అనుష్క టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పనుందా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒకప్పుడు టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగిన అనుష్క.. ఇప్పుడు తెలుగు తెరకు దూరమైపోయింది. ఇతర భాషల్లోనూ సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గించారు. ఇటీవల ఆమె నటించిన భాగమతి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. దీంతో అనుష్క క్రేజీ అమాంతం పడిపోయింది. త్వరలో అయినా మంచి చిత్రంతో మనవాళ్లను పలరిస్తుందని అనుకుంటే.. ఆమె ఏకంగా ఇండస్ట్రీకే గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టిందట.
(ఇదీ చదవండి: రామాయణ మూవీ.. టికెట్లపై బంపరాఫర్..!)
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లో అనుష్క ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఇక్కడ నుంచే షూటింగ్స్‌కు వెళ్లేది. అయితే ఇప్పుడు ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్టులేవి లేవు. అందుకే హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని అమ్మేసిందట. దీని ద్వారా రూ. 12 కోట్ల వరకు అనుష్కకు వచ్చాయట.
(ఇదీ చదవండి: ఆ ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది: కాజల్ అగర్వాల్)
అయితే ఇంటిని అమ్మిన విషయాన్ని, ధర విషయం గురించి కానీ అనుష్క ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మంగళూరులో మరో ఇంటిని కొనుగోలు చేసే యోచనలో ఉన్నారట. అక్కడ ఫ్యామిలీతో స్థిరపడాలని అనుష్క ఆలోచిస్తుందట.అయితే ఇంటిని అమ్మినంత మాత్రన తెలుగు సినిమాకు దూరమైనట్లు కాదని ఆమె సన్నిహితులు అంటున్నారు. మంచి కథతో తిరిగి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే అనుష్క చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు.


