శ్రుతీహాసన్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తరుణ్ తేజ దర్శకత్వంలో శాంతి టాకీస్‌పై అరుణ్ విశ్వ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘మావీరన్, 3 బీహెచ్‌కే’ వంటి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన శాంతి టాకీస్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వసంత్ రవి హీరోగా ‘అశ్విన్స్’ సినిమాకు తరుణ్ తేజ దర్శకత్వం వహించారు. ఇప్పుడు శ్రుతీహాసన్‌తో ఆసక్తికరమైన కథతో ఈ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు.


