పూరీ: ఒడిశాలోని పూరీ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 16, గురువారం నుంచి జూలై 24, శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రథయాత్రకు సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలు..
1.ప్రారంభం: ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం, శుక్ల పక్షం ద్వితీయ తిథిన పూరీ జగన్నాథ ఆలయం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది.
2.దారు తయారీ: రథాల నిర్మాణానికి ఎంపిక చేసిన వేప చెట్లను ‘దారు’ అని పిలుస్తారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, శుభప్రదమైన చెట్లను ఎంపిక చేస్తారు.
3.రథాల పేర్లు: జగన్నాథుని రథాన్ని ‘నందిఘోష’ (గరుడధ్వజ) అని, బలరాముని రథాన్ని ‘తలధ్వజ’ అని, సుభద్ర దేవి రథాన్ని ‘దర్పదాలన్’ (పద్మ రథం) అని పిలుస్తారు.
4.నిర్మాణ విశేషం: వసంత పంచమి రోజున కలప ఎంపిక మొదలై, అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది. రథాల తయారీలో మేకులు, ఇతర పదునైన లోహ వస్తువులను ఉపయోగించకపోవడం విశేషం.
5.హేరా పంచమి: రథయాత్ర ఐదో రోజైన ‘హేరా పంచమి’ నాడు, స్వామిని విడిచి వెళ్లారన్న ఆగ్రహంతో అమ్మవారు లక్ష్మీదేవి గుండిచా ఆలయానికి వచ్చి నందిఘోష రథ చక్రం వద్ద సంకేతక ఉత్సవాన్ని జరుపుతారు.
6.బహుడ యాత్ర: స్వామి తన అత్తగారి ఇల్లు అయిన గుండిచా ఆలయంలో వారం రోజుల పాటు బస చేసి, ఆషాఢ శుక్ల దశమి తిథిన తిరుగు ప్రయాణం అవుతారు. దీనినే ‘బహుడ యాత్ర’ అంటారు.
7. నీలాద్రి విజయం: తిరిగి ఆలయానికి చేరుకున్న స్వామిని, అమ్మవారిని గర్భాలయంలోకి ప్రవేశించే ప్రక్రియను ‘నీలాద్రి విజయం’ అని పిలుస్తారు.
8. ముస్లిం భక్త సాల్‌బేగ్: రథయాత్ర సాగే మార్గంలో సాల్‌బేగ్ అనే ముస్లిం భక్తుడి సమాధి వద్ద కూడా రథం ఆగుతుంది. ఆయన తల్లి హిందువు, తండ్రి ముఘల్ సైనికుడు.
9.రథం ప్రయాణం: పూరీ జగన్నాథాలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథం దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి రోజంతా పడుతుంది.
10.పాప విముక్తి: రథపు తాళ్లను లాగడం ద్వారా భక్తులు తమ పాపాలు తొలగిపోతాయని, శ్రీహరిలోకంలో స్థానం పొందుతారని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: షాకిస్తున్న ఐటీ ఉద్యోగి క్యాబ్ డ్రైవింగ్ స్టోరీ!


