రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే | High Court Grants Three Week Stay on Rayadurgam Land Auction | Sakshi
Sakshi News home page

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే

Jun 18 2026 5:16 PM | Updated on Jun 20 2026 4:31 PM

 High Court Grants Three Week Stay on Rayadurgam Land Auction

హైదరాబాద్‌: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టలు స్టే విధించింది. 

కాగా, రాయదుర్గం భూముల వివాదంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ల్యాండ్ ఆక్షన్ చేసే సమయంలో SBIకి సమాచారం ఇచ్చామని తెలిపారు. మరో చోట ల్యాండ్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ ప్రపోజల్ కు SBI కూడా ఒప్పుకుందని అన్నారు. 7 రోజులు కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కావాలని అన్నారు. ఎకరానికి రూ.237 కోట్లు చొప్పున చెల్లించిన గౌరవ్ వెంచర్స్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతుందని హైకోర్టు  ప్రశ్నించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement