విద్యార్థిపై ప్రిన్సిపల్‌ లైంగిక దాడి..! | Telangana College Principal Under Police Custody In Alleged Student Sexual Assault Case, Watch Video Inside | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై ప్రిన్సిపల్‌ లైంగిక దాడి..!

Jul 9 2026 12:07 PM | Updated on Jul 9 2026 12:55 PM

Principal And Student Incident

కొల్లాపూర్‌: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే సమాజం తలదించుకునే పనిచేశాడు. స్వలింగ సంపర్కానికి బానిసై కళాశాలలోని విద్యార్థులను టార్గెట్‌ చేసుకున్నాడు. ఆర్థికంగా, చదువులో వెనుకబడిన అబ్బాయిలపై నిఘా ఉంచి వారిని తన పైశాచికత్వానికి వాడుకొని సమాజానికి తలవంపులు తెచ్చేలా చేశాడు కొల్లాపూర్‌ ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ మార్క్‌ పోలోనియస్‌. మంగళవారం రాత్రి ఆధారాలతో సహా అతడి విశృంఖలత్వం వెలుగులోకి వచ్చింది అయినా.. అతడిని విధుల నుంచి తప్పించే విషయంలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విచారకరం. 



ఇదీ విషయం.. 
కొల్లాపూర్‌ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధుల నిర్వహిస్తున్న మార్క్‌ పోలోనియస్‌ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ఆయన పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.  జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబర్చుకొని గతంలో రెండు పర్యాయాలు అతడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 2025లో పీజీ పూర్తి చేసుకున్న సదరు విద్యార్థి టీసీ, ఇతర సరి్టఫికెట్ల కోసం రెండు రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో.. గత్యంతరం లేక సదరు విద్యార్థి ప్రిన్సిపల్‌ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. 

 

రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్‌ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకొని రోదించాడు. ప్రిన్సిపల్‌ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్‌ రూమ్‌ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూములోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపల్‌ ప్రైవేటు పార్ట్‌ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ప్రిన్సిపల్‌ తన గదిలోని బాత్రూంలో దాక్కొని గడియపెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపల్‌ కీచక పర్వాన్ని ఫోన్‌లో రికార్డు చేసి దాన్ని తీసుకొని విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  

పోలీసుల అదుపులో ప్రిన్సిపల్‌ 
లైంగిక దాడి ఘటన తర్వాత ఇంటినుంచి పరారైన ప్రిన్సిపల్‌ మార్క్‌పోలోనియస్‌ కొల్లాపూర్‌లోని బొంగరాలమిట్ట ప్రాంతంలో గల ఓ ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకొని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.  

రిజిస్ట్రార్‌ ప్రకటనపై విస్మయం 
విద్యార్థిపై లైంగిక దాడి, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్‌ బాబు, ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి కొల్లాపూర్‌ పీజీ సెంటర్‌ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. లైంగికదాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. రిజిస్ట్రార్‌ ప్రకటనపై విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రిన్సిపల్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కనీసం సస్పెండ్‌ కూడా చేయకుండా, విచారణ పేరుతో కాలయాపన చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement