విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రమోషన్లు సరవేగంగా చేస్తోంది చిత్రబృందం.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట యాంకర్ సుమతో ప్రత్యేకంగా చిటిచాట్ చేసింది. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో పాటు పలు వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. ఇలా విజయ్‌పై రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇంట్లో విజయ్ ఎలా ఉంటాడు?
‘ఇంట్లో విజయ్ ఎలా ఉంటాడు?’ అని సుమ రష్మికను అడిగారు. దీంతో రష్మిక అతడి స్టైల్‌ను తనదైన శైలిలో ఇమిటేట్ చేసి చూపించింది. విజయ్ కింద హాల్‌లోకి వచ్చి ఫుడ్ ఏంటి అని అడుగుతాడని చెప్పింది. అంతేకాదు.. తాను ‘బేబీ.. బేబీ’ అని పిలిచినా విజయ్ వెంటనే స్పందించడని, కానీ ‘ఒరేయ్’ అని పిలిస్తే మాత్రం వెంటనే పలుకుతాడని సరదాగా చెప్పుకొచ్చింది.
దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వదినమ్మా ఏంటి మా అన్నయ్యని పట్టుకుని ఒరేయ్ అంటున్నావా అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.
Vijay Deverakonda at Home. #Rashmika imitates #VijayDeverakonda https://t.co/V61TzWxGIY
— cinee worldd (@Cinee_Worldd) October 4, 2026


