అనుష్కా శెట్టి ‘ఘాటి’ రిలీజ్ అప్పుడేనా?
అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి’. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై మరింత శ్రద్ధ పెట్టి, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది టీమ్ ప్లాన్. దీంతో ఓ దశలో సెప్టెంబరులో రిలీజ్ అనుకున్నప్పటికీ నవంబరులో అయితే మరిన్ని థియేటర్స్ కూడా దొరకుతాయని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం లభిస్తుందని కూడా చిత్రయూనిట్ ఆలోచిస్తోందట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్.