మస్కట్‌లో ఓఎనిమిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. ఉత్తర షర్కియాలోని బిడియా ప్రాంతంలోని ఎడారిలో బాలుడు తప్పిపోయాడు.15 కిలోమీటర్లు ఏకాకిగా తీవ్రమైన ఉష్ణోగ్రతలో నడిచిన చిన్నారి ఎట్టకేలకు అక్కడి అధికారులకు దొరికాడు.
సాధారణంగా ఎండాకాలంలో ఇసుకలో నడిస్తేనే ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఏడారి ప్రాంతంలో అయితే ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దప్పిక, తీవ్రమైన వేడిమి, ఎక్కడ ముగింపు ఉంటుందో తెలియదు. ఇక ఆ ఆలోచనే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఒమన్ దేశం మస్కట్‌లో చిక్కుకపోయిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి. ఎవరికి తెలియని దారిలో దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎండ, వేడిమిని భరిస్తూ దాహాన్ని తట్టుకుంటూ ఒంటరిగా పయణించాడు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఎట్టకేలకు సురక్షితంగా బయిటపడ్డాడు.
తమ పిల్లాడు ఎడారిలో తప్పిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉత్తర షర్కియా భద్రత విభాగం వెంటనే అప్రమత్తమై తప్పిపోయిన బాలుడి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టింది. సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ అథారిటీ ప్రకారం దాదాపు ఎనిమిది ఎనిమిది గంటల పాటు శ్రమించిన తర్పాత ఎట్టకేలకు ఆ బాలుడి జాడను అధికారులు కనుగొన్నారు.
అంత కఠినమైన ఏడారిలో నీరు లేకుండా, ఎండ వేడిమిని తట్టుకొని ఆ చిన్నారి దాదాపు 15 కిలోమీటర్ల నడిచినట్లు తెలిపారు. అయితే విహారయాత్రలకు వెళ్లినప్పడు గానీ క్యాంపు ఫైర్ చేసిన ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొన్నారు.


