కాయదు.. ఆ హీరోతో సినిమా సెట్ అవ్వట్లేదు! | Dragon Fame Kayadu Lohar Opens Up About Missed Chances To Act With Simbu, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

కాయదు.. ఆ హీరోతో సినిమా సెట్ అవ్వట్లేదు!

Jul 10 2026 11:25 AM | Updated on Jul 10 2026 12:01 PM

kayadu Lohar Reacts Simbu Movie Latest

సినిమా రంగంలో ఎవరిని ,ఎప్పుడు అదష్టం వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకే ఒక్క హిట్‌ వస్తే చాలు వరస అవకాశాలు తలుపుతడతాయి. హీరోయిన్ కాయదు లోహర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. కన్నడం, తెలుగు చిత్రాలతో తొలుత ఉనికి చాటుకున్న ఈ అమ్మడు.. తమిళంలో చేసిన 'డ్రాగన్‌' మూవీతో సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాయదుకు సడన్ క్రేజ్‌ వచ్చేసింది. అదేచిత్రంలో నటించిన అనుపమకు రాని క్రేజ్‌ కాయదుని వరించింది. నిజం చెప్పాలంటే 'డ్రాగన్‌' తర్వాత ఈమెకు హిట్ పడలేదు. కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అవకాశాలు వరుస కడుతున్నాయి.

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

ప్రస్తుతం ఈమె తమిళంలో 'ఇమ్మోర్టల్‌', మారి సెల్వరాజ్‌ 'మంజనది', మలయాళంలో 'ఐ యామ్‌ గేమ్‌', తెలుగులో 'ది ప్యారడైజ్‌' మూవీస్ చేస్తోంది. తాజాగా సూర్య చిత్రంలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా బిజీగా ఉన్న కాయదు లోహార్‌‌ని ఇంతకుముందే శింబుతో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో అందులో నుంచి కాయదు డ్రాప్‌ అయిందని టాక్ నడిచింది.

ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాయదు మాట్లాడుతూ.. శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణంతో ఆ చిత్రం ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. దీంతో తాను ఆయనతో కలిసి నటించిన చిత్రం కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని నమ్ముతున్నానని పేర్కొంది. ఆ చిత్రం విధి చేతిలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె అభిమానులు మాత్రం త్వరలోనే శింబుతో జోడీకడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement