ఇండియన్ నేవీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ కౌండిన్య అరుదైన ఘనత సాధించింది. గుజరాత్ పోరుబందర్ నుంచి ఒమన్ పర్యటన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అధికారులు వాటర్ సెల్యూట్‌తో నౌకకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్ర నౌకయాన మంత్రి సర్బానంద సోనోవాల మట్లాడారు. "ఐఎఎస్‌వీ కౌండిన్య ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. భారత ప్రాచీన నౌక వారసత్వ సంపదను కాపాడడానికి ప్రధాని ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు." అని మంత్రి తెలిపారు.ఈ నౌక 5శతాబ్దపు అజంతాగుహలలో ఉన్న ఒక నౌక చిత్రం నుంచి ప్రేరణ పొందిందని తెలిపారు. భారత్ నుంచి హిందు మహాసముద్రం మీదుగా ఆగ్నేయాసియాకు ప్రయాణించిన ప్రఖ్యాత ప్రాచీన నావికుడు కౌండిన్య పేరునే ఈ నౌకకు పెట్టినట్లు తెలిపారు.
ఐఎన్‌ఎస్‌వీ 5శతాబ్దంలో భారత్‌లో ఉపయోగించిన నౌకల నిర్మాణ ఆధారమైన టెక్నిక్‌తో రూపొందించారు. దీనిప్రయాణం 2025 డిసెంబర్ 29న గుజరాత్ పోరుబందర్ నుంచి మెుదలైంది. ఈ రోజు (బుధవారం) ఒమన్ మస్కట్ సముద్ర తీరానికి చేరుకుంది. కాగా ఈ ప్రాజెక్టుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2023 సెప్టెంబర్‌లో ప్రారంభించింది. కేరళకు చెందిన ప్రత్యేక కళాకారులు సాంప్రదాయ కుట్టు పద్దతిని ఉపయోగించి కౌండిన్య నిర్మాణాన్ని చేపట్టారు.
#WATCH | INSV Kaundinya given water salute as it completes its voyage from Gujarat's Porbandar to Oman's Muscat
INSV Kaundinya is a recreation of a 5th century Indian ship using the ancient stitching technique. The ship departed from Gujarat's Porbandar on 29th December 2025 pic.twitter.com/xc3NtGdg6U— ANI (@ANI) January 14, 2026


