‘వారణాసి’కి భారీ ఓటీటీ డీల్‌..! ఇన్ని వందల కోట్లా..? | Rajamouli Varanasi Movie OTT Deal Netflix | Sakshi
Sakshi News home page

Varanasi Ott Deal: ‘వారణాసి’కి భారీ ఓటీటీ డీల్‌.. ఆ సంస్థతోనే..?

Nov 25 2026 3:51 PM | Updated on Nov 25 2026 4:12 PM

Rajamouli Varanasi Movie OTT Deal Netflix

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్!
‘వారణాసి’ ఓటీటీ హక్కుల కోసం రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

వారణాసి వాయిదా..?
‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. అయితే ఈ సినిమాను జులై, ఆగస్టు, నెలల్లో విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మరింత సమయం తీసుకున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే అటు ఓటీటీ డీల్‌పై.. ఇటు సినిమా వాయిదాపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. 

(ఇదీ చదవండి: అన్నా.. వాళ్లలా నన్ను సీఎంని చేస్తారా: శర్వానంద్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement