breaking news
Telangana High Court
-
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ తీరును, పోలీసుల జోక్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.అసెంబ్లీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎలా అడ్డుకుంటారు? అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధిలోకి వస్తుంది, అక్కడ పోలీసులకు ఏం పని? అని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. నిరసన సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పూర్తి ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తం అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. -
హైడ్రా కమిషనర్ రంగ్నాథ్కు హైకోర్టులో భారీ ఊరట
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం (డివిజన్ బెంచ్) సస్పెండ్ చేసింది.అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా.. రంగనాథ్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సింగిల్ బెంచ్ ఆయనపై కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైడ్రా వర్గాలు, ప్రభుత్వ లాయర్లు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి సమగ్ర విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ స్టేతో హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ తన విధులు కొనసాగించడానికి మార్గం సుగమమైంది. -
పెరోల్.. 40 ఏళ్లు పరార్
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్‌పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు.. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖైదీ నంబర్ 1567 వీరన్న కథ 1982లో మహబూబాబాద్‌లో ఓ పాన్‌షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, అల్లర్ల కేసులో సందెల వీరన్న నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వరంగల్ అదనపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం పెరోల్‌ను 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల ‘పరారీ జీవితం’. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్‌్కఫోర్స్ అతడిని పట్టుకుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. పేరు మార్చుకుని ప్రభుత్వ టీచర్‌గా.. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించినట్లు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు. 2013లో పదవీ విరమణ చేశాడు. పెన్షన్ పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు కూడా అందుకున్నట్లు పిటిషనర్ తరఫు వాదనలో నమోదైంది. 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టుకోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయత్నాలు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని పేర్కొంది. ఎట్టకేలకు ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను నియమించి అరెస్టు చేసినట్లు తెలిపింది. మళ్లీ పెరోల్ కోరిన భార్య.. తిరస్కరించిన హైకోర్టు వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు, మూడేళ్ల పాటు పెరోల్, ఫర్లో తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్‌పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్‌పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందడం ఆశ్చర్యకరమంది. ఇది జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల తీరును తెలియజేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా లేదా పరిశీలించడం, హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. మూడేళ్లపాటు పెరోల్–ఫర్లో (మంచితనంపై బయటకు వెళ్లేందుకు ఇచ్చే అనుమతి) నిరాకరణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. జీవితంలోని అత్యంత ముఖ్యమైన కాలాన్ని ఖైదీ జైలు వెలుపల గడిపాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. జైలు శిక్ష నుంచి తప్పించుకుని, ఆ సమయంలో సాధారణ జీవితంలోని ప్రయోజనాలను పొందాడరన్నారు. కానీ అతడిపై విధించిన జీవిత ఖైదు శిక్ష ఇప్పటికీ రద్దు కాలేదని.. ఉద్దేశపూర్వంగా శిక్ష తప్పించుకున్నట్లు అవగతమవుతోందన్నారు. మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు. -
రక్షణ గృహాల్లోని చిన్నారుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ గృహాల్లోని చిన్నారుల సంఖ్య, అక్రమంగా దత్తత పొందినట్టు అనుమానించి స్వా«దీనం చేసుకున్న చిన్నారులు, ప్రభుత్వ స్పాన్సర్షిప్ పథకం లబ్ధిదారులు, ఫోస్టర్ కేర్ పథకం కింద ఉన్న చిన్నారులు.. ఇలా పలు వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శిశువుల అక్రమ రవాణాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమంగా దత్తత తీసుకున్న 9 మంది చిన్నారులను గుర్తించి రక్షించినా, అసలు తల్లిదండ్రులను గుర్తించకపోవడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ వచ్చే నెల 2కు వాయిదా వేస్తూ ఆలోగా పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అవయవాల అక్రమ రవాణా, భిక్షాటన.. నల్లగొండకు చెందిన ఎం.వెంకన్న–స్రవంతి దంపతులకు సంతానం లేకపోవడంతో యాదగిరి ద్వారా ఓ చిన్నారి(శరణ్య)ని దత్తత తీసుకున్నారు. పిల్లలను అమ్ముతున్నాడన్న ఫిర్యాదు మేరకు యాదగిరిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా శరణ్యను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కన్న తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి ద్వారా పొందిన దత్తత చెల్లదన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకన్న అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ సంరక్షణలోని పిల్లల పూర్తి వివరాలను 2వారాల్లో సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, హోంశాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలన్నారు. సంబంధిత శాఖల్లో డైరెక్టర్ లేదా అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని అధికారులు స్వయంగా సమగ్ర నివేదికలు సమర్పించాలని చెబుతూ, విచారణ వాయిదా వేశారు. -
చెక్కులు ఎమ్మెల్యేలే ఇవ్వాలా?
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఉందా అని అడిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ శాసనసభ్యులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఆ నగదు ప్రజాధనం నుంచి వస్తుంది కదా.. దానికి, ప్రజాప్రతినిధులకు ఏం సంబంధమని, వాటిని పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని నిలదీసింది. ప్రాజెక్టులు, రహదారులు, ఇతర ప్రజావసరాలకు భూములిచ్చిన దేశ నిర్మాతలైన రైతులకు పరిహారం చెల్లింపు మాటేంటని ప్రశ్నలు సంధించింది. రాజధానిలో రహదారులు, సిగ్నళ్ల వద్ద చిన్నారులు, మహిళలు యాచిస్తున్నారని, భావి భారత పౌరుల సంక్షేమం పట్టదా, వీరు సంక్షేమం పరిధిలోకి రారా అని వ్యాఖ్యానించింది. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఖర్చు చేసే ప్రతీ పైసాకు చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది. అనంతరం.. పూర్తి వివరాలు అందజేసేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం, తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం.. పథకాల చెల్లింపుల జీవోలపై స్టే ఇచ్చిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలు ఎందుకు? సంబంధిత జీవో ప్రకారం.. లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ఎమ్మెల్యే కౌంటర్ సైన్ చేయాలని ఇంప్లీడ్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది వివరించారు. జీవోలను రద్దు చేయలేదని, సస్పెండ్ చేయలేదని, ఎమ్మెల్యేలను కేసులో ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలను అధికారులు నిర్వహిస్తున్నప్పుడు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఎందుకని నిలదీశారు. ప్రజాధనం పంపిణీలో రాజకీయ జోక్యానికి తావు ఉండకూడదని.. ఎమ్మెల్యేలు వెళ్లి చెక్కులు ఇవ్వడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం లేదని, అవసరమైన వారికి సంక్షేమ ప్రయోజనాలు అందాల్సిందేనని పేర్కొన్నారు. అమలు విధానమే చట్టబద్ధంగా ఉండాలని చెబుతున్నామన్నారు. పరిహారం కోసం 8 నెలలుగా... భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 నెలలుగా అందరూ ఎదురు చూస్తున్నారని.. అభివృద్ధి కోసం సొంత ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాంటి రైతులు, ఇతరులతోనే దేశ నిర్మాణం సాగుతోందని చెప్పారు. భూసేకరణ బాధితుల పరిహారం చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించారు. ఎవరైనా సామాజిక సంక్షేమం కింద ప్రయోజనం కోరితే, అది అవసరానికి అనుగుణంగా ఉండాలని.. సంక్షేమం ఎప్పుడూ అవసరంపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిరాశ్రయులు, నిరుపేదలు, బాలలు, మహిళలు వంటి అనేక వర్గాలు సంక్షేమం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్న పిల్లలున్నారు.. ఆధార్ కార్డు కూడా లేని చిన్నారులున్నారు.. నిరాశ్రయ మహిళలున్నారు. వారందరూ సామాజిక సంక్షేమ పరిధిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. వికలాంగ యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే జీవో 4ను తాత్కాలిక స్టే నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి.. న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. తెలుగు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘తెలుగు స్క్రైబ్’ను మొత్తంగా నిలిపివేయాలని కోరారు. ఆ ఖాతా నిర్వాహకుడి వివరాలు తెలియడం లేదని, అతనిపై 50కి పైగా క్రిమినల్ కేసులున్నాయని, అతడి చిరునామా తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రవాద నిరోధక చట్టాల నిబంధనల కింద కూడా ప్రయత్నాలు చేశారన్నారు. దీనిపై మెటా తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ పేర్కొన్న యూఆర్ఎల్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, పథకాల అమలుపై సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని, పేద యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై త్వరలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. వాటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన చెక్కులను అధికారులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ చెక్కుల పంపిణీ అంశంలో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో దివ్యాంగులకు ఇచ్చే ఆర్థికసాయం కొనసాగించేందుకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు.. జీవో నంబర్ 4పై ఉన్న స్టేను ఎత్తివేసింది.కాగా, ఈ నెల ఆరంభంలో ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది. రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇక ఆగస్టు 20వ తేదీన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై హైకోర్టు విచారణ సందర్భంగా నిధుల విడుదల అంశానికి సంబంధించి స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ పథకాలకు సంబంధించి చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడాన్ని ప్రధానంగా తప్పుబట్టిన న్యాయస్థానం.. అది రాజకీయ జోక్యమే అవుతుందని హెచ్చరించింది.ఇవి కూడా చదవండి: ఉచిత పథకాలు కోటీశ్వరులకూ అవసరమా?‘నా అమెరికా పర్యటన రద్దు.. తెలంగాణ ప్రజలకే అవమానం’ -
రాయదుర్గం భూ వేలాన్ని ఆపలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం భూముల వేలాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేలానికి సంబంధించి బిడ్లు ఇప్పటివరకు అందలేదని, వేలం ప్రక్రియను కొద్ది రోజులు వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరగా, తిరస్కరించింది. భూ సంస్కరణల ట్రిబ్యునల్ (ఎల్‌ఆర్‌టీ) ముందు ఎలాంటి విచారణ లేదా పునర్వి చారణ ప్రక్రియ పెండింగ్‌లో లేనప్పుడు.. మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపలేమని తేల్చిచెప్పింది. సర్వే నంబర్ 83లో 11.12 ఎకరాల భూ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.రాయదుర్గం సర్వే నంబర్ 83/1, 83/పార్ట్‌లో తమకు చెందిన 11.12 ఎకరాల భూమిపై అధికారులు బుల్డోజర్లతో సరిహద్దులను చెరిపివేసి జోక్యం చేసుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన రమాదేవితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, ఈ నెల 21, 28న నిర్వహించనున్న ఈ వేలాన్ని ఆపాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ⇒ ప్రభుత్వం, టీఎస్ఐఐసీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్న భూమి 53 ఎకరాల్లో భాగమా లేక ప్రభుత్వ మిగులు భూమినా అన్నది సర్వే చేసి నిర్ధారించాలి. పిటిషనర్లు హక్కును కోరితే.. సివిల్ కోర్టును ఆశ్రయించాలి. ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు’అని వాదించారు.⇒ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జే.రామచంద్రారావు వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వివాదం తిరిగి ఎల్‌ఆర్‌టీ పరిధిలోకి వెళ్లింది. అయితే, వేలానికి ఇంకా ఎలాంటి బిడ్లు రానందున వారం రోజులపాటు నిలిపివేయాలి’అని కోరారు. ⇒ వాదనలు విన్న న్యాయమూర్తి.. గతేడాది మే 7న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎల్‌ఆర్‌టీ ముందు పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఎల్‌ఆర్‌టీ ముందు ప్రస్తుతం ఏదైనా నిర్దిష్ట ప్రొసీడింగ్ పెండింగ్‌లో ఉందా? నోటీసులు జారీ అయ్యాయా? అనే అంశాలపై పిటిషనర్ల నుంచి స్పష్టత కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
కోర్టుకే తప్పుడు వివరాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఆమోదం లేకుండానే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వ అఫిడవిట్లో ఆర్టికల్ 162ను తప్పుగా ఉటంకించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సాధారణ తప్పిదంగా తీసుకోలేమని.. రాజ్యాంగంలోని ఒక అధికరణాన్ని అధికారిక అఫిడవిట్లో వక్రీకరించడం ఎలా జరిగిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంక్షేమ పథకాల అమల్లో జోక్యం చేసుకోవట్లేదని.. అదే సమయంలో చెల్లింపుల ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం గత వారం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ రెండు పథకాల చెల్లింపులపై స్టే ఇచ్చిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులు, రిటైరైన ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు కూడా మనుషులేనని.. వారికి బకాయిలు చెల్లించకపోవడం ఏమిటని ధర్మాసనం నిలదీసింది. తాత్కాలిక ఉద్యోగులు కూడా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించరా అని ప్రశ్నించింది. కోర్టు సిబ్బందికి కూడా కొన్ని నెలలుగా జీతాలు అందని పరిస్థితి ఉందని చెప్పింది. అప్పుల వివరాలు సమర్పించండి... ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ భూసేకరణ పరిహారానికి సంబంధించి 19 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా మూడింటిలో టోకెన్లు జారీ అయ్యాయన్నారు. త్వరలో మిగతా కేసుల్లోనూ విడుదల చేస్తామన్నారు. అయితే మిగిలిన కేసుల్లో చెల్లింపులు ఎందుకు జరగలేదో వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్లో ఆర్టికల్ 162ను వక్రీకరించడాన్ని తప్పుబట్టారు. ఇది కేవలం సాధారణ తప్పిదం కాదన్నారు. ఏఏజీ స్పందిస్తూ ఆర్టికల్ 162ను తప్పుగా రాశారని అంగీకరించారు. ఇది తప్పిదమని.. సరిచేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మీకులు, పెన్షనర్లు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రాన్ని పిటిషనర్ విజయ్‌గోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండో పీఆర్సీ అమలు కాలేదని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఏజీ జోక్యం చేసుకొని ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధం లేదన్నారు. ప్రభుత్వం రూ. 5 కోట్ల బిల్లు చెల్లించకపోవడంతో ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను పిటిషనర్ ప్రస్తావించగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని దీనికి ఈ కేసుతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ వేదికగా కోర్టులను చేసుకోవద్దని.. పథకానికి, పారీ్టలకు సంబంధం లేదన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలేమైనా తీసుకుందా అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. భూనిర్వాసితుల పరిహారం, రాష్ట్ర అప్పుల పరిస్థితి, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలను అందులో పేర్కొనాలన్నారు. -
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ లబ్ధిదారులకు భారీ షాక్ తగిలింది. ఈ రెండు పథకాలపై గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా నిరాకరించింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వ పథకాలపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం నిధుల దుర్వినియోగంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు రాక చాలామంది ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉచిత పథకాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసం? కష్టపడి పని చేసే ప్రజల ట్యాక్స్ డబ్బును ఇలా ఉచిత పథకాలకు మళ్లించడం న్యాయమేనా?’ అంటూ న్యాయస్థానం నిలదీసింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను తప్పుబడుతూ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయి బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. అర్హులైన భూ బాధితులకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తూ, శాసనసభ ఆమోదం లేని ఇటువంటి ఉచిత పథకాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల లభ్యత,ప్రాధాన్యతలపై ప్రభుత్వం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందని ధర్మాసనం సీరియస్ అయ్యింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇవ్వడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి పూర్తిస్థాయి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలపై స్టే యథాతథంగా కొనసాగనుంది. -
ప్రజాధనం.. వినియోగ విధానం పాటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం సంక్షేమ పథ కాలను అమలు చేయడమే కాకుండా తన చట్టబద్ధమైన బాధ్యతలను కూడా సమర్థవoతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సయమంలో ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను ఎలా రూపొందించుకోవాలో తాము నిర్దేశించలేమని, అయితే పౌరుల చట్టబద్ధ హక్కులు, ప్రజాధనం వినియోగ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి భూములిచ్చి పరిహారం కోసం ఏళ్లుగా రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ప్రజలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అవసరం తగ్గే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి లాభాలను కూడా ప్రసావించింది. ప్రభుత్వానికి చెంది న సంస్థలు లాభాలు ఆర్జిస్తే వాటిని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించొచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రాధాన్యం ఏంటో చెప్పాలని సర్కార్ ఆదేశిస్తూ.. స్టేపై గురువారం తేలుస్తామని చెబుతూ, విచార ణ వాయిదా వేసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు చట్టపరమైన, శాసనపరమైన ఆధారం లేదంటూ.. ప్రభు త్వం జారీ చేసిన 8 జీఓలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పథకాలకు మేం వ్యతిరేకం కాదు.. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని, ముఖ్యంగా బాలికల సాధికారతే వీటి లక్ష్యమన్నారు. పథకాల ద్వారా రాష్ట్రంలోని యువతులు ఎలా ప్రయోజనం పొందుతున్నారో, నిధుల సమీకరణ, చట్టబద్ధత తదితర అంశాలపై ఇప్పటికే కౌంటర్ వేశామన్నారు. పథకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కూడా అభ్యర్థించారు. న్యాయవాది విజయ్‌గోపాల్ వాదిస్తూ.. ఒక పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించినంత మాత్రాన ప్రత్యేక చట్టం అవసరం లేదన్న ప్రభుత్వ వాదన సరైంది కాదన్నారు. ప్రజాధనం ఖర్చుపై మార్గదర్శక సూత్రాలను నిర్దేశించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీతాలు, పింఛన్లు, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు, అప్పుల చెల్లింపులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఇతర వ్యయాలకు నిధుల కేటాయింపు జరగాలన్నారు. పథకం మంచిదా? చెడ్డదా? అన్నది తన వాదన కాదని, దానిపై వ్యతిరేకతా లేదని, చట్టం లేకుండా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఇలాంటి పథకాన్ని అమలు చేయవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న అని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. భూసేకరణ పరిహారాల విషయంలో కోర్టుల్లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్నింటిలో 50 శాతం పరిహారం కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం కోర్టులో హామీలు ఇవ్వడం, చెల్లింపుల కోసం టోకెన్లు జారీ చేస్తున్నా, వాస్తవంగా నిధులు విడుదల కావడం లేద ని చెప్పారు. సంక్షేమ పథకాలకు కోర్టులు వ్యతిరేకం కాదని, అయితే వాటి చట్టబద్ధత ఏంటో తేలాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులొద్దు.. కల్యాణలక్షి, షాదీ ముబారక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్, పిటిషనర్‌పై దుష్ప్రచారం చేస్తూ ‘తెలుగు స్క్రైబ్’పేరిట ప్రచురితమైన కంటెంట్‌ను తొలగించాలని మెటా, ఎక్స్ (ట్విటర్), గూగుల్ ఎల్ఎల్సీ ప్లాట్‌ఫామ్‌లకు స్పష్టం చేసింది. సీఎం రేవంత్ ఈ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తున్నారంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలిచ్చింది. -
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలా?
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని సర్వే నంబర్ 194/1లోని వాణి కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లోని ప్లాట్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసిన న్యాయస్థానం నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెవెన్యూ అధికారులు.. తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెబుతున్నప్పుడు కూల్చివేత ఎలా చేపట్టారని నిలదీసింది. ఎవరినీ సంప్రదించకుండానే కోర్టు పరిధిలోని అంశంలో ఇష్టానుసారం జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.రంగనాథ్ చర్యల కారణంగా ఇతర అధికారులు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడింది. సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. జూలై 18న తమ ప్రాపర్టీ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన లింగారావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించారని, కూల్చివేసిన ప్రహరీని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి ఎమ్మార్వో, తిరుమలగిరి తహసీల్దార్లు హాజరు కావాలన్న గత ఆదేశాల మేరకు వారు కోర్టుకు హాజరయ్యారు. ఆ ఆస్తుల వివరాలివ్వండి.. రెవెన్యూ శాఖ తరఫున జీపీ కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్ 194లో 12 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. ఇందులో నాలుగెకరాలు యూఎల్సీ కింద సర్కార్‌కు హక్కులు దఖలుపడ్డాయన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కూల్చివేత సమయంలో సర్వేయర్లు, తహసీల్దార్లు ఉన్నారా అని ప్రశ్నించగా, ఎవరూ లేరని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. కూల్చివేతపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదన్నారు. మరి ఎలా కూల్చివేశారని హైడ్రాను ప్రశ్నించారు. ప్రభుత్వ సర్వేయర్లు రానప్పుడు ప్రైవేట్‌గా ఎవరినైనా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఎన్ని కూల్చివేతలు చేపట్టారని అడిగారు. 30 నుంచి 40 దాకా కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు, సంబంధిత రికార్డులు లేకుండానే జీఎల్ఆర్ నంబర్లు 243, 255ను సర్వే నంబర్ 194/1తో అనుసంధానించి కూల్చివేతలు, ఫెన్సింగ్ చేపట్టినట్లు న్యాయమూర్తి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో గతంలో వివిధ రిట్ పిటిషన్లలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల నుంచి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే ప్రహరీలను కూల్చివేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమికంగా తేలడంతో రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో హైడ్రాపై సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాగే, హైడ్రా ఏర్పాటుకు ముందు వివిధ రిట్ పిటిషన్లలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు హైడ్రాకు తెలియజేయకపోవడంతో అవి ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇకపై హైడ్రా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో అమల్లో ఉన్న కోర్టు ఉత్తర్వులను హైడ్రాకు తప్పనిసరిగా తెలియజేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తదుపరి విచారణ వరకు చెల్లింపులు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి కోర్టు వాయిదా వేసింది. -
భూ క్రమబద్ధీకరణపై స్పందనేది?
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి బంజారాహిల్స్‌లోని విలువైన భూముల క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి గత డిసెంబర్ 10న తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం 9 నెలలుగా సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. మూడు వారాల్లో పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంటూ, వివాదాస్పద భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియ జేయాలని చెబుతూ విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా బంజారాహిల్స్‌లోని అత్యంత విలువైన 1,161 గజాలను వెంకటేశ్వర్రావుకు, 425 గజాలను గద్వాల్ విజయలక్ష్మికి క్రమబద్ధీకరించిందంటూ జి.రఘువీర్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అక్కడ గజానికి రూ.60,300 ఉండగా, వెంకటేశ్వరరావుకు రూ.2,500, విజయలక్ష్మికి రూ.350 చొప్పున క్రమబద్దీకరించారన్నారు.ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, రూ.9 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. పిల్‌ను ఉపసంహరించుకోవడానికి కె. వెంకటేశ్వరరావును పిటిషనర్ డబ్బులు డిమాండ్ చేశారని, దీనిపై పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. చిన్న విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములను వివిధ జీవోల ద్వారా క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఒకవేళ ఉంటే, కేకే కుటుంబ సభ్యులకు కేటాయించిన భూములకు సంబంధించిన జీవోలను సవరించి జారీ చేసిందా? అనే అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని చెప్పింది. -
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల అమలులో అర్హుల ఎంపిక, ప్రభుత్వాల బాధ్యతపై కోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది.రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం మిగులుస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.“ఒకప్పుడు దేశానికి ఏం ఇచ్చామా? అని ఆలోచించేవాళ్లం.. ఇప్పుడు దేశం మనకేం ఇచ్చిందని అడుగుతున్నాం” అంటూ సామాజిక బాధ్యతపై కోర్టు వ్యాఖ్యలు చేసింది.చదువుకు సాయం.. అర్హులకు సంక్షేమంప్రభుత్వ నిధులు సరైన దిశలో వినియోగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజులు, నిజంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించింది.1.15 కోట్ల మందికి పథకాలు.. ప్రభుత్వ నిర్వహణ ఎలా?రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. 1.15 కోట్ల మందికి ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు భవిష్యత్‌లో ప్రభుత్వాలు వాటిని ఎలా కొనసాగిస్తాయనే ప్రశ్నను లేవనెత్తింది. సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా ఉండాల్సినవేనని, అయితే వాటి అమలులో పారదర్శకత, అర్హత ప్రమాణాలు కీలకమని హైకోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ధనం సద్వినియోగం కావాలంటే అవసరమైన వారికి మాత్రమే ప్రయోజనాలు చేరేలా విధానాలు ఉండాలని సూచించింది. -
IAS సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేయండి.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
సుల్తానియాను అరెస్టు చేయండి
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఎక్కడ కన్పించినా అరెస్టు చేసి సురక్షిత కస్టడీలో ఉంచాలని, ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. వారెంట్‌ను అమలు చేయాలంటూ గురువారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని వెంటనే సీపీకి తెలియజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే సుల్తానియా రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి, శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తే బెయిల్‌పై విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కూడా న్యాయస్థానం తదుపరి ఆదేశాలిచ్చే వరకు అవసరమైనప్పుడు సుల్తానియా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందనే షరతు విధించింది. వారెంట్‌ను ఏ విధంగా అమలు చేశారన్న వివరాలతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా, సాధ్యమైనంత వరకు ఆగస్టు 7లోపే హైకోర్టుకు సమర్పించాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఒకవేళ వారెంట్‌ను అమలు చేయలేకపోతే సరైన కారణాలను కూడా నివేదికలో స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిల విడుదల కేసులో.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ సర్‌చార్జి బకాయిల విడుదలకు సంబంధించి సమర్పించిన వినతిపత్రంపై నాలుగు వారాల్లో చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని 2024లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుమారు రూ.33.42 కోట్ల బకాయిలను 8 వారాల్లో విడుదల చేయాలని, ఆలస్యమైతే ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించడంతో పాటు ఆలస్యానికి గాను ప్రతి నెలా సైనిక సంక్షేమ నిధికి రూ.లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది. ఏడాదైనా అమలు కాలేదంటూ.. హైకోర్టు 2024లో ఇచ్చిన ఆదేశాలను సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఆరోపిస్తూ పిటిషనర్ రామకృష్ణ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి మొదట సుల్తానియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, అలా చేయడంలో విఫలమైతే కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తదుపరి విచారణల సందర్భంగా..కౌంటర్ దాఖలు చేయలేదని, కనీసం ఆయన తరఫున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని గమనించిన న్యాయమూర్తి.. సుల్తానియా హాజరుకు ఆదేశించారు. సమయం ఇవ్వాలన్న జీపీ విజ్ఞప్తి తిరస్కరణ ఇదే పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ధిక్కరణ కేసులో దాఖలైన అఫిడవిట్‌తో పాటు ఏప్రిల్ 17, జూన్ 18 తేదీల్లో ఇచ్చిన గత ఆదేశాలను న్యాయమూర్తి పరిశీలించారు. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కోరిన విషయం గమనించారు. ఎటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పాటు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఎలాంటి దరఖాస్తు కూడా దాఖలు చేయలేదని గుర్తించారు. జీపీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో..తదుపరి పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్‌పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
హైడ్రా భూములు అమ్మేద్దాం
హైడ్రా స్వాధీనం చేసుకున్న వాటిల్లో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ,హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు ఉన్నాయి.సాక్షి, హైదరాబాద్: నిధుల కటకట నుంచి గట్టెక్కే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) స్వాదీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చెరువులు, కుంటలు కాకుండా కేవలం ప్రభుత్వ భూములను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)లకు బదలాయించి, వాటి ద్వారా భూములను వేలం వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగిందని, హైడ్రా భూములను అమ్మేందుకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆయా భూముల అమ్మకం ద్వారా భారీ మొత్తంలో వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి భూముల స్వాదీన ప్రక్రియలో భాగంగా హైడ్రా అనుసరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయినా హైడ్రా తన తీరును మార్చుకోలేదంటూ కోర్టు పలు ధిక్కరణ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టును కమిషనర్ రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తప్పించి, మరొక అధికారిని ఆ స్థానంలో నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా భూములను అమ్మాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. వేల ఎకరాలు..వేల కోట్ల విలువ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు కాకుండా ఇప్పటివరకు సుమారు 2,665 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వా«దీనం చేసుకుంది. వాటి విలువ కనిష్టంగా రూ.60 వేల కోట్ల నుంచి గరిష్టంగా రూ.90 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటిలో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు.. ఇలా కోట్ల విలువైన భూములు ఉన్నాయి. వీటిల్లో నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూములను అమ్మడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ భూముల వేలం విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని, అన్ని చిక్కులు తొలగిన తర్వాతే పార్శిళ్ల వారీగా (ఒక్కో విడతలో కొన్ని ఎకరాల భూములు) భూములు వేలానికి పెట్టాలని ఉప సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు, మూడు సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే హైడ్రా భూముల అమ్మకాలపై స్పష్టత రానుంది. మా వల్ల కాదన్న హెచ్ఎండీఏ! ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశాల్లో మరో ఆసక్తికరమైన చర్చ జరిగిందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు గాను భూముల అమ్మకాలే మార్గమనే భావనకు వచ్చిన కేబినెట్ సబ్ కమిటీ.. హెచ్ఎండీఏ, టీజీఐఐసీలకు నెలవారీ లక్ష్యాలు సైతం విధించినట్టు సమాచారం. చెరో వెయ్యి కోట్లు చొప్పున ఈ రెండు సంస్థలు నెలకు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి సమకూర్చగలిగేలా భూముల వేలం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉప సంఘం సూచించినట్లు తెలిసింది. అయితే నెల వారీ టార్గెట్ విధించడం సరైంది కాదని, వేలం ప్రక్రియ నిర్వహణకు చాలా గడువు అవసరమవుతుందని, ఆ తర్వాత భూములు దక్కించుకున్న సంస్థలు డబ్బులు కట్టేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని, కొన్ని డబ్బులు తాము ఇప్పటికే తెచ్చిన రుణాలకు చెల్లించాల్సి ఉందంటూ హెచ్ఎండీఏ అధికారులు చేతులెత్తేసినట్టు సమాచారం. అయినా వారి వివరణతో ఏకీభవించని ఉప సంఘం నిధుల సమీకరణపై వెంటనే సంక్షిప్త నివేదిక తయారు చేయాలని, ఈ నివేదికను సీఎం రేవంత్ సమక్షంలో పరిశీలించి నెలవారీ టార్గెట్లపై నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. -
తప్పుదోవ పట్టిస్తోంది అధికారులే!
కోర్టులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారనేందుకు ఈ కేసే నిదర్శనం. అది చేస్తోంది.. ప్రజలు కాదు. వాస్తవానికి తప్పుదారి పట్టిస్తోంది కొందరు ప్రభుత్వ అధికారులే. శాఖల మధ్య సమన్వయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలిపై ఇటీవల మరో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయమే. ఆయన అత్యుత్సాహంపై చేసిన వ్యాఖ్యలు కూడా సబబే –హైకోర్టు ధర్మాసనంసాక్షి, హైదరాబాద్: ప్రజలెవరూ కోర్టును తప్పుదోవ పట్టించ డం లేదని, కొందరు అధికారులే ఆ పని చేస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చే సింది. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో కూల్చివేతలే దీని కి నిదర్శనమని తేల్చిచెప్పింది. తహసీల్దార్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకున్నా.. చేశారంటూ హైడ్రా ఆగమేఘాలపై వెళ్లి చట్ట విధానాన్ని అనుసరించకుండా కూల్చివేతలు చేపట్టడం సహించరానిదని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థను పక్కకు పెట్టి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామంటే రాజ్యాంగ న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హైడ్రా కమిషనర్‌ను హెచ్చరించింది.ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం రాజ్యాంగ విధి అని, అందుకు న్యాయస్థానాలను నిందించడం సరికాదని పేర్కొంది. ఈ కేసు ముగిసేవరకు ప్రతీ విచారణకు తహసీల్దార్ హాజరు కావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసింది. కొండాపూర్‌లోని తమ ప్రైవేట్ స్థలంలో హైడ్రా అక్రమంగా జోక్యం చేసుకుని ప్రహరీ, వాచ్‌మన్ గదిని కూల్చివేశారంటూ పి.సుధారాణి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ఒక సర్వే నంబర్‌కు బదులు మరోటి గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ విచారణకు హాజరయ్యారు. కూల్చివేతకు సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. తమ కార్యాలయం రాసిన లేఖ సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమికి సంబంధించినది మాత్రమేనని తెలిపారు. పిటిషనర్ స్థలం సర్వే నంబర్ 60లోని ప్రైవేటు భూమిలోనే ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని వివరించారు. దీంతో హైడ్రా అధికారులు సర్వే నంబర్ 60లోని ప్రైవేటు స్థలాన్ని.. సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమిగా ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించారు.కూల్చివేతకు ముందు అసలు సర్వే నిర్వహించారా? రికార్డులు పరిశీలించారా? అని నిలదీశారు. 2025, అక్టోబర్ 1న తహసీల్దార్ లేఖ పంపగా, దాని ఆధారంగా అక్టోబర్ 4న కూల్చివేత చేపట్టామని హైడ్రా తరఫు న్యాయవాది చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ... జిల్లా కలెక్టర్ నుంచి కూల్చివేతకు ఏదైనా స్పష్టమైన ఆదేశం వచి్చందా.. అంత తొందరగా కూల్చివేత చేపట్టాల్సిన అత్యవసరం ఏమిటి.. సాధారణంగా ఏదైనా వివాదంలో భూమి ప్రభుత్వానిదేనని అనుకున్నా, ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసు ఇవ్వాలి కదా.. వారి వాదనలకు అవకాశం కల్పించాలి కదా.. మీపై బయట నుంచి ఎవరైనా ఒత్తిడి చేశారా.. అని వరుస ప్రశ్నలు సంధించారు. కోర్టు ఆదేశాలకు గౌరవం ఏదీ? ఈ కోర్టే గతంలో చట్ట ప్రక్రియను అనుసరించాలని స్పష్టంగా ఆదేశించిందని న్యాయమూర్తి చెప్పారు. అలాంటప్పుడు తెలంగాణ భూఆక్రమణ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలిపై ఇటీవల మరో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమరి్థస్తున్నామన్నారు. జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం రంగనాథ్ అత్యుత్సాహంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సబబేనన్నారు. ‘ఆయనకు నచి్చనట్లు వ్యవహరిస్తున్నారు.. చట్ట ప్రక్రియ పాటించకుండా కూల్చివేతలు చేస్తున్నారు.. కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. రికార్డులు సరిచూసుకోవడం లేదు.. సర్వే చేయడం లేదు.. కోర్టు ఆదేశాలకు గౌరవం ఇవ్వడం లేదు’అంటూ జస్టిస్ శ్రవణ్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రతివాదులు సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
సీఎం రేవంత్ కు గట్టి ఎదురుదెబ్బ.. హైడ్రా ఉంటుందా..? ఊడుతుందా..?
-
హైకోర్టు తీర్పుపై రేవంత్ రియాక్షన్.. తగ్గేదే లే..
-
మా విచక్షణాధికారం
ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారం. దానిని ఎవరూ లాక్కోలేరు. గతంలో సీఎస్‌గా పనిచేసిన సోమేశ్‌కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకు వెళ్తాం.. – సీఎం రేవంత్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ ‘హైడ్రా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. చెరువులు, కుంటలను కాపాడేందుకు చేపట్టిన ఈ వ్యవస్థను కొనసాగించి తీరతామని తేల్చి చెప్పారు. హైడ్రా విషయంలో కోర్టుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ దురుద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) కేసులు వేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? ‘చెరువులు, నాలాలను కాపాడటంలో హైడ్రా తన విధులు నిర్వర్తిస్తున్న తీరుపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎన్ కన్వెన్షన్, గండిపేట, బతుకమ్మ కుంటల్లో ఆక్రమణలు తొలగిస్తే అవి పేదలవంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్లు కబ్జా పెట్టుకున్నారు. దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారు. కబ్జాదారులు డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చెరువులను ఆక్రమించిన వారు ధనవంతులైనా, పేదలైనా చర్యలు తప్పవు. గత 12 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. ‘గడిచిన 12 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. రాష్ట్రంలోని 11.56 లక్షల మంది అర్హులైన పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై (జీ)2.0) కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ నిధుల విడుదల, ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశాం..’ అని రేవంత్ తెలిపారు. విద్యా హక్కులపై కేంద్రం ఆధిపత్యం సరికాదు.. ‘పరీక్షల నిర్వహణ, లీకేజీల నిరోధానికి దేశస్థాయిలో పకడ్బందీ విధానం ఉండాలి. నిబంధనలు పట్టించుకోని కోచింగ్ సెంటర్లే ప్రశ్నపత్రాల లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయి. విద్యకు సంబంధించి రాష్ట్రాల పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవాలని చూడటం వల్లే గందరగోళం ఏర్పడుతోంది. నీట్ సహా ఇతర పరీక్షల విషయంలో యూనివర్సిటీలపై ఆధిపత్య ధోరణి వీడాలి. ప్రశ్నపత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. సభలో చర్చ జరిగితే రాహుల్‌గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారు..’ అని సీఎం అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పకడ్బందీ ప్రణాళిక ‘గత కేసీఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయింది. ప్రతి ఏటా రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు ఇందుకు అవసరమవుతాయి. ఇకపై ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరమే చెల్లించేలా, అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో..కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో ఆ మేరకు డిమాండ్ చేస్తే బాగుంటుంది..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్‌కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు తదితరులు ఉన్నారు. -
హైడ్రా కమిషనర్ గా రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశాలు
-
హైడ్రా ఎపిసోడ్లో ట్విస్ట్: రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ని తప్పిస్తారా? వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా?.. అనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే ఈ విషయంలో తొందరపాటు వద్దని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నరలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం అసాధారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం చట్టబద్ధ పాలనకు కీలకమని పేర్కొంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకూ లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం గ్యారెంటీ అనే చర్చ మొదలైంది. అయితే కోర్టు ఆర్డర్ కాపీని అధికారికంగా అందుకుని పరిశీలించాకే తర్వాతే ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ)తో పాటు న్యాయ నిపుణుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. అప్పీల్‌పై ప్రభుత్వ కసరత్తుహైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయపరమైన అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తిస్థాయిలో పరిశీలించి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.ప్రస్తుతం హైడ్రా కమిషనర్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ కావడంతో.. అప్పీల్ ఎవరు దాఖలు చేయాలి? ప్రభుత్వం తరఫున వెళ్లాలా? లేదంటే రంగనాథ్ వ్యక్తిగతంగా అప్పీల్ చేయాలా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.రంగనాథ్ వివరణ.. ‘కబ్జాదారులే కేసులు వేశారు’మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొంటున్నానన్నారు. రెండేళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు రక్షించామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపట్టామని చెప్పారు. తనపై వచ్చిన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.హైడ్రా ఏర్పాటు అలా.. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)ను ఏర్పాటు చేసింది. కేబినెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99 ద్వారా హైడ్రాకు అధికారిక రూపం కల్పించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రాను రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక సంస్థగా భావిస్తోంది. ముఖ్యంగా చెరువులు, నాలాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం తన పాలనలో కీలక అజెండాగా తీసుకుంది.హైడ్రా భవిష్యత్‌పై ఉత్కంఠఇదిలా ఉండగా.. హైడ్రా పనితీరు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా సాధించిన ఫలితాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా? లేదంటే ప్రభుత్వం అప్పీల్‌తో ముందుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. డివిజన్ బెంచ్‌లో జరిగే విచారణే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై కీలకంగా మారనుంది. -
ల్యాండ్ మాఫియా తప్పుదోవ పట్టిస్తోంది
సాక్షి, హైదరాబాద్: లోతుకుంట భూముల కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం హైడ్రా కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తిననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48 (ఏ) ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షిస్తున్నా. మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండేళ్లల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారు. అంతా బడా భూ కబ్జాదారులే..లోతుకుంట భూమి విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కాజేయాలని చూసింది. అనుమతులు లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను నరికేసింది. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద ధిక్కరణ కేసు వేశారు. నా మీద 63 ధిక్కరణ కేసులు ఉన్నాయి.వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్‌రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ అడ్డు పడటమే హైడ్రా కమిషనర్‌గా నేను చేసిన తప్పు.కోర్టుల పట్ల నమ్మకం, చట్టాల పట్ల గౌరవం ఉందినా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు వీళ్లంతా వేసినవే. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కొంటా. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం ఉంది. చట్టాల పట్ల గౌరవంతోనే పని చేస్తూ వస్తున్నా. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100 శాతం ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటా. అలాగే పని చేస్తున్నా. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తా..’ అని రంగనాథ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. -
‘హైడ్రా’ రంగనాథ్ రియాక్షన్ ఇదే!
సాక్షి,హైదరాబాద్: కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్ ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నాను. చెరువులు.. ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే హైడ్రా లక్ష్యం. రూ.1.50 లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాం. నాపై ఉన్న కోర్టు ధిక్కార కేసులన్నీ భూకబ్జాదారులవే. చట్టపరంగా కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది’అని వ్యాఖ్యానించారు. -
హైడ్రా ముసుగులో రియల్ ఎస్టేట్ దందా..
-
High Court: సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ
-
రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు
-
‘హైడ్రా’నుంచి రంగనాథ్‌ను తొలగించండి: హైకోర్టు ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదుల సంఖ్యలో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్ ఏవీ రంగ్‌నాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం న్యాయస్థానంలో లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. దీంతో హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. లోతుకుంట సర్వేనం 1,2లో 40 ఏకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని పేర్కొన్న రంగనాథ్.. పిటిషనరే అవాస్తవాలు చెప్పారని అఫిడవిట్లో పేర్కొన్నారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయన్న న్యాయస్థానం పేర్కొనగా, కోర్టులపై తనకు నమ్మకముందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం, కోర్టు ఆదేశాల్ని దిక్కరించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు దిక్కరణకు పాల్పడతారని అసహనం చేసింది. కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ఆదేశించింది. -
రంగనాథ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే..
2016లో దాఖలైన రిట్ పిటిషన్ మొదలు రిట్ అప్పీల్, సివిల్ సూట్, సీసీసీఏ, మొదటి ధిక్కార కేసు వరకు హైడ్రా కమిషనర్ ఎక్కడా పార్టీ కాదు. రెండో ధిక్కార కేసు నుంచి అకస్మాత్తుగా ప్రత్యక్షమై కోర్టు ఉత్తర్వుల అమల్లో జోక్యం చేసుకున్నారు. ఏ కేసులోనూ పార్టీగా లేని ఒక అధికారి అకస్మాత్తుగా అన్ని అధికారాలూ తనవే అన్నట్లుగా వ్యవహరించారు. కోర్టు ఆదేశాల అమలుకు అడ్డుపడటం ఆక్షేపణీయం. ఇలాంటి తీరు ఎప్పుడూ చూడలేదు, వినలేదు. హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కాదు. వారి ధిక్కరణలను ఉపేక్షిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. – హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కస్టడీకి తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని భావించామని.. కానీ అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తిని గౌర విస్తూ సంబంధిత అధికారిని మూడోసారి కూడా అదుపులోకి తీసుకోకుండా సంయమనం పాటిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడంతోపాటు ఇకపై వివాదాస్పద స్థలంలోకి ఆయన, హైడ్రా అధికారులు అడుగుపెట్టబోమని హామీ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే జూలై 18న ఆ స్థలంలోకి ఎందుకు ప్రవేశించారో వివరించాలని పేర్కొంది.కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా ధిక్కార కేసులో సరైన అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది.అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి విచారణకు హాజరై వివరణ ఇవ్వడంతోపాటు హైడ్రా కమిషనర్‌ను అదుపులోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని సంయమనం పాటిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. గురువారం వివాదాస్పద స్థలం రక్షణకు సైన్యాన్ని మోహరించాలని ఇచి్చన ఆదేశాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు, శుక్రవారం ఇచ్చిన తాజా ఆదేశాలే అమల్లో ఉంటాయని వెల్లడించారు. హైడ్రానే ప్రభుత్వం అయ్యిందా? హైడ్రాను ఆశ్రయిస్తున్న ఇతర ప్రభుత్వ శాఖల తీరుపైనా న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ తదితర శాఖలకు వేర్వేరు చట్టాలున్నా అందరూ హైడ్రానే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఆ శాఖలన్నీ పనికిరాని సంస్థలుగా మారిపోయాయా?’అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా అన్ని శాఖలను పక్కనపెట్టి ప్రతి అంశంలోనూ హైడ్రా జోక్యం చేసుకోవడం ఎలా సాధ్యమన్నారు. హైడ్రా కమిషనర్.. ఒక చట్టంలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే ఒకసారి ధిక్కారానికి గురైనప్పటికీ కోర్టు ఆదేశాలను రంగనాథ్ పాటించట్లేదని.. ఇలాంటి చర్యలను వదిలేస్తే న్యాయపాలన వ్యవస్థే దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లోతుకుంటలోని 40 ఎకరాల భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని అఫిడవిట్లో పేర్కొనడమే కాకుండా తర్వాత మరింత వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొనడం ఆశ్చర్యకరమన్నారు. ధిక్కార చర్యలు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా వివరణాత్మక అదనపు కౌంటర్ అఫిడవిట్ అంటే ఏమిటో అర్థం కావట్లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇంత పోలీసు బలగం ఎందుకు? హైడ్రా ప్రతి చర్యకు భారీ పోలీసు బలగాన్ని వెంట తీసుకెళ్లడంపై కూడా న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేక వారిని భయబ్రాంతులకు గురిచేసేందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నగరంలో వందల చెరువులున్నా.. హైడ్రా చర్యలు మాత్రం ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయని.. ఇది ఎందుకో కమిషనర్‌కే తెలియాలన్నారు. ఇది పూర్తి వివక్షకు తావిచ్చేలా ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అఫిడవిట్ వేయాలంటూ విచారణ వాయిదా వేశారు. -
సర్కార్‌పై మాకు నమ్మకం లేదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో తమ ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయవ్యవస్థకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ఉత్తర్వుల అమలు కోసం సైన్యాన్ని రంగంలోకి దింపాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలానికి రక్షణగా 10 మంది ఆర్మీ సిబ్బందిని నియమించాలని, ఉత్తర్వులు ఉల్లంఘించి వచ్చే హైడ్రా, దాని కమిషనర్, ఇతర అధికారులను అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.24వ తేదీకల్లా (నేడు) ఆర్మీ అధికారుల జాబితాను అందజేయాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న స్పృహ కోర్టుకు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం లేకపోవడంతో ఇలా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తోందని చెప్పింది. అలాగే, బయట ఏం జరుగుతుందో కోర్టులోని వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, హైడ్రా తరఫున కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.నరసయ్య మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరై పిటిషనర్ భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్లరని హామీ ఇచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సంబంధిత అధికారి అఫిడవిట్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఎవరొచ్చినా బ్యారక్స్‌కు తరలించండి.. పిటిషనర్ తరఫు న్యాయవాది హరీశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ స్థలంలోకి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చినా దానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఈ నెల 20న కోర్టు ఆదేశాల మేరకు హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిటిషనర్ స్థలంలోకి జోక్యం చేసుకోలేదని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కూడా 21న పిటిషనర్ పునరుద్ధరణ పనులు చేపట్టగా హైడ్రా అధికారులు, పోలీసులతో సహా వచ్చి పనుల్లో జోక్యం చేసుకుని బెదిరించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి..హైడ్రా కమిషనర్ చట్టం కంటే తానే గొప్పవాడినని భావిస్తూ, కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించారన్నారు. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు, ఇకపై ఉల్లంఘిస్తే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను అవసరమైతే సైన్యం అదుపులోకి తీసుకుని, బ్యారక్స్‌లో ఉంచాలని ఆదేశించవచ్చన్నారు. సచివాలయంలో కూర్చున్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియాలని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద (ప్రైవేటు) స్థలం రక్షణ కోసం పది మంది అర్మీ సిబ్బందిని సిద్ధం చేయాలంటూ ఫైర్ డివిజన్లోని అత్యున్నత బ్రిగేడియర్‌ను సంప్రదించాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరీ్మకి అడ్డు వస్తే హైడ్రాతో సహా ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌కు తరలించాలని, వాహనాలను కూడా సీజ్ చేయాలని చెప్పారు. ఈ ఉత్తర్వుల కాపీని కేంద్రానికి కూడా పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ దశలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్.. ఒక్క అవకాశం ఇవ్వాలని, ఆ స్థలంలో జోక్యం చేసుకోరని చెప్పారు. ఏఏజీ హామీతో ఉత్తర్వులను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. -
హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయండి.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు
-
రంగనాథ్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో పెట్టండి.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోతుకుంట భూవివాదంలో హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని ఆర్మీని ఆదేశించింది. వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవ్వరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే హైడ్రా పనితీరును పలుమార్లు తీవ్రంగా మందలించిన హైకోర్టు, మళ్లీ ఆర్మీ భూములను టచ్ చేస్తే తమకు చెప్పాలని పేర్కొంది. గురువారం లోతుకుంట భూములపై జరిగిన విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది.కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఒకవేళ కోర్టు ధిక్కరణ ఇలాగే కొనసాగితే అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోమని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.శాంతిభద్రతల పరిరక్షణ, కోర్టు ఆదేశాల అమలు కోసం వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలు మోహరించాలని హైకోర్టు సూచించింది. సదరు భూములకు రక్షణగా 10 మంది జవాన్లను కాపలా ఉంచాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘించి హైడ్రా అధికారులు అక్కడకు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వారు వచ్చే హైడ్రా వాహనాలను కూడా వెంటనే సీజ్ చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
ట్రైనీ IPS ఉదయ్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసు నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.ఇదిలా ఉంటే, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తదుపరి తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.మరోవైపు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీసీపీ లావణ్య నాయక్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ నుంచి డీసీపీ లావణ్య నాయక్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. -
ఉచిత వైద్యం అందించాల్సిందే
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ భూమిని రాయి తీ ధరకు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేవని హైకోర్టు తేల్చిచెప్పింది. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఓ పేద వితంతువుకు బసవతారకం ఇండో–అమెరికన్ కేన్సర్ హాస్పిటల్లో వెంటనే ఉచిత చికిత్స అందించాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన 25% ఉచిత ఇన్పేòషేంట్ చికిత్స కోటా కింద బాధితురాలిని చేర్చుకుని రుసుములు వసూలు చేయకుండా చికిత్స ప్రారంభించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.అలాగే ఆ నిబంధనలు నిజంగా అమలవుతున్నాయా.. లేదా.. అనే అంశంపై డీఎంహెచ్‌వో పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. కరీంనగర్‌లోని వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత తన వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో లేదని, చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును తానే భరించాలని ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడే షరతులు పిటిషనర్ తరఫున న్యాయవాది మల్లారెడ్డి గాడిపల్లి, సీనియర్ న్యాయవాది గండ మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 1989లో ప్రభుత్వం బంజారాహిల్స్‌లోని 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని బసవతారకం కేన్సర్ ఫౌండేషన్‌కు రాయితీపై లీజుకు ఇచి్చందన్నారు. ఆ సమయంలో ఆస్పత్రి 25 % ఇన్‌పేషెంట్ పడకలను పేద రోగులకు ఉచితంగా కేటాయించాలని, 40% ఔట్‌పేషెంట్ సేవలనూ ఉచితంగా అందించాలనే షరతులు విధించిందని తెలిపారు.ఈ షరతుల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 2022లో జీవో 80 జారీ చేసి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. తాము ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స కోరడం లేదని, ప్రభుత్వ భూమిని రాయితీపై పొందినందుకు ప్రతిఫలంగా ఆస్పత్రిపై ఉన్న 25 శాతం ఉచిత చికిత్స బాధ్యతను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. పిటిషనర్ జూలై 15న సంబంధిత అధికారులకు ఈ మేరకు వినతిపత్రాలిచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కోర్టు అత్యవసర జోక్యం: వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ కేన్సర్‌తో బాధపడుతూ తక్షణ వైద్య సహా యం అవసరమైన పరిస్థితిలో ఉన్నారని గుర్తించి, ఈ దశలో చికిత్స ఆలస్యం అయితే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉన్నందున, తుది విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. భాగ్యమ్మను వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించాలని, కన్సల్టేషన్, పరీక్షలు, కీమో థెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, మందులు, ఆస్పత్రిలో చేరిక తదితర అన్ని వైద్య సేవలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందించాలని బసవతారకం ఆస్పత్రిని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే చాన్స్ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఒక్క బాధితురాలికే పరిమితం కాకుండా ఇతరులకు, అలాగే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు తీసుకున్న లేదా ఇతర రాయితీలు పొందిన ప్రైవేటు ఆస్పత్రులకు కూడా వర్తిస్తాయా? ఇవన్నీ పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాయా.. లేదా? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంటున్నాయి. -
పోలీస్ నియామకాలపై అఫిడవిట్ ఇవ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన సుమారు 7,400 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీతినేడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. స్పెషల్ జీపీ రాహుల్ వాదనలు వినిపిస్తూ.. 5,000 పోలీసు పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని దీనికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని తెలిపారు. కానిస్టేబుల్ నియామకాలపై సెప్టెంబర్ 8న సుప్రీంలో తుది విచారణ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2022 నాటి పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మిగిలిపోయిన సుమారు 400 పోస్టుల భర్తీ వివాదంపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8న తుది విచారణ చేపట్టనుంది. ఒకే రిజర్వేషన్ కేటగిరీకి జిల్లాల వారీగా వేర్వేరు కటాఫ్ మార్కులు నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఇదొక సంక్లిష్ట న్యాయపరమైన అంశమని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఆర్టికల్ 371(డి) కింద రాష్ట్రపతి ఉత్తర్వులను వ్యాఖ్యానించాల్సిన అవసరం ఇందులో ఇమిడి ఉందని పేర్కొంది. పరిపాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాలను కలిపి ఒకే జిల్లాగా చేసినప్పుడు, లోకల్ ఏరియా పరిధిని ఎలా నిర్ధారించాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ వ్యవహారంపై తుది విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఇదే కేసుకు సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులో తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. -
హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!
-
కోర్టు ధిక్కరణ అలవాటైంది
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని తేల్చిచెప్పింది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదని, ఏ పనైనా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేసింది. ఐపీఎస్‌కు కూడా చెప్పాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసులో మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే ఆయనకు కోర్టులపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారులు ఉత్సాహంగా పనిచేయవచ్చని.. అయితే ప్రతి చర్య చట్ట పరిధిలోనే ఉండాలని పేర్కొంది. చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదంది. ఏవీ రంగనాథ్ చట్టానికి అతీతులు కారని.. తమను తాము ’సూపర్ కాప్స్’గా భావించుకోవద్దని సూచించింది. చట్టాన్ని మించి వ్యవహరించే అధికారం ఆయనకు లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో బాధితులు పిటిషనర్ కాదని, కోర్టేనని ఘాటు వ్యాఖ్య చేసింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా నేను అనుకున్నదే చేస్తా అనే లెక్కలేనితనంగా వ్యవహరిస్తే.. న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్కు సంబంధించి పూర్తి వివరాలతో మంగళవారం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. రంగనాథ్ హాజరుకు పోలీసులను ఆదేశిస్తాం..: గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, హైడ్రా తరఫున కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.నరసయ్య మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.హరీశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ..లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాల భూమిపై కోర్టు ఇప్పటికే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. గతంలో దాఖలైన ధిక్కార కేసులకు సంబంధించి జూన్ 10న ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్ ప్రైవేట్ భూమిలోకి అడుగుపెట్టవద్దని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ జూలై 18న సుమారు 200 మంది సిబ్బంది, 50కి పైగా వాహనాలు, జేసీబీలు, బుల్డోజర్లతో హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించి ప్రహరీ, టిన్ షెడ్లు, సీసీ కెమెరాలు, గేట్లు, విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశారని, స్థలాన్ని స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పిటిషనర్‌ను, అతని న్యాయవాదిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశిస్తామని అన్నారు. సాయంత్రం 6:30 గంటలకు హాజరవుతానని హైడ్రా కమిషనర్ చెప్పడంతో విచారణను వాయిదా వేశారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ సాయంత్రం ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద హడావుడి నెలకొంది. ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్, స్పెషల్ జీపీలు, జీపీలు అంతా విచారణకు హాజరయ్యారు. హైడ్రా తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జీఎల్ఆర్(కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూమి) సర్వే నంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే చేయడానికి, విభజన చేపట్టడానికి కొంత గడువివ్వాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గతంలో కలెక్టర్ ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు విభజనకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీఎల్ఆర్ భూమి అని చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఐపీఎస్ అధికారైన ఏవీ రంగనాథ్‌కు చట్టంపై నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ తీరుతో వ్యవహరించారన్నారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. -
బహదూర్‌గూడ భూములపై తదుపరి చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ సర్వే నంబర్లు 3, 5లోని 28.06 ఎకరాల భూమి విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కంచె ఏర్పాటు చేయడం లాంటి ప్రక్రియలన్నింటినీ ఆపాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. తమ ప్రైవేట్ భూమిలో అధికారులు జోక్యం చేసుకుంటూ, తమను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయతి్నస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి యాదిరెడ్డి, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు.లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు సర్వే నంబర్ 3, 5లో మొత్తం 28.06 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ప్రస్తుతం ఆ భూమిలో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఆ భూమిలోకి హైడ్రా అధికారులు అక్రమంగా ప్రవేశించి, గేట్లను కూల్చివేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్నారు. పిటిషనర్లను తమ వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, పంటల సాగు కూడా నిలిచిపోయిందని చెప్పారు. పిటిషనర్లు.. 1989–90లో చట్టబద్ధంగా నమోదైన అమ్మకపు పత్రాల ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశారని, మూడు దశాబ్దాలుగా వారి స్వా«దీనంలోనే వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. నేడు విచారణ.. ప్రభుత్వం తరఫున ఏజీ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ భూమి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరిస్తున్న సుమారు 650 ఎకరాల్లో భాగమన్నారు. పిటిషనర్లు సదరు భూమికి యజమానులని నిరూపించే చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, పహాణీలు, ఈ–పాస్‌బుక్కులు, లింక్ డాక్యుమెంట్లు సమరి్పంచలేదని తెలిపారు.పిటిషనర్లు భూమి సర్వే నంబర్లు 3, 5లో ఉందని చెబుతున్నప్పటికీ, బహదూర్‌గూడలో సర్వే నంబర్లు 28, 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అదే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం స్వా«దీనం చేసుకుంటోందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. బహదూర్‌గూడలోని 28.06 ఎకరాల భూమికి సంబంధించి తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఇదే అంశంపై 85 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సోమవారం (జూలై 20) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ అభ్యంతరాలపై స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహదూర్‌గూడ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. అయితే, సదరు భూసేకరణ పరిధిలోని సర్వే నంబర్ 3, 4లలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు.తాతముత్తాతల కాలం నుంచి ఆ భూములు తమ సాగులోనే ఉన్నాయని, సరైన పరిహారం, చట్టపరమైన నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం చెల్లదంటూ వారు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. వివాదంలో ఉన్న 28 ఎకరాల భూమిపై ప్రస్తుతానికి యథాతథంగా ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి పనులు లేదా భూసేకరణ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
కవలలున్నారని.. ప్రసూతి సెలవు నిరాకరించరాదు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి కవలలు జన్మించి న సందర్భాన్ని రెండు వేర్వేరు ప్రసవాలుగా పరిగణించరాదని, అది ఒకే ప్రసవంగా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. ‘టూ చైల్డ్ నార్మ్’పేరుతో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు నిరాకరించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తొలిసారి ఇద్దరు పిల్లలు పుట్టినా రెండో కాన్పునకు కూడా 6నెలల ప్రసూతి సెలవు మంజూ రు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో పిల్లలు ఒకరు పుట్టారా.. లేదా కవల లు జన్మించారా.. అన్నది మహిళ చేతిలో లేదని, ఇది జీవసంబంధమైన ప్రక్రియని వ్యా ఖ్యానించింది. మొదటి కాన్పులో కవలలకు జన్మనిచ్చినందున రెండవ కాన్పునకు మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవుకు అర్హురాలేనని చెప్పింది. పిటిషనర్‌కు ఆ మేరకు సెలవు మంజూరు చేయాలని, ఈ కాలానికి సంబంధించి పూర్తి వేతనం చెల్లించాలని గురుకుల సొసైటీని ఆదేశిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చింది. రెండు కాన్పునకు ప్రసూతి సెలవును నిరాకరించడా న్ని సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న స్వరూపారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు. జీవో 50.. మార్గదర్శకాలకు విరుద్ధం పిటిషనర్ తరఫు న్యాయవాది గట్టు వినయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తొలి గర్భధారణలో కవలలు జన్మించారు. అనంతరం రెండోసారి గర్భవతి కావడంతో 180 రోజుల ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలి కాన్పులోనే ఇద్దరు పిల్లలు పుట్టారని, ఆమెకు ఇప్పటికే ఇద్దరు సంతానం ఉన్నట్లేనంటూ అధికారులు ప్రసూతి సెలవును తిరస్కరించారు. కవలల జననం ఒకే గర్భధారణ ఫలితం. దానిని రెండు ప్రసవాలుగా పరిగణించడం చట్టవిరుద్ధం’అని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 50 జారీ చేసిందని, ఈ నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవు ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు వర్తిస్తుందన్నారు.పిటిషనర్‌కు ఇద్దరు పిల్లలున్నందున సెలవు నిరాకరించారని, జీవోకు విరుద్ధంగా సెలవు మంజూరు చేస్తే ఆడిట్ అభ్యంతరాలు, నిధుల దుర్వినియోగం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రసూతి సెలవులను సంక్షేమ దృక్పథంతో మహిళల హక్కులను పరిరక్షించేలా చూడాలని.. యాంత్రికంగా అమలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం, హైకోర్టుల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో 50 ఉందన్నారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేష్
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న రుణ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ఫేసీ, ఐబీసీ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు.కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ సమయంలో, బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద చర్యలు చేపట్టి తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒకదానిని వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను, సేల్ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) తప్పుబట్టింది. కొనుగోలుదారుడికి వడ్డీతోసహా డబ్బును వాపసు చేయాలని, పిటిషనర్లకు ఆస్తిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అయితే, డీఆర్టీ ఇచ్చిన ఈ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద బ్యాంక్ రూ.71.44 కోట్లతో సహా సుమారు రూ.129.02 కోట్లను రికవరీ చేసిందని, బకాయిలు పూర్తిగా తీరిపోయినట్లు సెటిల్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని బండ్ల గణేష్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం త్వరలో విచారణకు రానుంది. -
కొల్లూరులో 2 బీహెచ్‌కే ఇళ్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి భీమ్రావ్బాడా స్లమ్ వాసులకు కొల్లూరులో 2 బీహెచ్‌కే ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధి కారిక ఉత్తర్వుల కాపీ అందిన రెండు నెలల్లో కేటాయింపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్లమ్వాసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు మెరుగైన జీవన పరిస్థితు లు కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం సానుకూలంగా 2 బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపునకు ముందుకు రావడాన్ని అభినందించింది. పిటిషనర్లు కూడా ప్రభుత్వ ప్రతిపాదనను స్వచ్ఛందంగా అంగీకరించడంతో, వివాదంలోని ఇతర అంశాలపై తీర్పు ఇవ్వకుండా పరస్పర అంగీకారంతో కేసును ముగించడం సముచితమంటూ అభిప్రాయపడింది. ఈ మేరకు తీర్పు కాపీ విడుదల చేసింది. దీంతో 18 ఏళ్ల తర్వాత భీమ్రావ్బాడా స్లమ్ వాసులకు న్యాయం దక్కినట్లయింది. తమ ఇళ్లు తొలగించడాన్ని సవాల్ చేస్తూ స్లమ్‌కు చెందిన కె.భారతితోపాటు 71 మంది హైకోర్టులో 2008లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు మల్లారెడ్డి గాడిపల్లి తదితరులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల పూర్వీకులు 60 ఏళ్లకు పైగా భీమ్రావ్ బాడా స్లమ్‌లో నివసిస్తున్నారని, 1991 లో ఆ ప్రాంతాన్ని అధికారికంగా స్లమ్‌గా ప్రకటించారన్నారు. అనంతరం కొందరికి డీ–ఫారం పట్టాలు కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఆ పట్టాలను రద్దు చేసి, 2008 లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 251 ద్వారా స్లమ్‌ను డీ–నోటిఫై చేసి, అక్కడి ప్రజలను అఫ్జల్‌సాగర్‌కు తరలించే చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ.. అఫ్జల్‌సాగర్‌లో నివాసానికి అనుకూల పరిస్థితులు లేకుంటే, కొల్లూరు సహా పలు ప్రాంతాల్లోని 2 బీహెచ్‌కే కాలనీల్లో ఇళ్లు కేటాయించేందుకు సిద్ధమని తెలి పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అర్హులైన ప్రతీ కుటుంబానికి కొల్లూరు 2 బీహెచ్‌కే కాలనీలో ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేటాయింపునకు రెండు నెలలు గడువు విధిస్తూ, విచారణ ముగించారు. -
విద్యార్థుల నుంచి ఫీజుల వసూలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి జీవో నంబర్–9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2026–27 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఆగస్టు 15 వరకు అడ్మిషన్ల (తొలి ఏడాది) విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని.. ఈ నెలాఖరులోగా ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఈ మేరకు ఉపశమనం ఇచ్చింది. ప్రవేశాలు యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు చెప్పింది.ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల వివరాలను వారం రోజుల్లో సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం నిధుల విడుదల చర్యలు చేపట్టి.. జూలై 31లోగా ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక మొదటి ఏడాది విద్యార్థులకు ఆగస్టు 15 డెడ్‌లైన్ విధించింది. ఆలోగా తొలిదశ ఫీజు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఆ తర్వాత కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. గురువారం సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ 100కుపైగా కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇది గత ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నాయి. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. జీవో నంబర్ 9లోని నాలుగు పేరాలపై గత నెల స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో స్టే ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఏళ్లుగా బకాయిలు పెడితే కాలేజీలు ఎలా నడపాలి.. కాలేజీల తరఫున న్యాయవాదులు వాదిస్తూ ‘విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు చెప్పిన తర్వాత.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 7 తెచ్చింది. జీవో 7పై స్టే ఇస్తే.. జీవో 8, 9 తీసుకొచ్చింది. వాటిపైనా స్టే ఇవ్వడంతో వెకేట్ పిటిషన్ వేసింది. ఇదంతా చేసిన ప్రభుత్వంపై మాకు నమ్మకం ఎలా ఉంటుంది? విద్యార్థుల భవిష్యత్ కోసం అని చెబుతున్న ప్రభుత్వం.. తొలి దశగా రూ. 1,500 కోట్లు కూడా విడుదల చేయలేదా? ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న ఫస్ట్ ఇయర్ వారికి ఇస్తామంటే.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఆగస్టు 27 వరకు చివరి అడ్మిషన్లకు అవకాశం ఉంది. ఒకవేళ ఆగస్టు 15న ప్రభుత్వం చెల్లిస్తే ఆ తర్వాత విద్యార్థులు చేరొచ్చు. జీవోపై స్టే ఉపసంహరించవద్దు. ఒకవేళ స్టేను సడలిస్తే అడ్మిషన్లకు సంబంధించి చెల్లింపుపై ఆగస్టు 19 వరకే అవకాశం ఇవ్వండి. అప్పటిలోగా కాలేజీలకు చెల్లించని పక్షంలో ఆగస్టు 20 నుంచి కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేలా ఆదేశించండి’అని కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ‘అన్ని సంవత్సరాల విద్యార్థుల కోసం రూ. 250 కోట్లు విడుదల చేస్తున్నాం. తొలి దశలోని మిగతా ఫీజు ఆగస్టు 15న విడుదల చేస్తాం. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని కాలేజీలు చెబితే.. పేద విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడుతుంది. ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజుల చెల్లింపుపైనా ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకుంటాం. గతంలో ఇచ్చిన మధ్యంతర స్టేను సడలించి.. ఉపశమనం కల్పించాలి’అని విజ్ఞప్తి చేశారు. -
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని కోర్టు ఆదేశించింది.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మే 16న పోక్సో కేసులో అరెస్టయ్యాడు. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం భగీరథ్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు గత నెల 20న హైకోర్టు భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువులో పరీక్షలు రాసిన అనంతరం జూన్ 25న తిరిగి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో పాటు కేసు విచారణకు సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. -
రెవెన్యూ శాఖ ఏం పనిచేస్తోంది?
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోకుండా రెవెన్యూ శాఖ ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల అలసత్వం కారణంగా పెరిగిపోతున్న పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భూ సంబంధిత దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని అభిప్రాయపడింది. అధికారులు తమ విధులను నిర్ణీత గడువులో నిర్వర్తిస్తే ఇటువంటి వ్యాజ్యాలు కోర్టుకు రావాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. రెవెన్యూ సేవలకు సంబంధించిన పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరిస్తున్న ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్వోపీ) ఏంటని ప్రశ్నించింది. రోజూ న్యాయస్థానం ముందుకొస్తున్న పిటిషన్లలో దాదాపు ఒకే రకమైన ఫిర్యాదులు ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. దరఖాస్తులు చేసినా ఫీల్డ్ సర్వేలు నిర్వహించకపోవడం, రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మారి్పడిలో జాప్యం, రెవెన్యూ ఎంట్రీలను సరిదిద్దకపోవడం, పట్టాదారు పాస్ బుక్‌ల నుంచి సర్వే నంబర్లను తొలగించడం, రిజిస్టర్డ్ సేల్ డీడ్లు లేదా ఇతర కన్వేయన్స్ల తర్వాత పట్టాదారు పాస్ బుక్‌ల జారీలో జాప్యం లాంటి సమస్యలు ఉంటున్నాయని పేర్కొంది. ఎస్‌వోపీపై నాలుగు వారాల్లోగా సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. మీ పని చేయడానికీ కోర్టు ఆదేశాలు... నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లిలోని ఎకరం భూమిని రెవెన్యూ రికార్డుల్లో తన పేరిట నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హన్మాండ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తు పెండింగ్‌లోనే ఉందని, సంబంధిత అధికారులను నిర్ణయం తీసుకోవాలని ఆదేశించాలని కోరారు. రెవెన్యూ ఏజీపీ వాదిస్తూ.. దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకుంటున్నా పోస్టల్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని పంపడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రెవెన్యూ శాఖ పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం కారణంగా ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సి వస్తుండటంతో, పరిపాలనావ్యవస్థ చేయాల్సిన పనులపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాజ్యాలతో కోర్టుపై అనవసర భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటే అనవసరంగా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి తగ్గుతుందన్నారు. -
ఆస్తి ఉంటే అప్పులకూ వారసుల బాధ్యత: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మరణించక ముందు వ్యక్తి చేసిన చట్టబద్ధమైన అప్పుల నుంచి వారసులు పూర్తిగా తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి లేదా ముందు తరం వారు చేసిన అప్పుల బాధ్యత, వారసత్వంగా వచ్చిన ఆస్తులపై కొనసాగుతుందని స్పష్టం చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద అధికారుల చర్యలు చట్టబద్ధమేనని చెబుతూ, కామారెడ్డి జిల్లాకు చెందిన యశోద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. యశోద భర్త జలాల్పూర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా పనిచేసే సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) నిధుల్లో రూ.14.89 లక్షలు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు అక్రమ వినియోగం జరిగినట్లు నిర్ధారించి, ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌లోని వ్యవసాయ భూములను జప్తు చేసి వేలం వేయడానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ యశోద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఆ భూములు యశోద భర్త సంపాదించినవి కాదని, పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వ ఆస్తులని చెప్పారు. పిటిషనర్‌తోపాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా ఆ ఆస్తులపై హక్కుదారులన్నారు. భర్త చేసిన అప్పులకు మొత్తం భూమిని వేలం వేయడం చట్టవిరుద్ధమని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూ వారసత్వ చట్ట సవరణలపై స్పష్టత ఇచ్చారు. 2005 సవరణతో ‘పయస్ అబ్లిగేషన్’(తండ్రి అప్పులు తీర్చాల్సిన పుత్ర ధర్మం) సిద్ధాంతంలో మార్పులు వచ్చి నా, మరణించిన వ్యక్తి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుంచి మాత్రం బకాయిల చెల్లింపు బాధ్యత కొనసాగుతుందన్నారు. పిటిషనర్ స్వయంగా భూమి పూర్వీకుల ఆస్తేనని అంగీకరించిన తర్వాత, రికవరీ చర్యలను ప్రశ్నించలేరని తేల్చిచెప్పారు. -
బండ్ల గణేష్ ఆస్తి వేలంపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు చెందిన జూబ్లీహిల్స్ ఆస్తి వేలానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ, బ్యాంకు సర్ఫేసీ చట్టం–2002 కింద చేపట్టిన ఆస్తి వేలం సమర్థనీయమేనని తేల్చిచెప్పింది. వేలం ద్వారా చేసిన విక్రయాన్ని రద్దు చేసి, ఆ సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. బండ్ల గణేశ్, ఆయన తండ్రి, సోదరుడు తదితరులకు చెందిన ఆస్తి వేలం వేయడాన్ని రద్దు చేస్తూ డీఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. బ్యాంక్ తరఫున మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణ రికవరీలో భాగంగా హామీదారులైన కుటుంబానికి చెందిన ఆస్తిని 2019లో స్వాధీనం చేసుకున్నామని. 2022లో వేలం నిర్వహించగా రూ.8.51 కోట్లు వచ్చిందన్నారు. డీఆర్టీ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని చెప్పారు. రుణగ్రహీత కంపెనీకి సంబంధించి ఎన్సీఎల్టీలో దివాళా ప్రక్రియ ప్రారంభమైనంత మాత్రాన వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై మారటోరియం వర్తించదన్నారు. వ్యక్తిగత గ్యారెంటర్లపై ప్రత్యేకంగా దివాళా చర్యలు ప్రారంభించినప్పుడే ఆ రక్షణ వర్తిస్తుందన్నారు. రూ. 8.50 కోట్ల విక్రయ మొత్తాన్ని ఇప్పటికే వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద బ్యాంక్ సర్దుబాటు చేసినట్లు తెలిపారు. పిటిషనర్లు ఓటీఎస్ కింద చెల్లించడానికి ముందుకొచ్చారని, దీనికి బ్యాంకు అంగీకరించిందన్నారు. వేలాన్ని సవాలు చేయడంతోపాటు బ్యాంకుపై వేసిన ఇతర పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి బండ్ల గణేశ్ అంగీకరించారన్నారు. అది చేయకుండానే డీఆర్టీని ఆశ్రయించారని, ట్రిబ్యునల్ బ్యాంక్ రికార్డులను పరిశీలించకుండా వేలాన్ని రద్దు చేసిందన్నారు.సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తా : బండ్ల గణేశ్హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తన ఆస్తిని బ్యాంక్ వాళ్లు అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో సుధీర్గమైన పోస్ట్ పెట్టాడు.‘అన్యాయంగా, లోపాయికారీ ఒప్పందంతో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు బ్యాంకు అధికారులు నా ఆస్తిని విక్రయించారు. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. ఈ కేసులో కింది డీఆర్టీ (DRT)లో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. అయినప్పటికీ నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిజాయతీగా నా హక్కుల ఆధారంగా న్యాయం సాధిస్తాననే అచంచలమైన నమ్మకం నాకు ఉంది’ అని తెలిపారుగతంలోనూ అనేక కేసులు..రుణాలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా లీగల్ చిక్కుల్లో పడడం బండ్ల గణేశ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ ఆయనపై పలు ప్రాంతాల్లో చెక్ బౌన్స్ కేసులు నమోదు అయ్యాయి. టెంపర్ సినిమాకు రచయితగా పని చేసిన వక్కంతం వంశీకి ఇవ్వాల్సిన రూ. 26 లక్షల రెమ్యునరేషన్ చెక్ బౌన్స్ కావడంతో.. ఆయనకు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల కఠినగారా శిక్షతో పాటు రూ.16లక్షల జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత ఆయన పర్సనల్ బాండ్లపై బెయిల్ పొందాడు. అలాగే కడప జిల్లాకు చెందిన ఒక ఫైనాన్షియర్ నుంచి తీసుకున్న ఆర్థిక సహాయానికి ప్రతిగా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కడప కోర్టులో కూడా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టుకు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆయనపై ఒకానొక దశలో నాన్-బెలబుల్ వారెంట్ (NBW) కూడా జారీ అయింది. -
జీవో 9పై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి జీవో నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టేను హైకోర్టు పొడిగించింది. వచ్చే సోమవారం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. మంగళవారం కౌంటర్ దాఖలు చేస్తామని, అందరికీ కాపీ ఇవ్వడానికి ఈనెల 6 వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కాలేజీల తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి సమ్మతించిన న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే సోమవారంలోగా రిప్లై కౌంటర్ వేయాలని కాలేజీలను ఆదేశించారు. అలాగే ఫీజుల నిర్ధారణ అంశాన్ని కాలేజీల న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో సోమవారం ఆ పిటిషన్లపై కూడా విచారణ చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ 100కుపైగా కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తామని స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి చెప్పారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, ఎస్.శ్రీరామ్, అవినాశ్ దేశాయ్, తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇన్ని రోజులు సమయం తీసుకుందన్నారు. -
‘సర్’పై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) హైదరాబాద్ మినహా ఫారాలను తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఫారాలు అందించే విషయాన్ని పరిశీలించా లని ఈసీని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సర్ ఫారాలు ఏఏ భాషల్లో ముద్రించారో వివరాలివ్వాలన్నారు. అలాగే పిటిషనర్ అభ్యంతరాలపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వారంపాటు వాయిదా వేశారు. ఎస్ఐఆర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కరీంనగర్‌కు చెందిన ఎంఏ ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఓటర్ల నమోదు నియమావళి రూల్ 4కు ఈసీ తీరు వ్యతిరేకం.. వివక్షపూరితమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలన్నీ సమ్మతించాయి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోలకు ఏ భాష వచ్చో.. ఏ భాష రాదో.. తెలియదు. మైనారిటీలను తొలగించాలనే ఉద్దేశంతోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే దరఖాస్తు ముద్రించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆంగ్లంలో ఉన్న ఫారాలను కూడా హైదరాబాద్ వరకే ఇచ్చారు. తెలిసిన భాషలో పత్రం కోరడం రాజ్యాంగ హక్కు. హైదరాబాద్‌లో ఉర్దూ వచ్చిన వారెక్కువ. తెలుగు రాని వారి కోసం ఉర్దూలో ముద్రించాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోల వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూ డమ్మీ ఫారాలుంటాయి. ఎవరికైనా తెలుగు తెలియకుంటే ఇతర భాషలోనివి చూపించి.. తెలుగు ఫారమ్‌లో నింపుతారు. ఈ నెల 17న జరిగిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ దీనికి ఏకగ్రీవంగా సమ్మతించాయి. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారున్నారు.. దేశంలోని అన్ని భాషల్లో సర్ ఫారాలు ప్రింట్ చేయాలనడం సరికాదు. ఇప్పటికే ప్రింటింగ్ ముగిసింది. బీఎల్వోలు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఫారమ్‌లో రెండు, మూడు భాషలిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఫారమ్ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది’అని చెప్పారు. -
ముగిసిన ‘ఎస్బీఐ’ వివాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. రాయదుర్గంలో మే 28వ తేదీన సర్వేనంబర్ 83/1లోని 6.29 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా, అందులో ఐదు ఎకరాలు తమవంటూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ఎస్బీఐ నేరుగా కోర్టు మెట్లు ఎక్కడం సంచలనం కలిగించింది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో లావాదేవీలు పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని, ఎస్బీఐ చైర్‌పర్సన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికి కూడా వచ్చింది. ఇదో పెద్ద వివాదంగా మారిన తరుణంలో రంగంలోకి దిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎస్బీఐతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల కొనసాగింపుగా సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వేలం ద్వారా ఎస్బీఐ కోల్పోయిన ఐదెకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా ఆ స్థలానికి సమీపంలోనే 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం ఆఫర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు బ్యాంక్ అధికారులు తాజాగా సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ స్థలాలను ఎస్బీఐ ప్రతినిధుల బృందం ఈ నెల 23న పరిశీలించింది. దీనిపై బోర్డు ఆమోదం పొందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ ప్రతినిధులు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వెల్లడించారు. ప్రస్తుత కోర్టు కేసుల నిబంధనలకు లోబడి తగిన చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ చర్చల అనంతరం ఇరుపక్షాలు ఒక సయోధ్య, పరస్పర అంగీకారానికి వచ్చాయి. అవసరమైన చట్టపరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసి, ఈ అంశాన్ని త్వరలోనే ముగించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, టీజీఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ కె.శశాంక పాల్గొన్నారు. ఎస్బీఐ తరఫున డీబీడీ, సీడీవో జీఎస్.రాణా, తెలంగాణ సీజీఎం నీలేశ్ ద్వివేది, ఏజీఎం జి.పూవజళి హాజరయ్యారు. -
సైనికుల సేవలు ‘సరిహద్దు’లకు అతీతం
సాక్షి, హైదరాబాద్: 1971 ఇండో–పాక్ యుద్ధంలో గాయపడి వికలాంగుడైన మాజీ సైనికుడు సీతారామరాజుకు ఇంటి స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుల సేవలు ప్రాంతీయ సరిహద్దులను మించినవని పేర్కొంది. జన్మస్థలం ఆధారంగా స్థలం నిరాకరించడం చెల్లదని స్పష్టం చేస్తూ, రంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన మెమోను కొట్టివేసింది. 1993లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యుద్ధ వీర వితంతువులు, వికలాంగ మాజీ సైనికులకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినా, అధికారుల నిర్లక్ష్యంతో సీతారామరాజుకు స్థలం ఇవ్వలేదని అభిప్రాయపడింది. 2005లో వచ్చిన జీవో ప్రకారం 300 చదరపు గజాల స్థలం ఇవ్వాల్సిన అర్హత అతనికి ఉందని పేర్కొంది. సీతారామరాజుకు తెలంగాణలోని ఏదైనా మున్సిపల్ ప్రాంతంలో ఆ మేరకు స్థలం కేటాయించే అంశాన్ని 3 నెలల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటి స్థలం ఇచ్చేందుకు కలెక్టర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సీతారామరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కావడంతో తెలంగాణలో ఇంటి స్థలం ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పిటిషనర్ 1975 నుంచే హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు సైనిక్ వెల్ఫేర్ అధికారుల ధ్రువీకరణ ఉందని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఫీజు వసూళ్లపై కాలేజీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కళాశాలలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఈ నెల తొలివారంలో జారీ చేసిన జీఓ నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై మధ్యంతర స్టే విధించింది. వచ్చే మంగళవారం (30వ తేదీ) వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపు, కొత్త ఫీజులకు బడ్జెట్లో ఎంత కేటాయించారని, బడ్జెట్ సెషన్ కూడా ముగిసినట్టుంది కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెండింగ్ బకాయిల చెల్లింపుపై స్పష్టత వచ్చిందా అని స్పెషల్ జీపీని అడిగింది. ప్రస్తుతం తను ఎలాంటి వాదనలు వినిపించలేనని, అడ్వొకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారని, మంగళవారం వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్, న్యాయవాది తరణ్ జీ రెడ్డి జోక్యం చేసుకొని.. అప్పటివరకు జీఓ 9లోని ఫీజులకు సంబంధించిన పేరా 5.2(ఈ), 10.2, 10.4, 12.1(ఏ)లను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ విచారణ వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న జారీ చేసిన జీఓ 7లోని ఓ క్లాజ్‌ను సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ క్లాజ్ విరుద్ధమని పేర్కొన్నాయి. ఈ క్లాజ్ ప్రకారం ప్రవేశ సమయంలో ట్యూషన్ ఫీజు సహా ఇతర ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అన్ని అంశాలపై ఏజీ స్పష్టత ఇస్తారు.. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆగస్టు 15న కొంతమేర చెల్లింపులు చేస్తామని జీఓ ఉందన్నారు. అడ్మిషన్లన్నీ పూర్తయి, అప్లికేషన్లు పంపే వరకు ఆగస్టు 1 వస్తుందని, పదిహేను రోజుల్లో ఫీజులు విడుదల చేస్తామని ఉత్తర్వులో చెప్పారన్నారు. ఈ పిటిషన్లలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరై వాదనలు వినిపిస్తారని, అన్ని అంశాలపై స్పష్టత ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం తాను ఎలాంటి వాదనలు వినిపించలేనన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, తరణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏజీ హాజరయ్యే వరకు జీఓ 9లోని అభ్యంతరకర నిబంధనలపై సస్పెన్షన్ విధించాలన్నారు. ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లిస్తే పిటిషన్ల ఉపసంహరణపై ఆలోచిస్తామన్నారు. మరోవైపు విద్యార్థులు తమ ఇబ్బందులను తెలియజేస్తూ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. కళాశాలలు, ప్రభుత్వానికి మధ్య తాము నలిగిపోతున్నామన్నారు. వారి తరఫు న్యాయవాదు లు వాదిస్తూ.. 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులను ఫీజు చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందంటేనే వారు కాలేజీల్లో చేరారని, ఇప్పుడు ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. చాలా మంది పేద విద్యార్థులున్నారని, తొలి ఏడాది విద్యార్థులకే ఫీజు చెల్లింపు ఉత్తర్వులు అమలు చేసేలా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశా రు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మంగళవారం అందరి వాదనలు విని నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు నాలుగు పేరాలపై మధ్యంతర సస్పెన్షన్ విధించారు. ఆ నాలుగు మార్గదర్శకాలు ఇవే..5.2(ఈ): మెరిట్ ఆధారంగా పారదర్శక అడ్మిషన్లు అర్హత కలిగిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా, పూర్తి పారదర్శక విధానంలో కన్వినర్ కోటా సీట్ల ద్వారా ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు మంజూరయ్యే స్కాలర్íÙప్ మొత్తాన్ని వారి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తర్వాత, అదే మొత్తంతో ట్యూషన్ ఫీజుతోపాటు ఇతర ఫీజులను ఆయా విద్యాసంస్థలకు చెల్లించాలి. ఆగస్టు 15, డిసెంబర్ 30, ఫిబ్రవరి 28.. ఇలా నిర్దేశించిన గడువుల ప్రకారం ఈ ఫీజుల చెల్లింపులు పూర్తి చేయాలి. 10.2: 7 రోజుల్లో ఫీజు చెల్లింపు.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో విద్యార్థులకు ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ తర్వాత 7 పనిదినాల్లోపు ఆయా విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లింపులు పూర్తి చేయడం విద్యార్థుల బాధ్యత.10.4: ఫీజు చెల్లింపు హామీతోనే అడ్మిషన్.. అర్హత కలిగిన విద్యార్థులకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించేటప్పుడు ఈ జీఓలోని మార్గదర్శకాల ప్రకారం ఫీజుల చెల్లింపు జరిగేలా నిర్ధారించుకోవాలి. స్కాలర్షిప్ ఆధారంగా ఫీజు చెల్లింపు జరుగుతుందనే ప్రాతిపదికపైనే కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్లు మంజూరు చేయాలి.12.1(ఏ): డీబీటీ విధానం తప్పనిసరి.. ప్రతీ విద్యాసంస్థ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. అర్హత ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే సమయంలో ట్యూషన్, హాస్టల్ ఫీజును కూడా విద్యార్థులే తమ ఖాతాల్లో జమయ్యే స్కాలర్íÙప్ మొత్తంతో విద్యాసంస్థలకు చెల్లించే విధానాన్ని గౌరవించాలి. -
కోర్టు నోటీసులంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం నోటీసులంటే గౌరవం లేదా అని విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది సమాచారం ఇచ్చి కారణాలు తెలుపుతూ ‘డిస్పెన్స్’ అప్లికేషన్ వేయకపోవడాన్ని సహించరాని నిర్లక్ష్యంగా పరిగణించాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్లిపోయారని పేర్కొంది. ఇది రాజ్యాంగ ధర్మాసన ఉత్తర్వుల ధిక్కరణ కిందకే వస్తుందని, కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. కారుణ్య నియామకం అంశం కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని యోగితారాణా చెప్పగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ‘కలెక్టర్ మీ పేరు చెబుతారు.. మీరు కలెక్టర్ అని చెబుతారు. పిటిషనర్‌తో ఆటలాడుకుంటున్నారా’ అని నిలదీశారు. కారుణ్య నియామకానికి సంబంధించి కోర్టు 2023, అక్టోబర్‌లో ఇచ్చిన ఉత్తర్వులను పాటించకపోవడంతో.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌కు చెందిన సయ్యద్ మహబూబ్ హైకోర్టులో 2024, ఫిబ్రవరిలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు ఫామ్–1 నోటీసులిచ్చినా హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారి నిజామాబాద్‌లో ఉన్నందున ఆన్లైన్లో హాజర య్యేందుకు అవకాశం ఇవ్వా లని ప్రభుత్వ న్యాయవాది కోరినా నిరాకరించారు. ధిక్కరణ పిటిషన్లో ఇంత నిర్లక్ష్యాన్ని సహించరానిదంటూ విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. న్యాయమూర్తి సమ్మతి మేరకు మధ్యా హ్నం యోగితా రాణా.. ఆన్లైన్లో హాజరై క్షమాపణ కోరారు. ఉదయమే నిజామాబాద్ వచ్చానని.. కార్యాలయంలో సమాచార లోపం కారణంగా తాను హాజరుకాలేకపో యానని, కోర్టులంటే గౌరవం ఉందని చెప్పారు. నోటీసులు అందుకుని కోర్టుకు రాకపోవడం ధిక్కరణ కిందకు వస్తుందని, మరోసారి ఇలా నిర్లక్ష్యం వహిస్తే శిక్షించాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. తదుపరి విచారణ నుంచి హాజరుకు మినహాయింపు ఇస్తూ.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
-
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటాయని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం స్పష్టం చేసింది.కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ఆంక్షలు విధించడంపై న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదన్న ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ 89 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.కోట్లాది రూపాయల బకాయిలను పెండింగ్‌లో ఉంచితే కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను, సిబ్బంది జీతాలను ఎలా చెల్లిస్తాయి? కాలేజీలు ఎలా నడుస్తాయి?" అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించదు, అటు కాలేజీలను విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోనివ్వదు. ఇలాంటప్పుడు ప్రస్తుత విద్యాసంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని కోర్టు నిలదీసింది.గతంలో ప్రభుత్వం తెచ్చిన జీవో 7 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నెం. 9 లో కూడా పాత నిబంధనలనే కొనసాగిస్తూ విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లలో ‘ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొనడాన్ని కోర్టు తప్పుబడుతూ స్టే ఇచ్చింది.ప్రభుత్వం తరఫున స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బకాయిల చెల్లింపుపై వివరణ ఇచ్చారు. ఈ రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధుల్లో కేంద్రం వాటా ఉంటుంది. అయితే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు చెల్లించాలని, ఆ తర్వాతే తమ వాటా విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని వివరించారు. దీనివల్ల మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడిందని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి రెండు వారాల సమయం కావాలని కోరారు.ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులందరికీ ఆగస్టు 15 లోపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం గనుక అధికారికంగా కోర్టుకు రోడ్‌మ్యాప్ సమర్పించి, ఆగస్టు 15 లోపు బకాయిలన్నీ స్పష్టంగా చెల్లిస్తామని హామీ ఇస్తే.. తాము దాఖలు చేసిన పిటిషన్లను విత్‌డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కాలేజీల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. -
ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉంచితే కాలేజీలు ఎలా నడుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించకుండా.. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవద్దంటే ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్ ఎలా ఇస్తారని నిలదీసింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.బకాయిల చెల్లింపు తేదీతో రావాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న జారీ చేసిన జీవో 7లోని ఓ క్లాజ్‌ను సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ క్లాజ్ విరుద్ధమన్నాయి. దీని ప్రకారం ప్రవేశ సమయంలో ట్యూషన్ ఫీజు సహా ఇతర ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. కాలేజీల పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. తాజా జీవోనూ సస్పెండ్ చేయాలి.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే విధించిన జీవో 7ను ఉపసంహరిస్తూ జీవో 8ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మార్గదర్శకాలతో జీవో 9ని విడుదల చేసిందని చెప్పారు. ఇందులోనూ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తామని చెప్పిందన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరిగా వారంలోపు కాలేజీలకు చెల్లించాలని, అలా చెల్లించని విద్యార్థుల తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేస్తామని పేర్కొందన్నారు. ఈ జీవో కూడా గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని.. సస్పెండ్ చేయాలని కోరారు. ఫీజు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం వెంటనే చెప్పాలని.. లేనిపక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కేంద్రం వాటా రావాలి: జీపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్రం వాటా కూడా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రమే రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తోందన్నారు. అయితే.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కేంద్రం చెబుతోందని, ఆ తర్వాత తమ వాటా విడుదల చేస్తామంటోదన్నారు. దీంతో ఇప్పుడు మొత్తం బకాయిలను రాష్ట్రం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. బకాయిలు రూ.వేల కోట్లు ఉన్నందున కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు రెండు వారాలు గడువు కావాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అంత సమయం ఇవ్వలేమని, గురువారం(నేడు)లోగా బకాయిల విడుదలపై స్పష్టత ఇవ్వాలంటూ విచారణ వాయిదా వేశారు. -
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
సాక్షి,హైదరాబాద్: సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 25 వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. -
ఫుట్‌పాత్‌లపై 'దుకాణాలు'.. నడిరోడ్డుపై 'పాదచారులు'
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపుపై గత విచారణ సందర్భంగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని అధికారులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలు కొనసాగుతుండటంతో ప్రజలు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. హైకోర్టు సమీపంలోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడానికి కారణమవుతున్నాయని పేర్కొంది. న్యాయవాదులు, వ్యాజ్యదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. టీజీ–బీపాస్ చట్ట ప్రకారం అనధికార నిర్మాణాలపై పౌరులు కూడా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కోర్టు గుర్తు చేసింది. పట్టణ ప్రణాళిక నిబంధనలను ఉల్లంఘించిన వారికి కోర్టులు ఉపశమనం ఇవ్వకూడదని, అక్రమ, అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాజ్యాంగ న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించకూడదని.. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. ఫుట్‌పాత్‌లపై అక్రమ ఆక్రమణలు ట్రాఫిక్ రద్దీని పెంచడంతోపాటు వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రాంగణం నుంచే ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించి హైదరాబాద్ నగరమంతటా విస్తరించాలని అధికారులను ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రెండు వారాల్లో చర్యలు ప్రారంభించాలి.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణ కేంద్రాల్లో రోడ్లు సక్రమంగా ఉండటంలేదని, పాదచారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేలా ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్ బి.సురేందర్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. మే 4న జారీ చేసిన ఆదేశాల అమలుపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి నివేదికను అధికారులు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి, శాశ్వత రక్షణ ఏర్పాట్లు చేయాలని, పాదచారులు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించిన విషయం గుర్తు చేశారు. -
ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా ఆరోపించిన కేసుల్లో వాన్‌పిక్ (వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను విడుదల చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన తొమ్మిది పిటిషన్లు కొట్టివేసింది.ఈ మేరకు జస్టిస్ పి. శామ్ కోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం.. అన్ని వర్గాల నుంచి సుదీర్ఘ వాదనలు విని గతేడాది డిసెంబర్ 23న తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అందులోని నిర్ధారణలు, పత్రాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేలా ఎటువంటి కొత్త ఆధారాలు లేదా చట్టపరమైన కారణాలను ఈడీ చూపించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.ట్రిబ్యునల్ ఇచ్చిన కారణాలు సమంజసంగా ఉన్నాయని సమర్ధించింది. వాటిని తప్పుబట్టేందు కు తగిన ఆధారాలు రికార్డులో లేవని స్పష్టం చేసింది. దీంతో ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను కొట్టివేస్తూ.. ట్రిబ్యునల్ ఉత్తర్వులను యథాతథంగా వెంటనే అమలు చేయాలని తేల్చిచెప్పింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ మొత్తం 12 కేసుల్లో ఉత్తర్వులు జారీ చేయగా గతంలో హైకోర్టు మూడు కేసుల్లో ఊరటనిచ్చింది. దీంతో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తోపాటు సంబంధిత కంపెనీలకు ఇది కీలక న్యాయపరమైన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఏమిటి వాన్‌పిక్ కేసు? వాడరేవు, నిజాంపట్నం ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, షిప్‌యార్డ్, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాన్‌పిక్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా ప్రభుత్వం మధ్య ప్రభుత్వ–ప్రభుత్వ (జీటుజీ) విధానంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.ఈ ప్రాజెక్టులో ప్రయోజనాలు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్, ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ. 863.33 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న నాటి అధికార, ప్రతిపక్ష కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. అక్రమంగా మనీలాండరింగ్ కేసులు నమోదు చేసి, పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించడంతో జగన్మోహన్రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా కంపెనీలు అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్ఏం చెప్పింది? విచారణ అనంతరం ట్రిబ్యునల్కీలక వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్టు అధికారికంగా అమల్లోకి రావడానికి ముందే సంబంధిత పెట్టుబడులు జరిగాయని.. కాబట్టి వాటిని ప్రాజెక్టుకు ప్రతిఫలంగా ఇచ్చినట్లు లేదా క్విడ్ ప్రో కోగా పేర్కొనలేమంది. అక్రమ పెట్టుబడులను నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ.. 2019 జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న మీడియా సంస్థ జగతి పబ్లికేషన్స్ ఆస్తుల బదిలీని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఉన్నందున, ఆ సంస్థకు సంబంధించిన రూ. 273.39 కోట్ల విలువైన ప్లాంట్, యంత్రాల జప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.మొత్తం 60 మంది పెట్టుబడిదారులు (నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన గ్రూప్ కంపెనీలతో సహా) ఒక్కో షేరుకు రూ. 360 చొప్పున షేర్లను కొనుగోలు చేశారన్న వాస్తవాన్ని ఈడీ తరఫు న్యాయవాది కూడా కాదనలేదు. 60 మందిలో 45 మంది పెట్టుబడిదారులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పెట్టుబడి పెట్టిన వారిలో కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకొని వారి వ్యవహారాలను క్విడ్ ప్రో కోగా ఆరోపించడం వెనుక ‘ఎంపిక చేసుకునే విధానం’అవలంభిస్తోందని సందేహం కలుగుతోందని ట్రిబ్యునల్ అనుమానం వ్యక్తం చేస్తూ జప్తు ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో దర్యాప్తు సంస్థల జోక్యం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అనుమతితోనే పెట్టుబడులు.. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2019 అక్టోబర్‌లో ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ విధానాలను దురి్వనియోగం చేసి భారీ ప్రయోజనాలు పొందారని.. ప్రాజెక్టు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఈడీ వాదించింది. ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా చేపట్టారన్నారు. రస్–అల్–ఖైమా ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరించిందన్నారు. ప్రాజెక్టు కోసం జరిగిన పెట్టుబడులు, భూముల కొనుగోళ్లు, కంపెనీల ఏర్పాటు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే జరిగాయని కోర్టుకు తెలిపారు. ప్రతివాదులకు ఊరట.. హైకోర్టు కొట్టివేసిన అప్పీళ్లలో జీ2 కార్పొరేట్ సర్విసెస్, సుగుణి కన్స్ట్రక్షన్స్ ఎల్ఎల్పీ, జగతి పబ్లికేషన్స్, గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, ఆల్ఫా విలాస్ ప్రైవేట్ లిమిటెడ్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితర ప్రతివాదులకు ఊరట లభించింది. (వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్, వాన్‌పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు రెండేళ్ల కిత్రం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఊరట లభించిన విషయం తెలిసిందే) ట్రిబ్యునల్ నాటి ఉత్తర్వుల్లోని మరికొన్ని అంశాలు.. వాన్‌పిక్ ప్రాజెక్టు రస్–అల్–ఖైమా (యూఏఈ) ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం కింద ప్రారంభించిందన్న వాదనలకు రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయంది. పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని గుర్తుచేసింది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల్లో సీబీఐ, ఈడీలు విధాన నిర్ణయాలను కూడా నేరపూరిత చర్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయని వ్యాఖ్యానించింది.ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధాన నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు తమ అభిప్రాయాలతో భర్తీ చేయలేవని పేర్కొంది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అవగాహన ఒప్పందంలోని ప్రతి అంశం తుది ఒప్పందంలో యథాతథంగా ఉండాల్సిన అవసరం లేదని, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సహజమని అభిప్రాయపడింది. అడ్జుడికేటింగ్ అథారిటీ పలు కీలక పత్రాలు, వాదనలను సరిగా పరిశీలించలేదంది. వాన్‌పిక్ కేసుల్లో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులివే... మొత్తం ఆస్తుల విలువ: 863.33 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రూప్: రూ.538.31 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్: రూ. 325.02 కోట్లు వైఎస్ జగన్‌కు చెందిన కంపెనీల్లో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి: రూ. 68.31 కోట్లు (సండూర్ పవర్స్: 54.94 కోట్లు, స్థిరాస్తులు: 13.35 కోట్లు) జగతి పబ్లికేషన్స్: రూ. 450.00 కోట్లు కార్మెల్ ఆసియా హోల్డింగ్స్: రూ. 20.00 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీల్లో... నిమ్మగడ్డ ప్రసాద్: రూ. 37.83 కోట్లు ఆల్ఫా అవెన్యూస్: రూ. 97.82 కోట్లు ఆల్ఫా విల్లాస్: రూ. 35.90 కోట్లు గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్: రూ. 45.85 కోట్లు జి2 కార్పొరేట్ సర్విసెస్: రూ. 49.98 కోట్లు సుగుణి కన్స్ట్రక్షన్స్: రూ. 7.00 కోట్లు వాన్‌పిక్ పోర్ట్స్: రూ. 23.23 కోట్లు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్: రూ. 27.72 కోట్లు (ఇందులో వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్టుపై ఉత్తర్వులు గతంలోనే వెలువడ్డాయి) -
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టలు స్టే విధించింది. కాగా, రాయదుర్గం భూముల వివాదంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ల్యాండ్ ఆక్షన్ చేసే సమయంలో SBIకి సమాచారం ఇచ్చామని తెలిపారు. మరో చోట ల్యాండ్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ ప్రపోజల్ కు SBI కూడా ఒప్పుకుందని అన్నారు. 7 రోజులు కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కావాలని అన్నారు. ఎకరానికి రూ.237 కోట్లు చొప్పున చెల్లించిన గౌరవ్ వెంచర్స్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతుందని హైకోర్టు ప్రశ్నించింది. -
ఆ 5 ఎకరాలు మావే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఇటీవల ప్రభుత్వం ఎకరా రూ.237 కోట్లకు వేలం ద్వారా విక్రయించిన భూమి తమదేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన 5 ఎకరాల భూమిని తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ–వేలం ద్వారా విక్రయించడాన్ని సవాల్ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పణ్మక్తా హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నంబర్ 83/1లోని ప్లాట్ నంబర్–1ఏ (5 ఎకరాలు)ను ప్రభుత్వం 2010లో జారీ చేసిన జీవో 501 ప్రకారం పూర్తిస్థాయి విక్రయ పద్ధతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు కేటాయించిందని పేర్కొంది. దీని కోసం రూ.13.33 కోట్లను చెల్లించామంది. అనంతరం ఎస్బీహెచ్.. ఎస్బీఐలో విలీనమైందని గుర్తు చేసింది. ఈ–వేలం నోటిఫికేషన్‌ను ఇప్పటికే మరో రిట్ పిటిషన్లో సవాల్ చేసినప్పటికీ, ఆ కేసు విచారణలో ఉండగానే మే 28న వేలం నిర్వహించి గౌరా వెంచర్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ప్రకటించారని తెలిపింది. భూమి విక్రయ ధరను ప్రభుత్వం ఇప్పటికే స్వీకరించిన నేపథ్యంలో తిరిగి అదే భూమిని వేలం వేయడానికి చట్టబద్ధమైన అధికారం లేదని కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ముంబై తరువాత దేశంలో రెండో కార్పొరేట్ ఆఫీసును ఎస్బీఐ హైదరాబాద్‌లో రెండు టవర్లలో నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వేలంలో జరిగిన విక్రయాన్ని రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. -
హైడ్రా.. చట్టానికి అతీతం కాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట సర్వే నంబర్ 1, 2లోని భూయజమాని స్వాధీన హక్కులను రక్షిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలున్నా.. ప్రైవేటు ఆస్తిలో ప్రవేశించినందుకు హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికారులు కోర్టు ఉత్తర్వులను బహిరంగంగా ఉల్లంఘించారని.. వారు ప్రత్యేక విభాగ అధికారులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కానీ వారు కూడా చట్టానికి అతీతులు కాదని.. పాలనా వ్యవస్థలో భాగమేనని స్పష్టం చేసింది. చట్ట పరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రాకు లేదని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఆ భూమిలోకి ప్రవేశించబోమని హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇవ్వడంతో దీన్ని ఉల్లంఘించవద్దని అధికారులను ఆదేశించింది. అలాగే పిటిషనర్ భూమిలోకి ప్రవేశించకుండా, వారి ప్రశాంత స్వాధీన, అనుభవ హక్కులకు భంగం కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధిక్కరణ పిటిషన్లో విచారణ ముగించింది.భూమిపై హక్కు లేకున్నా ప్రవేశం సమ్మతం కాదులోతుకుంట గ్రామానికి చెందిన భూమి విషయంలో శాంతా శ్రీరామ్ నిర్మాణ సంస్థ ధిక్కార పిటిషన్లు దాఖలు చేసింది. భూమి వివాదానికి సంబంధించిన రిట్ అప్పీల్, సివిల్ సూట్, ఫస్ట్ అప్పీల్ తదితర కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోయినా హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించి తమ స్వాధీన భూమిలో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు స్థలాన్ని సందర్శించారని హైడ్రా తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూమి తమదేనని నిరూపించడంలో సర్కార్ విఫలమైందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఆ భూమిపై ఎలాంటి హక్కు ఉండదని, హైడ్రా అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించడం న్యాయసమ్మతం కాదన్నారు. హైడ్రా ఏర్పాటు ఉత్తర్వులను పరిశీలించిన న్యాయమూర్తి.. రహదారులు, కాలువలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సంస్థ పరిమితమని తేల్చిచెప్పారు. -
హైడ్రా రంగనాథ్‌కు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒక వివాదాస్పద స్థలంపై కోర్టు ఉత్తర్వులున్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో స్థలం విషయమై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా.. జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50వేల జరిమానా విధించింది.వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సర్వే నెంబర్-45లో 2 ఎకరాల వివాదాస్పద భూమిపై ఉంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థలం విషయంలో హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో, విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.అలాగే, తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. దీంతో, కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు తీసుకోవడం, కాలయాపన చేయడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతరం, కమిషనర్ రంగనాథ్‌పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించింది. దీంతో, జరిమానా విషయం చర్చనీయాంశంగా మారింది. -
విటుడిపై ‘ట్రాఫికింగ్’ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: సెక్స్ వర్కర్ సేవలు పొందిన వ్యక్తిని కేవలం విటుడు అన్న కారణంతో ఐపీసీ సెక్షన్ 370 (ట్రాఫికింగ్/మానవ అక్రమ రవాణా) కింద నేరస్తుడిగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐపీసీ సెక్షన్ 370ఏ(2) కింద అతనిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. సదరు సెక్స్ వర్కర్.. అక్రమ రవాణాకు గురైన మహిళ అనే విషయం అతనికి తెలిసినా లేదా తెలిసేందుకు అవకాశమున్నా సెక్షన్ 370(ఏ)(2) వర్తిస్తుందని చెప్పింది. అలాగే ఇతరులకు సెక్స్ వర్కర్లను సమకూర్చడం లేదా మధ్యవర్తిత్వం వహించడం వంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫికింగ్ కేసులు నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు దాఖలైన దాదాపు 120కి పైగా క్రిమినల్ పిటిషన్లలో ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వెలువరించింది. తాము ట్రాఫికింగ్‌కు పాల్పడకున్నా ఆ చట్టం కింద కేసులు పెట్టడాన్ని సవాల్ చేస్తూ హేమంత్‌కుమార్ సహా 120 మంది పలు పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో చదువుకుంటున్న యువకులు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా నమోదైన వ్యభిచారం కేసుల్లో వీరంతా నిందితులు. మూడేళ్లుగా నమోదైన ఇలాంటి కేసుల్లో హైకోర్టులోని సింగిల్ జడ్జిల ధర్మాసనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుల విచారణను డివిజన్ బెంచ్‌కు అప్పగించారు. దీంతో జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు కేవలం విటులం మాత్రమేనని, ట్రాఫికింగ్‌కు లేదా లైంగిక దోపిడీకి పాల్పడలేదని తెలిపారు. ట్రాఫికింగ్‌కు పాల్పడేవారి కోసమే ‘370’ వాదనలు విన్న ధర్మాసనం.. ఐపీసీ సెక్షన్ 370 ట్రాఫికింగ్‌కు పాల్పడే వ్యక్తులను శిక్షించేందుకు ఉద్దేశించిందని స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా వృత్తిలో ఉండే సెక్స్ వర్కర్లు, వారి విటులను పోలీసులు, దర్యాప్తు సంస్థలు వేధించరాదని హెచ్చరించింది. స్వచ్ఛంద సెక్స్ వర్క్ భారత చట్టాల ప్రకారం నేరం కాదంటూ ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ప్రస్తావించింది. అలాగే వేశ్యాగృహం లేదా వ్యభిచారం జరుగుతున్న ప్రాంగణ సమీపంలో ఉన్న వ్యక్తిపై సెక్షన్ 370ఏ(2) కింద కేసు నమోదు చేయలేమని పేర్కొంది. కేసు నమోదు చేయాలంటే..ట్రాఫికింగ్‌కు గురైన మహిళపై లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడని, ఆమె ట్రాఫికింగ్ బాధితురాలని అతనికి తెలుసు అనేందుకుఆధారాలు ఉండాలని వెల్లడించింది. కేవలం అక్కడ ఉండటం నేరంగా పరిగణించలేమనితేల్చిచెప్పింది. -
హెచ్‌సీఏ అధ్యక్షుడికి భారీ షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యుక్షుడిగా అమర్నాథ్ నియమాకంపై తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. అతని నియమాకం చెల్లదని, ప్రెసిడెంట్ పదవి నుంచి తొలిగించాలని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నికోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్సీఎ నూతన అధ్యుక్షుడిగా అమర్నాథ్ పేరును రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ కైత్ ప్రకటించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రావ్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ కావడంతో ప్రెసిడెంట్ పదవి నుంచి అతడిని తప్పించారు. ఆ స్ధానంలో రన్నరప్‌గా నిలిచిన అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అతడి ఎంపిక కూడా చెల్లదని కోర్ట్ తీర్పునివ్వడంతో మరోసారి హెచ్సీఎ ప్రెసెడింట్ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మాకూ కావాలి ‘జస్టిస్’
సాక్షి, హైదరాబాద్: తీవ్ర పని భారం వల్ల సత్వర న్యాయం అందించలేని స్థితిలో న్యాయస్థానాలు విధులు నిర్వహిస్తున్నాయి. జనాభాకు సరిపడా జడ్జీలు లేక కేసుల ఒత్తిడితో వారు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోర్టు విచారణ సమయం తర్వాత కూడా తీర్పులు డిక్టేషన్ చేయడం, మరలా వాటిలో తప్పొప్పులను పరిశీలించి సరిచేయడం.. ఇలా పనిభారంతో సతమతం కావాల్సి వస్తోంది. సెలవు రోజుల్లో విచారణ కొనసాగించకున్నా.. ఇతర పనులు తప్పడం లేదు. వాదనల నమోదు, గత తీర్పుల విశ్లేషణ.. అనంతరం తాజా కేసుల్లో తీర్పు రాయడం.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మరోవైపు ప్రజలు తమ కేసుల విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్తగా పోస్టుల సంఖ్య పెంపు మాటేమోగానీ.. మంజూరైన వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం.. నిరంతరం 20 నుంచి 30 శాతం ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచిన నేపథ్యంలో హైకోర్టులోనూ జడ్జీల సంఖ్య కూడా పెంచాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. అదీగాక ఇరురాష్ట్రాల ఎన్సీఎల్టీ, క్యాట్ ఇక్కడే ఉండటంతో బెంచ్‌లు సరిపోవడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. సరిపడా జడ్జీలు లేకుంటే సమస్యలివీ.. ⇒ కోర్టుల్లో పేరుకుపోయే కేసుల భారం ⇒ న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని ఒత్తిడి ⇒ సామాన్యుడికి ‘న్యాయం’అందేందుకు ఏళ్లకు ఏళ్లు ⇒ కోర్టుల్లో సత్వర న్యాయం దక్కేందుకు అవకాశం లేకపోవడంతెలంగాణలోనూ జడ్జీల సంఖ్య పెంచాలి జడ్జీల సంఖ్య జనాభాకు సరిపడా లేకపోవడంతో కేసుల పెండింగ్ రేటు అంతకంతకు పెరిగిపోతోంది. హైకోర్టులో విభజన సమయంలో మంజూరైన పోస్టులే తప్ప.. ఇప్పటివరకు పెంచలేదు. అందులోనూ ఖాళీలతో కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. హైకోర్టుతోపాటు ఇతర కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి.. సత్వర న్యాయానికి ప్రభుత్వాలు దోహదం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలి. –హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.సురేందర్రెడ్డిదేశంలో పెండింగ్ కేసులు 5 కోట్లకుపైగా ఉన్నాయి. ఇందులో దశాబ్దాల కేసులు కూడా ఉండటం ఆశ్చర్యకరం. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) ఈ ఆలస్యానికి కారణాలను అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఏడు ప్రధాన కారణాలు ఇలా.. న్యాయవాది అందుబాటులో లేక..: 59,72,394 నిందితుడు పరారీలో: 34,17,009 సాక్ష్యం కారణంగా: 25,79,442 స్టే కారణంతో: 20,62,339 డాక్యుమెంట్ల కోసం: 13,74,611 కక్షిదారుల నిరాసక్తత: 7,35,127 పదేపదే అప్పీళ్లు: 4,29,373 -
తెలంగాణ హైకోర్టులో జనసేనకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ‘నవనిర్మాణ సభ’కు అనుమతి నిరాకరించిన పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో ఆ పార్టీకి మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నిన్న కోర్టు సాధారణ సమయం ముగిసిన తర్వాత పోలీసుల నుంచి జనసేనకు తిరస్కరణ సమాచారం వెళ్లింది. దీంతో చేసేది లేక ఇవాళ అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరపాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి కేవియెట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు.ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన హైకోర్టు.. జనసేన వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నవనిర్మాణ సభ నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఫోకస్ అంతా సాయంత్రం పవన్ కల్యాణ్ నిర్వహించబోయే ప్రెస్‌మీట్ మీద కేంద్రీకృతమైంది. -
రిలీజ్‌కి ముందు ‘పెద్ది’ మేకర్స్ కీలక నిర్ణయం!
పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలనుకున్నారు. ఈ మేరకు హైకోర్టుకు తమ విజ్ఞప్తిని తెలియజేయడంతో..దానికి ధర్మాసనం అనుమతించింది. జూన్ 4న విడుదలవుతున్న పెద్ది సినిమా టికెట్ ధరలను 7 రోజులపాటు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ అధికారులకు నిర్మాణ సంస్థ వినతిపత్రం అందించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈనెల 15న వినతిపత్రం ఇచ్చి, 25న మరోసారి విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా తాము కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఇలాంటి అంశంలోనే ఇదే హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణ తీసుకుందని గుర్తుచేశారు. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అయితే పిటిషన్ ఉపసంహరణకు పిటిషనర్ కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో టికెట్స్ ధరల పెంపు ఉండకపోవచ్చునని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో’కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది దాఖలు చేసిన ఉపసంహరణ లేఖను అనుమతించింది. తనపై పేట్‌బషిరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఉపసంహరణకు అనుమతించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది లేఖను పరిశీలించిన న్యాయమూర్తి అంగీకరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు అనుమతించారు. -
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది భార్య. ఈకోర్టును విచారించిన కింది కోర్టు ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను తెలంగాణా హైకోర్టు రద్దు చేసి కేవలం రూ. 500 జరిమానాగా తగ్గిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలోకేసు నేపథ్యంకోర్టు రికార్డుల ప్రకారం.. భార్య పిల్లలు, పుట్టింట్లో ఉండగా భర్త తన పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఇక్కడ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత బైటికెళ్లిపోయాడు. కాసేపటికి ఒంటిపై బట్టలు లేకుండా (దిగంబరంగా) తిరిగి వచ్చాడు. అంతేకాదు భార్యను, ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడు. ఈ తీవ్ర ఘర్షణ మధ్యలో ఆగ్రహం తట్టుకోలేక ఆ మహిళ కత్తి తీసుకుని అతడిని పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.మొదట పోలీసులు ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (IPC Section 302) కింద హత్యగా నమోదు చేశారు. అయితే, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఇది కావాలని అనుకుని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని తేల్చింది. చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని భావించి, దీనిని సెక్షన్ 304 పార్ట్-II కిందకు మార్చింది. దీని కింద ఆమెకు నాలుగేళ్ల కఠిన శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 300లోని 'ఎక్సెప్షన్ 4' (Exception 4 to Section 300 IPC) ను పరిగణనలోకి తీసుకుని ఆమె జైలు శిక్షను రద్దు చేసింది.ఎక్సెప్షన్ 4 అంటే ఏమిటి?ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆవేశంలో, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే.. అలాగే నిందితుడు ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందకుండా, క్రూరంగా లేదా అసాధారణంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆ మరణాన్ని 'హత్య' (Murder) గా పరిగణించకూడదు. మహిళ పథకం ప్రకారం కాకుండా, ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల తీవ్ర ఆవేశంతో (Heat of passion) ఆ ఘర్షణలో అలా ప్రవర్తించిందని కోర్టు పేర్కొంది. కత్తితో పొడవడం వల్ల ప్రాణాలు పోతాయనే కనీస జ్ఞానం (Knowledge) ఆమెకు ఉంటుందని భావించి సెక్షన్ 304 పార్ట్-II కింద నేరాన్ని సమర్థించినప్పటికీ.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్ష విషయంలో మానవతా దృక్పథంతో ఉదారత చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.జైలు శిక్ష పూర్తిగా ఎందుకు రద్దైంది?క్రింది కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షపై మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ సమయంలో ఘటన జరిగిన పరిస్థితులను, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెకు ఇకపై ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. క్రింది కోర్టు విధించిన రూ. 500 జరిమానాను ఆమె అప్పటికే చెల్లించి ఉండటంతో, కేవలం ఆ జరిమానానే శిక్షగా మార్చి ఆమెను విడుదల చేసింది.అంటే, గొడవలో హత్య చేయడం ఎల్లప్పుడూ క్షమించదగినదేనా? కానే కాదు... గొడవల్లో లేదా వాదనల్లో జరిగే ప్రతి హింసను భారతీయ చట్టం క్షమించదు. ఉద్దేశం, ప్రణాళిక, ఉపయోగించిన ఆయుధం యొక్క స్వభావం, దాడి తీవ్రత, నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడా లేదా వంటి అంశాలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ కోర్టుకు చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేదా ముందస్తు ఏర్పాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికితే.. అది ఐపీసీ సెక్షన్ 302 కింద 'హత్య'గానే పరిగణించబడుతుంది. దానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలు ఉంటాయి. -
దామోదర్ పై సైబర్ క్రైమ్ కేసు..
-
TG : హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే? పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్‌లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.బండి సాయి భగీరధ్‌ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్‌ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్‌తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
బండి భగీరథ్ కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ ను నిరాకరించిన హై కోర్టు
-
ముందస్తు బెయిల్‌పై 21న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వు చేసింది. ఈనెల 21న ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. వాదనలకే 3 గంటలకుపైగా సమయం పట్టిందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని, అన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.అన్ని పక్షాలు చేసిన వాదనలు, గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందంటూ ఉత్తర్వులను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌ను అరెస్టు చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా స్టేటస్కో ఆదేశాలు ఇవ్వాలని కోరగా, నిరాకరించింది. తనపై పేట్‌బïÙరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం రాత్రి మరోసారి విచారణ చేపట్టింది. పోలీసులు కుమ్మక్కు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘గత సంవత్సరంలోనే బాధితురాలు, నిందితుడు స్నేహితులుగా మారారు. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు నాలుగుసార్లు బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనడంలో వాస్తవం లేదు. పోలీసులు బాధితులతో కుమ్మక్కై తొలుత ఉన్న సెక్షన్లకు తోడు పోక్సో సెక్షన్లు 5, 6ను చేర్చారు.బెయిల్ రాకుండా పూర్తి న్యాయ సలహాతో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ మార్చారు. నానక్‌రామ్‌గూడ, తర్వాత ఫామ్‌హౌస్‌లకు వెళ్లినప్పుడు వారి వెంట మిత్రులు కూడా ఉన్నారు. బాధితురాలికి గతంలోనే ఆల్కహాల్ అలవాటు ఉంది. బాధితురాలు మైనర్ కాదు (కొన్ని సర్టీఫికెట్లను సమరి్పంచారు). నాలుగున్నర నెలల వరకు ఫిర్యాదు చేయకపోవడంలో కుట్రదాగి ఉంది. బాధితురాలు పలుమార్లు బెదిరిస్తూ సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపారు. దీంతో ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని బాధితురాలి తల్లిదండ్రులకు పిటిషనర్ చెప్పారు’ అని పేర్కొన్నారు. పిటిషనర్‌కు నేర చరిత్ర... బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘బాధితురాలి డాక్యుమెంట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది సమరి్పంచడం అభ్యంతరకరం. బాధితురాలు మేజర్ అనేది నిరాధార ఆరోపణ. బర్త్ సర్టీఫికెట్ స్కూల్లో ఇచ్చింది ప్రధాన ఆధారం. దీనిపై ఏది ప్రామాణికమో సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. మున్సిపల్ అధికారులు ఇచి్చన పత్రం, టెన్త్ సర్టీఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. భగీరథ్ ఒత్తిడితో బాధితురాలు అతని ప్రేమను అంగీకరించింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. పెళ్లి చేసుకుంటానంటున్నాడన్న నమ్మకంతో మరికొందరు కూడా ఉండటంతో భగీరథ్ వెంట తమ అమ్మాయిని తల్లిదండ్రులు పంపారు. అక్కడ బలవంతంగా ఆల్కహాల్ తాగించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అవమానించేలా రూ.50 వేలు పంపగా, ఆమె వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కు పంపింది. నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో అందరి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. నిందితుడికి గతంలోనే నేర చరిత్ర ఉంది’ అని పేర్కొన్నారు. ఐవోకు ఎఫ్ఐఆర్లో మార్పు అధికారం.. పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘పుట్టిన రోజు (2008, ఆగస్టు), ఇతర సర్టీఫికెట్లు దర్యాప్తు అధికారి నుంచి తీసుకున్నాం (వాటిని కోర్టుకు సమరి్పంచారు). పోక్సో కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యంకాదు. ఇలాంటి కేసుల్లో కూడా నిందితులకు బెయిలిస్తే చట్టంపై నమ్మకం లేకుండా పోతుంది. ఎఫ్ఐఆర్లో మార్పులు చేసే అధికారం దర్యాప్తు అధికారి (ఐవో)కి ఉంటుంది. సేకరించిన వివరాల ఆధారంగా సెక్షన్ల మార్పు, నిందితులను చేర్చడం చేయొచ్చు’ అని చెప్పారు. నాపైనే తీవ్ర ఆరోపణలు...కేసు విచారణకు స్వీకరించడానికి ముందు న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో తనపై, తన భర్తపై సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు చేశారన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని భావించానని, కానీ, వెకేషన్ కోర్టు అయినందున అన్ని పక్షాల న్యాయవాదులంతా అంగీకరిస్తేనే వాదనలు వింటానని చెప్పారు.అయితే, సోషల్ మీడియా పోస్టులు తాము కూడా చూశామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తిపై అత్యంత నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిని తొలగించాలని డీజీపీని కోరినట్లు పీపీ పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేసుల విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి రాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టడం గమనార్హం. -
బండి భగీరథ్ కేసు: హై కోర్టులో దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు రక్షణ (బెయిల్) పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హై కోర్టు వెల్లడించింది.‘బాధితురాలు ముమ్మాటికీ మైనరే’పిటిషన్‌పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్‌కు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించారు. బాధితురాలు ముమ్మాటికీ మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె పదో తరగతి (టెన్త్) మెమోతో పాటు, జీహెచ్ఎంసీ (GHMC) జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు.బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. "బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లింది" అని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు రక్షణ కల్పించకూడదని కోరారు.కాగా, అంతకుముందు బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు. -
భర్తను కత్తితో పొడిచిన భార్య.. జైలు శిక్షను రద్దు చేసిన హైకోర్టు.. తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే!
-
బండి భగీరథ్ ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశాడు. భగీరథ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్ ముందస్తు రక్షణ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. -
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్‌ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్‌తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్‌బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందిపోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు. -
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్‌ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
అషురెడ్డికి హైకోర్టు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్
-
891.38 ఎకరాల భూమి సర్కార్కే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు బాలానగర్‌లో అప్పగించిన 891.38 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోకుండా 2008 నాటి పారిశ్రామిక, ఆర్థిక పునర్విర్మాణ మండలి (బీఐఎఫ్ఆర్) ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనే ప్రభుత్వం భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నందున, బీఐఎఫ్ఆర్ ఉత్తర్వులో హేతుబద్ధత లోపించిందని చెప్పింది. నాటి ఉత్తర్వు అమలులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూడ్చలేని నష్టాన్ని చవిచూస్తుందని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించడం కూడా జరిగిందని గుర్తు చేసింది. తదుపరి విచారణ జూన్ 22కు వాయిదా వేసింది. ఈ వివాదం 90వ దశకంలో మొదలైంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వినియోగం కోసం ఆ భూమిని సేకరించి, ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌ను స్థాపించడానికి ఐడీపీఎల్‌కు బదిలీ చేసింది. ఆ భూమిని కేవలం పారిశ్రామిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలనే నిర్దిష్ట ఒప్పందం కింద అప్పగించారు. అయితే, ఐడీపీఎల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, తన పరిపాలనా భవనాలను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. వివాదం బీఐఎఫ్ఆర్కు చేరడంతో.. భూ స్వాధీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, కంపెనీపై బలవంతపు చర్యలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మూడో పక్షానికి లీజుకివ్వడం కుదరదు.. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట ప్రజాప్రయోజనం కోసం బదిలీ చేసిన భూమిని ఒక సాధారణ ప్రైవేట్ అమ్మకంలా పరిగణించకూడదన్నారు. ఒప్పందం ప్రకారం పరిశ్రమల స్థాపన కోసమే ఈ భూమిని వినియోగించుకోవాలి తప్ప.. మూడో పక్షానికి లీజుకు, సబ్ లీజుకు ఇచ్చి తద్వారా ఆదాయ వనరుగా మార్చుకోకూడదన్నారు. ఐడీపీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2008లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్లో తీవ్ర జాప్యం జరిగిందని, పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2008 నుంచి చట్టపరమైన పరిస్థితులు గణనీయంగా మారాయన్నారు. బీఐఎఫ్ఆర్ను రద్దు చేశారని, కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు సక్రమంగా బదిలీ చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల కోసం లీజుకు ఇవ్వడాన్ని కూడా సమర్థించలేమన్నారు. నాటి ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
సాదాబైనామాలపై ‘కుస్తీ’
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్లు సాదాబైనామా దరఖాస్తులతో కుస్తీ పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించిన 9 లక్షలకు పైగా దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవడం, నియమ నిబంధనల్లో మార్పులు జరగడం, వీలున్నంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ముమ్మరమైంది. హైకోర్టు తీర్పు అనంతరం నిర్వహించిన పరిశీలన ప్రక్రియలో అమ్మకందారుని అఫిడవిట్‌తోపాటు నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి అఫి డవిట్ అవసరం లేదని, కొనుగోలుదారుడు మాత్రం అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధన మా ర్చింది. దీంతో గతంలో అమ్మకందారు కూడా అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనతో తిరస్కరించిన వాటితో సహా మొత్తం దరఖాస్తులను ఈసారి పున:పరిశీలిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే కొంత ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అన్నీ.. రీఓపెన్ వాస్తవానికి, ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్చిన నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను గత నెల మొదటి వారంలో రెవెన్యూ శాఖ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు సాదాబైనామాలను పరిష్కరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. అయితే, గతంలో అమ్మిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్ లేని వాటితోపాటు కొన్ని దరఖాస్తులను సాంకేతిక కారణాలతో కూడా తిరస్కరించారు. కొన్ని ప్రభుత్వ భూములు ఉండడం, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడం లాంటి కారణాలతో ఈ దరఖాస్తులను తిరస్కరించారు. మార్గదర్శకాలు కొత్తగా వచ్చినా, ఇలాంటి దరఖాస్తులను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం లేదు. కానీ, అన్ని దరఖాస్తులను పునఃపరిశీలన చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నింటినీ రీఓపెన్ చేశామని తహసీల్దార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం జరుగుతోందని అంటున్నారు. కాగా, ఇప్పటివరకు తుది నిర్ణయం కోసం కేవలం 20 శాతం లోపు దరఖాస్తులు మాత్రమే ఆర్డీఓలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సాదాబైనామా దరఖాస్తుల పూర్తిస్థాయి పరిష్కారానికి 3, 4 నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
అషురెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి.. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి.. హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఈమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈమె.. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం తదుపరి విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే హైకోర్టు.. మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోట్‌ని అషు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)'గత కొన్నిరోజుల నుంచి నాపై మీడియా, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్స్ నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నాపై వచ్చిన ఆరోపణల కేసు.. కోర్టు పరిధిలో ఉంది. నా పరువుకు భంగం కలిగించే కంటెంట్ ప్రసారం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇది గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, నెటిజన్లని కోరుతున్నా. కోర్టు ఆదేశాల మేరకు నాపై ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని, కొత్తవి పబ్లిష్ చేయకుండా సహకరించాలని కోరుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి' అని అషురెడ్డి చెప్పుకొచ్చింది.ఇకపోతే ఈ కేసు విషయం బయటకొచ్చిన తర్వాత తామేం తప్పు చేయలేదని అషురెడ్డి, ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అషురెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర తిరిగి ఇచ్చేస్తా, మిగిలిన డబ్బులు జీవితంలో స్థిరపడినప్పుడు ఇచ్చేస్తా అని ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లు ఉంది. మరోవైపు ధర్మేంద్రకు సంబంధించిన ఆరు నిమిషాల ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు మాట్లాడుతూ అప్పు చేసి మరీ అషురెడ్డికి డబ్బులిచ్చానని.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్లే కేసు పెట్టాల్సి వచ్చిందని మాట్లాడినట్లు ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
మానవత్వంతో రష్యన్ మహిళ వీసా పొడిగించండి
సాక్షి, హైదరాబాద్: అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మార్గదర్శకాలను యాంత్రికంగా అమలు చేయకుండా.. కొంత మానవత్వం అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. మన దేశానికి చెందిన వ్యక్తిని వివాహమాడి భర్త మరణంతో తీవ్ర బాధలో ఉన్న రష్యన్ మహిళ వీసా పొడిగింపునకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం తెలుపడాన్ని తప్పుబట్టింది. సంతానంలేని వితంతువుకు వీసా పొడిగింపు ను నిరాకరించడం ఆలోచనారహిత మని వ్యాఖ్యానించింది. బాధిత మహిళకు ఎలాంటి జరిమానా విధించకుండా వీసా పొడిగించాలని అధికారులను ఆదేశించింది.రష్యన్ మహిళ అలెనా ఎవ్జెనియెవ్నా పావ్లోవా.. గత 8 ఏళ్లు గా భారత్, రష్యా తిరుగుతూ సత్యసాయి సంస్థలో సేవ చేస్తున్నారు. భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదిస్తున్నా రు. 2024లో భారతీయుడిని వివాహం చేసుకోగా.. ఏడా ది తర్వాత అతను అనారోగ్యంతో మరణించారు. ఈ నేప థ్యంలో కార్యక్రమాలు పూర్తి చేయడానికి, అత్తకు తోడు ఉండటానికి వీలుగా వీసా గడువు పొడిగించాలని ఆమె కోరారు. వీసా పొడిగింపునకు చేసుకున్న దరఖాస్తును అధి కారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అలెనా హైకోర్టు ను ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. భర్త మరణంతో వితంతువుగా మారిన విదేశీ వని త వీసా పొడిగింపునకు నిబంధనల పేర బాధపెట్టడం సరికాదన్నారు. అధికారులు చెబుతున్న మార్గదర్శకాలు సరైనవే అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విచక్షణ వినియోగించాలని అభిప్రాయపడ్డారు. మానవత్వంతో ఆమె దరఖాస్తు పరిగణనలోకి తీసుకుని వీసా గడువును పొడి గించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులపై 2011లో మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 2011, మార్చి 10న ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ జరిగింది.కాగా, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సహా సుమారు 50 మంది తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమ వద్ద కెమెరా, మైకులు లాక్కుని దాడి చేశారని, వీడియో కెమెరాను ట్యాంక్ బండ్లోకి విసిరేశారని జర్నలిస్టులు రాజు, ప్రసాద్, సూర్యప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ట్రయల్‌కోర్టు వీరిపై విచారణ చేపట్టి.. ఇతర నిందితులంతా నిర్దోషులని 2013లో తీర్పునిచి్చంది. అయితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను మాత్రం ’పరారీలో ఉన్న నిందితులుగా’ పేర్కొంది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం విచారణ చేపట్టి.. కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
రైతులంతా టెక్ నిపుణులు కాదు
సాక్షి, హైదరాబాద్: రైతులందరూ సాంకేతిక నిపుణులు కారని, అందరి వద్దా స్మార్ట్ ఫోన్ ఉండదని.. యాప్‌లో యూరియా ఎలా బుక్ చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి యాప్‌లు తీసుకొచ్చినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా సర్కార్‌దేని స్పష్టం చేసింది. హోర్డింగ్‌లు, ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ద్వారానో.. గ్రామ కార్యాలయాల్లో బుకింగ్ విధానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారానో ప్రచారం కల్పించాలని పేర్కొంది. సబ్సిడీ యూరియాను ఎవరెవరికి ఇస్తున్నారు? ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉంది? యుద్ధం వేళ ఇబ్బందులు రాకుండా ఏవైనా చర్యలు తీసుకున్నారా? ఒక రైతుకు.. ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా ఇస్తారు? తదితర సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత, బుకింగ్ సమస్యను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సహా మరికొందరు రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాము అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నా నిర్వహించినా పట్టించుకోకపోవడంతో తప్పనిస్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. తొలుత రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించగా, సీజే ఆదేశంతో నంబర్ నమోదు చేసింది. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌలు, అసైన్డ్ రైతులకు ఇవ్వడం లేదు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. యూరియా కొనుగోలులో సమస్యలను రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు పట్టించుకోలేదన్నారు. రైతుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో అధికారులు, నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ‘రైతులకు ఎలాంటి ఆటంకాలు లేదా ఇబ్బందులు కలగకుండా ఉండేలా, ప్రస్తుత ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా బుకింగ్‌ను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా మార్చేలా సాంకేతికంగా మెరుగుపరచాలి. స్మార్ట్ఫోన్న్లు లేని రైతులకు, అలాగే ఆన్లైన్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి సౌకర్యం కల్పించేందుకు, అ«దీకృత ఎరువుల డీలర్లు, వ్యవసాయ కార్యాలయాలు, రైతు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆఫ్‌లైన్ వ్యవస్థలో పంపిణీ చేయడానికి తగినంత పరిమాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి. కౌలు రైతులకు కూడా యూరియాను నిరాకరించకుండా అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలి’అని కోరారు. మెరుగైన సరఫరాకే యాప్.. జీపీ మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. యూరియాపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని.. మెరుగైన సరఫరాకే యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. బస్తా ధర రూ.3 వేలు ఉండగా, రూ.266కే రైతుకు అందిస్తున్నామని.. ఇది కేవలం రైతుకు దక్కాలన్నది సర్కార్ ఉద్దేశమన్నారు. పాస్‌బుక్ నంబర్, ఎకరాల ఆధారంగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో కంటే అధిక మొత్తంలోనే అందజేస్తున్నామన్నారు. యాప్‌పై అవగాహన లేని వారికి యూరియా కేంద్రంలోని వలంటీర్లు సాయం చేస్తారన్నారు. అసైన్డ్ భూమి ఉన్న రైతులకు ఇవ్వడం లేదని పిటిషనర్ న్యాయవాది పేర్కొనగా.. వివరాలు తెలుసుకొని సమర్పిస్తానని జీపీ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇలాంటి యాప్‌లు తీసుకొచ్చినప్పుడు రైతుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాలో బుకింగ్‌పై ప్రచారం కల్పించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్ గతేడాది జూన్ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్ ఘోష్ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీ¯న్ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. కమిషన్ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం.. కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం కాదు. నిర్లక్ష్యమే కారణమన్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు. కమిషన్ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు ‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్‌కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు. సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. సెక్షన్ 8బీ కమిషన్‌పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్ పార్టెమ్’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది. సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
కుట్రలు కూలిపోయాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, భూమిపై గోదావరి నది పారినంత కాలం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అభాండాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, రాహుల్‌గాందీని మేడిగడ్డకు తెచ్చి సీఎం రేవంత్ గోబెల్స్‌ను మించి చిల్లర ప్రచారం చేసినా రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌పై చేసిన కుట్రలు, కుతంత్రాలు కోర్టు తీర్పుతో కూలిపోయాయన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యాన్ని కనిపించకుండా చేయాలనే కుట్రలు వీగిపోయాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడిన వారి గూబ గుయ్యిమంది. నిజం బయట పడింది. ఘోష్ కమిషన్ ట్రాష్ (చెత్త) కమిషన్ అని తేలిపోయింది. మేము గతం నుంచీ చెప్తున్నట్లుగానే ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది. కోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకుని చిల్లర ప్రచారం ఆపి మేడిగడ్డ బరాజ్‌కి మరమ్మతులు చేయాలి. నటించడం మానుకుని నీటిని ఎత్తిపోయాలి. మేడిగడ్డ పేల్చివేతపై విచారణ జరపాలి మేడిగడ్డ బరాజ్ పేల్చివేతపై నెలకొన్న అనుమానాల విషయంలో బీజేపీ స్వతంత్ర విచారణ జరపాలి. నిక్షేపంగా ఉన్న బరాజ్ పిల్లర్లు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలా కూలిపోయాయో తేలాల్సి ఉంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఆగమేఘాల మీద స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ).. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం ఘటన, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం, చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై స్పందించకుండా ఎక్కడ చచ్చింది? కేసీఆర్ మీద కక్షతో రెండున్నరేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతు చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు. ఇప్పటికైనా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో కారుకూతలు, బూతులకు స్వస్తి చెప్పి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి. రేవంత్ ఇకనైనా గాసిప్స్ మీద కాకుండా గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ హితవు పలికారు. ఘోష్ కమిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు వృథా చేసిందని, సుప్రీంకోర్టులో ఏదో చేస్తామని ప్రభుత్వం అనుకోవడం వృథా ప్రయాస అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ ‘పగలు కాంగ్రెస్‌తో ఉంటూ రాత్రి బీజేపీతో అంటకాగుతున్న రేవంత్‌రెడ్డి ఒక హైబ్రిడ్ సీఎం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. చీకటి, దొంగ ఒకటి అయినట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఒక్కసారి కూడా రేవంత్‌ను విమర్శించడం లేదు. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రం నుంచి మూటలు వెళ్తుంటే, సంజయ్ స్పందించకుండా కరీంనగర్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి అక్రమాలకు రక్షణ గోడలా నిలుస్తున్నాడు. అమృత్ స్కీమ్, సింగరేణి కుంభకోణాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు విచారణ జరపడం లేదు? రేవంత్‌ను ఎవరు కాపాడుతున్నారు? కెమెరాలకు చిక్కిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌లా రేవంత్ కూడా ఓటుకు నోటు కేసులో కెమెరాలకు చిక్కాడు. అయినా ఆయనను ఎవరు కాపాడుతున్నారో బీజేపీ నేతలు చెప్పాలి. రేవంత్ భవిష్యత్తులో కాంగ్రెస్‌ను బొందపెట్టి బీజేపీలో చేరడం ఖాయం..’అని కేటీఆర్ అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవతకవలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులతో సహా బాధ్యులెవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని తేల్చిచెప్పారు. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో న్యాయస్థానం తీర్పుపై చర్చిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నివేదికలో బాధ్యులైన కొందరికి కామెంట్స్, రిమార్క్స్ వారిని వేలెత్తి చూపించే అంశంలో 8బీ కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాలతో కోర్టు వారిపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు కోరినట్లు కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరించి.. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని న్యాయస్థానం తేల్చిందని చెప్పారు. బుధవారం సచివాలయంలో తన చాంబర్లో మంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అంతకుముందు ఉత్తమ్ కోర్టు తీర్పు రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని, కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతకవలకు సంబంధించి సీబీఐతో ప్రభుత్వం విచారణ జరిపించనున్నట్లు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చిన అంశాన్ని ఉత్తమ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పీసీ ఘోష్ నివేదికను న్యాయస్థానం తప్పుపట్టలేదని వెల్లడించారు. సాంకేతిక అంశాన్ని అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం నిర్మాణం, కూలడం రెండు జరిగిపోయాయని, ప్రాజెక్టు స్థలం మార్పు, డిజైన్ లోపాలతోనే కూలినట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తేల్చిందని, అలాగే విజిలెన్స్ విచారణ, భారత కం్రప్టోలర్ ఆడిటర్ జనరల్ నివేదికలు.. అవకతవకలు జరిగాయని తేల్చినట్లు చెప్పారు. సీబీఐతో విచారణ జరిపించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి సీబీఐ విచారణ జరగకుండా బీజేపీ నేతలతో రహస్యంగా మంతనాలు జరిపి వచ్చారని ఆరోపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీతో ఉత్తమ్ ఫోన్లో చర్చించారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో గురువారం కేబినెట్ సమావేశానికి ముందే అభిప్రాయం వెల్లడించాలని కోరినట్లు సమాచారం. -
హైకోర్టు తీర్పు సర్కార్‌కు చెంపపెట్టు
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు? అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాలే కాబట్టి.. దొంగలుదొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, కేసీఆర్ కుటుంబంపై కానీ, గత ప్రభుత్వ అక్రమాలపై కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘నేను గిచ్చినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’అన్న చందంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద హామీలిచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదని కిషన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
కాళేశ్వరంపై తీర్పు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం విషయంలో జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కక్ష సాధింపులు ఆపాలి అంటూ మండిపడ్డారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధర్మం జయించింది. కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పటికైనా కాంగ్రెస్ కక్ష సాధింపులు ఆపాలి. పిల్లర్ల మరమ్మత్తులు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ముమ్మాటికీ కాళేశ్వరం.. తెలంగాణకు ప్రాణేశ్వరమే’ అంటూ కామెంట్స్ చేశారు. సత్యమేవ జయతే..ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్…— Harish Rao Thanneeru (@BRSHarish) April 22, 2026 -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట
-
చర్యలు వద్దు.. కేసీఆర్, హరీష్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాగా, ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
ఫలించిన న్యాయపోరాటం.. అందిన పరిహారం
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన ఒంటరి మహిళలు, పురుషుల న్యాయపోరాటం ఫలించింది. ఎట్టకేలకు పునరావాసం, పునర్నిర్మాణం పథకం నిబంధన మేరకు పరిహారం అందింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే మంగళవారమే ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. కాగా బుధవారం విచారణ నేపథ్యంలో ఇంటి స్థలం, వడ్డీ చెల్లింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిహారం పంపిణీ చేసినందున పిటిషన్లపై విచారణ ముగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచి్చంది. కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరు కాకపోవడంపై ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. 79 మందిలో సగం మందికే పరిహారం! ఒంటరి మహిళలు, పురుషులను కుటుంబంతో కలిపి చూడకుండా వారికి ప్రత్యేకంగా లెక్కించి రూ.12.50 లక్షల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన 27 మంది, వేములఘాట్‌కు చెందిన 52 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్లను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం అందజేయాలని సర్కార్‌ను ఆదేశించింది. అయినా పరిహారం పంపిణీ చేయకపోవడంతో కొందరు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. 8 వారాలు గడువిస్తే నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని సర్కార్ గతేడాది జూలైలో హామీ ఇచి్చంది. కానీ నెలలు గడిచినా పరిహారం పంపిణీ చేయకపోవడంతో గత నెలలో కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్డీ, ఇంటి స్థలం అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలు చేయనప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరుకావాలి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణ వాయిదా వేశారు. ఈ కేసులో మొత్తం 79 మంది పిటిషన్లు దాఖలు చేస్తే అందులో సగం మందే పరిహారం అందుకోవడం గమనార్హం. మిగతా సగం మంది మరణించారు. -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వివేకా హత్య కేసులో విచారణను అడ్డుకునేందుకు సునీత కుయుక్తులు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను నర్రెడ్డి సునీత అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని వైఎస్ భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్రావు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్ వివేకాను తానే గొడ్డలితో నరికానని స్వయంగా ఒప్పుకున్న నరహంతకుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించి నిందితుల జాబితా నుంచి తొలగిస్తే సునీత కనీసం వ్యతిరేకించలేదని న్యాయస్థానానికి నివేదించారు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతీ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతూ విచారణను ఆపడం కోసం సునీత శతవిధాలా కుయుక్తులు పన్నుతూనే ఉన్నారన్నారు. ఈ కేసులో ఇక విచారణ చేయడానికి ఏమీ లేదని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ తేల్చి చెప్పినా కూడా ఆమె పిటిషన్లు వేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల వరకు కేసు ట్రయల్ పూర్తి కాకుండా చూడటమే ఆమె ప్రధాన ఉద్దేశమన్నారు. తనకు బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులను సడలించాలని కోరుతూ వైఎస్ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం విచారించింది. ‘మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే విచారణ పూర్తి చేసి చార్జిషిట్ కూడా దాఖలు చేశారు కదా..! పిటిషనర్ వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ షరతుల సడలింపు కల్పిస్తే ఇబ్బందేమిటి?’ అని ఈ సందర్భంగా సీబీఐ, నర్రెడ్డి సునీత తరఫు న్యాయవాదులను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఆయన బంధువుల పార్టీ అధికారంలో ఉందన్నారు.. మరి ఇప్పుడు లేదు కదా..! అని వ్యాఖ్యానించింది. ట్రయల్‌ను ఆపేందుకు సునీత విశ్వప్రయత్నం వైఎస్ భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ నిందితుల్లో చాలా మందికి లేని షరతులు వృద్ధుడైన భాస్కర్‌రెడ్డికి విధించడం సబబు కాదని నివేదించారు. ‘వైఎస్ వివేకా కేసులో సునీత బాధితురాలు కానేకాదు. ఆమెపైనా పలు అనుమానాలున్నాయి. కొందరి రాజకీయ లబ్ధి కోసం కేసు విచారణ పూర్తి కాకుండా చూసేందుకు ఆమె యత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు కేసు ట్రయల్ పూర్తి కాకుండా చూడటమే ఆమె ప్రధాన ఉద్దేశం. ఇక విచారణ చేయడానికి ఏమీ లేదని సీబీఐ చెప్పినా కూడా పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు ఆ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించి.. ఒకట్రెండు అంశాలపై విచారణకు ఆదేశించింది. సీబీఐ ఆ విచారణ పూర్తి చేసి అదనపు చార్జిషిట్ కూడా దాఖలు చేసింది. అయినా కూడా ఇంకా విచారణ చేయాలంటూ సునీత మరో పిటిషన్ వేశారు. విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయ్యే నాటికి భాస్కర్‌రెడ్డి నిందితుడిగా లేరు. అలాంటప్పుడు ఆయన విచారణను ప్రభావితం చేస్తారనడం అర్హరహితం’ అని నివేదించారు.చెత్తబుట్టలో వేసినా పిటిషన్లు ఆపడం లేదు‘సునీత సుప్రీం కోర్టులో చెప్పిందే ఇక్కడ కూడా చెబుతున్నారు. ఆమె ఎంత చెప్పినా, తదుపరి విచారణ కోరినా అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ట్రయల్కోర్టుకే ఆ బాధ్యతను అప్పగించింది. అది కూడా పూర్తయింది. పిటిషనర్ జీవితమంతా తన సొంత ప్రాంతంలోనే గడిపారు. వ్యవసాయం చేస్తూ జీవించారు. తిరిగి అక్కడికి వెళ్లాలని కోరుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. సునీత ఇలా పిటిషన్లు వేస్తూ ఏళ్లకు ఏళ్లు ట్రయల్ అడ్డుకుంటూ పోతే.. సొంత వారికి దూరంగా పిటిషనర్ ఎన్నేళ్లు బతకాలి? చాలా పిటిషన్లను చెత్త బుట్టలో వేసినా.. ఆమె పిటిషన్లు వేయడం మాత్రం ఆపడం లేదు. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఈ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.పులివెందుల వెళ్లేందుకు సీబీఐ సాయం ఏమీ అవసరం లేదు. చక్రాల కు ర్చిల్లో తిరిగే వాళ్లు కూడా వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చూడాలని భావిస్తారు. పిటిషనర్ అనారోగ్యంగా ఉన్నా.. అక్కడికి వెళ్లాలని కోరుకోవడం తప్పుకాదు. ఇప్పటివరకు ఒక్క బెయిల్ షరతునూ పిటిషనర్ ఉల్లంఘించలేదు. సీబీఐ న్యాయవాది, సునీత న్యాయవాది ఒకే వాదన వినిపిస్తున్నారు..’ అని ఉమామహేశ్వర్రావు నివేదించారు. కాగా బెయిల్ ఇచి్చన నాటి నుంచి పిటిషనర్ షరతులు ఉల్లంఘించారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. లేదని సీబీఐ న్యాయవాది బదులిచ్చారు. అనంతరం న్యాయమూర్తి దీనిపై తీర్పు వాయిదా వేశారు. -
హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాకు ఉన్నత న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదా తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధనలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను సమర్పించాలని స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్లు అభిప్రాయపడింది. పెత్తందారీ విధానం, చట్టవిరుద్ధ చర్యల కారణంగా వందలాది పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పింది. చాలా పిటిషన్లలో స్పష్టమైన కౌంటర్లు దాఖలు చేయలేదని, సంస్థ తీరు సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఐలాపూర్ కూల్చివేతలపై స్టేటస్కో ఆదేశాలు పాటించాలని చెబుతూ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. వెయ్యి ఎకరాల కబ్జాకు యత్నం: ఏఏజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘సంగారెడ్డిలోని కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్‌లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి పిటిషనర్ ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందే. ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవు’అని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘కూల్చివేసిన భవనం కోర్టు విచారణలో ఉన్న ఆస్తిలోని ఓ భాగం. ఆ కేసులోనే వివాదాస్పద డిక్రీ జారీ అయ్యింది. 2006లో నాటి ఉమ్మడి ప్రభుత్వంపై పిటిషనర్ ఈ దావా వేశారు. అలాగే, 2024లో ప్రతివాద అధికారులు జోక్యం చేసుకున్నప్పుడు పిటిషనర్ రిట్ పిటిషన్ కూడా వేశారు. రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంబంధిత స్థలంలో ప్రస్తుతమున్న నిర్మాణాలను తొలగించడానికి, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది పట్టించుకోకుండా హైడ్రా అధికారులు ఈ నెల 11న తెల్లవారుజామున 4 గంటలకు పిటిషనర్ స్థలానికి వచ్చి భవనాన్ని కూల్చివేశారు. 2005లో అధికారులు ఇచ్చిన అనుమతి మేరకే భవనాన్ని నిర్మించారు. (భవన కూల్చివేత వీడియో దృశ్యాలను కూడా న్యాయస్థానం ముందు ప్రదర్శించారు). వాదనలు విన్న న్యాయమూర్తి సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. నోటీసులు జారీ చేయకుండా.. ‘పిటిషనర్ న్యాయవాది సమర్పించిన వీడియోను పరిశీలిస్తే.. హైడ్రాకు చెందిన వందలాది మంది సిబ్బంది ఆ స్థలంలో గుమిగూడినట్లు స్పష్టమవుతోంది. పిటిషనర్‌కు చెందిన భారీ భవనం కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించారని భావించినా, ఇంత భారీ నిర్మాణం చేపట్టే వరకు అధికారులు ఏం చేస్తున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అనధికార నిర్మాణాన్ని గమనించి ప్రారంభంలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి చక్కబడి ఉండేది. దానికి బదులుగా.. అధికారులు కళ్లు మూసుకుని, ఓ భారీ నిర్మాణం జరగడానికి అనుమతించి.. ఇప్పుడు నిర్మాణం అక్రమమంటూ న్యాయస్థానం ముందు ఫిర్యాదు చేస్తున్నారు’అని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ప్రామాణిక విధానమేదీ... ‘ఏదేమైనా అనుమతి లేకున్నా ఓ భవనాన్ని కూల్చివేసే సమయంలో సహజ న్యాయ సూత్రాలు పాటించాల్సిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు.. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా హైడ్రా సిబ్బందిని మోహరించింది. ఇది సహించరానిది. ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన తర్వాత హైడ్రా ఎలాంటి ప్రామాణిక పద్ధతులను పాటించడం లేదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. యాజమాన్య హక్కుకు సంబంధించి వివాదమున్న సందర్భాల్లో అవతలి పక్షానికి నోటీసు జారీ చేసిన తర్వాతే చర్యలు చేపట్టాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కూల్చివేతలు చేపట్టామని హైడ్రా వాదిస్తూ తన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో అనేక జలాశయాలను పునరుద్ధరించినట్లు హైడ్రా గర్వంగా ప్రచారం చేసుకుంటోంది. హైడ్రా.. పెత్తందారీ చర్యలకు వ్యతిరేకంగా వందలాది కేసులు దాఖలయ్యాయన్నది వాస్తవం. అలాంటి పిటిషన్లలో హైడ్రా ఎలాంటి ప్రామాణిక విధానాన్ని అనుసరించలేదు. హైడ్రా ఏర్పడి ఏడాదైనా జీహెచ్ఎంసీ లేదా పురపాలక సంఘాల చట్టంలోని నిబంధనలను అనుసరిస్తోందా? లేదా? అనేది తెలియడం లేదు. ఆ సంస్థ చర్యలు చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు సదరు ఆస్తి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలి. జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర వర్తించే నిబంధనలు, నియమాలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను హైడ్రా ఈ కోర్టు ముందుంచాలి. అప్పటివరకు అనధికార నిర్మాణం, అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు లాంటి చర్యలను హైడ్రా చేపట్టవద్దు’అని న్యాయమూర్తి ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. నకిలీ నోటీసులపై ఫిర్యాదుతెలంగాణ హైకోర్టు పేరిట హైడ్రాకు నకిలీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ రంగనాథ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. రిస్క్ చేయాల్సిందే!ఫాతిమా కాలేజీ విషయంలో దాఖలైన ఓ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సల్కం చెరువులో కాలేజీ నిర్మించారని.. ఇంతదాకా హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫాతిమా కాలేజీలో జాయిన్ అయ్యేవాళ్లు రిస్క్ చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాలేజీ నోటీసు బోర్డులో ఈ విషయాన్ని పేర్కొనాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదు
సాక్షి, హైదరాబాద్: మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి నడుపుతున్న వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. రిజిస్ట్రేషన్ పత్రాలు, గుర్తింపు రుజువు, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించిన వెంటనే వాహ నాన్ని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పలు సూచనలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. తన మహేంద్ర ఎక్స్‌యూవీ 500 వాహనాన్ని అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్.. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారంటూ కూకట్‌పల్లికి చెందిన జె.విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ వాహనాన్ని నడుపుతుండగా వాహనంలోని మరో వ్యక్తి మద్యం సేవించి ఉన్నారనే కారణంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటన సమ యంలో ఏం చేయాలో ఇదే హైకోర్టులో 2021లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే సందర్బాల్లో వాహనం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంది’అని చెప్పారు. హోం శాఖ తరఫు ఏజీపీ వాదనలు వినిపిస్తూ.. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడపడంలో పాల్గొన్నారన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి పిటిషనర్ పత్రాలతో పోలీసులను సంప్రదించలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ⇒ డ్రైవర్ లేదా రైడర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలితే వాహనాన్ని నడపడానికి అనుమతించరాదు. అయితే, అతనితో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో లేకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆ వ్యక్తిని వాహనం నడపడానికి అనుమతించాలి.⇒ వాహనాన్ని తన అదుపులో ఉంచుకున్న పోలీసులు, మరే ఇతర అధికారి అయినా, సదరు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, గుర్తింపు రుజువు, డ్రైవింగ్ లైసెన్స్‌ను సమర్పించిన మీదట దానిని యజమానికి, ఏదైనా అధీకృత వ్యక్తికి అప్పగించాలి. ⇒ డ్రైవర్, వాహన యజమాని.. వీరిపై న్యాయపరమైన చర్యలు అవసరమని పోలీసులు ఒక నిర్ణయానికి వస్తే, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు వారిపై చార్జిషీట్ దాఖలు చేయాలి. ⇒ చార్జిషీట్లు ఇతరత్రా సక్రమంగా ఉంటే మోటారు వాహనాల చట్టంలోని నిబంధన 448–ఏ(4)కు అనుగుణంగా, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు ఆ చార్జిషీట్లను స్వీకరించాలని మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.⇒ ఈ ఆదేశాలతోపాటు 2021లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే ‘కోర్టు ధిక్కరణ’గా పరిగణిస్తాం. సంబంధిత పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటాం అంటూ పిటిషన్‌ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్‌కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. -
కోర్టుకు హామీ ఇచ్చి పాటించరా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు, ఇతర ప్రయోజనాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలంటూ గత నెలలో తామిచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 758 మంది పిటిషనర్లకు చెల్లించామని ప్రభుత్వం చెబుతున్నా.. 221 మందికి మాత్రమే పూర్తిస్థాయిలో నగదు అందినట్లు తెలుస్తోందని చెప్పింది. ఇంకో చివరి అవకాశం ఇస్తున్నామని, అందరికీ పూర్తిస్థాయి చెల్లింపులు చేయాల్సిందేనని తెల్చిచెప్పింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరై ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుంటే ఎలా ప్రశ్నించింది. కోర్టులతో ఆటలాడుకోవద్దని, అలుసుగా తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా వేస్తూ.. ఆలోగా ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా ఆర్థిక ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్నది కాదు.. అది జీవితకాలమంతా ఆ ఉద్యోగులు దాచుకుందని మరోసారి నొక్కి చెప్పింది. పదవీ విరమణ బకాయిలు, ఇతర ప్రయోజనాలు చెల్లించడం లేదంటూ రెండేళ్లలో వందలాది పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లలో చెల్లింపులకు కొంత గడువిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు దాటినా నిధులు విడుదల చేయకపోవడంతో 758కి పైగా ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ధిక్కరణ పిటిషన్లలో విచారణ కూడా నెలలుగా సాగుతోంది. గత నెల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి స్పష్టమైన హామీ తీసుకుంది. ఆ మేరకు ఏప్రిల్ 9 వరకు చెల్లింపులకు డెడ్‌లైన్ విధించింది. ఒకరికి కూడా పెండింగ్ ఉండొద్దు..ఈ ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. చాలామంది తమకు పూర్తిస్థాయి చెల్లింపులు చేయలేదని చెప్పడంతో న్యాయమూర్తి ఒక్కో పిటిషన్ వారీగా పరిశీలించారు. మొత్తం పిటిషన్లలో 221 మందికి మాత్రమే పూర్తి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఏప్పిల్ 9లోగా చెల్లిస్తామని చెప్పి.. అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 758 మందిలో 737 మందికి పూర్తి చెల్లింపులు జరిపామన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులందరూ ఇక్కడ లేకపోవడంతో కొంత అస్పష్టత ఉందని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒక్కో వ్యక్తికి 2 నుంచి 10 టోకెన్లు జారీ అయ్యాయని, వాటిలో కొన్ని చెల్లించి మరికొన్ని బకాయి ఉంచారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరి అవకాశంగా జూన్ 10 వరకు సమయం ఇస్తున్నామని, బకాయిలు చెల్లించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. -
కాళేశ్వరం కమిషన్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడింది. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు వాయిదా వేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే.. ఇవాళ విచారణ జరగ్గా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
‘గ్రీన్‌ఫీల్డ్ రేడియల్’పై వివరాలు సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు వద్ద మీర్ఖాన్పేట నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవులు తర్వాతకు వాయిదా వేసింది. యాచారం మండలం కుర్మిద్ద గ్రామం, కడ్తల్ మండలంలోని కడ్తల్, ముద్విన్ గ్రామాలు, ఆమనగల్లు మండలంలోని ఆమనగల్లు, అకుతోటపల్లి గ్రామాల్లో 554.34 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 98 ఏళ్ల వృద్ధురాలు అహల్యదేవి సహా మరో 30 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా, పిటిషనర్ల వ్యక్తిగత విచారణ జరపకుండా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారన్నారు. సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమైనదిగా, ఏకపక్షమైనదిగా, దురుద్దేశపూరితమైనదిగా ప్రకటించాలని కోరారు. విచారణ జరపకుండానే పిటిషనర్ల అభ్యంతరాలను తిరస్కరించడం సరికాదన్నారు. పిటిషనర్ల 61.24 ఎకరాల భూమికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సేకరిస్తున్న మొత్తం 554.34 ఎకరాల్లో 200 ఎకరాలు మాత్రమే వివాదాస్పదంగా ఉన్నాయని, 26 ఎకరాల ప్రాంతంలోని ఆస్తులకు ఇప్పటికే పరిహారం మంజూరు చేశామన్నారు. భూసేకరణ ప్రక్రియపై స్టే విధించొద్దని కోరారు. పరిహారం మంజూరు చేసే వరకు పిటిషనర్లను వారి భూముల నుంచి ఖాళీ చేయించమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
ఐఐఎం అడ్మిషన్లలో మెరిట్‌కు పాతర
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యాసంస్థలైన ఐఐఎంలలో ప్రవేశాల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘క్యాట్’లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాదని, అహేతుక నిబంధనలతో మెరిట్‌ను కాలరాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఐఎం ముంబై అనుసరిస్తున్న విధానాలపై విచారణ జరపాలని కోరుతూ ఒక బాధిత విద్యార్థి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు మార్చి30న ఫిర్యాదు చేశారు.కాగా, ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. అత్యంత క్లిష్టమైన పరీక్షగా పరిగణించే క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)లో 99.52 పర్సంటైల్ సాధించినప్పటికీ, తనకు కనీసం ఇంట ర్వ్యూ (పీఐ) పిలుపు కూడా రాకపోవడంపై హైదరాబాద్ గుండ్ల పోచంపల్లికి చెందిన సత్యసాయి కటారు అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్కోరు సాధించిన విద్యార్థులను పక్కనపెట్టి, తక్కువ పర్సంటైల్ వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వ డం రాజ్యాంగంలోని 14వ అధికరణం (సమానత్వపు హక్కు) కింద కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా, ఐఐఎంలు క్యాట్ స్కోరుకు కేవలం 30 శాతం నుంచి 60 శాతం మాత్రమే వెయిటేజీ ఇస్తున్నాయని, పదేళ్ల క్రితం పూర్తి చేసిన 10వ, 12వ తరగతి మార్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అభ్యర్థి ప్రశ్నించారు. వివిధ బోర్డుల మధ్య మూల్యాంకన విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు, పాత అకడమిక్ రికార్డులను ప్రామాణికంగా తీసు కోవడం గ్రామీణ, వెనుకబడిన విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని పేర్కొన్నారు.చదవండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్టలేరా?ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఐఐఎం ముంబై యాజమాన్యం సరిగ్గా అమలు చేయలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు. తాను దరఖాస్తు చేయని కోర్సులో ఇంటర్వ్యూ ఇస్తామంటూ తప్పుడు సమాచారంతో కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధితుడు కోరారు. -
ఆర్థిక ఇబ్బందుల్లేకుంటే కారుణ్య ఉద్యోగానికి అర్హులు కారు
సాక్షి, హైదరాబాద్: మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో లేకున్నా, అతను లేకుండా దీర్ఘకాలంగా జీవనం సాగిస్తున్నా వారు కారుణ్య ఉద్యోగానికి అనర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 25 ఏళ్ల మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఎంజీఎం ఆస్పత్రిలో మేల్ నర్స్‌గా పని చేసి మరణించిన తండ్రి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలంటూ వరంగల్‌కు చెందిన ఓ యువతి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారు తిరస్కరించడంతో, ఆకస్మిక ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించడానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం చాలా కాలం జీవనం సాగించిందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లేవంటూ పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. పిటిషనర్ తల్లి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె తండ్రికి చట్టబద్ధమైన వారసురాలిగా పొందిన సివిల్ డిక్రీ కేవలం ఆస్తి విషయాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి చట్టపరమైన హక్కు కల్పించదని చెప్పారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారంటూ ఆ ఉత్తర్వులను సమర్థించింది. ఉద్యోగం కోసం చేసిన మొదటి దరఖాస్తును సరైన కారణాలతో తిరస్కరించారని పేర్కొంది. ఐదేళ్ల తర్వాత రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. -
ఆ ముగ్గురు ఐఏఎస్‌లు హాజరుకావాలి
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన ఏడుగురు ఉద్యోగులకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులైన ఆర్థిక, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులతో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, వరంగల్ ఎస్ఈ, కొత్తగూడెం డివిజన్ ఈఈ, ఖమ్మం జిల్లా కలెక్టర్.. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీరిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులున్నారు. తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసింది.తమను క్రమబద్దీకరించకపోవడాన్ని, పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు (గతంలో) జగన్నాథం సహా పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి వీరికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ అధికారులు అప్పీల్ వేశారు. అప్పీల్‌ను ద్విసభ్య ధర్మాసనం పాక్షికంగా అనుమతించింది. ఖమ్మం జిల్లాకు చెందిన జగన్నాథం సహా మరికొందరి సేవలను 1993, నవంబర్ 25 నుంచి అన్ని ప్రయోజనాలతో క్రమబద్ధీకరించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించి, బి.శ్రీనివాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించాలని 2023, సెప్టెంబర్ లో ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జగన్నాథం సహా మరికొందరు బాధితులు 2024లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ధిక్కరణ పిటిషన్‌ను పరిశీలించిన ప్రతివాదులను తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
ప్రేమ విఫలమైతే అది మోసం కాదు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. మోసపూరిత ఉద్దేశం లేనపుడు అది వాగ్దానం మాత్రమేనని గతంలో ఓ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ఈ కేసులోనూ ఐదేళ్లు ప్రేమలో ఉన్నారని, ఇది హామీలో విఫలం కావడమే తప్ప మోసం కాదంది.పిటిషనర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి పాటించలేదంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ రామగుండం జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం నేరం కిందకు రాదని గతంలో ఇదే కోర్టు చెప్పిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి యువతిని ప్రేమకు ఒప్పించాడని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. -
విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనుక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి రూ.వేల కోట్లు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినా విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.ఆయా కాలేజీల నిర్వహణ, కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లలో ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటివరకు పేరుకుపోయిన రూ.వేల కోట్ల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీతోపాటు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేశవ్ మెమోరియల్ సహా పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008, 2009లో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు రూ.1,500 కోట్ల ట్యూషన్ ఫీజు బకాయిలను విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తాలు రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డిఫాల్టర్‌గా పేర్కొని, శిక్షించేవన్నారు.చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి ఐదేళ్లయినా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకే రూ.56 కోట్లు బకాయి ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్ ఆమోదం ఉందని, అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబుకాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకూ ఆదాయాన్ని సమకూర్చుకోలేక పోతున్నాయని, బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బకాయిలు మరింతగా పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నిర్వహణ కష్టంగా మారడంతో...పిటిషనర్లు సమరి్పంచిన గణాంకాలు సరైనవి కావని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూ ర్తి.. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. -
‘జూబ్లీహిల్స్’ ఎన్నికలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సభ్యుడు సునీల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నందా సూరేపల్లి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘2024లో 270 మందికి సభ్యత్వం ఇవ్వడంపై ఈ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. పాత వారిని తొలగించడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా సహకార శాఖ రిజి్రస్టార్ పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది’అని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రక్రియలో కోర్టులో జోక్యం చేసుకోలేవని సహకార శాఖ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఓటర్ల జాబితాపై పలు పిటిషన్లు, ధిక్కరణ పిటిషన్లపై ఇదే కోర్టు విచారణ చేపడుతున్నందున జోక్యం చేసుకోవచ్చన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
రైతుకు ప్రత్యామ్నాయ భూమి రాజ్యాంగ హక్కు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడం రాజ్యాంగ హక్కు అని హైకోర్టు నొక్కి చెప్పింది. పరిహారం చెల్లించే విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. బాధితురాలైన ఓ వృద్ధ మహిళను పదేళ్లపాటు కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వాదనలు స్వార్థపూరితంగా ఉన్నాయని, విశ్వసనీయత ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు చట్టబద్ధమైందని, ఆర్టీకల్ 300ఏ ప్రకారం రాజ్యాంగ హక్కని పేర్కొంది.తప్పనిసరి పునరావాస ప్రయోజనం కోసం పిటిషనర్‌ను ఇరవై ఏళ్లు వేచి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది సర్కార్ తన బాధ్యతను విస్మరించడమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్లు పిటిషనర్ పడిన మానసిక వేదన, బాధకు ఎవరు మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించింది. ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి, భౌతికంగా అందజేయకుంటే అది రైతు జీవనోపాధిని దెబ్బతీసినట్లేనని తేల్చి చెప్పింది. మహిళా రైతుకు రెండెకరాల భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని, డాక్యుమెంటేషన్ పూర్తి చేసి భూమిని భౌతికంగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇరవై ఏళ్లుగా భూమి కోల్పోవడం ద్వారా నష్టపోయిన వ్యవసాయ ఆదాయానికి పరిహారంగా రూ.10 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.25 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు, పొలం కోల్పోయి.. ప్రస్తుతం నిజామాబాద్‌లో నివసిస్తున్న దంతకళ చిన్నక్క.. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలోని తన ఇల్లు, పొలాన్ని కోల్పోయారు. 2006లో ప్రభుత్వం సమీప గ్రామంలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించి పట్టా జారీ చేసినా భౌతికంగా స్వా«దీనం చేయలేదు. భూమి కోసం చిన్నక్క అధికారుల చుట్టూ పదేళ్ల పాటు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో విధిలేక 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పునరావాస, పునఃస్థాపన పథకం కింద భూమి అప్పగింత ప్రయత్నాలు సాగుతున్నాయని, అంతర్గత కార్యాలయాల నుంచి సమాచార జాప్యం కారణంగా అప్పగింత ఆలస్యమవుతోందన్న జీపీ వాదనలను తిరస్కరించారు. అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, నిరుపేద మహిళా రైతు ఏం చేయలేరన్న వైఖరిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 226 కింద తమ అసాధారణ అధికార పరిధిని వినియోగించుకోవడానికి ఇది సముచితమైన కేసు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సర్కారు తీరు దిగ్భ్రాంతికి గురి చేసింది: న్యాయమూర్తి రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సహించరానిదని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆక్షేపణీయమన్నారు. సర్కారు తీరు న్యాయస్థానాన్ని ది్రగ్బాంతికి గురి చేసిందని చెప్పారు. అధికారంతో పౌరులను వారి జీవనోపాధి నుంచి దూరం చేయలేరని చెప్పారు. ఉత్తర్వుల కాపీ అందిన నాటి నుంచి నాలుగు నెలల్లో ప్రత్యామ్నాయ సాగు భూమిని భౌతికంగా అందజేయాలని సూచించారు. హద్దులు నిర్ణయించి, పట్టాదారు పాస్‌బుక్, హక్కు పత్రాన్ని అందివ్వాలని ఆదేశించారు. ఏటా రెండెకరాలకు రూ.50 వేలు చొప్పున 20 ఏళ్లకు రూ.10 లక్షల నష్టపరిహారం 16 వారాల లోగా చెల్లించాలంటూ తీర్పునిచ్చారు. -
కూల్చివేతల కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలో ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లలో కొందరికి పట్టాలు మంజూరు చేయడంతోపాటు మరికొందరి దరఖాస్తులు పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులతో అర్హులకు అన్యా యం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేతలను సవాల్ చేస్తూ ఖానాపురానికి చెందిన తాళ్లూరి వెంకట నరసమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు మొత్తం 24 మంది కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 24న ఉదయాన్నే చట్టవిరుద్ధంగా అధికారులు చేపట్టిన కూల్చివేతలు 2014లో హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా.. కొందరికే ఇవ్వడం సరికాదన్నారు. అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చివేయడం చెల్లదన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలోని ఆరుగురికి పట్టా లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. సొంతిళ్లున్న అయిదుగురి విజ్ఞప్తిని తిరస్కరించామని, మిగిలినవారి దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామని వివరించారు. కూల్చివేతల తర్వాత 311 పట్టాలు, 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరిస్తూ, విచారణను వాయిదా వేశారు. -
‘అనర్హత’పై కడియం, సంజయ్‌లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్లలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కమ్ ట్రిబ్యునల్, ఫిరాయింపు శాసనసభ్యులను సీజే ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. దానికి సంబంధించిన ఆధారాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేస్తూ గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లకు వీటిని కూడా జత చేయాలని రిజిస్ట్రీకి సూచించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ బీఆర్ఎస్ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్(ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ‘అనర్హత’తీర్పుపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎల్. వెంకటేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం చట్టవిరుద్ధమన్నారు. స్పీకర్ తీర్పు అధికారిక ప్రతి అందనందున అది సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులైన స్పీకర్ కమ్ ట్రిబ్యునల్, ఇద్దరు ‘ఫిరాయింపు’ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
‘అనర్హత’పై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ కమ్ ట్రిబ్యునల్‌ను, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. సదరు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు తాజా పిటిషన్లు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్ఎస్ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్.. వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. దీనిపై రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాశ్‌గౌడ్, వెంకట్రావు, గాం«దీ, దానం నాగేందర్, కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి దాఖలైన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. స్పీకర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించిన సదరు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్‌లో చేరడం, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో కూడా ప్రసారమైంది. దానం నాగేందర్ ఏకంగా 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీటన్నిటిపై బీఆర్ఎస్ అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. అవేవీ పరిశీలించకుండానే పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం. పిటిషన్లపై సత్వరమే విచారణ చేపట్టాలి..’అని కోరారు. దీంతో సీజే ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలకు సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం,స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. -
మళ్లీ తెరపైకి బిల్డింగ్ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు పట్టణీకరణ వేగవంతమవుతుంటే మరో వైపు అంతే వేగంతో అక్రమ నిర్మాణాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం వద్ద నిర్దిష్ట యంత్రాంగమేదీ లేకపోవడంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. మహానగరంలో ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాం. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల్లో సుమారు 80 శాతం మేర అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. కాగా అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది కొరత, కోర్టు స్టే ఆర్డర్ల మూలంగా కూల్చివేతలు చేపట్టలేకపోతోంది. కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు నిరాకరించినా లేదా రద్దు చేసినా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మూలన పడిన ‘మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్’(ఎంబీటీ) ఏర్పాటు అంశాన్ని పురపాలక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2016లోనే తెరమీదకు ట్రిబ్యునల్2016లో ఎంబీటీ అంశం తెరమీదకు రాగా ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సవరణలు చేశారు. 2017లోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి నియమావళిని రూపొందించారు. ఈ నియమావళి ప్రకారం మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉండాలి. న్యాయ, సాంకేతిక అంశాలపై అవగాహన కలిగిన వారిని ట్రిబ్యునల్‌లో నియమించాలని ప్రతిపాదించారు. కేసుల సంఖ్యను బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌లను కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రతీ బెంచ్‌లో కనీసం ఇద్దరు సభ్యులు (ఒకరు న్యాయ, మరొకరు సాంకేతిక అనుభవం) ఉండాలనే నిబంధన విధించారు. చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి జిల్లా జడ్జి లేదా మాజీ జిల్లా జడ్జి స్థాయి అధికారి అయి ఉండాలి. టెక్నికల్ సభ్యుడు తెలంగాణ టౌన్ ప్లానింగ్ సర్వీస్‌లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి అనే నిబంధనలు విధించారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ చైర్మన్ పదవికి అర్హులైన ఇద్దరు జిల్లా జడ్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. పలు విభాగాలు కూడా సభ్యుల పేర్లను పురపాలక శాఖకు సూచించాయి. ప్రతిపాదించిన సభ్యుల్లో కొందరిపై ఆ తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వేర్వేరు కారణాలతో ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. 2022లో హైకోర్టు ఆదేశాలు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటులో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని 2022 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని 2023లోనూ కోర్టు మరోసారి గుర్తుచేస్తూ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొంది.మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పారదర్శకత పెంచడం, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా చేపడుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట పడినా, ఇతర అక్రమ నిర్మాణాల నియంత్రణకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ లాంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమనే డిమాండ్ బలపడుతోంది. -
సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.నిరంజన్‌రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
‘కాళేశ్వరం’పై ఏప్రిల్ 8న తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లలో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఏప్రిల్ 8న తుది ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి ఒకట్రెండు రోజులు అవకాశం ఇచ్చింది. అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో గత సెప్టెంబర్‌లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామ శేషాద్రినాయుడు, రామచంద్రరావు, న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపించారు. మీడియాకు వివరాలు ఎందుకు ఇచ్చారు? శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడాన్ని, దర్యాప్తు సీబీఐకి అప్పగించడాన్ని మేము తప్పుబట్టడం లేదు. లోపభూయిష్టంగా కమిషన్ ఏర్పాటు, చట్టవిరుద్ధంగా చేపట్టిన విచారణను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. నివేదికను అసెంబ్లీలో ఉంచి చర్చ జరగకముందే మీడియాకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి.. వివరాలు వెల్లడించాల్సిన అత్యవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. చట్టప్రకారం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ ఏర్పాటు చేశామంటున్న ప్రభుత్వం.. పిటిషనర్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసేలా చేయడం సరికాదు. బహుళ ప్రయోజనాలతోనే నాటి ప్రభుత్వం కాళేశ్వరం చేపట్టింది. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా మారింది. 13 జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించింది. అంచనాతో పోలిస్తే వ్యయం పెరగని ఒక్క ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల్లో ఉంటే చూపాలి? కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కమిషన్ వేశారు. నివేదిక చట్టవిరుద్ధం. రద్దు చేయాలి’అని చెప్పారు. రాంచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. చట్టంలోని నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన కమిషన్ చెల్లదన్నారు. తరణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సాక్షిగా పిలిచి వివరాలు తీసుకుని నివేదికలో ఇష్ట్రం వచ్చినట్లు పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది. భవన వివాదాలపై ట్రిబ్యునళ్లుఏర్పాటు చేయాలని సర్కార్‌కు హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలోని భవన నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాల సీజ్, కూల్చివేతలు లాంటి వివాదాలపై ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాజ్యాంగ ధర్మాసనానికి వచ్చే పిటిషన్ల సంఖ్య తగ్గడంతోపాటు ఇప్పటివరకు ఉన్న కేసుల భారం కూడా కొంత తగ్గుతుందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అనంతరం స్థల వివాదంపై దాఖలైన అప్పీల్‌ను ధర్మాసనం ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. టైటిల్‌ను పరిశీలించకుండా మేడ్చల్ మల్కాజిగిరి ఉప్పల్ మండలం కొత్తపేట సర్వే నంబర్ 106, 107లో భవన నిర్మాణానికి రాధేశ్యామ్ కన్స్ట్రక్షన్కు అనుకూలంగా 2025, అక్టోబర్ 10న అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హబ్సిగూడకు చెందిన శ్రీనివాస్‌యాదవ్, మలక్‌పేట్‌కు చెందిన డీఈ నాగరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కమిషనర్ ప్రాథమికంగా టైటిల్, సబ్జెక్ట్ ఆస్తిపై హక్కులు ధ్రువీకరించిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారని, అనుమతిని రద్దు చేయమని చెప్పడానికి పిటిషనర్ల వద్ద సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. న్యాయాధికారులను కేటాయిస్తాం.. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీల్ విచారణ సందర్భంగా ఇలాంటి వేలాది పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటాన్ని ప్రస్తావించింది. ప్రతీ వివాదం నేరుగా హైకోర్టుకు రాకుండా ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించాలని ఏజీకి సూచించింది. ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తే న్యాయాధికారులను కేటాయిస్తామంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ఈ విషయంపై ప్రభుత్వానికి న్యాయసలహా ఇస్తానని పేర్కొన్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని తమ తీర్పులో ప్రస్తావిస్తామని.. అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను మూడు వారాలపాటు వాయిదా వేస్తున్నామని.. అప్పటివరకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
5న వాదనలు ముగించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో గురువారం (5న) వాదనలు ముగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు.. తర్వాత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. రోజుల తరబడి వాదనలు వినడం సరికాదని, క్లుప్తంగా వాదనలు ముగించాలని సూచించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.కమిషన్‌ను తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ,, కేంద్ర జల కమిషన్ వంటి సంస్థల నుంచి అందిన పత్రాల ఆధారంగా మాత్రమే సమగ్ర నివేదికను సమర్పించింది. ఎవరినీ నిర్బంధించడానికి ఎవరిపైనా ఎటువంటి ఆధారాలు తీసుకోలేదు. ప్రజా ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం సర్కార్‌కు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఇతర ఏ ప్రాజెక్టుపైనైనా విచారణ కమిషన్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ ఏర్పాటును తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది. చట్టప్రకారం ఇచ్చిన అధికారం మేరకే కమిషన్ విధులు నిర్వహించి నివేదిక అందజేసింది. కేబినెట్ సబ్‌కమిటీ ఆమోదం లేకుండా నాటి సీఎం, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి సంతకాలతో రూ.వేల కోట్లు విడుదల చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం’ అని ఏజీ చెప్పారు. ‘రూ.1.47 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించే కాళేశ్వరం గిట్టుబాటు కాదని కాగ్ ఆక్షేపించింది. ఎకరాకు రూ.6.42 లక్షల పెట్టుబడి పెట్టింది. ఎత్తిపోతలకు విద్యుత్ వినియోగంతో రాష్ట్రంపై అదనపు భారం పడుతోంది. అంత మొత్తం పెట్టుబడికి తగిన ఆదాయం వ్యవసాయం నుంచి రావడం లేదు’ అంటూ పీవీ జగన్నాథ్‌రావు వర్సెస్ ఒడిశా, ఏలేరు కమిషన్‌లో సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. -
కమిషన్ ఏర్పాటు కుట్రపూరితం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదిక చెల్లదని, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదించారు. ప్రతిపక్ష నేతలను ఇరికించాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ప్రభుత్వం కమిషన్‌ను నియమించిందన్నారు. అనంతరం కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. రెండున్నర గంటల వాదనల తర్వాత తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలొద్దంటూ గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వా నికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మా సనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, పి.శ్రీరామ్, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. బాధ్యులెవరో తేల్చాలని కమిషన్ ఎలా వేస్తారు? సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ప్రభు త్వం ముందే ఓ నిర్ణయానికి వచ్చి ంది. దానికి బాధ్యులెవరో తేల్చాలని కోరుతూ 2024, మార్చి 14న జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియ మిస్తూ జీవో 6 జారీచేసింది. ఇది ఒక రకంగా తాము చెప్పిన విధంగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరడమే. ఇలా కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం నోటీసులు జారీ చేయలేదు. సాక్షిగా పిలిచి దోషిగా చూపే ప్రయత్నం చేయడం అభ్యంతరకరం.నివేదిక పేరిట తీర్పు చెప్పే అధికారం కమిషన్‌కు లేదు. 2025, జూలై 31న సర్కార్‌కు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సమ ర్పించింది. అంతకుముందే నివేదికలోని అంశాలు బహిర్గతం చేశారు. సీఎం, మంత్రులు.. హరీశ్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. పవర్ పాయి ంట్ ప్రజెంటేషన్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించడం, నిరాధార ఆరోపణలు చేయడం పరువుకు భంగం కలిగించడమే. ఏకపక్షంగా నివేదికలోని వివరాలను 60 పేజీలకు కుదించి మీడియాకు విడుదల చేశారు. చట్టప్రకారం, కేబినెట్ అనుమతితోనే అన్ని చర్యలు చేపట్టినందున సీబీఐ విచారణకు ఆదేశించినా ఎదుర్కొంనేందుకూ సిద్ధం’అని చెప్పారు.రాజకీయ కక్షలో భాగంగానే.. ‘కేంద్ర ప్రభుత్వ అధీనంలోని వ్యాప్కో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించింది. హరీశ్‌పై సాక్షులెవరూ తప్పుడు ఆరోపణలు చేయలేదు. గత జూన్ 9న హాజరై కమిషన్ అడిగిన సమాచారం, కేబినెట్ తీర్మాన కాపీలన్నీ అందజేశారు. అయినా, సహేతుకమైన అవకాశం ఇవ్వకుండా ఆరోపణలు చేయడం చెల్లదు’అని సుందరం చెప్పారు. దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్‌ను దోషిగా చూపించాలని ఉద్దేశంతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏకపక్షంగా జీవో జారీ చేశారు’ అని చెప్పారు. అనంతరం కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. -
‘భూపాలపల్లి’ కేసులో రేవంత్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (నాడు ఎంపీ)పై 2023లో దాఖలైన కేసులో ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు రేవంత్‌కు ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. 2023, ఫిబ్రవరి 22న భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి తనపై భూకబ్జాదారుడినని, పెట్రోల్, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డానని, సింగరేణిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డానని తీవ్ర ఆరోపణలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మొగుళ్లపల్లి, భూపాలపల్లి పీఎస్‌ల్లో కేసు నమోదైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ మూడు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. -
వన్ మ్యాన్.. వన్ ఎపిక్ కార్డుపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘వన్ మ్యాన్.. వన్ ఎపిక్ కార్డు’పై వివరాలు ఇవ్వాలని, అలాగే పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కలెక్టర్, ఆర్డీవోతోపాటు కౌన్సిలర్ బుగ్గా రాములుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. పంచాయతీ, మున్సిపాలిటీలో వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులున్న చిలకల బుగ్గ రాములు (బీఆర్ఎస్) నామినేషన్‌ను తిరస్కరించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈగల రాములు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మున్సిపాలిటీలో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్)తో పోటీచేసి వార్డు సభ్యుడిగా గెలుపొందిన రాములు, పంచాయతీ ఎన్నికల్లో మరో ఓటరు కార్డుతో ఓటు వేశారన్నారు. దీనిపై పిటిషనర్ గత నెలలో ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎన్నిక ముగిసినందున ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి మూడు నెలలకోసారి ఓటర్ల జాబితాను సవరిస్తూ ఉంటుందని, ఈ జాబితా మేరకు ఆయా పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.ఈ జాబితా ఆధారంగా ఎస్ఈసీ వార్డుల వారీగా ఓటర్ల జాబితా విభజిస్తుందని.. ఒక వ్యక్తికి ఒక ఎపిక్ కార్డు మాత్రమే ఉంటుందన్నారు. పల్లెలో, నగరంలో ఇల్లున్నా ఒకచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘వన్ ఎలక్షన్.. వన్ ఓట్ ’లేదా ‘వన్ మ్యాన్.. వన్ ఎపిక్ కార్డు’పై ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏముందో వివరాలు సమర్పించాలని చెప్పారు. ఈ పిటిషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కూడా పార్టీగా చేర్చి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
ఎన్ని చెట్లు తొలగించారు.. ఎన్ని మొక్కలు నాటారు?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న ఫ్రీక్వెన్సీ రాడార్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని చెట్లను తొలగించారు.. ఎన్ని మొక్కల్ని నాటారు.. వివరాలు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. 9 లక్షల మొక్కలను నాటామని, వాటిలో 93 శాతం బతికాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. చెప్పడానికి అంకెలు బాగానే ఉంటాయని, వాస్తవ పరిస్థితిని గణాంకాలతో సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. రాడార్ ప్రాజెక్ట్ కేంద్రానికి 2,900 ఎకరాల దామగుండం అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ హైకోర్టులో 2020లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ..మొత్తం 11.74 మొక్కలు నాటాల్సి ఉందని, ఇప్పటికే రాష్ట్ర అటవీ శాఖ 9 లక్షల మొక్కలను నాటిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
సిద్ధార్థ్‌రెడ్డికి జైలు
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్ లేవంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. గత నవంబర్‌లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. డాక్టర్ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్‌ప్రొఫెషనల్’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కాదు: కూల్‌డ్రింక్‌లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్థ్ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సర్వైవింగ్ పార్ట్‌నర్‌దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.ఆ రోజు ఏం జరిగింది? 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్‌డ్రింక్‌లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. -
‘బుల్డోజర్’ తీర్పు మీకు వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: ఫిర్యాదు రావడమే అదునుగా ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ చేపట్టకుండా భూములను ప్రభుత్వానివిగా పేర్కొంటూ హైడ్రా కంచె వేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ‘బుల్డోజర్ న్యాయం’పై చెప్పిన తీర్పు మీ ఏజెన్సీకి వర్తించదా అని ప్రశ్నించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి పనిచేస్తున్నారా? లేదా? అని అడిగింది. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని హైడ్రా భావిస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చినప్పుడు, కంచె వేసేటప్పుడు హైడ్రా చట్ట ప్రక్రియను పాటించడంలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ‘మీరు మీకు నచ్చిన భూములకు కంచె వేస్తూనే ఉంటారు. కానీ మీ చర్యలకు మద్దతిచ్చే ఆధారాలు మీ వద్ద ఉండవు’అని మండిపడింది. హైదరాబాద్ గోల్కొండ మండలం గుడిమల్కాపూర్ సర్వే నంబర్ 104లోని 1,351 చదరపు గజాల స్థలంలో తన షెడ్‌ను కూచ్చివేసి, దాని చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ప్రసాద్ ఎన్.తంజెర్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైడ్రా చర్య గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు. హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు అడిగిన వాటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం హైడ్రా చర్యలు చేపడుతోందని వాదించారు. కంచె తొలగించండి... వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూమి నుంచి కంచె తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. అలాగే అక్కడ ఎలాంటి మార్పులు చేయొద్దని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వ భూములా.. వివాదంలో ఉన్నాయా.. కోర్టు ఉత్తర్వులున్నాయా.. అనేది ఎలా నిర్ధారణ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా కంచె వేయడం సబబుకాదని హితవు పలికారు. జీవితకాలం సంపాదించిన డబ్బుతో ప్రజలు భూమి కొనుగోలు చేస్తారని, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కంచెలు వేస్తూ పోవడం సమర్థనీయం కాదన్నారు. హైడ్రాపై ఆరోపణలు ఇదే తొలిసారి కాదని, వందల పిటిషన్లు న్యాయస్థానం వద్ద విచారణలో ఉన్నాయని చెప్పారు. కంచె వేయడానికి ఏజెన్సీకున్న అధికారం ఏంటో కూడా చెప్పాలన్నారు. పిటిషనర్ ఫోన్‌ను లాక్కునే అధికారం మీకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలు, గణాంకాలు, భూములపై పూర్తి సమాచారం లేకుండా కంచె వేయవద్దని హైడ్రాను ఆదేశించారు. ఇప్పటివరకు అలా వేసి ఉంటే తొలగించాలన్నారు. తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేశారు. -
‘పట్నం’ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సి పల్ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బుధవారం తమ ముందు హాజరుపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యాదగిరి అదృశ్యం కావడంతో ము న్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే, మధ్యాహ్నం ధర్మాసనం ముందు ప్రభుత్వ న్యాయవాది హాజరై యాదగిరి కనిపించారని, ఎన్నిక నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించలేదు. యాదగిరిని ఆయన భార్యతోపాటు తమ ముందు హాజరుపరచాలని తేల్చిచెప్పింది. ఈ విషయంపై వివరాలు సమర్పించేందుకు అమికస్ క్యూరీగా న్యాయవాది రామకృష్ణారెడ్డిని నియమిస్తూ, విచారణ వాయిదా వేసింది. ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన తన తండ్రి యాదగిరి కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆకుల హరికాంత్ హైకోర్టులో బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకే ఎన్నిక ఉందని చెప్పడంతో వెంటనే జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాస్తవాలు తెలియాల్సి ఉంది..: పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఒక పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లను 13న బొంగులూరులోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అనంతరం అందరినీ బయటకు పంపి యాదగిరిని మాత్రం పంపలేదు. చైర్మన్ రేసులో ఉన్న యాదగిరిని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కిడ్నాప్ చేసినట్లు అనుమానం ఉంది. దీనిపై 15న యాదగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. యాదగిరికి ప్రాణహాని ఉంది’అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడువిస్తే హాజరుపరుస్తారు’అని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం.. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీవోలకు వెంటనే తెలియజేయాలని చెబుతూ విచారణ 19కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి హాజరైన యాదగిరి ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలో మంగళవారం సైతం ఉత్కంఠ కొనసాగింది. స్వతంత్ర అభ్యర్థి ఆకుల యాదగిరిని కి డ్నాప్ చేశారన్న నేపథ్యంలో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో, న్యాయస్థానం స్టే విధించిందని చెబుతూ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నోటీసు ఇవ్వలేదని గొడవ..: జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ మిట్టల్, ఎన్నికల అధికారి, ఆర్డీవో అనంతరెడ్డి ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆకుల యాదగిరి సమావేశానికి రాగా, ఆ తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. మీటింగ్ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. మయాంక్ మిట్టల్ సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఎక్స్అఫీషియో ఓటర్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఎన్నికల నోటీసు అందజేయలేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు గొడవ చేయడంతో పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన అధికారులు మెజార్టీ సభ్యులు చైర్మన్‌గా బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డిని బలపర్చినట్లు సంతకాలు చేశారు. అనంతరం ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని చెబుతూ, ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఆపేశారు. కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ సుప్రీంలో వాదించింది. అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. -
మీడియేషన్ సరైన సొల్యూషన్!
తండ్రి వీలునామా ద్వారా సంక్రమించిన 4,461 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం కె.రవీంద్రనాథ్, ఆయన సోదరి మధ్య వివాదం నెలకొంది. సుప్రీంకోర్టు వరకు కేసులు వేస్తూ వెళ్లారు. ‘ఇది అన్నాచెల్లెలి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం. వివాదం ప్రారంభమై ఇప్పటికే 12 ఏళ్లయింది. ఇద్దరూ చర్చించుకుని ఓ న్యాయబద్ధమైన పరిష్కారానికి రావాలన్నది మా ఆకాంక్ష. దీని కోసం మధ్యవర్తిగా జస్టిస్ సుధాంశు ధులియాను నియమిస్తున్నాం.’ –హైదరాబాద్‌కు చెందిన కేసులో సుప్రీంకోర్టు సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వెళ్లాలంటే భయం.. కేసు ఎప్పటికి పరిష్కారమవుతుందోనని.., న్యాయవాదులు ఫీజు ఎంత అడుగుతారోనన్న ఆందోళన. కేసు తేలేదాక పార్టీల మధ్య వివాదాలూ తప్పవు. అదే బంధువులు, స్నేహితులైతే ఇక ఆ బంధం నిలబడే అవకాశమే ఉండదు. పలు క్రిమినల్ కేసులకు సివిల్ కేసు మూలంగా మారుతోంది. అలా కాకుండా.. సమయం, డబ్బుతోపాటు బంధాలు కలిపి ఉంచే ఒకే ఒక వేదికే ‘మధ్యవర్తిత్వం’. ఇరుపక్షాలు రాజీ కుదర్చుకుని ఆనందాన్ని పొందవచ్చు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనాలైన సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్యవర్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. న్యాయస్థానాలపై కేసులు భారం తగ్గించడం, సత్వర న్యాయం అందించడమే ధ్యేయంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కూడా ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’కార్యక్రమాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించింది. ఈ సందర్భంగా ‘మధ్యవర్తిత్వం’పై ప్రత్యేక కథనం.. పరిష్కరించుకునే కేసులు: సివిల్, వాణిజ్య, దాంపత్య వివాదాలు, చెక్‌బౌన్స్ కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, భూసేకరణ, వినియోగదారుల సంబంధ, కాంట్రాక్ట్ యాక్ట్ కేసులు, ఆర్థిక, ఆస్తి విభజన తగాదాలు, లేబర్‌కోర్టు కేసులుఇరుపార్టీలకు విజయం: పంచాక్షరీ, సభ్యకార్యదర్శి, టీజీఎల్ఎస్ఏ ఢిల్లీలోని మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ ఆదేశాల మేరకు ‘దేశం కోసం మధ్యవర్తిత్వం–2.0’ను గత నెల 2 నుంచి ప్రారంభించాం. హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, టీజీ ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్‌కోషి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. కక్షిదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విలువైన సమయం, డబ్బును ఆదా చేసుకోవాలి. ఇరుపార్టీల అంగీకారం మేరకే వివాదం పరిష్కారం అవుతుంది. మధ్యవర్తిత్వంలో ఆయా పార్టీలదే అంతిమ విజయం. మధ్యవర్తిత్వం బంధాలను నిలబెడుతుంది. మధ్యవర్తిత్వం కోసం ఎక్కడ సంప్రదించాలి... » ప్రతీ జిల్లాలోని న్యాయసేవాధికార సంస్థ ఆవరణలో మధ్యవర్తిత్వ కేంద్రం ఉంటుంది. » కో–ఆర్డినేటర్, మధ్యవర్తిత్వ కేంద్రం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు ప్రాంగణం. నల్సా టోల్ ఫ్రీ నంబర్ 15100 దేశం కోసం మధ్యవర్తిత్వం పురాతన, ఇతిహాసాల కాలం నుంచి మన దేశంలో అమల్లో ఉన్న మధ్యవర్తిత్వాన్ని న్యాయపరంగా, చట్టబద్ధంగా ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించి ఏటా ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఏడాది మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉన్న కేసులను సిద్ధం చేయాలని హైకోర్టులకు సమాచారమిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జనవరి 2 నుంచే దీని కోసం తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీజీఎల్ఎస్ఏ) చర్యలు ప్రారంభించింది. మధ్యవర్తిత్వ నిర్వహణకు శిక్షణ పొందిన వారు : 587 వీరిలో న్యాయవాదులు : 581 పదవీ విరమణపొందిన హైకోర్టు జడ్జిలు : 6 న్యాయవాదుల్లో హెచ్సీఎల్ఎస్సీ సభ్యులు : 67 40 గంటల ప్రత్యేక శిక్షణ పొందిన జ్యుడీషియల్ అధికారులు: 137 -
ఏకపక్షం చెల్లదు.. హైడ్రాను ఆదేశించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలోనే హైడ్రా పనిచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కంచె వేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆక్రమణ ఆరోపణ రాగానే కంచె వేసే అధికారం ఉందన్న వాదనపై పత్రాలను తమ ముందు ఉంచాలని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది.కాగా, గండిపేట మండలం నార్సింగిలోని 1608 గజాల భూమిపై వివాదం జిల్లా కోర్టు విచారణలో ఉంటే వెంటనే అందులో వేసిన కంచెను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ అందిన 48 గంటల్లో ప్రక్రియ పూర్తి చేయాలంది. దీనిపై నివేదిక సమర్పించాలంటూ... తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ భూమిలో హైడ్రా బోర్డు తొలగించాల్సిన అవసరం లేదంది. వివాదాస్పద భూమిపై విచారణ కోర్టు పరిధిలో ఉంటే కంచె తొలగించాలంది.కోర్టు పరిధిలోని భూమి చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించిందని, ఆ సంస్థ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నార్సింగికి చెందిన జి.రాహుల్ యాదవ్ సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి వాదిస్తూ.. ‘వివాదాస్పద భూమి మా ప్రైవేట్ భూమి. హక్కులు మాకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.ఆ కేసులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అందులో ప్రతివాదిగా నార్సింగి మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఇదే భూమికి సంబంధించి మరో పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద భూమిలో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి’ అని కోరారు. హైడ్రా కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. ఎంఏయూడీ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నా.. ప్రతిసారి ఆదేశాలు పొందాల్సిన అవసరం లేదన్నారు. ఎంఏయూడీ అనుమతి లేకుండా ఏజెన్సీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. -
అక్రమ ఓటర్ల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి అక్రమ ఓటర్లుంటే.. ఆ వివరాలు సమర్పించాలని ధిక్కరణ కేసులో పిటిషనర్ జ్యోతిప్రసాద్ కోసరాజును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ‘కోఆపరేటివ్ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. స్థలాలు పొందని సభ్యుల సంఖ్య ఎప్పుడూ 10 శాతానికి మించ కూడదు. అలాగే మంచిరేవులలో జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో సొసైటీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. కొత్త సభ్యులుగా చేరే వారు రూ.5 లక్షలు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకోవాలని షరతు విధించింది. ఓ ప్రైవేట్ వెంచర్ వారితో ఒప్పందం కుదుర్చుకుంది. సొసైటీ పరిధిలోనే భూములు ఇవ్వాలి గానీ, పరిధిలేని ప్రాంతాల్లో ‘ప్రైవేట్’తో ఒప్పందం చట్టవిరుద్ధం. ఈ అక్రమాలపై కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదు’అంటూ 2024లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్త సభ్యత్వాల ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని, వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్–4 పేరిట నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందాన్ని కూడా ఆపేయాలని చెప్పారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లుగా ‘మంచిరేవుల’సభ్యులకు అవకాశం ఇచ్చారంటూ సొసైటీ సభ్యులు జ్యోతిప్రసాద్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ప్రతివాదులు సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. కొత్త సభ్యులను చేర్చి.. వారికి ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ ఇద్దరిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలి’అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కొత్త ఓటర్ల వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. రవీంద్రనాథ్‌పై చర్యలేవీ? జూబ్లీహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్‌పై ఆరు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోఆపరేటివ్ రిజి్రస్టార్‌ను హైకోర్టు ఆదేశించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ మరో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సొసైటీ సభ్యులు జ్యోతిప్రసాద్, విజయభాస్కర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లోనూ విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. రవీంద్రనాథ్‌పై అనర్హత వేటు వేయాలంటూ తాము 2024, అక్టోబర్ 26న ఇచ్చిన వినతిపత్రంపై రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవడం లేదంటూ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. సొసైటీ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, రవీంద్రనాథ్‌పై చర్యలు తీసుకోవాలని రిజి్రస్టార్‌ను ఆదేశించారు. అయినా చర్యలు తీసుకోలేదంటూ ఈ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
ఆధార్ లేకుంటే ఆస్పత్రికి తరలించరా?
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సాయం అవసరమైన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించడానికి ఆధార్ కార్డు తప్పనిసరా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయా లని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచా రణ 3 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల్లోనూ తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన కె.రాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆధార్ కార్డు లేకపోవడంతో 108 సిబ్బంది సేవలకు నిరాకరించిన ఘటనను ప్రస్తావించారు. స్థిరమైన చిరునామా లేకుండా సంచార జీవనం కొనసాగించే బుడగజంగం కమ్యూనిటీకి చెందిన వారికి తగినంత ఆశ్ర యం, మనుగడ కోసం భూమి, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రతా పెన్షన్లు వంటి సాయాన్ని అందించడంలో జిల్లా అధికారులు విఫలమవడం చట్టవిరుద్ధమన్నారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. చట్టంలో అలా ఉందా?పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2024, డిసెంబర్లో బుడగ జంగం వర్గానికి చెందిన ఓ బాలిక ప్రమాదానికి గురైంది. ఆధార్ కార్డు లేనందున 108 అంబులెన్స్‌లో తరలించేందుకు సిబ్బంది నిరాకరించారు. ఎలాంటి పత్రాలతో సంబంధం లేకుండా అందరికీ సకా లంలో అత్యవసర వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించాలి’ అని కోరారు. ఈ సందర్భంగా ప్రమా దానికి గురైన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలించడానికి ఆధార్ కార్డు తప్పనిసరా అని ధర్మా సనం ప్రశ్నించింది. ‘రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి లేదా ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తి వద్ద ఆధార్ కార్డు లేకపో తే, అత్యవసర సేవ ప్రయోజనం లభించదా? ఆధార్ చూపించే వరకు ఆ వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించరా? చట్టంలో అలా ఉందా?’ అని అడిగింది. ఆధార్ కార్డు లేకపో యి నా రోగులకు చికిత్స అందిస్తున్నా మని ఏజీపీ బదులిచ్చారు. సమస్య చికిత్స గురించి కాదని, అత్యవసర పరిస్థితుల్లోని వ్యక్తులను వారి పత్రాలపై పట్టుబట్టకుండా సమీప ఆసుప త్రికి తరలించడంపై అని ధర్మాసనం పేర్కొంది. -
గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట
-
ఉత్తర్వులేకాదు.. అమలు బాధ్యతా సర్కార్‌దే
సాక్షి, హైదరాబాద్: స్కాలర్‌షిప్‌ల బకాయిల కారణంగా విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేయడమే కాదు.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, విచారణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని చెప్పింది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేసేలా సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల సరి్టఫికెట్లను నిలిపివేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు నిరాకరించే కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏదైనా టోల్–ఫ్రీ నంబర్, హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉందా అని అడిగింది. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలకు ఓ యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది. దీంతో బాధితులంతా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది. -
సిబిల్‌పై కౌంటర్‌కు ఇదే లాస్ట్ చాన్స్
సాక్షి, హైదరాబాద్: సిబిల్ స్కోర్ నివేదికలో ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఇదే చివరి అవకాశమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల సవరణ నిబంధనలకు సంబంధించి 2021, నవంబర్ 29న ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే విధించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన కృపాసోని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధ వారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సిబిల్’పై పారదర్శక, స్వతంత్ర యంత్రాంగం రూపొందించే వరకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సేవా కంపెనీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, సిబిల్ రూపంలో ప్రచురించి, వ్యాప్తి చేయకుండా నిరోధించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రతివాదుల తీరును తప్పుబట్టింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలై ఐదేళ్లు కావొస్తున్నా కౌంటర్ వేయకపోవడం సరికాదంటూ తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసింది. -
హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ
ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెబుతూ అప్పీల్లో విచారణ ముగించారు.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)రీసెంట్గా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజులు ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులివ్వడంతోపాటు షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం.. మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ఆ పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతున్నందున అక్కడే వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ ఎదురైంది.(ఇదీ చదవండి: అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!సాయిపల్లవితో ప్రభాస్) -
తెలంగాణ గ్రూప్-1 తీర్పు వాయిదా
-
గ్రూప్-1 తీర్పు ఇంకా రెడీ కాలేదు: హైకోర్టు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో నెలకొన్న ఉత్కంఠ కొనసాగనుంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. అది కాస్త వాయిదా పడింది. ఈ తీర్పుతో అప్పాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల భవితవ్యం తేలాల్సి ఉండేది. అయితే.. గత నెలలోనే సంబంధిత పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే ఇవాళ్టి తీర్పును ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని డివిజన్ బెంచ్ వెల్లడించింది.2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అలాగే..గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. అయితే ఈ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు సెలక్ట్ అయిన అభ్యర్థులు వేసిన పిటిషన్లను సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. తీర్పుతో 563 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే వీళ్లు అప్పాయింట్మెంట్ లెటర్లు అందుకున్న సంగతి తెలిసిందే.వాదనలు ఇలా..టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్లను వేర్వేరుగా జారీ చేసిందని చెప్పారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారన్నారు. రెండు హాల్‌టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్లడించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదన్నారు.తీర్పు.. ఇవాళ వెలువడాల్సిన తీర్పు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా పడింది. -
సుప్రీంకోర్టు విచారిస్తుండగా... ఇక్కడ ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఒకే రోజు 40 కుక్కలు చంపారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కుక్కలకు సంబంధించిన కేసులన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నందున ఇక్కడ విచారణ చేపట్టడం సబబు కాదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైదరాబాద్ శివార్లలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లోపల, చుట్టుపక్కల 40 వీధి కుక్కలను సామూహికంగా చంపిన ఘటనకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది రిషిహాస్రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వర్సిటీ లోపల, వెలుపల కుక్కలను బంధించి చంపుతున్నారు. నందిగామ మండలం తహసీల్దార్, మోడల్లకుడ గ్రామ పంచాయతీ సర్పంచ్, విశ్వవిద్యాలయ అధికారుల ఆదేశాల మేరకు కుక్కలను పట్టుకుని చంపారన్నారు. ఒకేరోజు దాదాపు 40 కుక్కల చంపిన బాధ్యులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేలా నందిగామ ఎస్‌హెచ్‌వోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే, విచారణ జరిపే వరకు కుక్కలను చంపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా 40 కుక్కలను చంపారనేందుకు సోషల్ మీడియా తప్ప ఇతర ఆధారాలున్నాయా అని జస్టిస్ మొహియుద్దీన్ ప్రశ్నించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది ఈ మరణాల గురించి తనకు తెలియజేశారని, గ్రామ పంచాయతీ అధికారులు కూడా దీనిని ధ్రువీకరించారని న్యాయవాది బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిల్లో లేవనెత్తిన సమస్యలు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ‘వీధి కుక్కలకు సంబంధించిన సాధారణ సమస్యల’పరిధిలోకి వస్తాయని పేర్కొంది. పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జంతు సంక్షేమ బోర్డును వీలైనంత త్వరగా పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, చట్టప్రకారం నిర్వహించకుంటే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (ఇండియా) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా అన్ని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను వెంటనే తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బోర్డు మొదట 2019లో ఏర్పాటు చేశారని, దాని పదవీ కాలం 2022లో ముగిసిందన్నారు. చట్టాలు కఠినంగా అమలు కావాలంటే పర్యవేక్షణ కమిటీకి నాయకత్వం వహించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలన్నారు. 2025, జనవరిలో బోర్డుకు అనధికార సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ మేరకు చర్యలు చేపట్టలేదన్నారు. జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని, అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటివరకు బోర్డును ఏర్పాటు చేయకుంటే ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
హైకోర్టు సంచలన ఆదేశాలు.. ట్రాఫిక్ పోలీసులకు కఠిన నిబంధనలు
-
వాహనాల చలాన్లు.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్లను చెల్లించమని బలవంతపెట్టొద్దని పోలీసులకు సూచించింది. తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల విషయమై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు.. వాహనదారులు చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయవద్దు. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు. అంతేకానీ.. పెండింగ్ చలాన్లను చెల్లించమని బలవంతపెట్టొద్దు అని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఆటోమెటిక్‌గా చాలా చలాన్ కట్ అయ్యేలా టెక్నాలజీ తీసుకురావాలని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించమని పోలీసులు.. పౌరులను ఆపొద్దని, బలవంతం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది . -
'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్
ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు, నిర్మాతలకు షాకిచ్చింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షోని ఆదేశించింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నం.120 ప్రకారం 350లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ పేర్కొంది.అలానే పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని, అలానే అధికారుల తీరుపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని మండిపడింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని స్వయంగా మంత్రి చెప్పినా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు, అధికారుల్ని ప్రశ్నించింది.టికెట్ ధరల పెంపు కోసం మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలని సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. -
తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ ప్రాసస్‌ను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు.. యూపీఎస్సీకి పంపిన తరువాత కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. డీజీపీ నియామక ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలన్న IA(ఇంట్రిమ్ ఆప్లికేషన్)ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.రాష్ట్ర డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 సెప్టెంబర్‌లో సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ నిన్న (గురువారం జనవరి 8) మరోసారి విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, యూపీఎస్సీ కౌన్సెల్ అజయ్‌కుమార్ కులకర్ణి వాదనలు వినిపించారు.కోర్టు ఆదేశాల మేరకు తాము యూపీఎస్సీకి జాబితాను పంపామని, కమిషన్ దాన్ని తిప్పి పంపిందని ఏజీ అన్నారు. కోర్టు ఉత్తర్వులు యూపీఎస్సీకి కూడా వర్తిస్తాయని, రాష్ట్ర జాబితాను తిరిగి పంపకూడదన్నారు. పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్న సరైంది కాదన్నారు. రాష్ట్ర సిఫార్సులను పునఃపరిశీలించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోరారు.ఈ విషయంలో కేంద్ర హోం శాఖకు ఎలాంటి పాత్ర లేదని ఏఎస్జీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి, యూపీఎస్సీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల అంశమని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి జరిగిన జాప్యం, డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీం ఆదేశాల దృష్ట్యా అటార్నీ జనరల్‌ను న్యాయ సలహా కోరామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు నుంచే స్పష్టత కోరాలని ఆయన సూచించారన్నారు. వాదనలు విన్న జడ్జి.. ఇవాళ(శుక్రవారం) తీర్పు వెల్లడించారు. -
తెలంగాణ హైకోర్టుకు చిరంజీవి, ప్రభాస్
-
భార్య వంట చేయకపోతే విడాకులా?
-
హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట
మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. -
హైకోర్టుని ఆశ్రయించిన 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్' నిర్మాతలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి. గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఏ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు లేదని తేల్చేశారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్లపై హైకోర్టులో బుధవారం (డిసెంబరు 07) విచారణ జరగనుంది.ఇకపోతే 'రాజాసాజ్' నిర్మాతలు.. తెలంగాణ ప్రభుత్వాని టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల గురించి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రీమియర్ల కోసం మల్టీప్లెక్స్‌ల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800కు విక్రయించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్-మల్టీప్లెక్స్‌ల్లో ప్రీమియర్ల కోసం రూ.600 ధరకు విక్రయించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంలో అటు హైకోర్టు, ఆపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! ) -
భర్త ఆర్థిక ఆధిపత్య ధోరణి... క్రూరత్వం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: కేవలం భర్త ఆర్థికంగా ఆధిపత్య ధోరణి కనబరుస్తున్నాడనే కారణంగా దాన్ని వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సాకులతో క్రిమినల్ కేసులు వేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. భర్త నుంచి కొంతకాలంగా దూరంగా ఉన్న ఓ మహిళ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. క్రూరత్వం, వరకట్న వేధింపుల ఆరోపణలతో భర్తపై పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. సదరు ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ‘‘మాజీ భర్త తాను పంపిన డబ్బులను ఎలా ఖర్చు చేసిందీ లెక్కలడిగాడన్నది పిటిషనర్ అభియోగం. అంతే తప్ప బాధితురాలికి ఇతరేతరా ఏ విధమైన మానసిక, భౌతిక హానీ జరగలేదు. అలాంటప్పుడు కేవలం మాజీ భర్త ఆర్థిక ఆధిపత్య ధోరణి చూపడాన్ని క్రూరత్వంగా పరిగణించలేం. ఇలాంటి వైవాహిక వివాదాల కేసుల విచారణలో కోర్టులు అత్యంత జాగరూకంగా వ్యవహరించాలి. ఒకరకంగా ఇది భారత సమాజ తీరుతెన్నులకు అద్దం పట్టే అంశం. పురుషులు స్త్రీల ఆర్థిక విషయాలపైనా తమ పెత్తనమే సాగాలనుకుంటూ ఉంటారు’’అని తీర్పు రాసిన జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు. -
దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: సిగాచీ దారుణ ఘటనకు అసలైన బాధ్యులెవరో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సర్కార్‌దేనని హైకోర్టు స్పష్టం చేసింది. తాము దర్యాప్తును నియంత్రించడం లేదని, విచారణ పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ పిల్ విచారణ ట్రయల్ కోర్టుపై ప్రభావం ఉంటుందని తాము భావించడం లేదని అభిప్రాయపడింది. తమ ముందున్న వాస్తవాల ఆధారంగా ట్రయల్‌కోర్టు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, సర్కార్ నివేదిక, చట్టాలను విశ్లేషించేందుకు సమయం కావాలని అమికస్‌క్యూరీ కోరడంతో ధర్మాసనం విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని హైదరాబాద్ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం విదితమే. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దర్యాప్తు గణనీయంగా పురోగతి సాధించింది. సిగాచీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (నిందితుడు–2) అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేశాం. ఇతర నిందితులు (3 నుంచి 7) పరారీలో ఉన్నారు. గల్లంతైన 8 మందిని కూడా మరణించినట్లుగా గుర్తించాం. వారికి కూడా మృతిచెందిన వారిలాగానే పరిహారం అందించే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు రూ.22.30 కోట్ల పరిహారం పంపిణీ జరిగింది’అని చెప్పారు. దర్యాప్తునకు సహకారం అందిస్తున్నాం.. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే అధికారులతో చర్చలు జరిపాం. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 42 లక్షలు చెల్లించడానికి అంగీకరించాం. తీవ్రంగా గాయపడిన కార్మికులకు రూ. 2 లక్షలు చెల్లించాం. వారి పూర్తి వైద్య ఖర్చులనూ భరించాం. అరెస్టయిన ఎండీ, పరారీలోని నిందితులకు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే ట్రయల్ కోర్టుపై ఈ పిల్ ప్రభావం లేకుండా చూడాలి’అని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. కంపెనీ రూ.కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి రూ.42 లక్షలు మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు.


