తాలిబన్ల కఠిన ఆంక్షలు.. దిక్కులేక ఇంటివద్దే ప్రసవాలు | Taliban harsh restrictions on women | Sakshi
Sakshi News home page

తాలిబన్ల కఠిన ఆంక్షలు.. దిక్కులేక ఇంటివద్దే ప్రసవాలు

Feb 4 2026 2:24 AM | Updated on Feb 4 2026 2:37 AM

Taliban harsh restrictions on women

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడి మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆ దేశంలో గర్భ నిరోధక మాత్రలు అమ్మడంపై తాలిబన్లు నిషేదం విధించారు. 

దీంతో అక్కడి డాక్టర్లు గర్భస్రావం కలిగించకుండా కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో అక్కడ ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రసవాలకు ఆసుపత్రుల కొరత ఏర్పడడంతో సరైనంతమంది డాక్టర్లు లేకపోవడంతో  చాలా మంది ఇంటివద్దే అధికంగా ప్రసవాలు జరుగుతన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

చిన్న వయసులోనే అక్కడి బాలికలకు పెళ్లిళ్లు చేస్తుండడంతో చాలా మంది పోషాకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వారందరికి సరైన వైద్యం అందకపోవడంతో  గర్భిణిలు స్వంతంగా వైద్యం చేసుకుంటున్నట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. 

12 ఏళ్లు దాటిన తర్వాత బాలికలకు చదువు నిషిద్దం. బాలికలు బయిటకు వెళ్లి పనులు చేయకూడదు. వాటిలో కొన్ని ఏదైనా వ్యాపార సముదాయాలపై మహిళల ఫోటోలు ప్రదర్శించడం నిషిద్దం. పురుషుడు లేకుండా మహిళలు ఒంటరిగా బయిటకి వెళ్లకూడదు.  డ్రైవింగ్ లైసెన్సులు మహిళలకు ఉండవు. ఇలా కఠిన మైన ఆంక్షలు అక్కడి మహిళలపై తాలిబన్లు విధిస్తారు. దీంతో  కొత్తగా ఆ దేశంలో మహిళలు వైద్యులయ్యే అవకాశం సైతం చాలా తగ్గింది. 

Advertisement
 
Advertisement
Advertisement