యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్'..జూలై నెలకు సంబంధించిన మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈసారి భారతీయులకు నిరాశే మిగలగా, బంగ్లాదేశ్, అర్మేనియా ప్రవాసులను అదృష్టం వరించింది. మొత్తం నలుగురు విజేతలు తలా 25,000 దిర్హామ్‌ల (సుమారు రూ. 5.6 లక్షలు) చొప్పున ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.
అయితే వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన 33 మహ్మద్ షఫీకుల్ ఇస్లాం ఒకరు. షఫీకుల్ గత 16 ఏళ్లుగా యూఏఈలో ఒక కార్ గ్యారేజీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా తన స్నేహితులతో కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రతి నెలా క్రమం తప్పకుండా టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. ఎట్టకేలకు అతడిని అదృష్టం వరించింది.
తనకు దక్కిన విజయంపై షఫీకుల్ మాట్లాడుతూ.. "నాకు ఫోన్ కాల్ రాగానే నమ్మలేకపోయాను. ఇన్నేళ్ల నా నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం ఇది. ఈ ప్రైజ్ మనీని నాతో పాటు టికెట్ కొన్న స్నేహితులతో పంచుకుంటాను" అని చెప్పకొచ్చాడు. అతడితో పాటు ఈ జాబితాలో మరో ఇద్దరు బంగ్లా దేశీయులు మహమ్మద్ అమ్దాదుల్లా అలీ హొస్సేన్ ఉన్నారు.
ఆగస్టు 3న మెగా డ్రా
ఈ వారుపు డ్రాలతో పాటు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ టికెట్ లైవ్ మెగా డ్రా ఆగస్టు 3న జరగనుంది. ఈ డ్రాలో మొదటి బహుమతిగా రికార్డు స్థాయిలో 2 కోట్ల దిర్హామ్‌లను (భారత కరెన్సీలో సుమారు రూ. 45 కోట్లకు పైగా) అందించనున్నారు.


