ఇది నా నిజ జీవిత పాత్రలానే ఉంది | Roja Returns To The Big Screen After 11 Years With Anbe Diana, Says Her Role Reflects Real Life | Sakshi
Sakshi News home page

Rk Roja: రోజా నటించిన తమిళ సినిమా.. రిలీజ్‌కి రెడీ

Jul 13 2026 9:05 AM | Updated on Jul 13 2026 10:27 AM

Rk Roja Speech Anbe Diana Movie Event

పారి ఇళవళగన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'అన్బే డయానా'. మిలియన్‌ డాలర్‌ స్టూడియోస్‌, నియో క్యాస్టిల్‌ క్రిమేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రమ్య నారాయణన్‌ హీరోయిన్. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నటి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మా ఇంటి బంగారం'.. అధికారిక ప్రకటన)

'సుమారు 11 ఏళ్ల తరువాత నేను నటించిన సినిమా 'లెనిన్‌ పాండియన్‌'. దాని తర్వాత ఇదే. దర్శకుడు పారి ఇళవళగన్‌ నన్ను కలిసి కథ చెప్పినప్పుడే ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అనిపించింది. నేను ఇందులో ఆంధ్రా నుంచి చైన్నెకి వచ్చి సెటిల్‌ అయిన అమ్మాయిగా నటించాను. ఇది నా నిజజీవిత పాత్రలానే ఉంది. మూవీ కోసం అందరూ బాగా పనిచేశారు' అని రోజా చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement