సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని కోర్టు ఆదేశించింది.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మే 16న పోక్సో కేసులో అరెస్టయ్యాడు. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం భగీరథ్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు గత నెల 20న హైకోర్టు భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువులో పరీక్షలు రాసిన అనంతరం జూన్ 25న తిరిగి జైలుకు వెళ్లాడు.
ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో పాటు కేసు విచారణకు సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయవద్దని కోర్టు ఆదేశించింది.


