మా మధ్య దూరం పెంచాలని కుట్రలు చేశారు | Singer Susheela Pays Emotional Tribute To S Janaki Video Went Viral, Says Music World Is Incomplete Without Her | Sakshi
Sakshi News home page

Susheela-Janaki: ఎస్.జానకి మరణంపై సింగర్ సుశీల ఆవేదన

Jul 13 2026 8:52 AM | Updated on Jul 13 2026 10:21 AM

Singer Susheela Reacts Janaki Demise

ప్రముఖ సింగర్ జానకి.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆమెకు నివాళి అర్పించారు. మరో ప్రముఖ సింగర్ సుశీల కూడా జానకి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియోని రిలీజ్ చేశారు.

'జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేం. ఆమెకు మరణం లేదు. మా కెరీర్ రోజుల్లో కొందరు స్వార్థపరులు మా మధ్య లేనిపోని తగాదాలు పెట్టేందుకు కుట్రలు చేశారు. ఆనాడు దూరం పెంచాలని చూసిన వారి కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయి. జానకి లేదంటే ఈరోజు నా కళ్లలో నుంచి నీళ్లు కూడా రావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కచేరీ పాడాలి నువ్వు అందుకే వచ్చేసేయ్ అని సరస్వతి దేవి పిలిచి ఉంటుంది' అని సుశీల చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement