ఓటీటీలోకి 'సింగ్ గీతం' సినిమా.. అధికారిక ప్రకటన | Sing Geetham Movie OTT Release Date Confirmed, Check Out Streaming Details Inside | Sakshi
Sakshi News home page

Sing Geetham OTT: 94 ఏళ్ల డైరెక్టర్ తీసిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ

Jul 5 2026 4:38 PM | Updated on Jul 5 2026 6:11 PM

Sing Geetham Movie OTT Streaming Update

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'సింగ్ గీతం' ఒకటి. 94 ఏళ్ల వయసులోనూ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తీశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఇది ఎందులోకి ఎప్పుడు రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

అయానే, అహల్య, షాలినీ అని కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. ‍అత్యాశ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పర్లేదనిపించింది. ఇప్పుడు ఈ బుధవారం(జూలై 08) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా అప్‌డేట్ ఇచ్చారు.

'సింగ్ గీతం' విషయానికొస్తే.. జైలు నుంచి బయటకొచ్చిన ప్రతాప్, తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు కుబేరపురం అనే ఊరిలో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అయితే అవి సాధారణ భూములు కాదని వాటిలో బంగారు గనులున్నయాని తెలుస్తుంది. అయితే ఇదే ఊరిలో ఉన్న ఏకైక చెట్టుని తల్లిలా చూసుకుంటుంది గౌరి(అహల్య). బంగారం తవ్వేందుకు ఈ చెట్టుని కొట్టేసిన తర్వాత ఊరంతటికి శాపం తగులుతుంది. దీంతో అందరి నోటి నుంచి మాటలకు బదులు పాటలు వస్తుంటాయి. మరి ఈ శాపం నుంచి విముక్తి ఎలా పొందారు? మనుషుల్లోని అత్యాశ వల్ల ఎన్ని ఇబ్బందులొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement