కారు అదుపు తప్పి బోల్తా.. వైద్య విద్యార్థిని మృతి | Medical student Ends Life In Outer Ring Road | Sakshi
Sakshi News home page

కారు అదుపు తప్పి బోల్తా.. వైద్య విద్యార్థిని మృతి

Jul 15 2026 1:01 PM | Updated on Jul 15 2026 1:10 PM

Medical student Ends Life In Outer Ring Road

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని అమ్‌స్రీ సెంట్రల్‌ కోర్టు నివాసి అద్దంకి అమూల్య(21) ఎంఎన్‌ఆర్‌ కళాశాలలో డెంటల్‌ విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితుడు సిద్ధార్థ్‌తో కలిసి శంషాబాద్‌ చూడటానికి కారులో వచి్చంది. మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌ బయలుదేరారు. 

వీరు దారి తప్పి ఔటర్‌పైకి వచ్చి పెద్ద అంబర్‌పేట్‌ వైపు వెళ్తూ పెద్దగోల్కొండ టోల్‌గేట్‌ దాటగానే ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవింగ్‌ చేస్తున్న అమూల్య కారులోంచి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన సిద్ధార్థ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్రోలింగ్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement