ఏపీ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది.
ఈ అకాల వర్షానికి ఉద్యాన రైతులు నిండా మునిగారు. అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తోటల్లో పక్వానికి వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలో దాదాపు 80 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది.


