ఇండోనేషియాలో విమానం అదృశ్యం : శకలాలు లభ్యం | Indonesian ATR 42-500 goes missing near Makassar debris spotted | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో విమానం అదృశ్యం : శకలాలు లభ్యం

Jan 17 2026 6:28 PM | Updated on Jan 17 2026 6:52 PM

Indonesian ATR 42-500 goes missing near Makassar debris spotted

ఇండోనేషియాలోని మకాస్సర్ సమీపంలో అదృశ్యమైన ATR42-500 విమానం కూలిపోయిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సమీపంలోని పర్వతంపై ఈ విమాన శకలాలను గుర్తించినట్టు విమాన ట్రాకింగ్ డేటా, స్థానిక మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ATR 42-500 సముద్రంపై తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు రాడార్ నుండి అదృశ్యమైందని FlightRadar24 తెలిపింది. విమానం కనిపించకుండా పోయిందని, దానిచివరి సిగ్నల్ మకాస్సర్ విమానాశ్రయానికి ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ (12 మైళ్ళు) దూరంలో 04:20UTC వద్ద రికార్డ్ అయిందని, రాడార్‌ కవరేజ్‌ కూడా మిస్‌ అయిందని ఎక్స్‌లో  పోస్ట్ ద్వారా వెల్లడించింది.

 

స్థానిక  మీడియా కవరేజ్ ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి రూటింగ్ సూచనలు అందిన తర్వాత మకాస్సర్ విమానాశ్రయాన్ని సమీపిస్తున్నప్పుడు ATR 42‑500 రాడార్ నుండి అదృశ్యమైంది. విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు సహా 11 మంది ఉన్నారు. అయితే ఇండోనేషియా అధికారులు  ఈ ప్రమాద విషయాన్నిఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మకాస్సర్‌లోని ఇండోనేషియా శోధన మరియు రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషన్స్ హెడ్ ఆండి సుల్తాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపుతున్నట్లు చెప్పారు. విమానంలో ఉన్నవారి పరిస్థితి గురించి  ఎలాంటి సమాచారం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement