ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు | Telangana High Court Issues Notice To MLA Danam Nagender | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Mar 23 2026 12:01 PM | Updated on Mar 23 2026 12:25 PM

Telangana High Court Issues Notice To MLA Danam Nagender

సాక్షి,హైదరాబాద్‌: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్‌ పార్టీ మారలేదన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వ్యాఖ్యలకు సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.  అనంతరం, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం,స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement