అర్హ బర్త్‌ డే స్పెషల్ పార్టీ.. ఓకే ఫ్రేమ్‌లో అల్లు ఫ్యామిలీ | Allu Arjun Family Celebrates Allu Arha Birthday Party In Srilanka | Sakshi
Sakshi News home page

Allu Arjun: అర్హ బర్త్‌ డే స్పెషల్ పార్టీ.. ఓకే ఫ్రేమ్‌లో అల్లు ఫ్యామిలీ

Nov 25 2026 1:11 PM | Updated on Nov 25 2026 1:11 PM

Allu Arjun Family Celebrates Allu Arha Birthday Party In Srilanka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‍అట్లీ దర్శకత్వంలో ఈ యాక్షన్‌ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాని ఈ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇది చదవండి: శర్వానంద్ భోగి.. థీమ్ సాంగ్ రిలీజ్)

ఇదిలా ఉంటే ఈ నెల 21 అల్లు అర్జున్ తన ముద్దుల కూతురు అల్లు అర్హ తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. తన గారాలపట్టితో సెల్ఫీ దిగుతున్న ఫోటోను షేర్ చేశారు. నా జీవితంలో ఆనందం నువ్వే అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్హ పుట్టినరోజును ‍గ్రాండ్‌గా జరుపుకున్నారు. బన్నీ ఫ్యామిలీతో పాటు అల్లు శిరీష్ దంపతులు, అల్లు అరవింద్‌ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరంతా ఓ రెస్టారెంట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అల్లు కుటుంబం ఓకే ఫ్రేమ్‌లో కనిపించింది. ఈ పిక్‌ను శిరీశ్ సతీమణి నయనిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ పార్టీని ఇటీవలే శ్రీలంక వెకేషన్‌లో చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement