బెంగళూరు: ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్‌కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్‌గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్‌స్టా ద్వారా నవీన్‌కుమార్ పరిచయమయ్యాడు.
అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్‌కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్‌కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
pic.twitter.com/glv1rMtE1P Bengaluru's Jnanabharathi area on December 22, 2025, where 21-year-old Naveen Kumar groped, slapped, and attempted to tear the clothes of a woman who rejected his repeated romantic proposals after connecting on Instagram, as captured in attached CCTV…
— MdShakeel(PingTV) (@PingtvIndia) December 24, 2025


