పన్నెండు గంటలు వర్షంలో... | Chiranjeevi begins filming massive vintage action sequence for Mega158 | Sakshi
Sakshi News home page

పన్నెండు గంటలు వర్షంలో...

Jul 10 2026 6:11 AM | Updated on Jul 10 2026 6:11 AM

Chiranjeevi begins filming massive vintage action sequence for Mega158

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా షూటింగ్‌  హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా స్టంట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో వర్షం నేపథ్యంలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. 

‘‘వర్షంలో తెరకెక్కించిన ఈ ఫైట్‌ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ యాక్షన్‌ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ షెడ్యూల్‌ చిత్రీకరించాం. మధ్యలో గంట లంచ్‌ బ్రేక్‌ తీసుకున్న చిరంజీవి మిగతా 12 గంటల పాటు వర్షంలోనే తడుస్తూ ఏకధాటిగా షూటింగ్‌ చేశారు’’ అని చిత్రబృందం తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement