కూతురు కొత్త ప్రయాణం..! రామ్‌ చరణ్‌కు స్పెషల్‌ మూమెంట్‌..? | Ram charan Upasana Daughter Klin kaara Preschool | Sakshi
Sakshi News home page

Klin Kaara Konidela Preschool: బడి మెట్టు ఎక్కిన క్లింకార..?

Nov 24 2026 3:51 PM | Updated on Nov 24 2026 3:51 PM

Ram charan Upasana Daughter Klin kaara Preschool

పిల్లలు తొలిసారి బడిలో అడుగుపెట్టే క్షణం ప్రతి తల్లిదండ్రికీ ఎంతో ప్రత్యేకం. తమ చిన్నారుల జీవితంలో కొత్త ప్రయాణం మొదలవుతుంటే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతిని మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఆస్వాదిస్తున్నట్లు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 

వారి గారాలపట్టి క్లింకార కొణిదెల తాజాగా ప్రీ స్కూల్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రామ్‌చరణ్‌, ఉపాసన స్వయంగా తమ కుమార్తెను ప్రీ స్కూల్‌కు తీసుకెళ్లి అక్కడ చేర్పించినట్లు కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా క్లింకార తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారిని చూసిన అభిమానులు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు.  అయితే క్లింకార ప్రీ స్కూల్‌లో చేరిన విషయంపై రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

(ఇదీ చదవండి: మహేశ్‌బాబుపై ఆందోళన .. ఆ డైరెక్టర్‌ కోసమేనా..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement