గాజా సిటీ: ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) జరిపిన తాజా వైమానిక దాడిలో హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్లతో పాటు పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. హమాస్‌కు చెందిన ‘సెంట్రల్ జబాలియా బెటాలియన్’ మిలిటరీ సెక్యూరిటీ విభాగం అధిపతి మహమ్మద్ మర్వాన్ మహమ్మద్ సలేంను సైన్యం మట్టుబెట్టింది.
ఈ దాడిలో మహమ్మద్ సలేంతో పాటు హమాస్ సైనిక విభాగానికి చెందిన మరికొందరు కీలక ఉగ్రవాదులు కూడా మరణించినట్లు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. హతులలో సెంట్రల్ జబాలియా బెటాలియన్‌కు చెందిన నుఖ్బా ఉగ్రవాది, హమాస్ పోలీసు దర్యాప్తు విభాగం అధిపతి అబ్దల్-మాలెక్ అబు అల్-జబిన్, అదే బెటాలియన్‌కు చెందిన యమన్ మహమ్మద్ జిబ్రిల్ ఉబైద్, అలాగే వెస్ట్రన్ జబాలియా బెటాలియన్ ఉగ్రవాది, హమాస్ పోలీస్ ఆపరేటివ్ ఘస్సాన్ అక్రమ్ సలామా దకాస్ ఉన్నారు.
గత కొన్ని నెలలుగా ఈ ఉగ్రవాదులంతా కలిసి ఇజ్రాయెల్‌పై భారీ ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని, ఆ ముప్పును ముందే తిప్పికొట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం పేర్కొంది. కాగా ఈ వైమానిక దాడి సమయంలో సాధారణ పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ఐడీఎఫ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక ఆయుధాలను, వైమానిక నిఘా వ్యవస్థలను ఉపయోగించినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: ఇండియన్ సినిమాతో పాక్ థియేటర్లకు కాసుల పంట!


