సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 21న ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తాజాగా ఈ నూతన దంపతులు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విందులో రకరకాల వంటకాలను వడ్డించారు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీతో పాటు వివిధ రకాల స్వీట్లు మెనూలో ఉన్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ‘శ్రద్ధా కాళ్లకి 8 కేజీల గజ్జెలు.. గాయమైనా తగ్గలేదు’)
A Heartwarming Gesture! ❤️✨ Kavya Maran and Anirudh host a special lunch for Sun TV employees, celebrating togetherness, appreciation and team spirit. A lovely gesture! 👏❤️ #KavyaMaran #Anirudh #SunTV https://t.co/i7L4cYklqa
— venkat (@Venkatbw) November 25, 2026


