సమాజానికి సమాధానం చెప్పలేకే ఆత్మహత్యాయత్నం ! | Married Man And Alleged Lover Attempt To End Their Lives On Sabari Express, Shifted To Gandhi Hospital | Sakshi
Sakshi News home page

సమాజానికి సమాధానం చెప్పలేకే ఆత్మహత్యాయత్నం !

Jul 9 2026 11:45 AM | Updated on Jul 9 2026 12:09 PM

Extramarital affair couple drinks poison on train

    గాంధీ ఆస్పత్రిలో ప్రియుడు, ప్రియురాలు

హైదరాబాద్‌: భార్య కళ్లెదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త, అతని ప్రియురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శ్రీకాకుళం జిల్లా చప్రా గ్రామానికి చెందిన శ్రీరామ్‌ శిరీష్‌ అదే గ్రామానికి చెందిన నీలవేణి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని నెల రోజులుగా కోయంబత్తూర్‌లో నివాసముంటున్నాడు. భర్త ఆచూకీ తెలుసుకున్న భార్య కోయంబత్తూర్‌కు వెళ్లి తన భర్తతో పాటు అతని ప్రియురాలిని తీసుకొని మంగళవారం శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌కు వస్తున్నారు. 

ఇంటికి వెళ్లిన తరువాత సమాజం తమను ఏ విధంగా చూస్తుందో... పిల్లలకు ముఖం ఎలా చూపించుకోవాలి... అనే ఆలోచనతో సతమతమై ఉంటారని, ఈ క్రమంలో భార్య కళ్లముందే భర్త శిరీష్, అతని ప్రియురాలు నీలవేణిలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిరీష్, నీలవేణిల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement