అరేబియా సముద్రంలో టెన్షన్.. ఇరాన్ డ్రోన్‌ను కూల్చిసిన ‍అమెరికా | Arabian Sea America shoots down Iran jet | Sakshi
Sakshi News home page

అరేబియా సముద్రంలో టెన్షన్.. ఇరాన్ డ్రోన్‌ను కూల్చిసిన ‍అమెరికా

Feb 4 2026 3:58 AM | Updated on Feb 4 2026 4:28 AM

Arabian Sea America shoots down Iran jet

అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.  రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అని స్థితికి ప్రస్తుతం పరిస్థితులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్‌ను అమెరికా జెట్ కూల్చివేసింది.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అణు ఒప్పందంపై చర్చలకోసం ఇరాన్‌కు ఆహ్వానం పంపామన్నారు. త్వరలో టర్కీ ఇస్తాంబుల్‌లో ఆ చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌ సైతం ఇదివరకే చర్చలకు సముఖమే అని ప్రకటించడంతో ఇక పరిస్థితులు సద్ధుమణుగుతాయి అనుకున్నారు. అయితే ఇంతలోనే సీన్ రివర్స్ అయ్యింది.  అరేబియా సముద్రంలో ఇరాన్‌ డ్రోన్‌ను అమెరికా కూల్చివేసింది..

ఇరాన్‌కు చెందిన షహెద్-139 అనే డ్రోన్ అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్‌కు దగ్గరగా ఎగరింది. దీంతో అమెరికా బలగాలు ఎఫ్-35 జెట్‌తో దానిని కూల్చివేశాయి. అయితే డ్రోన్ వాహన నౌకకు సమీపంగా రావడంతో ఆత్మరక్షణ కోసం దానిని  కూల్చివేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.

అయితే అమెరికా యుద్ధనౌక అబ్రహం లింకన్ బయిలు దేరిందని, అణు ఒప్పందంపై ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా దాడిని మించి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో ఏం జరగనుందా అనే ఆందోళన మెుదలైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement