హమాస్‌ సంచలన ప్రకటన | Hamas Steps Down From Governing Gaza, Hands Administration To Technical Committee, More Details Inside | Sakshi
Sakshi News home page

హమాస్‌ సంచలన ప్రకటన

Jul 7 2026 6:52 AM | Updated on Jul 7 2026 9:34 AM

Hamas Dissolves Gaza Governing Body

సంచలన పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 20 ఏళ్ల పాలన తర్వాత గాజా పాలక మండలిని హమాస్ రద్దు చేసింది. దాదాపు రెండున్నరేళ్లపాటు కొనసాగిన భీకర దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దారులు పడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా ప్రాంత పాలన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఏర్పాటైన టెక్నికల్‌ కమిటీకి పాలన బాధ్యతలను అప్పగిస్తామని తెలిపింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కేవలం సాంకేతిక, వృత్తి నిపుణులు మాత్రమే విధుల్లో కొనసాగుతారని హమాస్‌ ప్రభుత్వ మీడియా కార్యాలయం జనరల్‌ డైరెక్టర్‌ ఇస్మాయిల్‌ అల్‌–తవాబ్తా తెలిపారు. అయితే, కీలకమైన నిరాయుధీకరణ, భద్రతా బాధ్యతలను అంతర్జాతీయ దళాలకు అప్పగించడం వంటి అంశాలను మాత్రం ప్రస్తావించలేదు.

గత అక్టోబర్‌లో హమాస్-ఇజ్రాయెల్ మధ్య గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుంచి.. పాలన నుంచి తప్పుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ హమాస్ చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, 2007లో గాజాలో హమాస్‌ పాలన ప్రారంభం కాగా.. తాజా నిర్ణయంతో గాజాలో పౌర పాలనకు  మార్గం సుగమమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement