ఇరాన్‌కు దగ్గరగా అబ్రహం లింకన్... ఏక్షణానైనా దాడి? | The Abraham Lincoln ship is close to Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు దగ్గరగా అబ్రహం లింకన్... ఏక్షణానైనా దాడి?

Feb 6 2026 8:47 PM | Updated on Mar 13 2026 10:48 AM

The Abraham Lincoln ship is close to Iran

అరేబియా మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా యుద్ద నౌక అబ్రహం లింకన్ ఇరాన్‌కు అత్యంత దగ్గరగా వచ్చింది. అమెరికా బలగాలు అబ్రహాంలింకన్‌ యుద్ధ నౌకపై యుద్ధవిమానాలు, డ్రోన్లు, ఇతర ఆయుధ సామాగ్రి మోహరించాయి. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు గనుక విఫలమైతే అమెరికా ఏ క్షణాన్నైన ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉంది.

అయితే ఇరాన్‌పై అణు ఒప్పందంపై ఒత్తిడి చేసేందుకే ఈ విధంగా యుద్ధనౌకను దగ్గరగా మోహరించినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుభావిస్తున్నారు.  కాగా ఇటీవలే ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ను అమెరికా కూల్చివేసింది. యుద్ధనౌకకు దగ్గరగా వచ్చినందుకే భద్రతా కారణాలతో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

అణుఒప్పందంపై చర్చలకు ఇరు దేశాలు సముఖంగా ఉన్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే యుద్ధం తలెత్తడం అనివార్యంగా కనిపిస్తుంది.ట్రంప్ ఈ సారి వెనిజువెలాను మించి దాడి ఉంటుందని ప్రకటించగా, ఖమేనీ సైతం తగ్గేదేలే  అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement