3 వేల అపార్ట్‌మెంట్లు… ఒకే భవంతిలో ఊరు! | World's longest residential building in Ukraine | Sakshi
Sakshi News home page

3 వేల అపార్ట్‌మెంట్లు… ఒకే భవంతిలో ఊరు!

Jan 11 2026 1:25 PM | Updated on Jan 11 2026 3:21 PM

World's longest residential building in Ukraine

నిర్మాణపరంగా అది ఒక భవంతి మాత్రమే! అయితే, దాని పరిమాణం ఒక ఊరంత ఉంటుంది. ఈ భవంతి పొడవు దాదాపుగా మూడు కిలోమీటర్లు. కచ్చితంగా చెప్పాలంటే, 2.75 కిలోమీటర్లు. ఇందులో ఒక చివరి నుంచి మరో చివరకు నడవాలంటే, కనీసం అరగంట పడుతుంది. ప్రపంచంలోనే అతి పొడవాటి నివాస భవనంగా పేరు పొందిన ఈ భవంతిలో దాదాపు పదివేల మంది నివాసం ఉంటారు. ఈ అరుదైన భవంతి ఉక్రెయిన్‌లోని లత్‌స్క్‌ నగరంలో ఉంది. 

ఉక్రెయిన్‌ ఇదివరకు సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న కాలంలో ఆర్‌.జి.మెతెల్‌నిత్‌స్కీ, వి.కె.మలోవిత్సా అనే ఆర్కిటెక్ట్‌లు ఈ సుదీర్ఘ భవంతి నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతి పొడవాటి చైనాగోడ స్ఫూర్తితో ఈ ఆర్కిటెక్ట్‌లు ఈ భవంతిని 1969లో నిర్మించారు. ఇందులో మూడువేల అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ భవంతి లోపలికి అడుగు పెడితే, ఒక చిన్న పట్టణంలోకి అడుగుపెట్టినట్లుగానే ఉంటుంది. ఇప్పటికీ దీనికి పోటీవచ్చే మరో కట్టడమేదీ ప్రపంచంలో లేకపోవడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement