జకార్తా: ఇండోనేసియాలోని ప్రధాన దీవి జావాలో జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున సెమరంగ్ నగరంలోని క్రప్యక్ టోల్ ప్లాజా సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఇండోనేషియాలో పురాతన నగరం యోగ్యకర్త నుంచి రాజధాని జకార్తాకు వస్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులున్నారు. వేగంగా వస్తున్న బస్సు మలుపులో అదుపుతప్పి కాంక్రీట్ గోడను ఢీకొని, పల్తీ కొట్టింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దాదాపు 40 నిమిషాలకు పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ప్రమాద తీవ్రతకు నుజ్జయిన బస్సులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 10 మంది తుదిశ్వాస విడిచారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగాను, మరో 13 మంది ఆందోళనకరంగాను ఉందని పోలీసులు తెలిపారు. బస్సును నడుపుతున్న అసిస్టెంట్ డ్రైవర్ కూడా క్షతగాత్రుల్లో ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚌 At least sixteen people were killed early Monday in a #bus accident at the intersection of the Krapyak toll exit in Semarang city, #Indonesia's Central Java province, local authorities reported. #BusAccident pic.twitter.com/v6gAj2medT
— A Ahmed (@_AAhmed004) December 22, 2025


