
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.
కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.
క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.
Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0
— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025