టెహ్రాన్: ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ తీవ్రత 4.3గా నమోదైంది.
ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తారాస్థాయిలో కొనసాగుతున్న వేళ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూమి కంపించినట్లు ఇరాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ శత్రుత్వాలకు ఈ భూకంపం మరింత ఊపునిచ్చింది. భూకంపంతో ఆస్తినష్టం,ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.


