విజయవాడ: కృష్ణ జిల్లా పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌పై పెట్టిన కేసులో పోలీసులకు చుక్కెదురైంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కైలే అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ తరుఫు మనోహర్ రెడ్డి తన వాదనలు వినిపించారు.
మాజీ ఎమ్మెల్యే కైలేపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు.అనంతరం కైలే అనిల్‌పై నమోదైన సెక్షన్లను హైకోర్టు పరిశీలించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల చెల్లవని స్పష్టం చేసింది. మనోహర్ రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు..2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చెయ్యాలని పోలీసులుకి ఆదేశాలు జారీ చేసింది.


