breaking news
PG hostel
-
ఇవి అచ్చంగా హత్యలే!
పీడలా వెంటాడుతున్న పేదరికంనుంచి తప్పించుకుందామని... మెరుగైన జీవితాన్ని అందుకుందామని చదువుల కోసం, కోచింగ్ కోసం, చిన్నా చితకా కొలువుల కోసం దేశ రాజధాని నగరం వచ్చే లక్షలమంది యువతకు అక్కడ అడుగడుగునా మృత్యువు పొంచివుంటుందని తెలియదు. బడాయి కబుర్లుచెప్పి గద్దెలెక్కే నేతలకు ఇలాంటివేమీ పట్టవని అసలే తెలియదు. అందుకే ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కుప్పకూలిన ఢిల్లీ సత్యనికేతన్ కాలనీ పీజీ హాస్టల్లో ఏడుగురు యువకులు తనువు చాలించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారు మమ్మల్ని కాపాడండని ఆర్తనాదాలు చేస్తున్నా అవి అరణ్యరోదనలే అయ్యాయి. ఆలస్యంగా మొదలైన సహాయక చర్యల్లో కొందరు ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీకి ఇలాంటి విషాదకర ఉదంతాలు కొత్తగాదు. గత పదేళ్లకాలంలో చూసుకున్నా వీటి సంఖ్య ఎక్కువే. మొన్నటికి మొన్న మే నెలాఖరు, జూన్ మొదటివారం మధ్య రెండుచోట్ల ఇటువంటివే చోటు చేసుకున్నాయి. అయిదంతస్తుల భవంతి కూలిన ఘటనలో ఆరుగురు మరణించగా,20 మంది గాయపడ్డారు. మరో మూడు రోజులకు ఒక హోటల్ మంటల్లో చిక్కుకుని 23 మంది మరణించారు. అక్కడ ఆరు గదులకు అనుమతి తీసుకుని ఏకంగా 26 గదులు నిర్మించి అద్దెకిచ్చారు. కుప్పకూలేందుకు సిద్ధంగా ఉండే భవంతుల్ని పోల్చుకోవటం పెద్ద కష్టం కాదు. అవేమీ బయటకు రాజమహళ్ల మాదిరిగా కనబడవు. నాచుపట్టిన గోడలతో, పెచ్చులూడిపడుతూ, కరెంటు వైర్లు వేలాడుతూ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఉంటాయి. లోపలికెళ్తే ఇరుకిరుకు గదులు, విరగడానికి సిద్ధంగా ఉండే మంచాలు, టేబుళ్లు, పెద్దగా ధ్వని చేసుకుంటూ ఎప్పుడు మీదపడతాయో తెలియని ఫ్యాన్లు దర్శనమిస్తాయి. ఎక్కడికక్కడ నల్లా గొట్టాలు చిట్లి నీళ్లు లీకవుతుంటాయి. కానీ ఓట్ల కోసం ఇల్లిల్లూ తిరిగే నాయకులకు ఇవేమీ కనబడవు. గెలిచాక అసలే పట్టవు. అధికార గణానికీ, సిబ్బందికీ ఇలాంటి భవంతులు అదనపు ఆదాయ మార్గాలు. వివిధ పట్టణాల్లో, నగరాల్లో చదువుల్లో టాపర్లుగా ఉంటూ, పోటీ పరీక్షల్ని సునాయాసంగా గెలుచుకునే పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 90 కళాశాలల్లో చేరడానికి వస్తారు. వీటిల్లో చేరే లక్షన్నరమందిలో అత్యధికులు బయటివారే. కానీ కేవలం 20 కళాశాలలకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. అవి 3,000 మందికి మించి చోటిచ్చే అవకాశం ఉండదు. ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర పరిధుల్లోని యూనివర్సిటీలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు మొత్తంగా 38 ఉంటాయి. వీటిల్లో 5 లక్షలమంది విద్యార్థులుంటే ఇందులో మూడింట రెండొంతులమంది బయటివారే. దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తోందని గంభీరోపన్యాసాలిచ్చే వారికి ఇవేమీ కనబడవు. కనీసం నెలకు పదో పదిహేనో భవంతుల్ని తనిఖీ చేసి నివాసయోగ్యం కాని, అగ్నిప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నవాటిని గుర్తించి తక్షణం ఖాళీ చేయించేలా తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండదు. పదే పదే చోటుచేసుకునే ఉదంతాల్ని చూశాకైనా కళ్లు తెరవాలని తోచదు. ఒకప్పుడు జనావాసంగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక ప్రైవేటు హాస్టళ్లకు అనుమతించారు. ఈ మహానగరంలో మనుగడ సాగించటానికి ఉన్నంతలో అవే దిక్కని మధ్యతరగతి, దిగువమధ్యతరగతి పిల్లలు వస్తారు. కానీ అవి సురక్షితమో కాదో, కట్టడం నాణ్యత ఏ మేరకుందో చూసే నాథుడుండడు. సొమ్ము వచ్చిపడేసరికి ఉదారంగా అనుమతులీయటం ఒక్కటే అధికారులకు తెలుసు. చిత్రమేమంటే... సాధారణ సమయాల్లో వీటిపై ఏమాత్రం శ్రద్ధపెట్టని నేతలు ఏదైనా జరిగాక పరామర్శకొస్తారు. ఇకపై ఇలాంటివి జరగబోవని ఉదారంగా హామీ ఇస్తారు. ఎన్నడో 2007లో రూపొందించిన నిబంధనల్లో ఇలాంటి భవంతుల్ని వెంటవెంటనే గుర్తించి ఖాళీ చేయించాలని ఉన్నా తమకు పట్టింపులేకపోయిందన్న సంగతి తెలియనట్టు ప్రవర్తిస్తారు. ఇంతకూ నలుగురు అధికారుల్ని సస్పెండ్ చేశామని చెప్పడం ఎవర్ని వంచించటానికి? ఇవి ప్రమాదాలు కాదు... అవినీతి, నిర్లక్ష్యం కలగలిసిన పర్యవసానంగా జరిగిన హత్యలు. ఇందుకు బాధ్యత కేవలం ఆ అధికారులదేనా? పాలకులకు జవాబుదారీతనం ఉండదా? -
విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి..!
కొల్లాపూర్ (నాగర్ కర్నూలు జిల్లా): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే సమాజం తలదించుకునే పనిచేశాడు. స్వలింగ సంపర్కానికి బానిసై కళాశాలలోని విద్యార్థులను టార్గెట్ చేసుకున్నాడు. ఆర్థికంగా, చదువులో వెనుకబడిన అబ్బాయిలపై నిఘా ఉంచి వారిని తన పైశాచికత్వానికి వాడుకొని సమాజానికి తలవంపులు తెచ్చేలా చేశాడు కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్. మంగళవారం రాత్రి ఆధారాలతో సహా అతడి విశృంఖలత్వం వెలుగులోకి వచ్చింది అయినా.. అతడిని విధుల నుంచి తప్పించే విషయంలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విచారకరం. A shocking incident came to light where a principal of the PG College in Kollapur town of Nagarkurnool district, in Telangana, allegedly attempted to sexually assault a student who had come to collect his transfer certificate, and in the process, the student bit the man’s… pic.twitter.com/B8i7ZnEUdb— Hate Detector 🔍 (@HateDetectors) July 9, 2026ఇదీ విషయం.. కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధుల నిర్వహిస్తున్న మార్క్ పోలోనియస్ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ఆయన పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబర్చుకొని గతంలో రెండు పర్యాయాలు అతడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 2025లో పీజీ పూర్తి చేసుకున్న సదరు విద్యార్థి టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం రెండు రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో.. గత్యంతరం లేక సదరు విద్యార్థి ప్రిన్సిపల్ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకొని రోదించాడు. ప్రిన్సిపల్ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ రూమ్ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూములోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపల్ ప్రైవేటు పార్ట్‌ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ప్రిన్సిపల్ తన గదిలోని బాత్రూంలో దాక్కొని గడియపెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపల్ కీచక పర్వాన్ని ఫోన్లో రికార్డు చేసి దాన్ని తీసుకొని విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో ప్రిన్సిపల్ లైంగిక దాడి ఘటన తర్వాత ఇంటినుంచి పరారైన ప్రిన్సిపల్ మార్క్‌పోలోనియస్ కొల్లాపూర్‌లోని బొంగరాలమిట్ట ప్రాంతంలో గల ఓ ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకొని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. రిజిస్ట్రార్ ప్రకటనపై విస్మయం విద్యార్థిపై లైంగిక దాడి, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి కొల్లాపూర్ పీజీ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. లైంగికదాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. రిజిస్ట్రార్ ప్రకటనపై విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రిన్సిపల్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కనీసం సస్పెండ్ కూడా చేయకుండా, విచారణ పేరుతో కాలయాపన చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్‌ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ప్రేమించలేదని యువతిపై దాడి
బెంగళూరు: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్‌కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్‌గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్‌స్టా ద్వారా నవీన్‌కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్‌కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్‌కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. pic.twitter.com/glv1rMtE1P Bengaluru's Jnanabharathi area on December 22, 2025, where 21-year-old Naveen Kumar groped, slapped, and attempted to tear the clothes of a woman who rejected his repeated romantic proposals after connecting on Instagram, as captured in attached CCTV…— MdShakeel(PingTV) (@PingtvIndia) December 24, 2025 -
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
బెంగళూరులోని పీజీ హాస్టల్లో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఘటన జరిగిన మూడు రోజులకు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని నగరానికి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.కాగా బిహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కృతి కుమారిని ఓ దుండగుగు అర్థరాత్రి హాస్ట్‌లోకి చొరబడి కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని రద్దీగా ఉండే కోరమంగళలోని పీజీ హాస్టల్లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే బాధితురాలికి నిందితుడు ముందుగానే పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఓ ప్రైవేటు కంపెనీ పనిచేస్తున్న కృతికి.. హాస్ట్‌లో తన రూమ్మెట్కు ప్రియుడు అని వెల్లడైంది. తన రూమ్మెట్, ఆమె ప్రియుడు ప్రతిసారి ఉద్యోగం విషయంలో గొడవపడేవారిని, వీరి విషయంలో కుమారి జోక్యం చేసుకోవడంతో గొడవలు పెద్దగా అయినట్లు సమాచారం. అయితే ప్రియుడికి దూరంగా ఉండాలని కృతి తన రూమ్మెట్కు సలహా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆవేశంతో ఆమెను చంపడానికి హాస్ట్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ముందుగా నిందితుడు కుమారి రూమ్ తలుపు తట్టడం, ఆమె డోర్ తీయగానే బలవంతంగా కారిడార్లోకి లాక్కెళ్లాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. యువతిని గొడకు నెట్టి తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. మెడపై కత్తితో పదే పదే పొడిచాడు. దీంతో తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలింది.యువతి కేకలు విన్న మిగతా హాస్టల్ మహిళలు భయటంతో బయటకు పరుగులు తీశారు. వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేయడగా.. పోలీసులు వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిన తాజాగా అతుపులోకి తీసుకున్నారు. -
పీజీ హాస్టల్లో యువతి హత్య
బనశంకరి: మహిళా పీజీ హాస్టల్లోకి చొరబడిన ఓ దుండగుడు యువతి గొంతుకోసి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూరు కోరమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బిహార్ కు చెందిన కృతికుమారి (24) హతురాలు. వివరాలు.. ఎంబీఏ పూర్తిచేసిన కృతి బెంగళూరుకు చేరుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కోరమంగలలో వీఆర్ లేఔట్‌లోని పీజీలో ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లి రాత్రి తిరిగివచ్చింది. దుండగుడు రాత్రి 11.10 నుంచి 11.30 మధ్య పీజీ యజమాని, మహిళా సెక్యూరిటీ గార్డు కళ్లు గప్పి పీజీలోకి చొరబడి మూడవ అంతస్తులోని కృతికుమారి రూమ్‌లోకి వెళ్లి చాకుతో గొంతుకోసి అక్కడ నుంచి ఉడాయించాడు.తెలిసినవారి పనేనా?కొన్ని గంటల తరువాత విషయం తెలిసి పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం సెయింట్‌జాన్స్ ఆసుపత్రికి తరలించారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పీజీ చుట్టుపక్కల రోడ్లలో సీసీ కెమెరాల చిత్రాలను పోలీసులు సేకరించి హంతకుని కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్యతో పీజీలోని యువతులు భయభ్రాంతులకు గురయ్యారు.హంతకుడెవరో తెలిసింది: డీసీపీఆగ్నేయ విభాగ డీసీపీ సారా ఫాతిమా మాట్లాడుతూ పీజీ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. హంతకుని ఆచూకీ తెలిసిందని త్వరగా అరెస్ట్ చేస్తామని ఆమె తెలిపారు. -
HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ..అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని తెలిపారు. నిందితులు గోడ దూకి లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వసతి గృహంలోని బాత్రూం వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. హాస్టల్లో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్న విద్యార్ధులు అతన్ని చితకబాదారని చెప్పారు. వసతి గృహంలోని విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు. చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం.. -
ఓయూ పీజీ హాస్టల్లో విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీ హాస్టల్లో నర్సయ్య అనే జాగ్రఫీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్ ప్రతాప్‌రెడ్డితో మాట్లాడి.. కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారంగా విచారణ చేస్తున్నారు. మనస్తాపంతో మరో విద్యార్థి.. గేట్ పరీక్షలో అర్హత సాధించలేననే మనస్తాపంతో గుజరాత్‌కు చెందిన హరీష్ బాయ్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూసారాంబాగ్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
పీజీ హాస్టల్లో ఆకలి కేకలు
రెండు రోజులుగా భోజనాలు బంద్ ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు రాయచూరు : గుల్బర్గా వర్సిటీకి అనుబంధంగా స్థానిక శివారు ప్రాంతంలోని జ్ఞానతుంగ స్నాతకోత్తర కేంద్రం హాస్టల్లో ఆకలికేకలు మార్మోగుతున్నాయి. హాస్టల్ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా రెండు రోజులుగా విద్యార్థులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. నీటి సౌకర్యం లేక రెండు రోజులుగా స్నానాలకు కూడా నోచుకోవడం లేదు. హాస్టల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 130 విద్యార్థులు, 10 విద్యార్థినిలు వసతి పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి టిఫిన్లు, భోజనాల కోసం టెండర్లు పిలిచి కంట్రాక్టు ఇచ్చారు. కాంట్రాక్టర్ అందజేస్తున్న భోజనంలో నాణ్యత లేదని రెండు రోజుల క్రితం విద్యార్థులు ఆరోపించడంతో కాంట్రాక్టర్ ఏకంగా భోజనాలు వడ్డించడం మానేశారు. దీంతో విద్యార్థులు బయటి హోటళ్లను ఆశ్రయించారు. జేబులు ఖాళీ కావడంతో దాదాపు 80 మంది స్వగ్రామాలకు వెళ్లిపోగా 40 విద్యార్థులు ఒక్కొక్కరు 20 రూపాయలు చందా వేసుకొని ఒకపూట భోజనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై హాస్టల్ ప్రత్యేక అధికారి, ఇంచార్జి వార్డెన్‌ను వివరణ కోరగా తన నిస్సాహాయతను వ్యక్తం చేశారు. ఆ కేంద్రం ప్రత్యేక అధికారి భాస్కర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌తో వివాదం ఫలితంగానే విద్యార్థుల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విషయాన్ని కలెక్టర్ శశికాంత్ సెంథిల్ దృష్టికి తీసుకెళ్లగా గుల్బర్గ విశ్వవిద్యాలయం కులపతితో మాట్లాడి భోజన ఇతర వసతులకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని కోరతానన్నారు.


