ప్రేమ విఫలమైతే అది మోసం కాదు | HC Says Breach of Promise to Marry Without Initial Fraudulent Intent Does Not Constitute Cheating | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైతే అది మోసం కాదు

Apr 4 2026 5:36 AM | Updated on Apr 4 2026 5:36 AM

HC Says Breach of Promise to Marry Without Initial Fraudulent Intent Does Not Constitute Cheating

మోసం చేయాలన్న ఉద్దేశం ఉంటేనే నేరమన్న హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. మోసపూరిత ఉద్దేశం లేనపుడు అది వాగ్దానం మాత్రమేనని గతంలో ఓ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ఈ కేసులోనూ ఐదేళ్లు ప్రేమలో ఉన్నారని, ఇది హామీలో విఫలం కావడమే తప్ప మోసం కాదంది.

పిటిషనర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి పాటించలేదంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ రామగుండం జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం నేరం కిందకు రాదని గతంలో ఇదే కోర్టు చెప్పిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి యువతిని ప్రేమకు ఒప్పించాడని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.

Advertisement
 
Advertisement
Advertisement