మరో మహిళతో గదిలో.. భార్యకు పట్టుబడ్డ ‘బాసింగ బలాలు’ హీరో | Folk Dancer Eshwar Sai Incident Gone Viral | Sakshi
Sakshi News home page

మరో మహిళతో గదిలో.. భార్యకు పట్టుబడ్డ ‘బాసింగ బలాలు’ హీరో

Aug 19 2026 1:45 PM | Updated on Aug 19 2026 2:45 PM

Folk Dancer Eshwar Sai Incident Gone Viral

తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్‌ ఆర్టిస్ట్‌ ఈశ్వర్‌ సాయి వివాదంలో చిక్కుకున్నాడు. మరో మహిళా ఫోక్‌ ఆర్టిస్ట్‌తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో అతని భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ యువతి బెడ్‌పై కూర్చుని ఉండగా.. ఈశ్వర్‌ సాయి బాత్రూమ్‌ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన వేములవాడలోని రెడ్డి భవన్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై ఈశ్వర్‌ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు, సదరు మహిళా ఫోక్‌ ఆర్టిస్ట్‌కు మధ్య సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు, దీంతో ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ఈశ్వర్‌ సాయి ‘బాసింగ బలాలు’ ఫోక్‌ సాంగ్‌తో ఇటీవల మరింత పాపులర్‌ అయ్యారు. ఈ పాటలో ఆయనతో పాటు వైష్ణవి సోనీ నటించారు. విడుదలైన కొద్ది రోజులకే ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి భారీగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభించింది.మరోవైపు మాధురి రాథోడ్‌తోనూ ఈశ్వర్‌ సాయి గతంలో పలు ఫోక్‌ సాంగ్స్‌లో కలిసి కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పాటల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement