అమీర్‌పేట గర్ల్స్‌ హాస్టల్‌లో.. చొరబడ్డ వ్యక్తులు..! | Unknown Men Enter Girls Hostel In Manikonda, Manager Arrested For Abusing Residents In Hyderabad | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట గర్ల్స్‌ హాస్టల్‌లో.. చొరబడ్డ వ్యక్తులు..!

May 20 2026 8:25 AM | Updated on May 20 2026 11:17 AM

Asian Girls PG Hostel in Ameerpet Incident

హైదరాబాద్‌: గర్ల్స్‌ హాస్టల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్‌ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో ఏషియన్‌ పీజీ గర్ల్స్‌  హాస్టల్‌ను శివపార్వతి,  ఆమె కుమారుడు వీరారెడ్డి  నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్‌రూమ్‌లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement