హీరోకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్.. దర్శకుడికి గోల్డ్ చెయిన్ | Vishnu Vishal Receives BMW And Gold Chain Gift As Gatta Kusthi 2 Success Celebrations Turn Special, Video Went Viral | Sakshi
Sakshi News home page

సినిమా హిట్.. హీరో, దర్శకుడు, టీమ్‌కి ఖరీదైన బహుమతులు

Jul 10 2026 9:05 AM | Updated on Jul 10 2026 10:11 AM

Gatta Kusthi 2 Movie Producer Gifted BMW Car And Gold Chain

తమిళ హీరో విష్ణు విశాల్‌ లేటెస్ట్ సినిమా 'గట్ట కుస్తీ 2'. ఐసరి గణేష్‌‌తో పాటు విష్ణు విశాల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. గత వీకెండ్ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుని కోట్ల కొద్ది కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం మధ్యాహ్నం చైన్నెలోని థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఐసరి గణేష్‌ మాట్లాడుతూ తాను ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఆడియో విడుదల కార్యక్రమానికి, ఇప్పుడు సక్సెస్‌ మీట్‌ మాత్రమే హాజరయ్యానన్నారు. మిగతాదంతా విష్ణు విశాల్‌‌నే చూసుకున్నాడు. విష్ణు విశాల్‌ మాట్లాడుతూ ఐసరి గణేష్‌ తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన స్వేచ్ఛనే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమని అన్నాడు. 

తన 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనకు దక్కిన తొలి సక్సెస్‌ క్రెడిట్‌ ఈ చిత్రమేనని విష్ణు విశాల్‌ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత గణేష్‌.. యూనిట్‌ సభ్యులకు ఒక్కొక్కరికి 40 గ్రాముల వెండి పలకాన్ని బహుమతిగా ఇచ్చారు. అలానే దర్శకుడు సెల్లా అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌ని అందించారు, విష్ణు విశాల్‌కు ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' మూవీ ట్విటర్ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement