ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పితృవియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజికవేత్త నంద్ కిషోర్ గోయెంకా (Nand Kishore goenka ) మృతి సమాజానికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
నందర్ కిషోర్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన జీవితం సమాజ సేవకు, వినయానికి, అంకితభావానికి ఒక గొప్ప నిదర్శనమని ప్రశంసించారు. సామాజిక శ్రేయస్సుకు ఆయన చేసిన సేవలు, చూపిన విలువలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిస్తాయంటూ మోదీ నివాళు లర్పించారు. ఆర్‌ఎస్ఎస్ స్వయంసేవక్‌గా సమాజానికి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుభాష్ చంద్ర తండ్రి, ప్రముఖ దాత, సామాజిక కార్యకర్త నంద్ కిషోర్ గోయెంకా (96) సోమవారం (జులై 13, 2026) కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం, నంద్ కిషోర్ గోయెంకా అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన హర్యానాలోని హిసార్ జిల్లా, అగ్రోహా (Agroha) లోని 'గోయెంకా ఉద్యాన్' లో జులై 15 న నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?
తన తండ్రి మరణాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కుమారుడు సుభాష్ చంద్ర. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తామంతా తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, సమాజ సేవ, గోసేవ, దేశ సేవలతో నిండిన ఆయన 96 ఏళ్ల సార్థక జీవితాన్ని ఒక పండుగలా గౌరవించాలనుకుంటున్నామంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
గోయెంకా మరణం పట్ల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే సహా పలు పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎసెల్ గ్రూప్ శ్రేణులు, హితైషులు గోయెంకా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారునంద కిషోర్ గోయెంకా. ఎస్సెల్ గ్రూప్ విజయాల వెనుక ఆయనొక నిశ్శబ్ద మార్గదర్శకుడిగా నిలిచారు.
ఇదీ చదవండి: ‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం


