష కూడా చేయించలేదు. కొన్ని వాయిదాల తర్వాత డీఎన్ఏ నమూనాలు సరిపోలేదని చెప్పవచ్చులే అన్నది పోలీసుల ధీమాగా స్పష్టమవుతోంది.సిట్.. ఈ ప్రశ్నలకు బదులివ్వాలి » ఎక్కడో బయటకు తీసుకువెళ్లి దహనం చేసి ఉంటే.. అక్కడి నుంచి ఎముకలు, బూడిద తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ మీద దాచారా? » ఒకవేళ పోలీస్ స్టేషన్ డాబా మీదే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి ఉంటే, అప్పుడు వచ్చే మంటలు, పొగను ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది నివాసాల్లో ఉన్న వారు గమనించలేదా? » అదే జరిగి ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ ఈ విషయం తెలిసి ఉండదా? » మరి విజయవాడ కోర్టుకు సమర్పించిన సాయికృష్ణ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలను ఎందుకు వెల్లడించ లేదు? »ప్రస్తుతం హఠాత్తుగా హైకోర్టుకు ఎందుకు ఈ విషయాన్ని చెప్పినట్టు? » హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ఇది బరితెగించడం కాదా?టాస్క్ ఫోర్స్, సీపీ, డీజీపీ, పెద్దలను తప్పించడమే లక్ష్యంటీడీపీ ప్రజా ప్రతినిధి భూ, ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలోనే సాయికృష్ణను అంతం చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారం వెనుక కేవలం సీఐ నాగరాజు పాత్రధారి మాత్రమేనని.. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు పాత్ర ఉందన్నది నిర్వివాదాంశం. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా ఉన్నారని పోలీసువర్గాలే చెబుతున్నాయి. ఈ కేసును కేవలం సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అందుకే కృష్ణలంక పోలీస్‌స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికినట్టు కట్టు కథను తెరపైకి తెచ్చారు. కాగా, సాయికృష్ణ లాకప్‌లోనే అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సీఐబీకి అప్పగించాలని సామాజికవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే టాస్క్ ఫోర్స్ అధికారులు, సీపీ, డీజీపీలతోపాటు ప్రభుత్వ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది. అందుకే ఈ కేసు దర్యాప్తులో ఏదో పురోగతి సాధించామని నమ్మించేందుకు.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించేందుకు వీలుగా పోలీసు పెద్దలే పోలీస్ స్టేషన్‌పై కొన్ని ఎముకలు, కొంత బూడిద లభించాయనే కట్టుకథను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. సాయికృష్ణ లాకప్ హత్య కేసును పూర్తిగా నీరుగార్చేందుకు పోలీసు పెద్దలు ఇంతగా బరితెగిస్తుండటం సదరు శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మీపై కేసు ఎందుకు పెట్టకూడదు?
ఆదోని: తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హొళగుంద ఎస్హెచ్ఓ, ఎస్ఐ దిలీప్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సదరు ఎస్ఐపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆయనతోపాటు ప్రతివాదులైన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డీఐజీ, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, కానిస్టేబుల్ అనిల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ గిరిమల్ల దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రకారం.. హొళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన దళిత గిరిమల్ల కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. గత మే 20న గ్రామంలోని చెరువు కట్ట వద్ద మట్టిని తవ్వుకుంటూ ట్రాక్టర్లో నింపుకుంటున్నాడు. ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన పింజారి అల్లావలి అకారణంగా గిరిమల్లను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తూ మట్టిని ఎలా తవ్వుతావని గట్టిగా అరుస్తూ, గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. తల మీద తగలాల్సిన గొడ్డలికి గిరిమల్ల చెయ్యి అడ్డు పెట్టడంతో అతనికి రక్తగాయమైంది. అధికార పార్టీ వర్గీయులను ప్రశ్నించినందుకే.. గ్రామంలో సచివాలయం పక్కన అధికార పార్టీ అనుచరుడు పీర్‌సాబ్ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ విషయంలో గ్రామస్తులతో కలిసి గిరిమల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. న్యాయపోరాటం చేస్తూ వచ్చాడు. ఆ నిర్మాణాలను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ ప్రోద్బలంతో పింజారి అల్లావలి దాడికి పాల్పడటంతో వారందరిపై గిరిమల్ల హొళగుంద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దళితుడినైన తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. అయితే ఎస్ఐ దిలీప్‌కుమార్ గిరిమల్లను బెదిరించి అనిల్ అనే కానిస్టేబుల్ చేత ఫిర్యాదును తిరగరాయించారు. ఆ ఫిర్యాదులో పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ పేర్లు లేకుండా కేవలం పింజారి అల్లావలి పేరు మాత్రమే ఉండేలా చేశారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. పైగా ఈ ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర ఆలస్యం అయ్యింది. ఆ దీంతో న్యాయం కోసం బాధితుడు గిరిమల్ల సీనియర్ అడ్వకేట్ డాక్టర్ బి.పురుషోత్తమ రెడ్డి ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఫిర్యాదులో పేర్లు లేకుండా చేసుకున్న వాళ్లంతా టీడీపీ వర్గీయులు కావడంతో పెద్దల ఒత్తిడితో ఎస్ఐ ఫిర్యాదు నుంచి వారి పేర్లను తీసివేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
నాగరాజును విజయవాడలోనే విచారిస్తాం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇచ్చిన పోలీసు కస్టడీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైలులో కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజును విచారించేందుకు అనుమతించాలని సిట్ తన పిటిషన్లో హైకోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణ జరిపారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. సిట్ అత్యవసర విచారణ కోరుతున్న నేపథ్యంలో ఆదివారమైనప్పటికీ ఆ రోజున ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జైలులో విచారణకు సిట్ అభ్యంతరాలు ఇవీ.. నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని ఆదేశిస్తూ పలు నిబంధనలు విధించింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, ‘నేరం మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే జరిగింది. పోలీస్ కస్టడీ సమయంలో నిందితుడు నాగరాజు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలను సేకరించడానికి లేదా క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు దర్యాప్తు అధికారి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోలీస్ కస్టడీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే పరిమితం చేయడం వల్ల సరైన దర్యాప్తు జరపకుండా అడ్డుకున్నట్లవుతుంది. నేరం జరిగిన పరిధిని విడిచిపెట్టి వేరే చోట నాగరాజును విచారించడం వల్ల దర్యాప్తు అధికారికి ఎదురయ్యే ఇబ్బందులను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తులో భాగమైన అధికారులందరూ రాజమండ్రి జైలుకెళ్లడం సాధ్యం కాదు. పోలీసు అధికారి అయిన నాగరాజు నుంచి వివరాలు రాబట్టడం అంత సులభం కాదు. అందువల్ల ఇందుకు సంబంధించి కింది కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలి’’ అని విన్నవించారు.మరకలు ఉన్న లాఠీ.. ఎముకలు.. బూడిద, కాలిన రిస్ట్ చైన్ స్వాదీనం చేసుకున్నాం: హైకోర్టుకు సిట్ సంచలన విషయాలువిజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సిట్ తన పిటిషన్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ‘సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా, చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. ముఖ్య సాక్షులు అతనిని పోలీస్ స్టేషన్లో గాయాలతో చూశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు. 01.05.2026 నుండి 01.06.2026 వరకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేశారు. ఎల్రక్టానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైన్, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం స్వాదీనం చేసుకున్నాం.. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.’ అని సిట్ తన పిటిషన్లో పేర్కొంది.నాకు ప్రాణహాని ఉంది: నాగరాజుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ప్రధాని నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. నాగరాజును ఎనిమిది రోజుల పాటు విచారించేందుకు సిట్‌కు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయవాడ కోర్టుకు ఈ లేఖ రాశారు.తాను నిర్దోషినని, సిట్ తనను అన్యాయంగా ఇరికించి భయభ్రాంతులకు గురిచేస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలని, సిట్ టార్చర్ లేకుండా చూడాలని కోరారు. నాగరాజును రాజమహేంద్రవరంలో విచారించడంసహా పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణ కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఆయన విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. -
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ : న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తులుగా వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులవుతారు. ఈ ముగ్గురి చేత వచ్చే వారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించనున్నారు. న్యాయమూర్తులుగా ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే 4న సమావేశమై, వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వీరిలో గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. పురుషోత్తం కుమార్ ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టుకు మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 32కు చేరింది. గంధం సునీత గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెదకళ్లేపల్లిలోని ఎస్‌డీఎన్‌ఎస్‌డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి టాపర్‌గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 మధ్య హైకోర్టు రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆలపాటి గిరిధర్ ప్రకాశం జిల్లా కొండెపి మండలం గోగినేనివారిపాలెంలో ఆలపాటి గిరిధర్ జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. గిరిధర్ ఒంగోలు ఇందిరా ప్రయదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా కూడా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రధాన జిల్లా జడ్జీలుగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చింతలపూడి పురుషోత్తం కుమార్ విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు పురుషోత్తం కుమార్ జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి. ఈ కుటుంబంలోని వారు మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో సైతం వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజి్రస్టార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
సాయికృష్ణ కేసు.. సిట్ లంచ్‌మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో కస్టడీ విచారణకు బ్రేక్ పడింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత సీఐని సిట్ కస్టడీకి తీసుకోనుంది. తదుపరి విచారణ ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది. నాగరాజు అరెస్టు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించడం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తనను సిట్ ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే న్యాయమూర్తికి సీఐ నాగరాజు చెప్పిన సంగతి తెలిసిందే.కాగా, సిట్ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు.సాయికృష్ణ కేసులో తనను సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు. -
భరణం పిటిషన్‌ను 6 నెలల్లో పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల వయసున్న ఆటిజం బాధిత చిన్నారిని భర్త, అత్తమామల వద్ద వదిలేసి వెళ్లిన భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను 6నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు విజయవాడలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. గుండు సాయికార్తీక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది బి.శ్రవణ్శంకర్ వాదనలు వినిపిస్తూ.. సాయికార్తీక్ భార్య నాలుగేళ్ల ఆటిస్టిక్ చిన్నారిని భర్త, అతడి తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆమె కూడా భర్తతో సమానంగా చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, పెళ్లికి ముందు బ్యాంకులో పనిచేశారని తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త చేతికి వచ్చే నికర నెలవారీ ఆదాయం కేవలం రూ.48 వేలు మాత్రమేనని చెప్పారు. 2024లో భరణం కోసం పిటిషన్ వేసిన ఆమె ఇప్పటివరకు కనీసం బిడ్డ కస్టడీ కోరలేదని తెలిపారు. ఈ పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇది కేవలం కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వ్యవహారమేనని, ప్రస్తుత దశలో ఇందులో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అయితే, విజయవాడలోని ట్రయల్ కోర్టులో విచారణలో ఉన్న మెయింటెనెన్స్ పిటిషన్‌ను 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది. అసలేం జరిగిందంటే.. ఐర్లాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుండు సాయికార్తీక్‌పై అతడి భార్య హిమబిందు విజయవాడలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కింది కోర్టు.. ఆమెకు నెలకు రూ.50 వేలు మధ్యంతర భరణం చెల్లించాలని 2025 నవంబర్ 26న ఆదేశించింది. తనకున్న ఆర్థికభారాన్ని, వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు ఎక్కువ మొత్తాన్ని భరణంగా ఖరారు చేసిందంటూ సాయికార్తీక్ ఏపీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 2న ఏపీ హైకోర్టు విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రధాన కేసును వేగంగా పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశిస్తూ రివిజన్ పిటిషన్‌ను కొట్టేశారు. దీంతో సాయికార్తీక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
బెయిల్ పిటిషన్లో నేర చరిత్రను చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసే నిందితులు తమ నేరచరిత్రను దాచిపెట్టి బెయిల్ పొందుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తన స్టాండింగ్ ఆర్డర్స్‌కు కీలక సవరణ చేసింది. హైకోర్టులో దాఖలు చేసే బెయిల్ పిటిషన్లో నిందితుడు తన నేరచరిత్రను తెలియజేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు హైకోర్టు స్టాండింగ్ ఆర్డర్స్‌లో కఠినమైన కొత్త నిబంధన చేర్చింది. హైకోర్టులో దాఖలు చేసే ప్రతి బెయిల్ పిటిషన్లో.. సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్‌ను ఏదైనా దాఖలు చేశారా? లేదా? అనే విషయాన్ని పిటిషనర్ తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకవేళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంటే దాని ఫలితాన్ని కూడా బెయిల్ పిటిషన్లో తెలియజేయాలి. అంతేగాక పిటిషనర్/దరఖాస్తుదారు తనపై మరేదైనా క్రిమినల్ కేసు ఉందా? లేదా? అన్న విషయాన్ని కూడా పేర్కొనాలి. ఒకవేళ క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు, ఆ కేసుల్లో కోర్టుల నిర్ణయాలను (తీర్పులను) కూడా పిటిషనర్ తన బెయిల్ పిటిషన్లో తెలియజేయాలి. ఒకవేళ ఈ సమాచారాన్ని బెయిల్ పిటిషన్లో పొందుపరచకపోతే, ఆ వివరాలను తెలుసుకున్న తరువాతే ఆ పిటిషన్ విచారణకు వస్తుంది. హైకోర్టు ఈ సవరణ ఆర్డర్‌ను తక్షణమే అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనతో న్యాయపరమైన ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.కుమ్మక్కు ఆటలు సాగవు ఇప్పటివరకు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు అందులో కేవలం సదరు కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే పొందుపరిచేవారు. నేరచరిత్రను, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల వివరాలను ప్రస్తావించేవారు కాదు. దీంతో కోర్టుకు సదరు నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం లేకపోయేది. తద్వారా బెయిల్ మంజూరు విషయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. బెయిల్ మంజూరు విషయంలో న్యాయస్థానాలు ఇటీవల కాలంలో నిందితుడి నేరచరిత్రను తప్పనిసరిగా తెలుసుకుంటున్నాయి. గతంలో ఎలాంటి కేసులు నమోదయ్యాయి.. వాటి తీవ్రత ఏమిటన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే నిందితుడి నేరచరిత్ర వివరాలను పోలీసులే కోర్టు ముందుంచాల్సి వచ్చేది. కొందరు పోలీసులు నిందితులతో కుమ్మక్కై వారి నేరచరిత్రను కోర్టు ముందుంచకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేవారు. తద్వారా నిందితులకు బెయిల్ వచ్చేందుకు పోలీసులు తమవంతు సహకారం అందించేవారు. అంతేగాక నిందితులు తమపై గతంలో నమోదైన కేసుల్లో కోర్టులు ఇచ్చి న తీర్పుల గురించి కూడా బెయిల్ పిటిషన్లో పేర్కొనేవారు కాదు. దీంతో సదరు నిందితుడి నేరస్వభావాన్ని తెలుసుకునే అవకాశం హైకోర్టుకు లేకుండాపోయేది. అంతిమంగా సులభంగా బెయిల్ మంజూరుకు ఆస్కారం ఉండేది. ఇప్పుడు హైకోర్టు తీసుకొచ్చి న కొత్త నిబంధన వల్ల ఇకపై ఈ ఆటలు సాగవు. నిందితులే స్వయంగా తమ బెయిల్ పిటిషన్లో తమ నేరచరిత్రను, గతంలో నమోదైన కేసుల వివరాలను, ఆ కేసుల్లో కోర్టులిచ్చి న తీర్పులను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఇకపై తీవ్రనేరాల్లో బెయిల్ పొందడం అంత సులభం కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. -
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట దక్కింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.కాగా, వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఇటీవల పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌తో పాటు డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తి, తదితరులపై కేసు నమోదైంది. -
రాష్ట్రం రావణ కాష్టం కావాలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అడ్మినిస్ట్రేషన్ ఏ మాత్రం సక్రమంగా లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి, సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగే వారు లేరనుకుంటున్నారా? లేక మీరే తెలివైన వాళ్లు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా?’ అంటూ మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి పోలీసు శాఖపై నిప్పులు చెరిగింది.ఒక నేత దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలను హైకోర్టు ముందుంచేందుకు సమయం తీసుకున్న పోలీసులు, దానిని అడ్డం పెట్టుకుని ఆ వెంటనే కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘వివరాలు సమర్పించేందుకు సమయం తీసుకుని చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారు? ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. పోలీసులు, కలెక్టర్‌కు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది.పోలీసులు, కలెక్టర్‌ను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వివరాల సమర్పణ కోసం పోలీసులు సమయం కోరినప్పుడు, కోర్టు సమయం ఇవ్వడం పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. పోలీసులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అధికారులు ఇల్లు కూల్చి వేస్తున్నారంటూ కక్షిదారుడు పిటిషన్ దాఖలు చేస్తే.. వివరణ సమర్పణ కోసం గడువు తీసుకుని ఆ ఇల్లు కూల్చేసినట్లుగా ఉంది పోలీసుల తీరు’ అని హైకోర్టు మండిపడింది. ఫలితంగా ప్రత్యర్థులే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీపీ ప్రభుత్వ మౌత్‌పీస్ కాకూడదు హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) జయంతి తీరుపై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి కొన్ని ప్రమాణాలు ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ ప్రతినిధిగా (మౌత్‌పీస్) వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది ఉన్నది కోర్టుకు సహకరించేందుకే తప్ప ప్రభుత్వానికి పోస్టు మ్యాన్‌గా ఉండేందుకు కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి స్పందిస్తూ.. కేసును విచారణకు స్వీకరించాలా? లేదా అన్నది కింది కోర్టు పరిధిలోని వ్యవహారమన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రయల్‌లో తేల్చాల్సి ఉంటుందని తెలిపారు. అధికరణ 226 కింద హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అధికరణ 226 కింద హైకోర్టు అధికారాలకు ఆకాశమే హద్దని స్పష్టం చేసింది. మూడేళ్లు శిక్షపడే కేసుల్లో మూడేళ్ల తర్వాత ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించడంపై చట్ట ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది.ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషనా?2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి హోదాలో కొడాలి నాని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి గుడివాడ పోలీసులకు 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అప్పటి కేసుపై ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిని కొట్టేయాలని కోరుతూ నాని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.నాని తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు మంగళవారం వాదనలు వినిపించారు. 2021లో కేసు నమోదైతే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనన్నారు. నానిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించే గడువు ఎప్పుడో ముగిసిందని తెలిపారు. అందువల్ల సీఆర్పీసీ ప్రకారం కొడాలి నాని ప్రాసిక్యూషన్ చెల్లదన్నారు. వివరాల సమర్పణకు మొన్న (28వ తేదీ) గడువు తీసుకున్న పోలీసులు, నిన్న (29న) చార్జిషీట్ దాఖలు చేశారని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. నానిపై నమోదైన కేసులో మూడేళ్ల శిక్ష మాత్రమే పడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మూడేళ్లు దాటిన తర్వాత ఆ కేసును కోర్టులు విచారణకు స్వీకరించలేవని స్పష్టం చేసింది.మూడేళ్ల తరువాత కేసును విచారణకు స్వీకరించడంపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టమైన నిషేధం ఉందని తెలిపింది. 2021లో జరిగిన ఘటనపై తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, ఆ చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించడానికి వీలు ఉండదని గుర్తు చేసింది. నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18న జారీ చేసిన జీవో 801, తదనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జూన్ 25న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నిలిపేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకే
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకేనని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో, ప్రభుత్వానికి సహకారం అందించడానికో కాదని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తెలిపారు. తమకు చట్టం ఎనలేని అధికారాలను ఇచ్చింది న్యాయ పాలనను నిలబెట్టడానికి, ప్రజల హక్కులను ప్రభుత్వాలు హరించకుండా చూడటానికే అని పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ ఇదే సూత్రంపై పని చేశానని, దీనికి ఎప్పుడూ చింతించలేదన్నారు.మన చుట్టూ ఉన్న ఆడంబరాలు లేదా మనకు లభించే గౌరవ మర్యాదలను బట్టి మన గుర్తింపు, విశ్వసనీయత ఆధారపడి ఉండవని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉండి మన తలుపు తట్టిన ప్రతిసారీ వారికి ఏ విధంగా న్యాయం చేశామనే దానిపైనే మన అసలు గుర్తింపు ఆధారపడి ఉంటుందని చెప్పారు. న్యాయమూర్తిగా జస్టిస్ రఘునందన్‌రావు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు సాయం చేయడానికి నాకు లభించిన గొప్ప అవకాశం‘నేను అడ్వొకేట్‌గా ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ స్వభావం వల్ల, ఎక్కువ వనరులు ఉన్న కక్షిదారుల పక్షాన వాదించేవాడిని. వారికి కోర్టులు వారి హక్కులను కాపాడుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో ఒకటి మాత్రమే. కానీ, నేను న్యాయమూర్తి అయిన తర్వాతే.. కోర్టు మాత్రమే తమ మొదటి, చివరి ఆశ్రయం అని నమ్మే సాధారణ ప్రజల కేసులను చూసే అవకాశం దక్కింది. అటువంటి నిరుపేదలకు, హక్కులు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి నాకు లభించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో వెనుకబడిన వర్గాల వారు మనుగడ కోసం ఎంతగా పోరాడుతున్నారో, వారు ఎంత బలహీనంగా ఉన్నారో నేను న్యాయమూర్తి అయిన తరువాతే గ్రహించాను.’ అని ఆయన చెప్పారు.భవిష్యత్ తరాలు గర్వపడేలా తీర్చిదిద్దాలి‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మౌలిక సదుపాయాల పరంగా ఎంతో పురోగతి సాధించింది. త్వరలోనే కొత్త హైకోర్టు భవనం కూడా రాబోతోంది. గత రెండేళ్లుగా హైకోర్టు వంద శాతానికి పైగా కేసుల పరిష్కార రేటును సాధించింది. అంటే కొత్తగా దాఖలైన కేసుల కంటే ఎక్కువ కేసులను పరిష్కరించాం. గత ఏడాది ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన స్వతంత్ర సర్వేలో కోర్టులు, జైళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని 25 హైకోర్టులలో మన ఏపీ హైకోర్టు ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా ఎదగడానికి ఇంకా శ్రమించాలి.రాబోయే తరాలు గర్వపడేలా మన న్యాయవ్యవస్థను తీర్చిదిద్దాలి. ఈ దేశ ప్రజల కోసం, చట్టాన్ని నిలబెట్టడం కోసం ఈ కోర్టు ఎల్లప్పుడూ తన బాధ్యతను నిర్వర్తిస్తుందనే నమ్మకం నాకు ఉంది.’ అని జస్టిస్ రఘునందన్‌రావు తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ కూర్చోవడానికి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి విజయవాడకు మారడానికి అంగీకరించి, తన సంరక్షణ కోసం కెరీర్‌ను సైతం వదులుకున్న తన సతీమణి రాజిత, పిల్లలు అనన్య, ఆదిత్య అందించిన మద్దతు వల్లే ఇక్కడ ప్రశాంతంగా పని చేయగలిగానని తెలిపారు.సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారు: సీజే జస్టిస్ లీసా గిల్జస్టిస్ రఘునందన్‌రావు సేవలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. న్యాయవ్యవస్థపై ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. 25 వేల కేసులను పరిష్కరించి సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారన్నారు. సాంకేతికతను, న్యాయవ్యవస్థను అనుసంధానం చేసి న్యాయాన్ని ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని సీజే ఆకాక్షించారు. పౌర హక్కుల పరిరక్షణలో ముందున్నారుఈ కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడారు. పౌరుల హక్కులను కాపాడటంలో జస్టిస్ రఘునందన్‌రావు ముందున్నారని తెలిపారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారు వృత్తి మెళకువలు నేర్చుకునేలా చేశారన్నారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయ వ్యవస్థకు లోటన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ మఠం వెంకటరమణ, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ రఘునందన్‌రావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, అదనపు అడ్వొకేట్ జనరల్ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానంపదవీ విరమణ చేసిన జస్టిస్ రఘునందన్‌రావును హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. జస్టిస్ రఘునందన్‌రావు, ఆయన సతీమణి రాజితకు అమ్మవారి చిత్రపటాన్ని సంఘం కార్యవర్గం బహూకరించింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
ఇవాళ హైకోర్టు ముందుకు సాయికృష్ణ కేసు
-
తెర వెనుక మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్‌కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
వంశపారంపర్య ఆస్తిలో రెండో భార్య సంతానానికీ సమాన హక్కు
సాక్షి, అమరావతి: తండ్రికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో అతడి మొదటి భార్య పిల్లలతో పాటు రెండో భార్య సంతానానికి కూడా సమాన హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మొదటి భార్య మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్నానని, తద్వారా కుమార్తెలు జన్మించారని తండ్రే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో ఆ కుమార్తెలు చట్టబద్ధ సంతానమే అవుతారని స్పష్టంచేసింది. సదరు తండ్రి వంశపారంపర్య ఆస్తికి కుమార్తెలు సైతం హక్కుదారులేనని, వారందరికీ ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన దాఖలైన రెండవ అప్పీల్‌ను కొట్టేసిన న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించారు. తండ్రి, కుమార్తెల న్యాయ పోరాటం తురంగి సోమరాజుకు కాకినాడ గ్రామీణ మండలం, గైగోలుపాడు గ్రామంలో వంశపారంపర్య ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లో తనకూ, రెండో భార్యతో తనకు కలిగిన ఆరుగురు కుమార్తెలకు సమాన వాటా ఉందని, దీనిపై తన మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ విబేధిస్తున్నాడని, ఆస్తుల పంపకాలు జరగనీయడం లేదని పేర్కొంటూ సోమరాజు ఆయన కుమార్తెలతోపాటు కాకినాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ దావాను కొట్టేసింది. దీనిపై సోమరాజు, ఆయన కుమార్తెలు కాకినాడ అదనపు జిల్లా కోర్టులో మొదటి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే సోమరాజు మరణించారు. అయితే దావాపై విచారణ జరిపిన కోర్టు.. సోమరాజు, ఆయన కుమారుడు సత్యనారాయణతో పాటు ఆరుగురు కుమార్తెలకు ఆ ఆస్తిలో సమాన వాటా (8 వాటాలు) ఉందంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యనారాయణ 2012లో హైకోర్టులో రెండో అప్పీల్ దాఖలు చేశారు. తన తండ్రికి రెండో వివాహం కాలేదని, ఆయన కుమార్తెలు చెబుతున్నట్లు వారు తన తండ్రికి జన్మించలేదని సత్యనారాయణ చేసిన వాదనలను హైకోర్టు త్రోసిపుచ్చింది. తన తండ్రి తన నుంచి రూ. 80 వేలు తీసుకుని ఆస్తిపై హక్కులు వదులుకున్నారన్న వాదనలనూ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సోమరాజు మరణించినందున, ఆయన వాటాకు రెండో భార్య హక్కుదారు అవుతారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక రూ.80 వేలు తీసుకుని తండ్రి ఆస్తిపై వాటా వదులుకున్నారని సత్యనారాయణ మౌఖికంగా చెబుతున్నారే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలను చూపడం లేదన్నారు. ఒకవేళ డబ్బు తీసుకుని సోమరాజు ఆస్తిపై హక్కు వదులుకున్నది నిజమే అనుకున్నా, ఆయన తన వాటా ఆస్తిపై హక్కును వదులుకోగలరే తప్ప, కుమార్తెలకు రావాల్సిన వాటా విషయంలో కాదని న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు స్పష్టం చేశారు. -
మాకు బాబుపై నమ్మకం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి...
-
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం..
-
హైకోర్టుకు సాయి కృష్ణ తల్లి.. ఖాకీలపై నమ్మకం లేదు.. సీబీఐకి ఇవ్వండి!
-
విడాకులకు 6 నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదు
సాక్షి, అమరావతి: పరస్పర అంగీకారంతో భార్య భర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారికి విడాకులు మంజూరు చేసేందుకు ఆరు నెలల పాటు వేచి ఉండటం (కూలింగ్ పీరియడ్) తప్పనిసరి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించి ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు.. భార్య, భర్తలు చాలా కాలం నుంచి వేర్వేరుగా ఉంటూ, తమ మధ్య ఉన్న వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు విధించే కూలింగ్ పీరియడ్ వల్ల వారికి మానసిక వేదన పెరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టంచేసింది. ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ భార్య, భర్తలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ మేరకు అనుమతించిన హైకోర్టు వీలైనంత త్వరగా విడాకుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. -
గంగమ్మ మృతి కేసు దర్యాప్తు ఏమైంది?
సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెప్పాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. గంగమ్మ మృతి కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. అలాగే గంగమ్మ పోస్టుమార్టం నివేదికతో సహా అన్ని రికార్డులను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అలాగే గంగమ్మ కుమార్తె లక్ష్మికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్ట్ తారుమారు? గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ సీల్డ్ కవర్లో సమర్పించిన పత్రాలను ధర్మాసనం బుధవారం పరిశీలించింది. అనంతరం గంగమ్మ పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె ఎలా చనిపోయారని పోలీసులను ప్రశ్నించింది. దీనికి పోలీసుల తరఫు న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ, «కార్డియాక్ అరెస్ట్‌తో పాటు పలు ఇతర కారణాలతో గంగమ్మ మృతి చెందారని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. పిటిషనర్ ఆగమన్రాజ్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, గంగమ్మ కుమార్తె లక్ష్మిని కలిసేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. గంగమ్మ పోస్టుమార్టం రిపోర్ట్‌ను సైతం పోలీసులు తారుమారు చేశారని తెలిపారు.గంగమ్మ లాకప్‌డెత్! కర్నూలు జిల్లా బదినేహాల్కి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్స్) కె.సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్ ఏర్పాటయ్యింది. వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సిట్ గంగమ్మను, బేగరి దర్గప్పను కస్టడీలోకి తీసుకుంది. అయితే సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందిందన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఆమె కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు కర్నూలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.టార్చర్‌కు గురైన దర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గంగమ్మ లాకప్‌డెత్ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆగమన్రాజ్ అనే యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం
-
గంగమ్మ లాకప్‌డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్‌పై దాఖలైన పిల్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ మా ముందుంచండి
సాక్షి, అమరావతి : దళిత మహిళ మాల గంగమ్మ లాకప్‌డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గంగమ్మతో పాటు పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని గత వారం ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, తాజాగా అతని మెడికల్ రికార్డులన్నింటినీ సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అలాగే జుడీషియల్ కస్టడీలో ఉన్న దుర్గప్ప వద్దకు వెళ్లి, అతని ప్రస్తుత ఆరోగ్య స్థితిని పరిశీలించి.. అందుకు సంబంధించిన నివేదికను సైతం తమ ముందుంచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అవసరమైతే అతన్ని ఆసుపత్రికి తరలించాలని కూడా చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వీరేంద్ర అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్) కె.సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులిచ్చారు. వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సుప్రజ నేతృత్వంలోని సిట్.. మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారు. సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందారు. గంగమ్మ, దుర్గప్పలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని టార్చర్ చేసిన సంగతి గ్రామస్తులందరికీ తెలుసు. టార్చర్‌కు గురైన దుర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగమ్మ మృతితో భయపడిన పోలీసులు దుర్గప్పను ఆసుపత్రిలో చేర్పించారు. వాస్తవానికి గంగమ్మ లాకప్‌డెత్‌కు దుర్గప్ప ప్రత్యక్ష సాక్షి. దుర్గప్ప వాంగ్మూలం నమోదు కోసం పిటిషన్ దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గంగమ్మ లాకప్‌డెత్ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉండటంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాసుకుర్తి ఆగమన్రాజ్ అనే యువకుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, దుర్గప్ప చికిత్స పొందున్న ఆసుపత్రికి వెళ్లి అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి తమ ముందుంచాలని సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, ధర్మాసనం ఆదేశాల మేరకు దుర్గప్ప వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేశారన్నారు. దుర్గప్ప ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. దీంతో ధర్మాసనం.. మేజిస్ట్రేట్ నమోదు చేసిన దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించింది.గంగమ్మ కుమార్తెకూ పోలీసుల బెదిరింపులుఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మృతురాలు గంగమ్మ కుమార్తె లక్ష్మీని పోలీసులు బెదిరించారన్నారు. ఆమె ఆచూకీ తెలియడం లేదని తెలిపారు. ఆమె తన స్వగ్రామంలో కూడా లేదని, ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తోందన్నారు. ఈ వాదనను ఎస్‌జీపీ ప్రణతి తోసిపుచ్చారు. గంగమ్మ కుమార్తె అందుబాటులోనే ఉన్నారన్నారు. గంగమ్మ మృతికి సంబంధించిన అన్ని రికార్డులను కర్నూలు జీజీహెచ్ నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. దుర్గప్ప మెడికల్ రికార్డుల కోసం ఆసుపత్రి వర్గాలకు దరఖాస్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దుర్గప్పకు సంబంధించిన అన్ని మెడికల్ రికార్డులను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అలాగే కర్నూలు జైలుకు వెళ్లి.. అక్కడ ఉన్న దుర్గప్పను పరిశీలించి అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపీ విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఆదేశాలుకర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. స్వయంగా జైలుకు వెళ్లి దుర్గప్ప ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పింది. చికిత్స అవసరమైతే అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. -
దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ
-
కాపు యువకుని లాకప్‌డెత్ కేసు సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రొపర్టీ అండ్ ఎని్వరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడమన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుంది. పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ఈ కేసులో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దలు పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా, స్వతంత్రంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలి. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గం.సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎల్రక్టానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్‌మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలుపంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఈ వ్యాజ్యం తేలేంత వరకు, కేసును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణ రక్షణ ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరవచ్చునని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్ పిల్లో ప్రస్తావించారు. ‘సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోంది. స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు.. రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తును కొనసాగించడం అసమంజసం’’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కొట్టి చంపేశారు... ‘సాయికృష్ణను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీస్ స్టేషన్లలో రెండు రోజులు ఉంచారు. ఆ తర్వాత విజయవాడ బెంజ్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించి, మే 23 వరకు తీవ్రంగా హింసించారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిపి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మాకుంది.కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఒక రోజు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్లీ హోటల్ గదికే తీసుకెళ్లి, ఒక డాక్టర్‌తో ప్రథమ చికిత్స చేయించారు. చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడు. సాయికృష్ణ మరణించిన తర్వాత, కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు.ప్రజలను నమ్మించడానికి, ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్ నంబర్ 43 వద్ద పడేశారు. అది గుర్తుతెలియని శవంగా భ్రమింపజేసి, మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారు. స్మశానవాటిక సిబ్బందిని లొంగతీసుకుని, మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి, చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయికృష్ణను అరెస్టు చేయలేదని అబద్ధం చెబుతూ, మే 29 వరకు సమయం కోరారు.కానీ ఈ లోపే, విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారనే నిజం బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారు. అయితే, ఒక బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా. అందులో భాగంగానే ఈ పిల్ దాఖలు చేస్తున్నా.’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. -
దళిత మహిళ లాకప్ డెత్‌పై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం తీసుకోండి
సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రాణా పాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సంబంధిత జుడీషియల్ మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దుర్గప్ప ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే అతన్ని వెంటనే సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. నమోదు చేసిన వాంగ్మూలాన్ని ఈ నెల 23న తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన రిట్ పిటిషన్ కాపీతో పాటు ఈ ఆదేశాల కాపీని సంబంధిత మేజిస్ట్రేట్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. కాసుకుర్తి ఆగమన్రాజ్ అనే యువకుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొడుకు ఆచూకీ కావాలన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది కర్నూలు జిల్లా, కౌతాళం మండలం, బదినేహాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వీరేంద్ర అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్స్) కె.సుప్రజ నేతృత్వంలో మొత్తం 13 మందితో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులిచ్చారు.వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సుప్రజ నేతృత్వంలోని సిట్ మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారన్నది ప్రధాన విమర్శ. దీని ప్రకారం సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్పను కర్నూలు ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. ఇక గంగమ్మ లాకప్‌డెత్ వ్యవహారం తమ మీదకు రాకుండా ఉండేందుకు పోలీసులు గంగమ్మ కుమార్తె లక్ష్మిని భయపెట్టి ఆమె చేత ఓ తప్పుడు ఫిర్యాదు చేయించారు. తన తల్లి గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిందని, అయితే ఆమె మరణానికి కారణాలను తెలుసుకోవాలని మే 31న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లక్ష్మి పేర్కొన్నారు. తన తల్లి లోబీపీ, విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్న లక్ష్మి, ఫిర్యాదు చివరి లైనులో మాత్రం అనారోగ్యంతో కాక మరేదైనా కారణంతో మరణించారో తెలియడం లేదని పేర్కొంది. అనారోగ్యంతో కుటుంబ సభ్యులు మరణిస్తే దానిపై సాధారణంగా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు. అయితే లక్ష్మి మాత్రం తల్లి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గంగమ్మ లాకప్‌డెత్ వ్యవహారం మరుగున పడిపోయింది. సిట్ అధికారులందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్‌డెత్ నేపథ్యంలో గంగమ్మ లాకప్‌డెత్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పిల్‌తో వెలుగుచూసిన పోలీసుల దాష్టీకం! ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్ప మరణిస్తే గంగమ్మ లాకప్‌డెత్ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉందని భావించిన కాసుకుర్తి ఆగమన్రాజ్ అనే యువకుడు ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు. పోలీసుల టార్చర్‌కు గంగమ్మ మృతి చెందగా, దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. పోలీసులు మాత్రం బైక్‌పై నుంచి పడిపోవడం వల్ల దుర్గప్పకు గాయాలయ్యాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని వివరించారు. గంగమ్మను కస్టడీలో పోలీసులు హింసించారా లేదా అనేదానికి ఆ సమయంలో అక్కడే ఉన్న దుర్గప్ప ఏకైక కీలక సాక్షి అని, అతను కూడా చనిపోతే ఈ కేసులో కీలకమైన సాక్ష్యం లేకుండా పోతుందని వివరించారు. కాగా, దుర్గప్ప మోటారుసైకిల్ నుంచి పడటం వల్ల గాయపడ్డారని రిమాండ్ రిపోర్ట్ పేర్కొంటుంటే.. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి మాత్రం దుర్గప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ధర్మాసనం ముందు పేర్కొనడం గమనార్హం. -
పోలీసులే హంతకులైతే.. సీబీ‘ఐ’తోనే న్యాయం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ రాష్ట్ర పోలీసుల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పౌరులను, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే హంతకులుగా మారినప్పుడు జరిగే ఘోరానికి.. తమిళనాడులోని తూత్తుకుడి (సాతాన్‌కుళం), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (కృష్ణలంక)లలో జరిగిన రెండు భయంకరమైన లాకప్‌డెత్‌లు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడులో కరోనా సమయం 2020 జూన్‌లో పాన్ షాపు మూసివేతకు సంబంధించిన ఒక చిన్న వ్యవహారంలో జయరాజ్–బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి లాకప్‌డెత్ చేసిన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది. సదరు కేసులో ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అప్పట్లో జరిగిన ఆ దారుణంపై రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ కోర్టులో చెప్పిన సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు దర్యాప్తుతో ఏమాత్రం న్యాయం జరగదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టుకు ఇచ్చే సమాధానంపై ఆసక్తి విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీ తెలియకపోవడం, అతడి శవాన్ని మాయం చేసి కాల్చి బుడిద చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు 29వ తేదీన హైకోర్టుకు ఏం చెబుతారు? దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అవి సర్కారు హత్యలే!
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్‌లోనే ‘కనుమరుగు’...! పోలీసుల థర్డ్‌డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. ఇంత బరి తెగింపా బాబూ...! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ లాకప్‌లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్‌లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్‌లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ... విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు. అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది. న్యాయస్థానం జోక్యం... తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్‌కు పంపించి చేతులు దులిపేసుకుంది. వైఎస్ జగన్ రాకతో... తప్పనిసరై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్‌లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుకాయించి.. బెదిరించి! ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు క్రాంతి కుమార్ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. -
త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహిస్తాం
సాక్షి అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని.. త్వరలో వాటిని నిర్వహిస్తానని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకి నివేదించింది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, దానికి సంబంధించిన డేటాను ఈనెల 19 నుంచి రెండ్రోజుల పాటు గ్రామసభల ముందు ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఆ తరువాత ఈనెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఖరారు నిమిత్తం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారుచేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ బీసీ సంఘం పిల్ దాఖలు.. బీసీ జన గణన చేపట్టకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, బీసీ జనాభా లెక్కించిన తరువాతే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ మరో పిల్ వేయడంతో ఈ రెండు వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. -
‘ఈ–స్టాంపు’ల కుంభకోణం దర్యాప్తు పురోగతి ఏంటి?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ‘ఈ–స్టాంప్’ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి పూర్తి వివరాలను (స్టేటస్ రిపోర్ట్) తమ ముందుంచాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశాం. ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు’ అని వివరించారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై మూడు కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14వేల లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. పిల్ వివరాలుఅనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో బోయ యర్రప్ప.. ‘బాబు మీ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు యర్రప్ప 15,851 ఈ–స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ, కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ‘ఈ–స్టాంపు’లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది.ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) నుంచి డీజీపీకి లేఖ వెళ్లింది. అయినా ఎవ్వరినుంచీ స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.36 గంటలు ఎలా పని చేయిస్తున్నారు?పీజీ వైద్య విద్యార్థుల పనిగంటలపై హైకోర్టు ఆందోళనవారి ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పండిరాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశంసాక్షి, అమరావతి: ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల సుదీర్ఘ పనిగంటల పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా వారి చేత 36 గంటలు ఎలా పని చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితుల్లో వారు ఏకంగా 72 గంటలు ఏకబిగిన పనిచేస్తున్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. అసాధారణ పని గంటల నుంచి పీజీ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ‘నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి సేవలు అందించాల్సిన అవసరం లేదు. నిబంధనలకు అనుగుణంగా పనిగంటలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వండి’ అని విన్నవించారు. -
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..?
సాక్షి,అమరావతి: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో తాము ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా పెద చెరువులో నిర్మాణాలకు ఎలా అనుమతులు జారీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్మాణాలు ఆపాలంటూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అసలు నీటి వనరుల్లో నిర్మాణాలు చేయవచ్చా? అన్న అంశంపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ప్రోద్బలంతో పెద చెరువును ఆక్రమించి ‘సృష్టిక్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. వాదోపవాదనలు ఇలా... పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాం. ధర్మాసనం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు. స్పీకర్ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటు అవుతుండటంతో అధికారులు కోర్టు ఆదేశాల కన్నా రాజకీయ నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారు’అని వివరించారు.కాగా, వ్యాజ్యంలో అయ్యన్నపాత్రుడి తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చి, ఆయనే చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు. పిల్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. ఎమ్మెల్యే హోదాలో అయ్యన్నపాత్రుడు కేవలం భూమి పూజలో మాత్రమే పాల్గొన్నారు. పిల్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. -
సాయికృష్ణ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
-
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులిచ్చారు?, ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు?అనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ఏదైనా ఖాతాదారుడి కంటెంట్‌ను తొలగించినప్పుడు, ప్రభుత్వ నోటీసు నకలును సదరు ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడానికి గల కారణాలను తెలియజేయకపోవడం, అందుకు సంబంధించిన నోటీసు కాపీని ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆయన హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, సదరు బ్లాకింగ్‌కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే పిటిషనర్లకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ‘మెటా అధికార పార్టీకి సహకరిస్తోంది’ ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ బ్లాకింగ్ ప్రభుత్వ ‘సహయోగ్ పోర్టల్’ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే, నోటీసు ఇచ్చిన సంస్థ అసలు చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన సంస్థేనా కాదా అనే వివరాలు దాచారు. ఐటీ బ్లాకింగ్ రూల్స్–2009లోని రూల్ 16 ప్రకారం కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చు. కానీ అది సెక్షన్ 69ఏ కింద చేసే బ్లాకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 79(3)(బీ) కింద మెటా తీసుకునే చర్యలకు ఈ రహస్య నిబంధన వర్తించదు. తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా, అధికార పక్షం చెప్పినట్లు వింటూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి సహకరిస్తోంది. తద్వారా అది తన తటస్థతను కోల్పోయింది’ అని వివరించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, మెటా ప్లాట్‌ఫామ్ ఇంక్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే’ ‘2026 జూన్ 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద భారత ప్రభుత్వం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన నోటీసు ఆధారంగా ఈ పేజీని నిలిపివేసినట్టు మెటా పేర్కొంది. అయితే, ఏ అధికారి లేదా ఏ శాఖ నోటీసు ఇచ్చిందో మెటా స్పష్టం చేయలేదు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారు. రాజకీయ పార్టీగా ప్రజలతో, లక్షలాది మంది ఫాలోవర్లతో కమ్యూనికేట్ చేయడం మా పార్టీ ప్రాథమిక హక్కు. మా పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం రాజ్యాంగం మాకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. ఏదైనా నిర్దిష్ట పోస్ట్, వీడియో లేదా ఇమేజ్ చట్టవిరుద్ధంగా ఉంటే దాన్ని తొలగించవచ్చు. కానీ, కేవలం ఒక అస్పష్టమైన నోటీసుతో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం చట్టపరిధిని మించిన చర్య’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
కాపు యువకుడిది లాకప్ డెత్తేనా!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు, చినబాబు రెడ్‌బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న.. కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా? లాకప్‌లో చంపేశారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా ఎత్తుచికెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతుండగా, అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో, లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛలను కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వలేకపోతే, సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు? సమాధానాలు లేని ప్రశ్నలు ఈ వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూకీ కనుగొని తన ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లే సాయికృష్ణ వారి అదుపులో లేకపోతే, అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడు? అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా అలాగే పోలీసు శాఖపైనా ఉంది. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీలోపు తన ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది. స్వతంత్ర విచారణకు ఆదేశించాలి చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తోందన్నది ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారనే అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసర పరిష్కారంగా ‘హెబియస్ కార్పస్ పిటిషన్’ను తన ప్రజల ముందు ఉంచింది. అలాంటి పరిస్థితి ఏర్పడటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక హెచ్చరికగా చూడాలి. ఇలాంటి పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ సమస్య ఒక్క సాయికృష్ణ గురించే కాదు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఎలా అమలవుతోంది? పోలీసుల చర్యలపై పర్యవేక్షణ ఎంత సమర్థంగా ఉంది? పౌర హక్కులకు ఎంత విలువ ఇస్తున్నారు? అనే తీవ్ర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పోలీసు శాఖ చట్టానికి మాత్రమే విధేయంగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆచూకీపై హైకోర్టు పదేపదే జోక్యం చేసుకోవాల్సి రావడం పరిపాలనా వైఫల్యంగా కనిపిస్తోంది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు త్వరితగతిన, విశ్వసనీయ సమాధానం రాకపోతే, ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మరింత తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. సీఐ బెదిరించారంటున్న తల్లి ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’ అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9, 10 తేదీలలో మార్కాపురం నుండి తన కుమారుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఎవరికి చెప్పకుండా స్టేషన్‌కు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రతికి ఉంటే కోర్టుముందు హాజరుపరచండి.. లేదంటే మృతదేహాన్ని అప్పగించండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతుండడం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.ఈ విషయమై ఆమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవహక్కుల కమిటీ చైర్మన్‌ను సంప్రదించి, తనకు న్యాయం చేయాలని అర్థించారు. ‘మే నెలలో కృష్ణలంక పోలీసులు నా ఇంటివద్దకు వచ్చారు. సీఐ పోలీసుస్టేషన్‌కు రమ్మంటున్నారంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నా సెల్‌ఫోన్‌ను లాక్కొని, కొద్దిరోజులు వారి వద్దే ఉంచుకొన్నారు. ఫోన్‌ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా, రోజుల తరబడి తిప్పించుకొన్నారే తప్ప తిరిగి ఇవ్వలేదు’అంటూ ఆమె చెబుతున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల అరాచకాన్ని కళ్లకు కడుతోంది. తన కొడుకును చంపేసి ఉంటారని ఆమె హైకోర్టు ధర్మాసనం సాక్షిగా ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘నా కొడుకును చంపేశారేమోనని చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి కూడా వెళ్లి చూశా’ అన్న ఆమె ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సాయికృష్ణను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందేకృష్ణలంక పోలీసులకు 29 వరకు గడువు పొడిగించిన హైకోర్టువిజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, పోలీసులు చంపేసి ఉంటారన్న అనుమానాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేశారు.సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29 వతేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కొంత కాలంగా మార్కాపురంలో ఉంటున్నాడు.అయితే పలు కేసులు ఉన్నాయన్న కారణంతో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఇటీవల మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారని, ఆ తరువాత నుంచి ఆచూకీ తెలియడంలేదని, తన కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ నెల 15న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.సోమవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీపీ కృష్ణ ప్రణీత్ వాదనలు వినిపిస్తూ, సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని, అందుకే అతడిని కోర్టు ముందు హాజరుపరచలేదని తెలిపారు. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరింత సమయం కావాలని కోరారు. విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. -
సాయికృష్ణ బతికే ఉన్నాడా?.. లేదంటే చంపేశారా?
సాక్షి,విజయవాడ: నెల రోజుల క్రితం ఆచూకీ గల్లంతయిన గాదె సాయి కృష్ణ కేసుపై ఏపీ హైకోర్టులో ఈవాళ విచారణ జరిగింది. విచారణలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29లోగా బాధితుణ్ని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. నెల రోజుల క్రితం ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో ఆమె న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల (మే)9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.తన సెల్‌ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశించింది. -
ఏపీ హైకోర్టులో సాయికృష్ణ తల్లి.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
-
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ప్రభుత్వాల విధి
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల విధి అని హైకోర్టు పేర్కొంది. ఈ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు తమను తాము సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకోలేవని స్పష్టంచేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనమన్నది జీవించే హక్కులో భాగమని తేల్చి చెప్పింది. రోడ్ల పక్కన తగినన్ని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం వల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ఉండే భయాలను తొలగించినట్లవుతుందని పేర్కొంది.అయితే పబ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదని, ఏడాది పొడవునా వాటిని సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని ఉద్ఘాటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక వ్యాజ్యంలో తీర్పు వెలువరించారు.విశాఖపట్నం, పిఠాపురం కాలనీలో, మద్దిలపాలెం బస్‌డిపో సమీపంలో తమ ఇళ్ల ఎదురుగా ఉన్న జీవీఎంసీ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కె.చిన్నస్వామి శెట్టి మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపితే ఆ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చునని పిటిషనర్లకు సూచించారు. -
ఆస్తి యాజమాన్య హక్కులను గ్రామ పంచాయతీలు తేల్చలేవు
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ అనుమతుల మంజూరు విషయంలో గ్రామ పంచాయతీల అధికారంపై హైకోర్టు ముఖ్యమైన తీర్పును వెలువరించింది. అనుమతుల విషయంలో గ్రామ పంచాయతీలు సివిల్ కోర్టులాగా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లీగల్ నోటీసులను సాకుగా చూపి భవన నిర్మాణ దరఖాస్తులను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, ఆ అధికారం గ్రామపంచాయతీలకు లేదని తేల్చిచెప్పింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసేటప్పుడు స్థానికసంస్థలు కేవలం దరఖాస్తుదారుడి ప్రాథమిక హక్కులను, ఆ ఆస్తి దరఖాస్తుదారుడి స్వాధీనంలో ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలించాలంది. అంతేగానీ సివిల్ కోర్టుల్లా యాజమాన్య హక్కులను తేల్చే అధికారం వాటికి లేదని తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి పంపిన లీగల్ నోటీసు ఆధారంగా ఓ భవననిర్మాణ అనుమతిని రద్దుచేస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తీర్మానం ఏకపక్షంగా ఉందంటూ దాన్ని రద్దుచేసింది. పిటిషనర్ జమాల్‌రెడ్డి వద్ద రిజిస్టర్డ్ సేల్‌డీడ్, ఇంటిపన్ను చెల్లించిన రశీదులున్నాయని, ఇవి ఆయనకు ఆ ఆస్తిపై ఉన్న ప్రాథమిక హక్కును నిరూపిస్తున్నాయని తెలిపింది. పిటిషనర్ ప్రస్తుతం భవనం నిర్మిస్తున్న చోటే నివాసం ఉన్నారని గుర్తుచేసింది. పిటిషనర్ నివాసం, పన్నులు చెల్లించిన విషయంతో పంచాయతీ అధికారులు విభేదించడంలేదని, ఇది అతడి ప్రాథమిక హక్కులను రూఢీ చేస్తోందని పేర్కొంది. భవననిర్మాణం కోసం జమాల్‌రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట నిబంధనల ప్రకారం పునఃపరిశీలించి 15 రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని పంచాయతీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ‘భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించిన పంచాయతీ తీర్మానంపై పిటిషనర్‌కు ప్రభుత్వం వద్ద అప్పీల్ చేసుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. అయితే పంచాయతీ నిర్ణయం ఏకపక్షంగా ఉన్నందున ఈ కోర్టే నేరుగా జోక్యం చేసుకుంటోంది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.అనుమతి నిరాకరణపై హైకోర్టులో పిటిషన్ కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన కాంటారెడ్డి జమాల్‌రెడ్డి 2009లో కొన్న స్థలంలో మట్టి ఇల్లు నిర్మించుకుని, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆయన మట్టి ఇంటిని కూల్చేసి భవనం నిర్మించుకోవాలనుకున్నారు. ఆ ఆస్తిపై యాజమాన్య వివాదం ఉందంటూ.. జమాల్‌రెడ్డికి ఆ స్థలం విక్రయించిన వ్యక్తి వారసులు పంచాయతీ కార్యదర్శికి లీగల్ నోటీసు పంపారు. ఈ లీగల్ నోటీసు ఆధారంగా గ్రామ పంచాయతీ 2025 డిసెంబర్ 24న జమాల్‌రెడ్డి ఇంటి నిర్మాణానికి అనుమతిని నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ జమాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. అనుమతుల వల్ల కొత్త హక్కులు రావు.. ఉన్నవి పోవు.. ‘భవననిర్మాణ అనుమతి ఇవ్వడం అనేది ఒక వ్యక్తికి కొత్తగా యాజమాన్య హక్కులను కల్పించదు. అలాగే మరొకరికున్న హక్కులను లాగేసుకోదు. ఒకవేళ ఆస్తిపై ఎవరికైనా నిజమైన అభ్యంతరాలుంటే వారు సివిల్ కోర్టును ఆశ్రయించి తేల్చుకోవాలి. అంతేతప్ప పంచాయతీలు సివిల్ కోర్టుల పరిధిని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ కేసులో జమాల్‌రెడ్డి స్థలం యాజమాన్యపు హక్కులపై అభ్యంతరం వ్యక్తం చేసినవారు కేవలం లీగల్ నోటీసు ఇచ్చారే తప్ప, ఇప్పటివరకు సివిల్ కోర్టులో కేసు దాఖలు చేయలేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
మైనర్ల పాస్‌పోర్ట్‌పై ఒంటరి తల్లికి ఊరట
సాక్షి, అమరావతి: మైనర్ బిడ్డల పాస్‌పోర్ట్ విషయంలో ఇబ్బందులు పడుతున్న ఒంటరి తల్లులకు ఊరటనిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త సమ్మతి లేదా సంతకం లేకుండానే మైనర్ల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే పూర్తి హక్కు ఒంటరి తల్లికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా కోర్టు నుండి లేదా సమర్థ అధికారి నుంచి ఎటువంటి నిషేధాజ్ఞలు లేని సందర్భాల్లో తండ్రి సమ్మతి లేకుండా, కేవలం తల్లి సమర్పించిన దరఖాస్తు ఆధారంగా మైనర్ బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేయవచ్చా.. లేదా? అన్న ప్రశ్నకు హైకోర్టు ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. పిటిషనర్ కుమార్తె పాస్‌పోర్ట్ దరఖాస్తును పరిశీలించి, రెండు వారాల్లో పాస్‌పోర్ట్ జారీ చేయాలని ఈ వ్యాజ్యంలో విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. సదరు ఒంటరి తల్లి ఇప్పటికే దరఖాస్తుతో పాటు చట్ట నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన ’అనెక్సర్–సి’, ’అనెక్సర్–డి’ పత్రాలను సమర్పించారని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని కూడా తెలియజేశారని, ఈ నేపథ్యంలో విడాకుల పత్రాల కోసం పాస్‌పోర్ట్ అధికారులు పట్టుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో తన 4 ఏళ్ల కుమార్తెకు పాస్‌పోర్ట్ కోసం ఒక మహిళ గత ఏడాది ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్ అధికారులు ఆమె భర్త సంతకం లేదా కోర్టు నుండి విడాకులు/న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని మౌఖికంగా ఒత్తిడి చేస్తూ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను నిలిపివేశారు. దీనిని సవాలు చేస్తూ షేక్ షబానా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
స్క్వేర్ ఫీటు.. ‘హై’రేటు
సాక్షి, అమరావతి: రాజధానిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) ప్రాంతంలో ‘ఎఫ్’ బ్లాక్‌లో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రూఫ్‌టాప్ ఎలివేషన్ కోసం ప్రీకాస్ట్ పిన్స్ నిర్మాణం, ఆ భవనం వెలుపల పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్, అంతర్గత రోడ్డు, సబ్‌స్టేషన్, వాటర్ బాడీస్ వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మరో రూ.547.07 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను డిజైన్, బిల్డ్ లంప్సమ్ విధానంలో టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అనుమతిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,978లకు చేరింది. హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు(బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ డిజైన్‌ను పోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థ రూపొందించింది. రూ.924.69 కోట్ల నుంచి రూ.2,027.76 కోట్లకు..హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.ఇక ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ(హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ(సీసీ టీవీ, ఫైర్ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.547.07 కోట్ల మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. సుప్రీం కోర్టుకు కొత్తగా 86,500 చదరపు మీటర్లు(9,31,078.25 చదరపు అడుగులు)లో రూ.800 కోట్ల వ్యయంతో అదనపు భవనం నిర్మిస్తున్నారు. అంటే.. సుప్రీం కోర్టు కొత్త భవనం కంటే 11,01,152.75 (రెట్టింపు) చదరపు అడుగులు ఎక్కువ నిర్మిత ప్రాంతంతో హైకోర్టు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కేసులు సుప్రీం కోర్టులో విచారణకు వస్తాయి. అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్లతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఎంతకు చేరుతుందో? రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయంతో ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చునని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్‌తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి 4,500కు మించదని గుర్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణంలో దుబారా చేస్తూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
సోషల్ మీడియా పోస్టును అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా?
ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే.. కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే కచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్ప నిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకు పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. – హైకోర్టుసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా.. ఆ పోస్టు దేనికి సంబంధించిందన్న దాంతో నిమిత్తం లేకుండా దానిని అల్లర్లను ప్రేరేపించే తీవ్రమైన నేరంగా పోలీసులు చిత్రీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే, కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకూ పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. ఒక సమూహంలో ఉన్నంత మాత్రాన లేదా ఒక నిర్దిష్ట గ్రూపుతో సంబంధం ఉన్నంత మాత్రాన, ఆ గ్రూపు చేసే ప్రతి తప్పును వ్యక్తిగతంగా ఒకరికి ఆపాదించలేం. నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేనప్పుడు, కేవలం సదరు వ్యక్తులతో పరిచయం ఉందనే నెపంతో ఎవరినీ దోషిగా నిలబెట్టలేం’, అని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు, మాగల్లు గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై ఐపీసీ సెక్షన్ 153 కింద నమోదు చేసిన కేసును కొట్టేసింది. అయితే ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 120బీ, 505 (2), ఐటీ చట్టం సెక్షన్ 66 కింద జరిగే విచారణలో (ప్రొసీడింగ్స్) జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. -
గోప్యత హక్కు పేరుతో నేరస్తులు తప్పించుకోలేరు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ ద్వారా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఒకరి భూమిని మరొకరికి విక్రయించిన వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సదరు నకిలీ ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్, ఇతర అనుమతించదగిన వివరాలను పోలీసులకు అందచేయాలని ఆధార్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత గోప్యత పేరుతో నేరగాళ్లు చట్టం నుండి తప్పించుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ చట్టం–2016 సెక్షన్ 33(1) ప్రకారం సమాచారాన్ని బహిర్గతం చేయడంపై సంపూర్ణ నిషేధం లేదని హైకోర్టు గుర్తు చేసింది. ‘సాధారణంగా ఒకరి ఆధార్ వివరాలను మరొకరికి ఇవ్వడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుంది. కానీ ఈ కేసులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది.వివాదంలో ఉన్న ‘ఆధార్ కార్డు’ స్వయంగా అప్పీలుదారు పేరుతోనే జారీ అయింది. ఎవరో ఒక అపరిచిత మూడో వ్యక్తి తన పేరుతో నకిలీ కార్డు సృష్టించి మోసానికి పాల్పడ్డారని అప్పీలుదారు వాదిస్తున్నారు. అప్పీలుదారు తన స్వంత పేరు, గుర్తింపుతో ముడిపడి ఉన్న సమాచారాన్ని మాత్రమే కోరుతున్నారు కాబట్టి.. ఇక్కడ వేరొకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశమే లేదు.’ అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి భూమి అమ్మేసిన ఆగంతకుడు... విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 156/1 , 157/11లో 1.99.5 ఎకరాల భూమికి ఏలప్రోలు సీతారామాంజనేయులు యజమాని. అయితే ఒక గుర్తుతెలియని వ్యక్తి సీతారామాంజనేయులు పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించి, తానే సీతారామాంజనేయులనంటూ 2021లో రెండు వేర్వేరు సేల్ డీడ్ల ద్వారా ఈ భూమిని ఇతరులకు అక్రమంగా అమ్మేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు నమోదయ్యింది. దీనిపై విశాఖపట్నం జిల్లా కోర్టులో దావా కూడా దాఖలయ్యింది. విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్, తనిఖీలు చేపట్టి నకిలీ సేల్ డీడ్లను రద్దు చేస్తూ 2021న ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, పోలీసుల దర్యాప్తులో భాగంగా సదరు నకిలీ ఆధార్ కార్డును సృష్టించిన వ్యక్తి అసలు వివరాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడానికి బాధితుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, చట్టంలోని సెక్షన్ 8 (1)(జే) ప్రకారం మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమంటూ ఆధార్ యంత్రాంగం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అటు పోలీసులు కూడా ఈ వివరాలు సేకరించడంలో చొరవ చూపకపోవడంతో, బాధితుడు సీతారామాంజనేయులు 2025లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో, సీతారామాంజనేయులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. -
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
సాక్షి, అమరావతి: రేయింబవళ్లు కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికి ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం! మళ్లీ నోటిఫికేషన్ నాటికి వయసు ఉంటుందో మీరిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సీ–2025లో కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగాలను పలువురికి ఇచ్చేదిలేదు పొమ్మంది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పటికే నియామకాలు జరిగి పోయాయని చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపోయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించగా, సర్కారు వాటినీ పెడచెవిన పెట్టింది. దాంతో అధికారులను ఇంప్లీడ్ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా దాదాపు 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీని ఎంత పారదర్శకంగా, ఘనంగా ఎలా చేపట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించామని సర్కారు పెద్దలు గొప్పలు చెబుతున్నా, తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపికప్రక్రియ పూర్తయిపోయిందని చెబుతున్న ప్రభుత్వం.. నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఆదిలోనే మెరిట్‌కు పాతర గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు వారి వారి అర్హతలను బట్టి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభగల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల్లో రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. వీటిల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ప్రాధాన్యక్రమంలో ఉంటాయి. ఒక ఎస్జీటీ 20 ఏళ్లకు పైగా పని చేసి, అర్హత సంపాదిస్తే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. ఈ క్రమంలో రెండు లేదా మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత ఉద్యోగం పొందాలనే కోరుకుంటారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మంది డీఎస్సీ అభ్యర్థులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025), కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని తిరస్కరించిన ఘటనలో ఏఎస్సార్ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ 3470/25 వివరాలు సర్కారు తీరుపై న్యాయస్థానం ఆగ్రహండీఎస్సీలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా, ఆప్షన్ ఇవ్వలేదన్న కారణంతో 54 మందిని ఎస్జీటీలుగా పరిగణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం విద్యా శాఖ తీరును తప్పుబట్టింది. విద్య, వైద్యంలో మెరిట్‌ను కాదని, కింది వారికి అవకాశం ఇస్తే ఆ దేశం నాశనం అవుతుందని తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ, కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15 నాటికి డీఎస్సీ ఎంపిక, పోస్టింగ్స్ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలిపింది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది వారి స్థానాల్లో వేరే వారిని నియమించామని చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తమ మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మీకు తోచిన సమాధానం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. రెండు నెలల్లోగా వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని జనవరిలోనే తీర్పునిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధితులు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిపోయిందని, కొత్తగా ఎవరికీ ఉద్యోగాలు ఇచ్చేది లేదని అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ బెదరింపు ధోరణి ప్రదర్శించినట్టు బాధితులు వాపోయారు.తప్పుపై తప్పులకు నిదర్శనాలెన్నెన్నో..⇒ 200 మందికి పైగా అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.⇒ డీఎస్సీలో మెరిట్ సాధించినా పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేక పోవడంతో వారికి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025) వేశారు. ఇందులో డీఎస్సీ నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజును ప్రధాన ప్రతివాదిగా చేర్చారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ (4261/25), బి.సరస్వతి (3585/25), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రాయల్ (3130/ 25) స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు (స్పోర్ట్స్ కోటా) ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించి తమ తప్పులేదని నిరూపించుకున్నారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్ (1347/26) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినా మెరిట్ కం రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. తమకు అన్యాయం జరిగిందని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, వారికి పోస్టు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (3470/25) ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా, కుల ధ్రువీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దాంతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల కమిటీని వేసి దుర్గాప్రసాద్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ సరైనదేనని నిర్ధారించారు. కానీ, అతనికి పోస్టు ఇవ్వలేదు. ఇదే కోవలో తిరుపతి జిల్లాకు చెందిన ఎ.శిరీష (3060/25) ఉద్యోగాన్ని కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ అని తిరస్కరించారు. ఆమె కూడా తన సర్టిఫికెట్ సరైనదేనని నిరూపించుకున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.⇒ గుంటూరుకు చెందిన జి.రాజేశ్ దినకర్ (1335/26) ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ ‘ఫేక్’ అని ఎస్ఏ పోస్టు తిరస్కరించారు. దాంతో మరోసారి గుంటూరు వైద్యుల కమిటీ ముందు హాజరై సచ్చీలతను నిరూపించుకున్నారు. సదరం సర్టిఫికెట్ సరైనదేనని ధ్రువీకరించినా పోస్టు ఇవ్వలేదు. -
ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఓ గిరిజన యువకుడు చేసిన 13 ఏళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. అతడికి కానిస్టేబుల్‌గా ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసు ఉందన్న విషయాన్ని దాచిపెట్టాడన్న కారణంతో ఆ గిరిజన యువకుడికి ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సమాజంలోని ఉన్నతవర్గాల వారు ఎన్నో క్రిమినల్ కేసులున్నా దేశంలో అత్యున్నత పదవులకు పోటీపడుతున్నప్పుడు.. ఒక పేద గిరిజన యువకుడికి చిన్న సంఘటన ఆధారంగా ఉద్యోగం నిరాకరించడం అన్యాయమని పేర్కొంది. ఇలా సమాజంలో వెనుకబడిన యువతకు అవకాశాలు నిరాకరిస్తే, వారు అసాంఘిక శక్తుల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యువత చేసిన చిన్న తప్పులకు వారిని జీవితాంతం శిక్షించకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తుచేసింది. వాస్తవం చెప్పకపోవడాన్ని ఆటోమేటిక్ అనర్హతగా కూడా పరిగణించరాదంది. పిటిషనరయిన గిరిజన యువకుడిపై నమోదైంది హత్య, దోపిడీ లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరం కాదని, కేవలం గ్రామంలో జరిగిన ఒక చిన్న ఘర్షణ అని, అందులోనూ అతను 13వ నిందితుడని పేర్కొంది. ఈ కేసు మినహా అతడిపై అంతకు ముందుగానీ, తర్వాతగానీ ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని గుర్తుచేసింది. గ్రామీణ గిరిజన ప్రాంతానికి చెందిన పిటిషనర్.. ఉద్యోగం పోతుందనే అమాయకత్వపు భయంతోనే తనపై కేసు నమోదైన సమాచారాన్ని దాచిపెట్టాడే తప్ప, అందులో ఎటువంటి దురుద్దేశం లేదని పేర్కొంది. సమాచారం దాచిపెట్టిన ప్రతి సందర్భాన్ని ఘోర తప్పిదంగా భావించి ఉద్యోగాన్ని యాంత్రికంగా రద్దుచేయడం చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసింది. అధికారులు విచక్షణతో, కేసు తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవాలంది. పిటిషనర్ ఎంపిక రద్దును చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా పరిగణిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అలాగే పిటిషనర్ ఎంపికను రద్దుచేస్తూ అధికారులు 2011, 2014 సంవత్సరాల్లో జారీచేసిన రెండు మెమోలను రద్దుచేసింది. తీర్పు వచ్చిన రోజు నుంచి నాలుగు వారాల్లో పిటిషనర్‌ను పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులోకి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్‌కు వేతన సదుపాయాలు, సీనియారిటీ, ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేందు శమంతో ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. పెంచలయ్య నిర్దోషి అని కోర్టు చెప్పినా.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళేనికి చెందిన గిరిజన యువకుడు దొడ్ల పెంచలయ్య 2008లో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగానికి తాత్కాలికంగా ఎంపికయ్యారు. గ్రామంలో రాజకీయ కారణాల వల్ల 2010లో పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత పోలీసులు ఎంపికయిన అభ్యర్థుల పూర్వ చరిత్రను పరిశీలించే సమయంలో పెంచలయ్యపై కేసు గురించి తెలిసింది. దీంతో పోలీసులు పెంచలయ్య నియామకాన్ని రద్దుచేస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై 2013లో పెంచలయ్య న్యాయపోరాటం ప్రారంభించారు. తొలుత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండగానే పెంచలయ్యపై నమోదైన కేసును కింది కోర్టు కొట్టేసింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ మాత్రం పెంచలయ్య పిటిషన్‌ను కొట్టేసింది. అటు తరువాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సైతం పెంచలయ్యకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి న్యాయం చేసింది. -
మీరు కొట్టకపోతే.. గాయాలు ఎలా అవుతాయి?
సాక్షి, అమరావతి: ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే పోలీసులు అతని తండ్రిని స్టేషన్‌కు తీసుకెళ్లి హింసించి తీవ్రంగా కొట్టిన ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీ వేజెండ్ల అజితతో పాటు గూడూరు గ్రామీణ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టు ముందు హాజరైన నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసులను నిలదీసింది. నిందితుడైన కొడుకును పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాలేదన్న కారణంతో తండ్రిని ఎలా కొడతారని ప్రశి్నంచింది. కొట్టలేదని కోర్టు హాలులో ఉన్న పోలీసులు చెప్పగా, మీరు కొట్టకుంటే ఆయనకు తీవ్ర గాయాలు ఎలా అవుతాయని కోర్టు నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి మెడమల్లి బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హింసించి, వేధించి కొట్టారనేందుకు ఆధారాలున్నాయన్న హైకోర్టు నెల్లూరు జిల్లా మంగళపూరు గ్రామానికి చెందిన రోజూ వారీ కూలీ, దళితుడు అయిన గడుతోటి పోలయ్య కుమారుడు ఓ కేసులో నిందితుడు. అయితే గూడూరు గ్రామీణ పోలీసులు పోలయ్యను తీసుకెళ్లి హింసించి, వేధించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల దెబ్బల వల్ల పోలయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని, వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై దాడిని దృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది.ఈ దాష్టీకంపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ అజితతో సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నాల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచి్చంది. కోర్టు ఆదేశాల మేరకు వీరు వ్యక్తిగతంగా గురువారం కోర్టు ముందు హాజరయ్యారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వీ.సురేంద్రరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. -
కొడుకు నిందితుడైతే..తండ్రిని హింసిస్తారా?
సాక్షి, అమరావతి : ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రోజూవారి కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరఫున న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయిన గాయాల తాలుకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికల్లో వచి్చన కథనాలను కూడా కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. పక్కా ఆధారాలు ఉన్నాయి.. పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై జరిగిన దాడిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాషీ్టకానికి పాల్పడి, పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నా ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులకు చెంపపెట్టు లాంటిదిఅధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసే పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయపోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చచొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి -
పోలీసుల అరాచకాలకు ఆ హోటల్ అడ్డా!
సాక్షి, అమరావతి: విజయవాడ పటమట పోలీసులు.. పోలీస్‌స్టేషన్ సమీపంలోని ప్రైవేట్ హోటల్ ‘కార్తికేయ ప్రైడ్’ను అడ్డాగా చేసుకుని దందాలు చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 70 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. అనధికారికంగా హోటల్‌ను పోలీస్ స్టేషన్‌గా ఉపయోగిస్తూ వ్యక్తులను ఆ హోటల్‌కి తీసుకెళ్లి నిర్బంధించడం, కొట్టడం, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకోవడం.. సివిల్, ఆస్తి వివాదాల బలవంతపు రాజీలు చేస్తుండటం, చట్ట విరుద్ధంగా కాల్ డీటెయిల్ రికార్డులు సేకరించడం.. అనుమతి లేకుండా డిజిటల్ సర్వైలెన్స్ చేస్తుండటం వంటి పిటిషన్‌లోని ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీస్‌స్టేషన్, ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీల మొత్తాన్ని భద్రపరచాలని పటమట పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారుల ప్రమేయం పల్నాడు జిల్లా, అందుకూరు గ్రామానికి చెందిన కర్నాటి వీరభద్రరావు హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నేకంటి మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ కార్తికేయ ప్రైడ్ హోటల్లో పోలీసుల సెటిల్మెంట్లన్నీ కూడా విజయవాడ అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్‌బీఎం మురళీకృష్ణ, పటమట సీఐ పవన్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. పిటిషనర్ వీరభద్రరావును సైతం పోలీసులు ఇదే రీతిలో కార్తికేయ ప్రైడ్ హోటల్లో నిర్బంధించి, కొట్టి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు.వాస్తవాలు తెలియాలంటే పటమట పోలీస్‌స్టేషన్‌తో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, ఈ పిల్‌కు విచారణార్హత లేదన్నారు. ఇవే అభ్యర్థనలతో పిటిషనర్ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.పటమట పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలు తెప్పించుకుని కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ మేజి్రస్టేట్ ముందు కూడా ఇవే విషయాలను చెప్పారని గుర్తు చేస్తూ.. వాస్తవాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. -
జగన్ విజన్ పర్ఫెక్ట్.. బాబుకు హైకోర్టు షాక్..
-
వెంకటరామిరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు?
సాక్షి, అమరావతి: తనను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కాకర్ల వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వెంకటరామిరెడ్డి డిస్మిస్ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ కమ్ విచారణాధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్మిస్ ఉత్తర్వుల రద్దుకు పిటిషన్... తనను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు తక్షణం వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వెంకట రామిరెడ్డి తరఫున న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలతో వెంకటరామిరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది.పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషనర్‌పై అభియోగాలు మోపారు. పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన నాలుగు కేసులను కూడా తన డిస్మిస్ ఉత్తర్వులకు కారణంగా ప్రభుత్వం చూపింది. ఆ ఆరోపణలన్నింటిపై పిటిషనర్ ఇచ్చిన వివరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విచారణాధికారి నిబంధనలు నిర్దేశించిన మేర విచారణ జరపలేదు. అభియోగాలను నిరూపించేందుకు సాక్షులను సైతం విచారించలేదు. ఆధారాలు లేకుండా విచారణాధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పిటిషనర్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది’’ అని వివరించారు. -
ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఇంగ్లిష్ అనేది అందరినీ ఏకం చేసే ఒక అంశమని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాలలోకి విస్తరించడానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనంది. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు తగిన అవకాశాలు దొరక్క పోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భాషగా ఇంగ్లిష్ ఉంటుందంటూ గత నెల 16న విద్యా శాఖ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను బోధన భాషగా చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ఇదే హైకోర్టు కొట్టేసిందన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లిష్‌ను బోధనా భాషగా చేస్తూ గత నెల 16న ప్రొసీడింగ్స్ జారీ చేసిందని వివరించారు.పొరపాటు జరిగింది.. సవరించాంవిద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. బోధన భాషగా ఇంగ్లిష్‌ను పొరపాటున పేర్కొన్నామని, అందువల్ల ఆ ప్రొసీడింగ్స్‌ను సవరించామని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ద్విభాషా విధానం (తెలుగు, ఇంగ్లిష్) అమల్లో ఉంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇక ఈ వ్యాజ్యం నిరర్థకమని, ఇందులో విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. -
యువ లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. వీడియో వైరల్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ యువ న్యాయవాదిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్‌రావు.. ఓ యువ న్యాయవాది చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా పోలీసు కస్టడీకి పంపాలంటూ ఆదేశించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బీసీఐ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌కు లేఖ రాసినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది. ఆ యువ న్యాయవాది చేతులు జోడించి సారీ.. క్షమించాలంటూ వేడుకుంటుండగా.. న్యాయమూర్తి ఆగ్రహంతో పోలీసులను చర్య తీసుకోవాలని ఆదేశిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.. ఆ కస్టడీ ఉత్తర్వు అమలులోకి రాకముందే బార్ అసోసియేషన్ జోక్యంతో దానిని ఉపసంహరించుకున్నారు.Bar Council of India writes to CJI against over Andhra Pradesh High Court judge who sent lawyer to police custody pic.twitter.com/OVS9uPhVuU— Bar and Bench (@barandbench) May 6, 2026ఇది యువ న్యాయవాదులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అన్నారు. చివరికి బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.What on earth is this?!! Is there something we are missing, that this lawyer could actually be arrested?? The Bar is due a fuller report. To start with. https://t.co/GU7N5Xur0t— Karuna Nundy (@karunanundy) May 6, 2026 -
హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఈమేరకు తీర్మానం చేసింది. ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసింది. గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. పురుషోత్తంకుమార్ ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. సుప్రీంకోర్టు సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత సంబంధిత ఫైలు ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది.గంధం సునీత...గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్థానిక ఎస్‌డీఎన్‌ఎస్‌డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్ఎల్బీ చేసి టాపర్‌గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 వరకు హైకోర్టు రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు.ఆలపాటి గిరిధర్...ప్రకాశం జిల్లా కొండేపి మండలం గోగినేనివారిపాలెంలో జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గిరిధర్ ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తరువాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నంలో ప్రధాన జిల్లా జడ్జిగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చింతలపూడి పురుషోత్తం కుమార్విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి కాగా ఆ కుటుంబంలో మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర వర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అటు తరువాత వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
ఆకివీడు రామాలయ అనుమతులపై పిటిషన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగా జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వివరించారు.ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ సోమవారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముందు ప్రస్తావించారు. లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్‌లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ లీసా గిల్ చేత గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు జస్టిస్ లీసా గిల్ కుటుంబ సభ్యులు, పంజాబ్–హరియాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభంలో జస్టిస్ లీసా గిల్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ లీసా గిల్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, పలువురు న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.త్వరలోనే పదోన్నతిపై సుప్రీంకోర్టుకి...ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి. పంజాబ్–హరియాణ కోటాలో జస్టిస్ లీసా గిల్ రానున్న మూడు, నాలుగు నెలల్లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఆమె న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి కేసులను విచారిస్తారు -
మీకు సిగ్గనిపించడం లేదా? పోలీసులకు హైకోర్టు చీవాట్లు
-
భర్త బాగోగులు చూడటంలో భార్యను మించినవారుండరు..
సాక్షి, అమరావతి: కోమాలో ఉన్న భర్తను బతికించుకునేందుకు ఓ భార్య చేసిన న్యాయ పోరాటం ఫలించింది. భర్త చికిత్స కోసం ఆయన ఖాతాలో ఉన్న డబ్బు విత్‌డ్రా చేసేందుకు ఆమెకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ‘భర్త కోమాలో ఉన్నప్పుడు, ఆయన సంక్షేమాన్ని చూసుకోవడానికి భార్య కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు. మన పురాణాలు సైతం భార్యను భర్తలో సగంగా భావించి, భార్యను అర్ధాంగిని చేశాయి’ అని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన సింగవరం నాగమ్మ భర్త సింగవరం సుభాన్ సింగ్ అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. వైద్య ఖర్చుల కోసం ఆయన ఖాతా నుంచి రూ.14.38 లక్షలు విత్‌డ్రా చేసేందుకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్‌ను నాగమ్మ అభ్యర్థించారు. అయితే దీనికి బ్యాంక్ తిరస్కరించింది. విధి లేని పరిస్థితుల్లో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భర్త చికిత్స నిమిత్తం తమ వద్ద డబ్బు లేదని, ఖాతాలో ఉన్న రూ.14 లక్షలే తమకు దిక్కని ఆమె హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. సంరక్షకుల నియామకం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దీనిపై సివిల్ కోర్టును ఆశ్రయించడమే మార్గమని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోమాలో ఉన్న వ్యక్తుల సంరక్షణ విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు లేనందున ఈ కేసులో హైకోర్టుకున్న అసాధారణ న్యాయపరిధిని ఉపయోగిస్తున్నామన్నారు. సుభాన్ సింగ్ బ్యాంకు ఖాతా నిర్వహణకు నాగమ్మను సంరక్షకురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు నాగమ్మకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్‌ని ఆదేశించారు. ఖాతా నిర్వహణ వివరాలను ప్రతీ మూడు నెలలకొకసారి హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపాలని నాగమ్మను ఆదేశించారు. -
మైనర్ బాలిక అత్యాచారం కేసు.. పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తెలుగుదేశం పార్టీ నేతను కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు సిగ్గు అనిపించట్లేదా? బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదారుడు స్పష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగించాలి. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిందన్న దానికి సంబంధించి 164 స్టేట్మెంట్ వాంగ్మూలాలు ఇతర ఆధారాలు ఉన్నాయని చెబితే దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి కేసు ఉపసంహరించుకోమని బెదిరిస్తారా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి. మీరు దర్యాప్తు సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదు కాబట్టే న్యాయం కోసం బాధితురాలు కోర్టుకు రావాల్సి వచ్చింది. మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే ఒకసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు చదవండి’ అంటూ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరణ సంతృప్తిగా లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే ఒకటో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. -
ఏపీ తొలి మహిళా సీజేకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు..: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెళ్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ (సీసీఎస్టీ) బాబు అహ్మద్ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం మరోసారి విచారణ జరిపారు. ‘ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరిని అవలంభించలేం. బాబు అహ్మద్ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు. ఆయన ప్రతీ నెలా 1వ తేదీన ఠంచనుగా జీతం తీసుకుంటున్నారు. మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్ చేసేవాళ్లం. అహ్మద్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, ఆధారాలుంటే ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాం’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పదోన్నతుల ఫైళ్లను తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? తొలుత విచారణ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ బాబు అహ్మద్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అహ్మద్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. పదోన్నతుల విషయంలో ప్యానల్ ఇయర్ ముగియడంతో తిరిగి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఎప్పుడో డీపీసీ పూర్తయితే ప్యానల్ ఇయర్ ముగిసేంత వరకు ఎందుకు పదోన్నతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందుకుగాను అహ్మద్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)నిసూటిగా ప్రశ్నించారు. పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను ఐఏఎస్ అధికారులు తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తేనే అన్నీ సర్దుకుంటాయన్నారు. గతంలో ఓ కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ధర్మాసనం ఇదే అహ్మద్‌ను భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిందని గుర్తు చేశారు. పదోన్నతుల విషయంలో గత డిసెంబర్లో ఈ కోర్టు ఆదేశాలిస్తే ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. -
పెద్దసంఖ్యలో జిల్లా జడ్జిల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. ఇటీవల సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) నుంచి అదనపు జిల్లా జడ్జిలుగా పదోన్నతులు పొందిన వారితో సహా మొత్తం 72 మందికి స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. వీరందరికీ హైకోర్టు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. మే 7వ తేదీ లోపు కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. రిలీవ్ అయ్యే లోపు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న తీర్పులను వెలువరించాలని కూడా స్పష్టం చేసింది. విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న ఎ.సత్యానంద్ ప్రకాశం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. అత్యంత కీలకమైన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఎల్.తేజోవతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఉన్న పి.భాస్కరరావు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా టి.రామచంద్రుడు నియమితులయ్యారు. గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్న జి.చక్రపాణి విశాఖపట్నం సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు. నెల్లూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.గీత, నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా బదిలీ అయ్యారు. విజయవాడ కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కె.రాధారత్నం నియమితులయ్యారు. -
జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసే వాళ్లం’ అని వ్యాఖ్యానించింది, -
హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గిల్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ గిల్ ప్రస్తుతం హైకోర్టులో నెంబర్ 2గా కొనసాగుతున్నారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గిల్.. గత నెల 6న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం జస్టిస్ గిల్‌ను సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న సీజేగా ఆమెతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
శ్రీహరి, గిరీష్ అరెస్ట్‌కు పోలీసుల యత్నాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్‌కుమార్‌రెడ్డి రిమాండ్‌ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసిన తరువాత కూడా వారి అరెస్ట్‌కు పోలీసులు ప్రయత్నాలు చేశారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అలా అయితే ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఆదేశించారు. దీనిపై ఈ నెల 29వ తేదీన పూర్తి స్థాయిలో వాదనలు వింటానని తెలిపారు. అప్పటి వరకైనా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్‌రెడ్డి అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘కుప్పం కోర్టు ఆదేశాల అమలును మాత్రమే నిలుపుదల చేశాం తప్ప, వాటిని రద్దు చేయలేదు. అందువల్ల శ్రీహరి, గిరీష్ లను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు’ అని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో శ్రీహరి, గిరీష్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవా లు చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణరావు కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. -
సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్ఓసీ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను రద్దు చేయాలని హైకోర్టు శుక్రవారం ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందిన వెంటనే ఎల్ఓసీ రద్దు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు ప్రయాణించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న, అనిశ్చితంగా ఉన్న కేసుల దర్యాప్తు పేరుతో భార్గవ్‌రెడ్డి హక్కులను హరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ భార్గవ్‌రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి భార్గవ్‌రెడ్డి ప్రయత్నించలేదు ‘సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెక్షన్ 35(3) నోటీసులిచ్చి, చట్ట ప్రకారం నడుచుకోవాలని 2025 మే 7న హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు ఈ రోజు వరకు భార్గవ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు. రికార్డులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే పిటిషనర్ భార్గవ్‌రెడ్డి దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి గానీ, కోర్టు పరిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. అందువల్ల, భార్గవ్‌రెడ్డి చట్టపరమైన ప్రక్రియల్లో పాల్గొనలేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు వాదించడం సమంజసం కాదు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భార్గవ్‌రెడ్డికి సెక్షన్ 35 (3) కింద నోటీసులు అందచేయాలి. దర్యాప్తునకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొంటూ భార్గవ్‌రెడ్డి డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు అఫిడవిట్లు దాఖలు చేయాలి. అనంతరం భార్గవ్‌రెడ్డిపై జారీ చేసిన ఎల్ఓసీ ఉపసంహరణకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు ఆదేశించింది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదుభారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) కింద ఉన్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ఇది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. గౌరవం, నైతికత, పరువు నష్టం, నేర ప్రేరేపణ వంటి అంశాల ఆధారంగా పరిమితులు ఉంటాయి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య కంటెంట్ వ్యక్తులకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ విధమైన కంటెంట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు లేదా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది, గోప్యతకు భంగం కలిగిస్తుంది. భావోద్వేగ పరమైన బాధను కలిగిస్తుంది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా వ్యక్తి ఏ విషయంపైనైనా, ప్రభుత్వ విధానాలపైనైనా తన అభిప్రాయాన్ని, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చు. అయితే, ఆ అభిప్రాయం మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధి విధానాలను కచ్చితంగా అనుసరిస్తూ, సమగ్రంగా, వేగంగా దర్యాప్తు జరపాలి. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నేరస్థులపై అభియోగాలు నమోదు చేసి చట్టం నిర్దేశించిన గడువులోపు చార్జ్‌షీట్ దాఖలు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య పోస్టులు పెట్టే వారు ఎవరైనా సరే లేదా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికంటే గొప్పది.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న స్పష్టమైన సందేశాన్ని పంపాలి. – సోషల్ మీడియాలో పోస్ట్‌లపై హైకోర్టు


