అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్ | Rajendra Prasad Reacts Chiranjeevi Award Comments | Sakshi
Sakshi News home page

Rajendra Prasad: చిరంజీవిని నేను సపోర్ట్ చేస్తున్నానని అనుకోవద్దు

Jul 5 2026 7:49 PM | Updated on Jul 5 2026 7:49 PM

Rajendra Prasad Reacts Chiranjeevi Award Comments

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్‌లోని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇందులోనే చిరు 'అవార్డ్ రావడానికి ఎన్నో దారులు' అనే వ్యాఖ్యలపై స్పందించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సింగ్ గీతం' సినిమా.. అధికారిక ప్రకటన)

'నిజం చెప్పాలంటే చిరంజీవి ఏ మూడ్‌లో, ఏ కారణంతో అన్నారో నాకు తెలీదు. ప్రతిదాన్ని నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న తిరుమల నుంచి బయటకొచ్చిన తర్వాత.. పద్మశ్రీ అవార్డ్ నాకు స్వామి ఇప్పించారు. నాకు అంత సీన్ ఎక్కడుంది అని సరదాగా అన్నారు. నాకు అంత సీన్ లేదు అన్నట్లు ఎవడో హెడ్ లైన్ పెట్టాడు. నేనే చేయలేను. అలానే చిరంజీవి కూడా వేరే సందర్భంలో అన్నారని అనుకుంటున్నాను'

'అలా అని ఆయన్ని నేను సపోర్ట్ చేస్తున్నానని అనుకోవద్దు. ప్రతిదీ అదే అర్థంతో తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాను. అవార్డుల విషయంలో నార్త్, సౌత్ అనే డిస్కషన్ అయితే ఉంది. చిరంజీవికి ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చాయి కదా. ఈ రోజు దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిలో చిరంజీవి ఒకరు. కాబట్టి ఇలాంటివి విన్నా అప్పుడే మర్చిపోండి' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలానే అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని, అదే వారు పిలిచి ఇస్తే గౌరవమని ఇదే సందర్భంగా చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్‌కి తమిళ నేత వార్నింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement