మ్యాన్‌హోల్ మూతల దొంగలు.. పదేళ్లు జైలు, రూ.50 లక్షలు ఫైన్! | Pakisthan People Manhole Theft And CM Viral Video | Sakshi
Sakshi News home page

Manhole Theft: మ్యాన్‌హోల్ మూతలు మాయం.. దారుణ పరిస్థితి

Feb 7 2026 2:05 AM | Updated on Feb 7 2026 2:09 AM

Pakisthan People Manhole Theft And CM Viral Video

పొరుగు దేశం పాకిస్థాన్‌కి మ్యాన్‌హోల్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా కొత్తవి అమర్చగానే అలా మాయమైపోతున్నాయి. ఈ సమస్య ఎలా అరికట్టాలా అని ఆలోచించిన అక్కడి పంజాబ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పాక్‌లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అందులో భాగంగానే ఈ సమస్య ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది.

ముఖ్యమంత్రి మరియం నవాజ్ వైరల్ వీడియోలో.. 'ఉదయం మేం మూతలు వేస్తున్నాం. రాత్రి అయ్యేసరికి అవి మాయమవుతున్నాయి. వాటిని దొంగిలించొద్దు. అలా దొంగిలించి అమ్మినా, వాటిని కొన్నా పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. మూతలు లేని మ్యాన్‌హోల్‌లో పడి ఎవరైనా చనిపోతే.. అందుకు కారణమైన వాళ్లకు పదేళ్లు జైలుశిక్ష, రూ.50 లక్షల పాకిస్థాన్ రూపాయల జరిమానా విధిస్తాం' అని ఈమె చెప్పారు.

ఒక్కో మ్యాన్‌హోల్‌ మూత బరువు 30 కిలోల వరకు ఉంటుంది. వాటిని స్క్రాప్‌గా అమ్మి రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. పాక్‌లో పరిస్థితి అంత దారుణంగా తయారైంది.అలా ఓ మూత లేకపోవడంతోనే ఓ తల్లికూతురు చనిపోయారు. మరో చోట పడిపోయిన పాపని సహాయక సిబ్బంది కాపాడారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 45శాతం మంది పాక్ ప్రజలు పేదరికంలో.. 16.5 శాతం మంది కటిక పేదరికంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement