టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈఎన్‌ఈ రిపీట్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. దీంతో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
నేను 17 ఏళ్ల వయసులో ఉండగానే స్టూడియోల చుట్టూ తిరిగేవాడినని విశ్వక్ సేన్ అన్నారు. ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలేసే వాడిని కాదని తెలిపారు. అలా స్టూడియోల చుట్టూ నాలుగేళ్ల తిరిగానని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని విశ్వన్ సేన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అలా నా దగ్గర పైసల్లేవని.. 21 ఏళ్లకే నా గర్ల్‌ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్లిపోయిందన్నారు.
ఒక సినిమాలో నన్ను మెయిన్ హీరో అని చెప్పి చివరికీ తీసేశారని విశ్వక్ సేన్ అన్నారు. మొదటి నెల ఫస్ట్ హీరోను చేశారు. ఆ తర్వాత రెండో నెల సెకండ్ హీరో.. మూడో నెలకు థర్డ్ హీరోను.. చివరికీ నాలుగో హీరోను చేశారు. కానీ చివరికీ ఆ సినిమాలో నేను లేనని కూడా చెప్పేశారు. నన్ను తీసేశారని 20 రోజులు ఆలస్యంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఫలక్‌నుమా దాస్ మూవీతో దర్శకుడిగా మారానని తెలిపారు. ఈ నగరానికి ఏమైంది మూవీ తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని విశ్వక్ సేన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.


