ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tributes To Tanguturi Prakasam Pantulu On His Death Anniversary, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

May 20 2026 12:13 PM | Updated on May 20 2026 12:23 PM

YS Jagan Pay Tributes To Tanguturi Prakasam Pantulu

సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు త‌న ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement