Bandi Bhageerath
-
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్‌ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్‌ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్‌ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
● బీఆర్ఎస్ మహిళా విభాగం నిరసనగచ్చిబౌలి: బండిభగీరథ్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమా డిమాండ్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ముందు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోంశాఖా సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఎప్పుడూ ధర్మరక్షణ, దేశ రక్షణపై చాలా మాట్లాడతారని.. అతని కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని, మా బిడ్డను రక్షించాలని కోరిన ఆ తండ్రికి ఏం న్యాయం చేస్తారన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ బేటీ బచావో, బేటీపడావో అని చెబుతుంటారని ఇప్పుడు ఇలాంటి నేరానికి పాల్పిడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. నేరం చేసిన వ్యక్తిని కాపాడుతున్న బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి నేరస్తులేనని విమర్శించారు. బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు కొమిరిశెట్టిసాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ మహిళా ఐపీఎస్‌తో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్‌కు ఇవ్వొచ్చని సూచించారు. -
బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే
జనగామ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను బీజేపీ నిర్లక్ష్యంగా తీసుకోవడం ఆందోళనకరమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణనాయక్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..బండి సంజయ్‌కి నీతి, నిజాయితీ, ఉంటే ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. మైనర్‌ను ఫాంహౌస్‌కు రప్పించి, కూల్‌డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు కలిపి భగీరథ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు చిన్నవేమీ కావన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నిశ్శబ్దం పాటించడం మహిళల భద్రతపై వారి అసలు వైఖరి బయటపడుతుందని విమర్శించారు. సమావేశంలో మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు వేమెళ్ల సత్యనా రాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి -
‘బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి’
నారాయణపేట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని.. అధికారం న్యాయానికి అడ్డుకాకూడదని వెంటనే భగీరథ్‌ను అరెస్టు చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సాయి భగీరథ్‌ను అరెస్టు చేయడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎందుకు వెనకడగు వేస్తోందని ప్రశ్నించారు. అసలు నిందితుడు దేశంలో ఉన్నాడా లేక దాటించాలనుకుంటారా అనే సందేహాలు నెలకొంటున్నాయన్నారు. 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో 3 రోజుల తర్వాత పోక్సో కేసు నమోదు చేయడంపై పలు అనూమానాలకు తావిస్తోందని తెలిపారు. బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోనే హోంశాఖ ఉందని.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా డీఐజీతో విచారణ జరిపించి బాధిత బాలికకు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టిన ఓ మహిళ అధినేత రాష్ట్రంలో ప్రజలందరికి తాను అమ్మాలాంటి దానినని బహిరంగా సభలో చెప్పిందని.. మరి ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే మహిళలతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, బుల్లెట్ రాజు, కౌన్సిలర్ భరత్ పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభనారాయణపేట ఎడ్యుకేషన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9, 10న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి నవీన్‌కుమార్ తెలిపారు. 42 పాయింట్ ఫైట్ క్యాడెట్ విభాగంలో నర్వ మండలానికి చెందిన ఆర్య విశ్వకరణ్ కాంస్యం, 67 కిక్ సీనియర్ పురుషుల విభాగంలో నారాయణపేటకు చెందిన కగడ సోనల్ రజతం, అదేవిధంగా 67 కిక్ సీనియర్ విభాగంలో దామరగిద్ద మండలానికి చెందిన సాయిరాం రాథోడ్ కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. -
బండి సంజయ్ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా?
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కేసును నీరుగార్చడమేనా? అంటే అవునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.బండి భగీరథ్ కేసుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సిట్ అంటేనే కేసును నీరుగార్చడం’ అని అన్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్లు ఏర్పాటు చేశారని, కానీ ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్‌కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.నేను పార్టీ తలవంచే పనిని నేను చేయను.చేతకాని దద్దమ్మలు నన్ను ఇబ్బంది పెట్టలేరు. నేను భయపడటానికి ఫామ్ హౌస్‌లో ఎలుకని కాదు. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. -
కుమారుడిపై ఆ కేసు.. బండి సంజయ్ రియాక్షన్
సాక్షి, కరీంనగర్: తన తనయుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా.. నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది.. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుండి వచ్చి, కార్పొరేటర్‌గా పనిచేసి, కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి...రేపు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు.. నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే’’ అంటూ ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటననాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్‌పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్‌తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది.


