సాక్షి, హైదరాబాద్: ‘‘శభాష్ రేవంత్ రెడ్డి.. మిత్రుడంటే మీలా ఉండాలి. బండి సంజయ్ పుట్టినరోజుకు సీఎం స్పెషల్ గిఫ్ట్ పంపారు. భగీరథ్‌కు బెయిల్ రావడం బాధాకరం. కోర్టు తీర్పును గౌరవిస్తాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం’’ అంటూ బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. బండి భగీరథ్ బెయిల్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితుడ్ని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భధ్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుంది. హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ బాధితురాలిని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతం. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో స్పెషల్ పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్)ని నియమించినా ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం సిట్ కూడా వేయలేదు.’’ అని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు.
‘‘నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినపుడే.. రేవంత్ రెడ్డి- బండి సంజయ్‌ల బలమైన మైత్రి బంధం బయటపడింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర హోం మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నంత కాలం బాధిత మైనర్‌కు న్యాయం జరగదు. ఈ చర్యతో ప్రభుత్వం ఎంతో మంది అమ్మాయిల, తల్లిదండ్రుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసింది. బాధితుల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ తరపు న్యాయవాదులు నిందితుని తరపున నిలబడ్డారు. బాధిత బాలిక ఒక ప్రైవేట్ లాయర్‌ను ఆశ్రయించక పోయుంటే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేది. మధ్యంతర బెయిల్ వచ్చినపుడు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించిన తీరు చూసి.. మిగతా న్యాయవాదులంతా ముక్కున వేలేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ,జైలులో ఉన్న బండి భగీరథ్ కి బెయిల్ రావడం బాధాకరం…
కానీ…
గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించాలి. ఇన్నాళ్లు ఈ తెలంగాణ పసి బిడ్డను ప్రజలూ, ఈ న్యాయ వ్యవస్థనే కాపాడారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు.
ప్రభుత్వం వుల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 9, 2026
.. అయితే, ఇదంతా కేవలం ముఖ్యమంత్రి, హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందన్నది నిప్పు లాంటి నిజం. 10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన నిందితుడు, నేడు బెయిల్‌పైన బయటకు రాబోతున్నాడు. ఈ నిందితుడు ప్రభుత్వం ఇచ్చిన అభయంతో ఇంకా ఎన్ని అఘాయిత్యాలు,ఎన్ని ఘాతుకాలకు పాల్పడుతాడో ఊహించలేం. ఏదేమైనా ఈ మైనర్ బాలికను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ సమాజానిదే.
..ఆమె భవిష్యత్‌లో న్యాయం కోసం చేసే ఏ పోరాటానికైనా మనం అందరం ఆమెకు బాసటగా నిలబడాలి. మొత్తానికి జులై 11న పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. శభాష్ రేవంత్‌రెడ్డి.. మిత్రుడంటే మీలా ఉండాలి’’ అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సెటైర్లు విసిరారు.


